
సాక్షి,విశాఖపట్నం: నావెల్ డాక్ యార్డు ప్రధాన ద్వారం ఎదుట మహిళల ఆందోళన కొనసాగుతుంది. తమ భర్తల ప్రాణాలకు రక్షణ కావాలంటూ డాక్ యార్డ్ ఉద్యోగస్తుల భార్యలు ఆందోళన బాట పట్టారు.
ఇటీవల నూతన వంతెన నిర్మాణం కోసం పోర్ట్ యాజమాన్యం రహదారిని మూసివేసింది. దీంతో ప్రత్నామాయ ఏర్పాటు చేసి నావికా దళానికి చెందిన ఎస్‌బీసీ నుండి రాకపోకలకు అనుమతి ఇవ్వాలంటూ సుమారు 200 మహిళలు రోడ్డెక్కారు.
మల్కాపురం, సిందియా, రామకృష్ణాపురం ప్రాంతాలనుండి విధులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment