కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఉచిత శిక్షణ | Free training constable candidates | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

Published Fri, Sep 16 2016 12:42 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

Free training constable candidates

వరంగల్‌ : పోలీస్‌ కానిస్టేబుల్‌ మెయి¯Œ్స పరీక్షలకు హాజరయ్యే బీసీ అభ్యర్థులకు రెండు వారాల పాటు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్‌–శిక్షణ కేంద్రం డైరెక్టర్‌ జి.హృషికేశ్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
శిక్షణ పొందగోరు అభ్యర్థులు తమ దరఖాస్తులను హన్మకొండలోని బీసీ స్టడీ సర్కిల్‌లో ఈనెల 17 వరకు అందించాలని సూచించారు. దేహదారుఢ్య  పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారే అర్హులని పేర్కొన్నారు. ప్రిలిమనరీ పరీక్షల్లో సాధించిన మార్కుల అధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. అభ్యర్థులు గ్రామీణ ప్రాంతం వారు రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారు రూ.2 లక్షల వార్షిక ఆదాయం మించకూడదని తెలిపారు. వివరాలకు 0870–2571192 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement