మిషన్ భగీరథ పనులు వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో
భగీరథ, కాకతీయ పనులపై సమీక్షలో కలెక్టర్
నల్లగొండ : మిషన్ భగీరథ పనులు వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భగీరథ పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేసి కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచి త్వరితగతిన పనులు పూర్తి చేసేవిధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇంటర్ విలేజ్ పైపులైను పనులు మే నెలాఖరు నాటికి పూర్తిచేసి 153 గ్రామాల్లో తాగునీరు అందించే విధంగా పనులు వేగవంతం చేయాలన్నారు.
ఎక్కడైనా పైపులైన్ల లీకేజీ, పగిలిపోవడం జరిగితే తక్షణమే వాటిని మరమ్మతులు చేయించాలని కోరారు. సమీక్షలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ రమణ, ఈఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులు త్వరితగతిన పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో కరువు మండలాల్లో వ్యవసాయ శాఖ, పశుసంవర్ధకశాఖ చేపట్టిన కరువు నివారణ పనుల పై కూడా కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో ఎస్‌ఈ బి.ధర్మానాయక్, ఈఈలు, జేడీఏ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.