ఆదిలాబాద్ రూరల్ : జిల్లాలోని కళాశాల విద్యార్థులకు సమాచార నైపుణ్యలపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పోటీ ప్రపంచంలో వివిధ పట్టాలు పొందడమే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించడానికి ఆస్కారం ఉంటుందని బీసీ స్టడీ సర్కిల్ సెంటర్ డైరెక్టర్ జి. ప్రవీణ్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ స్టడీ సర్కిల్ సెంటర్ ఆధ్వర్యంలో చదవడం, రాయడం, మాట్లాడడం, వినడం, భాష, శరీర భాష వంటి వాటిపై స్కిల్స్ నేర్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం లక్ష్మీనరసింహ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించిన అనంతరం తము ఎంపిక చేసుకున్న రంగాల్లో అత్యుత్తమ స్థాయికి చేరుకోవాలంటే ముఖ్యంగా ఉండాల్సిన వ్యక్తీకరణ సమర్థ్యాలు అవసరమన్నారు. ఏదైనా ఉద్యోగం పొందాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరమని తెలిపారు. ఇది వరకు జిల్లాలోని బీసీ కళాశాల బాలికల, బాలుర ఆదిలాబాద్ వసతి గృహల్లో, ఎస్సీ మహిళా, బాలుర కళాశాల ఆదిలాబాద్‌లలో నిర్వహిస్తున్నామన్నారు. బాలికల, బాలుర కళాశాల బెల్లంపల్లి, బీసీ మహిళా మందమర్రి, బీసీ సంఘ భవనంలో ఆదిలాబాద్, బీసీ బాలికల కళాశాల కాగజ్‌నగర్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.