సాక్షి, హైదరాబాద్: బీజేపీ మహాధర్నాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు(మంగళవారం) హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసుకోవచ్చని తెలిపింది. కాగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యంపై తెలంగాణ బీజేపీ నేతలు ఈనెల 25న ఇందిరాపార్క్ వద్దనున్న ధర్నాచౌక్‌లో నిరసనకు పిలుపునిచ్చింది.
అయితే అనుమతి కోసం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను బీజేపీ నేతలు సంప్రదించగా.. ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. నేడు న్యాయస్థానంలో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దీనిపై మధ్యాహ్నం హైకోర్టు విచారణ జరిపింది.
ధర్నాకు అనుమతి ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రభుత్వ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే కేంద్రం ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు శాంతి భద్రతల విఘాతం కలగలేదా? అని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించింది.. 5వేల మందికి మీరు భద్రత కల్పించలేకపోతే ఎలా అని పోలీసులపై మండిపడింది. బీజేపీ మహాధర్నాకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది.
చదవండి: TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం
Comments
Please login to add a commentAdd a comment