కరీంనగర్‌: ముసలమ్మ నాకొద్దు! | Son Left Mother On Road karimnagar Shankarapatnam Viral | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌: ముసలమ్మ నాకొద్దు!..

Dec 23 2023 8:14 AM | Updated on Dec 23 2023 8:14 AM

Son Left Mother On Road karimnagar Shankarapatnam Viral - Sakshi

అపురూపంగా చూసుకుంటూ అవసరాలు తీర్చే తల్లి.. వయసు మీద పడే సరికి భారంగా..  

నవ మాసాలు మోసి కనాలి. పాలిచ్చి పెంచాలి. అడిగివన్నీ చేసి పెట్టాలి. అపురూపంగా చూసుకోవాలి. కానీ, వయసు మీద పడితే.. ఆ తల్లి  భారమైపోతుందా?.. అలాగే అనుకున్నాడు ఇక్కడ ఓ కొడుకు.. వృద్ధురాలైన తన తల్లిని చూసుకోలేనంటూ చలిలో రోడ్డు పక్కన పడేశారు.

కరీంనగర్‌ శంకరపట్నం మండలం తాడికల్‌ గ్రామానికి చెందిన బొల్లం లచ్చమ్మకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. భర్తతోపాటు పెద్ద కొడుకు రాజయ్య, ఓ కూతురు కొన్నాళ్ల కిందట చనిపోయారు. వయసు పైబడడంతోపాటు ఇళ్లు పాడుబడి పోయింది. దీంతో ఆమె ఇద్దరు కొడుకుల కుటుంబాలు వంతులవారీగా లచ్చమ్మను చూసుకుంటూ వస్తున్నారు. రాజయ్య కుటుంబం మహారాష్ట్రంలో ఉంటోంది. తమ వంతు ముగియడంతో శుక్రవారం లచ్చమ్మను వాహనంలో తాడికల్‌ తీసుకొచ్చి దిగబెట్టింది.

అయితే తల్లిని ఇంట్లోకి రానివ్వకుండా చిన్న కొడుకు కుటుంబం అడ్డుకుంది. రాజయ్య కొడుకు వెళ్లిపోయే దాకా చూసి.. ఆటోలో పాత ఇంటి సమీపంలో రోడ్డు పక్కన దించేశాడు. చలిలో రోడ్డు మీద వణుకుతూ కనిపించిన లచ్చమ్మను స్థానికులు చూశారు. డయల్‌ 100కు సమాచారం అందించారు. పోలీసులు చిన్న కొడుకును పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చే యత్నం చేశారు. కానీ, అతను ముసలి అమ్మ వద్దంటూ కరాకండిగా చెప్పేశాడు. కావాలంటే పాత ఇంట్లో ఆమె ఉండొచ్చని.. తిండి కావాలంటే అక్కడికే తీసుకెళ్లి ఇస్తానని చెప్పాడు. దీంతో.. చేసేది ఏం లేక ఆ 80 ఏళ్ల వృద్ధురాలిని పోలీసులు ఆమె పాత ఇంటి వద్ద దిగబెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement