అమెరికాలో మగ్గాలు లేవు | in america Rangoli not thier... | Sakshi
Sakshi News home page

అమెరికాలో మగ్గాలు లేవు

Published Thu, Jan 23 2014 3:57 AM | Last Updated on Sat, Sep 2 2017 2:53 AM

in america Rangoli not thier...

నూతనకల్ , న్యూస్‌లైన్ : జిల్లాలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా క్రీడాల అభివృద్ధిశాఖ అధికారి మక్బూల్‌అహ్మద్ చెప్పారు. నూతనకల్‌లోని మర్రి సత్యనారాయణరెడ్డి మినీ స్టేడియంలో వివిధ ట్రాక్‌ల నిర్మాణ పనులను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినీ స్టేడియం అభివృద్ధి కోసం రూ.47లక్షలు మంజూరయ్యాయన్నారు.
 
 ఈ నిధులతో 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్, మధ్యలో ఫుట్‌బాల్, హాకీ మైదానాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే రన్నింగ్ ట్రాక్ భయట వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, హ్యాండ్‌బాల్ కోర్టులతో పాటు స్టేడియం చుట్టూ ప్రహరీ నిర్మిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డీఈ ఆర్.యాదయ్య, ఏఈ జనార్దనమూర్తి, పీడీ వీరన్న తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement