Grievance Cell
-
ఎంఎస్ఎంఈలకు కేంద్రీకృత ఫిర్యాదుల పోర్టల్
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈలు) కేంద్రీకృత ఫిర్యాదుల పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని అసోచామ్ డిమాండ్ చేసింది. ఆర్బీఐ అంబుడ్స్‌మన్ తరహాలో ఇది ఉండాని.. పలు శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలు ఈ పోర్టల్ ద్వారా లేవనెత్తేందుకు అవకాశం ఉండాలని కోరింది. ఫిర్యాదుల దాఖలు, పరిష్కారం విషయంలో ఎంఎస్ఎంఈలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయంటూ ఈ కీలక సూచన చేసింది. వ్యాపార నిర్వహణలో ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈగ్రోవ్ ఫౌండేష్ సాయంతో అసోచామ్ సర్వే నిర్వహించింది. ఎంఎస్ఎంఈ సమస్యల పరిష్కారం, వాటి బలోపేతానికి సూచనలతో ఒక నివేదికను విడుదల చేసింది. ‘‘2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించే లక్ష్యంలో భాగంగా ఎంఎస్ఎంఈలకు సంబంధించి వ్యూహాత్మక ప్రణాళిక, కార్యాచరణను ఈ నివేదిక తెలియజేస్తుంది. సంఘటిత, అసంఘటిత రంగంలోని మన ఎంఎస్ఎంఈలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంక్‌లు, దిగ్గజ కంపెనీల నుంచి మద్దతు అవసరం’’అని అసోచామ్ ప్రెసిడెంట్ సంజయ్ నయ్యర్ పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలకు కార్పొరేట్ ఆదాయపన్ను రేటును 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలని, సులభతర జీఎస్టీ వ్యవస్థను తీసుకురావాలని అసోచామ్ కోరింది. కేంద్రీకృత పోర్టల్.. ఎంఎస్ఎంఈల నమోదు, వ్యాపారానికి సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లను ఎలక్ట్రానిక్ రూపంలో సమర్పించేందుకు ఆన్లైన్ పోర్టల్ తీసుకురావాలని అసోచామ్ తన నివేదికలో కోరింది. జీఎస్టీ రిజి్రస్టేషన్, నిబంధనల అమలు ప్రక్రియలను సైతం సులభతరంగా మార్చాలని పేర్కొంది. స్పష్టమైన నిబంధనలతో మద్దతుగా నిలవాలని కోరింది. సహేతుక కారణాలున్నప్పటికీ సకాలంలో జీఎస్టీ రిటర్నుల ఫైలింగ్, చెల్లింపులు చేయని ఎంఎస్ఎంఈలపై కఠిన జరిమానాలు విధిస్తున్నట్టు పేర్కొంది. జాప్యం తీవ్రత, కారణాలకు అనుగుణంగా పెనాల్టీలో మార్పులు ఉండాలని సూచించింది. జరిమానాలు ఎంఎస్ఎంఈలకు భారంగా మారరాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యం సాకారం కావాలంటే వ్యాపార నమూనాలో నిర్మాణాత్మక మార్పు అవసరమని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ అన్నారు. ‘‘ఈ నిర్మాణాత్మక మార్పులో ఎంస్ఎంఈలు భాగంగా ఉండాలి. అభివృద్ధి చెందిన భారత్‌లో ఎంఎస్ఎంఈలు గొప్ప పాత్ర పోషించాలి. మా అధ్యయనం ఇదే అంశాన్ని బలంగా చెప్పింది’’అని సూద్ వివరించారు. పెరుగుతున్న కారి్మక శక్తికి ఎంఎస్ఎంఈలు పరిష్కారం చూపించగలవని, ఉత్పాదకతతో కూడిన ఉపాధిని అందించగలవని ఈగ్రోవ్ వ్యవస్థాపక చైర్మన్ చరణ్‌సింగ్ అన్నారు. వ్యవసాయ యూనివర్సిటీల మాదిరే ప్రతీ రాష్ట్రంలోనూ ఎంఎస్ఎంఈ యూనివర్సిటీ ఏర్పాటును పరిశీలించాలని, ఎంఎస్ఎంఈల ఉత్పత్తులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు ప్రత్యేకంగా సమన్వయ మండలిని ఏర్పాటు చేసి, పథకాల అమలు సాఫీగా సాగేలా చూడాలని, రాష్ట్రాల పరిధిలో సమస్యలను పరిష్కరించాలని ఈ నివేదిక సూచించింది. జీడీపీలో 30 శాతం వాటా, తయారీ రంగంలో 45 శాతం వాటా, ఎగుమతుల్లో 46 శాతం వాటా కలిగిన ఎంఎస్ఎంఈలు దేశ ఆర్థిక వ్యవస్థలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఈ నివేదిక గుర్తు చేసింది. -
Prajavani: రెండున్నరేళ్లుగా మూగబోయిన ప్రజావాణి
సాక్షి, హైదరాబాద్: సాక్షాత్తు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ప్రజల ఆవేదన వినేవారు లేకుండా పోయారు. గత రెండున్నరేళ్లుగా ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహించే ప్రజావాణి (గ్రీవెన్స్ సెల్) మూగబోయింది. కోవిడ్ నేపథ్యంలో జీహెచ్ఎంసీతోపాటు హైదరాబాద్ కలెక్టరేట్లలో 2020 మార్చి 17 నుంచి ప్రజావాణి కార్యక్రమం నిలిచిపోయింది. ఆ తర్వాత అదే ఏడాది ఆగస్టు 15 నుంచి ఈ–ఆఫీస్ ద్వారా కాగిత రహిత పాలనను చేపట్టారు. వివిధ సమస్యలపై వస్తున్న ప్రజల నుంచి నేరుగా కాకుండా దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా, ఆ తర్వాత కలెక్టరేట్లోని ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేక బాక్స్ ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించారు. కోవిడ్ వైరస్ ప్రభావం తగ్గినా... నేటికి గేటు వద్దనే మొక్కుబడిగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ దరఖాస్తుల్లో కనీసం 10 శాతం కూడా సమస్యలు పరిష్కారం కావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఆఫీసుల చుట్టూ చక్కర్లు నగర వాసులు తమ సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ, మున్సిపల్ కలెక్టర్ రెవెన్యూ ఆఫీసుల నిత్యం ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు ఎవరికి సమర్పించాలో తెలియని పరిస్ధితి నెలకొంది. సంబంధిత అధికారులు సైతం అందుబాటు లేక పోవడంతో వారిని పట్టించుకునేవారు కరువయ్యారు. దరఖాస్తులు సమర్పించినా... పరిష్కారమవుతుందన్న ఆశ కనిపించడం లేదు. దీంతో దళారులు, రాజకీయ నాయకులను ఆశ్రయించక తప్పడం లేదు. పెరిగిన పెండెన్సీ... ప్రభుత్వ పరంగా పేదలకు అందించే ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ ఆర్ధిక చేయూత, సంక్షేమ రుణాలు, డబుల్ బెడ్రూమ్, సదరం సర్టిఫికేట్ తదితర దరఖాస్తులు పెండెన్సీ పెరిగిపోతోంది. దరఖాస్తుదారులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం కనిపించడం లేదు. కనీసం ప్రజావాణి పునరుద్దరిస్తే అందులో తమ దరఖాస్తులకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుందని పలువురు బాధితులు పేర్కొంటున్నారు. (క్లిక్ చేయండి: మన కార్లపై భారత్ సిరీస్ ఎప్పుడు? దీంతో లాభలేంటి..?) -
డీఈవో కార్యాలయాల్లో గ్రీవెన్స్ సెల్..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయా ల్లో ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా గ్రీవెన్స్ సెల్ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పరిష్కారం పొందవచ్చని తెలిపింది. ఒకవేళ అక్కడ సమస్యకు పరిష్కారం లభించకుంటే పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ దృష్టికి తీసుకురావాలని, సాధ్యాసాధ్యాలను చూసిన తర్వాత పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలని డీఎస్ఈ భావిస్తోంది. ఈ మేరకు జిల్లా విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. సర్వీసుకు సంబంధించిన అం శాలు, బదిలీలు, మార్పులు చేర్పులంటూ వంద లాది మంది టీచర్లు డీఎస్ఈ చుట్టూ చక్కర్లు కొట్టడాన్ని తీవ్రంగా పరిగణించిన విద్యాశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఫోన్ చేస్తే చర్యలే..! ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగిసినప్పటికీ చాలామంది టీచర్లు మార్పులు, చేర్పులంటూ డీఎస్ ఈ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు టీచర్లు పైరవీలు చేస్తూ ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులతో విద్యాశాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఫోన్లు చేయిస్తూ అసౌకర్యం కల్పిస్తున్నారని భావించిన డీఎస్ఈ ఈ మేరకు సూచనలు చేసింది. బదిలీలు, మార్పులు, సర్వీసు సంబంధిత అంశాలపై ఫోన్ కాల్స్ వస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు టి.విజయ్‌కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.. ఈ సమస్యలు జిల్లా స్థాయిలోనే పరిష్కరించుకోవాలని, ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరిస్తే సీసీఏ రూల్స్ ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. -
రేటు మారలే..!
♦ ఇప్పటికీ రూ. 3 వేలు పలుకుతున్న ట్రాక్టర్ ఇసుక రేటు ♦ రూ. 1500 ధర నిర్ణయించిన అధికారులు ♦ పట్టించుకునే వారే కరువైన వైనం ♦ గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్‌కు ఫిర్యాదులు విజయనగరం గంటస్తంభం : అధికారులు ట్రాక్టర్ ఇసుక ధరను గతంలో రూ.1500గా నిర్ణయించారు. గజపతినగరం, గుర్ల, నెల్లిమర్ల మండలాల్లో ఉన్న రీచ్‌ల నుంచి ఎక్కడైనా ఇసుక పొందవచ్చని, అంతే ధర ఉంటుందని మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, అధికారులు ఇప్పటికే పలు సార్లు ప్రకటించారు. కానీ ఆ ధరకు ఇసుక దొరుకుతున్న దాఖలాలు ఎక్కడా కానరావడం లేదు. రేటు ఎంత ఉంది అని పట్టణానికి వచ్చే ట్రాక్టర్ల సిబ్బందిని అడిగితే యూనిట్‌కు రూ.3 వేలు తక్కువ లేదని చెబుతున్నారు. క్వారీల వద్ద కూడా అంతే రేటు ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఇంకో విషయం ఎంటంటే ట్రాక్టర్ ఇసుక ఒక యూనిట్ కూడా కాదు. దీంతో అక్కడ కూడా మోసమే జరుగుతుంది. ఇలా అయితే పేదలు ఇళ్లు కట్టుకోగలరా..? ఇన్నీ అక్రమాలు జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు అని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు వచ్చి అధికారుల వద్ద గాజుల రేగకు చెందిన గడి వెంకట సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. దందా ఆగలేదు.. ఇసుక రవాణాలో అక్రమార్కుల దందా ఆగడం లేదు. క్వారీలు ఉన్న చోట ఉండే అధికార పార్టీ నాయకులు, ట్రాక్టరు యజమానులు కుమ్మక్కై అధిక ధరకు అమ్మకాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి చెప్పినా, అధికారులు ప్రకటించిన ధరలు ఎక్కడా అమలు కావడం లేదు. దీంతో వినియోగదారులు అధిక ధరలకు ఇసుక కొనుగోలు చేసి ఆర్థిక భారం మోస్తున్నారు. ఫలితంగా పేదలకు సొంతింటి కల తీరడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండింతలే.. ఇసుక అక్రమాలపై వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఉచితంగా ఇసుక తీసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. కానీ జిల్లాలో ఎక్కడా ఉచిత ఇసుక అమలు కాలేదు. ట్రాక్టర్ ఇసుక కావాలంటే నిర్మాణదారులు రూ.3 నుంచి రూ.5 వేలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై వారం వరకు అనేక ఫిర్యాదులు గ్రీవెన్స్‌సెల్‌లో అధికారులకు అందాయి. కేంద్రమంత్రి ఆశోక్‌గజపతిరాజు, రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు దృష్టికి కూడా పలువురు సమస్యను తీసుకెళ్లారు. అయినా ఇసుక ఉచితంగా దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో ఇటీవల జరిగిన అధికారుల సమీక్షలో ఇసుక రవాణాకు ఒక ధర నిర్ణయించాలని మంత్రులు సూచించారు. ఈ మేరకు అధికారులు ధర నిర్ణయించారు. ట్రాక్టర్ ఇసుక తరలించేందుకు విజయనగరానికి రూ.1500, బొబ్బిలికి రూ.1500, పార్వతీపురం రూ.1700, సాలూరుకు రూ.1300 చొప్పున తీసుకోవాలని ప్రకటించారు. ఈ ధరలు ఇటీవల అందుబాటులోకి వచ్చాయి. కానీ ఆ ధరకు ట్రాక్టర్ ఇసుక ప్రస్తుతం దొరకడం లేదు. విజయనగరానికి ట్రాక్టర్ ఇసుక కావాలంటే రూ.3 వేలు చెల్లించాలని అడుగుతున్నారు. గతంలో రూ.3500, రూ.4 వేలు ఉంటే ఇప్పుడు రూ.3 వేలకు ఇవ్వడం మినహా పెద్దగా ఉపశమనం లేదు. దీంతో గాజులరేగకు చెందిన సత్యనారాయణ ఈ అక్రమాలు ఆపాలని, నిర్ణయించిన ధరకు ఇసుకు అందేట్లుగా చర్యలు తీసుకోవాలని కోరడం పరిస్థితికి అద్దం పడుతుంది. పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి పట్టణాలకు కూడా ఇదే విధంగా ట్రాక్టరు ఇసుకకు రూ.3 వేలకుపైగా తీసుకుంటుండడం గమనార్హం. ఇసుక రీచ్‌ల్లో అక్రమార్కులు దందా.. ఉచితంగా అందాల్సిన ఇసుక ఉచితంగా దొరక్కపోడానికి, కనీసం అధికారులు నిర్ణయించిన ధరకు కూడా రవాణా కాకపోవడానికి ఇసుక రీచ్‌ల్లో అక్రమార్కులు దందా కారణంగా తెలుస్తోంది. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఇసుక రీచ్‌ల్లో స్థానికంగా ఉండే గ్రామస్థులు అమ్ముకుంటున్నారు. ఇందులో అధిక శాతం మంది పచ్చ తమ్ముళ్లే ఉండగా కొన్ని చోట్ల అక్రమార్కులకు అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు అండగా ఉంటున్నారు. విజయనగరానికి ఎక్కువగా ఇసుక వచ్చే గజపతినగరం మండలం లోగిశ రీచ్‌లో అధికార పార్టీ నాయకుడు, ఆయన అనుచరులు ఇసుక ఉచితంగా పట్టుకెళ్లకుండా డబ్బులు వసూలు చేస్తున్నారని, ట్రాక్టర్ యజమానులు రూ.3వేలు ఇస్తే గానీ ఇసుక లోడ్ వేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. నెల్లిమర్ల, గుర్ల మండలాల్లో ఇదే పరిస్థితి. వేగావతి, సువర్ణముఖి తదితర నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక రీచ్‌ల్లో అక్రమార్కులు హవా కొనసాగుతోంది. దీనికి అడ్డకట్ట వేయాలని గృహ, ఇతర నిర్మాణదారులు కోరుతున్నారు. మరి అధికారులు ఏమి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. -
ఇవిగో అర్జీలు.. స్వీకరించే వారేరి..?
► గ్రీవెన్స్ సెల్‌కు హాజరుకానీ ఉన్నతాధికారులు ► అర్జీదారులతో కిటకిటలాడిన కలెక్టరేట్ ► మొత్తం 468 ఫిర్యాదులు ► డయల్ యువర్ కలెక్టర్‌కు 12 కాల్స్ బీచ్‌రోడ్ (విశాఖ తూర్పు): ప్రతి శాఖాధికారి తప్పనిసరిగా గ్రీవెన్స్ సెల్‌కు హాజరవ్వాలి.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం సోమవారాన్ని కేటాయించండి అంటూ కలెక్టర్ ఆదేశాలిచ్చినా.. ఉన్నతాధికారుల్లో ఎటువంటి స్పందన లేకుండా పోయింది. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌కి ఇద్దరు, ముగ్గురు శాఖాధికారులు మినహా ఎవ్వరూ హాజరుకాలేదు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు రాకపోవటంతో అధికారులు కావాలనే హాజరుకాలేదంటూ పలువురు ఆరోపిస్తున్నారు. అయితే కలెక్టరేట్ మాత్రం అర్జీదారులతో కిటకిటలాడింది. మొత్తం 468 దరఖాస్తులు ప్రజావాణికి వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలను అధికారులకు విన్నవించుకున్నారు. జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరెడ్డి స్వయంగా వినతులను స్వీకరించారు. వినతుల్లో ఎక్కువగా రేషన్ కార్డు, పింఛన్లు, భూ వివాదాలు, గృహాలు సంబంధించినవి వచ్చాయి. అయితే అర్జీదారులను సర్వర్ సమస్య వేధించింది. సాంకేతిక సమస్య కారణంగా ఫిర్యాదుదారులకు రసీదు ఇవ్వడం కుదరలేదు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించి జిల్లా అధికారులు పాల్గొన్నారు. డయల్ యువర్ కలెక్టర్.. అలాగే డయల్ యువర్ కలెక్టర్‌కు 12 మంది ఫోన్ చేసి తమ సమస్యలను అధికారులకు విన్నవించుకున్నారు. జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరెడ్డి ఫోన్ ద్వారా వినతులను తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ సత్వరమే అర్జీదారుల సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఇంకెన్నేళ్లు తిప్పుతారయ్యా!
⇒15 ఏళ్లుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా ⇒అర్హత ఉందంటూనే .. తిప్పి పంపుతున్నారు ⇒కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో దివ్యాంగురాలి ఆవేదన ⇒ఇప్పటికైనా కనికరించాలని వినతి విశాఖ సిటీ : ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లోని మీకోసం విభాగంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో అర్జీదారులు తమ కష్టాలను అధికారులకు విన్నవించారు. జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన దరఖాస్తుదారులతో కలెక్టరేట్ కిటకిటలాడింది. మీ కోసం కార్యక్రమంలో 215 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది గృహాలు మంజూరు చేయాలంటూ వినతిపత్రాలు అందించారు. వీటితో పాటు రేషన్ కార్డులు, భూ వివాదాలు, పింఛన్ల మంజూరు సహా పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అర్జీలు పెట్టుకున్నారు. జాయింట్ కలెక్టర్–2 డి.వెంకటరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరెడ్డి, జెడ్పీ సీఈవో జయప్రకాష్ నారాయణ, సెట్విన్ సీఈవో డా.సిరి కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తుదారుల సమస్యలు తెలుసుకున్నారు. ఎండలు పెరుగుతుండడంతో.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు పైకి వెళ్లి సమస్యలు విన్నవించుకునేందుకు అవస్థలు పడ్డారు. డయల్ యువర్ కలెక్టర్ రద్దు కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని ఈ సోమవారం రద్దు చేశారు. ఐసీడీఎస్ సమావేశం జరిగిన హాల్లోనే కార్యక్రమానికి సంబంధించిన ఉపకరణాలు ఉండటం వల్ల, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అందుబాటులో లేనందువల్ల కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. వచ్చేవారం యధావిధిగా నిర్వహిస్తామని చెప్పారు. మెట్లు ఎక్కలేకపోతున్నాం దివ్యాంగుల కోటాలో రేషన్ కార్డు మంజూరు చెయ్యమని ఆరు నెలలుగా తిరుగుతున్నాను. అయినా, అధికారులు స్పందించడం లేదు. మెట్లు ఎక్కి పైకి వెళ్లాలంటే నరకయాతనగా ఉంది. అయినా, కార్డు ఇస్తారనే ఆశతో ప్రతి వారం వస్తున్నాను. వచ్చిన ప్రతిసారీ అర్జీ తీసుకుంటున్నారే తప్ప అధికారుల నుంచి మాత్రం స్పందన లేదు. – మల్లా నర్సింహరామ, గవర కంచరపాలెం రుణాల మంజూరులో అవినీతిపై కలెక్టర్‌కు ఫిర్యాదు విశాఖ సిటీ : ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరు విషయంలో జరుగుతున్న అవినీతిపై దర్యాప్తు చేయాలంటూ కంచరపాలేనికి చెందిన అప్పారావు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జోన్–4 కార్యాలయ పరిధిలోని 35,36,37 వార్డుల్లో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలను అక్కడి అధికారులు, స్థానిక బీజేపీ నేతతో కలిసి లంచాలు తీసుకుని, అర్హత లేని వాళ్లకు మంజూరు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.5 వేల వరకూ లంచం తీసుకున్నారని ఆరోపించారు. జోన్–4 కార్యాలయం ఏపీడీ, యూసీడీ విభాగంలో కొంతమంది బీజేపీ నేతల కుటుంబ సభ్యులు ఉద్యోగులుగా చేరి చంద్రన్న బీమా, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తుదారుల నుంచీ పర్సంటేజీలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఆలస్యంగా ప్రారంభమైన గ్రీవెన్స్ సెల్
శ్రీకాకుళం పాతబస్టాండ్: సాధారణంగా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్ససెల్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే.. ఈ వారం 11.25 గంటలకు ప్రారంభించా రు. ముందుగా జేసీ చక్రధరబాబు హాజ రుకాగా, కాసేపటికి కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మినరసింహం వచ్చి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ఉదయం 8 గంటలకే కలెక్టరేట్‌కు చేరుకుని అర్జీలు ఇచ్చేందుకు క్యూ కట్టిన అర్జీదారులకు నిరీక్షణ తప్పలేదు. గంటల తరబడి నిల్చోవాల్సి రావడంతో అధికారుల తీరుపై అసహనం వ్యక్తంచేశారు. గ్రీవెన్‌ససెల్‌లో జేసీ -2 పి.రజనీకాంతారావు, డీఆర్డీఏ పీడీ కె.సి.కిశోర్‌కుమార్, డుమా పీడీ ఆర్.కూర్మనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 2002 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ నియామాకాలు వెంటనే చేపట్టాలన్న న్యాయస్థానం ఉత్తర్వులు అమలు చేయాలని డి.సింహాచలం, ఎస్.మురళీకృష్ణ, వై.భగవాన్, ఎం.షణ్ముఖరావులు కోరారు. సరుబుజ్జిలి మండల కేంద్రంలోని నందికొండ సిమ్మయ్య కొనేరు వద్ద సర్వే నంబర్ 32-1, 32-1, 2లలోని మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని అధికార పార్టీకి చెందిన నాయకులు, పెద్దలు కలిసి ఆక్రమించారని, మండల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదంటూ సర్పంచ్ బెండి అన్నపూర్ణమ్మ, మండ సుదర్శనరావు, శ్రీనివాసరావు, రామారావులు ఫిర్యాదు చేశారు. లావేరు మండలం బుడుమూరు గ్రామం ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు ఏర్పాటుచేయాలని కాలనీ వాసులు కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో వెంటనే సీసీ రోడ్లు, డ్రైనేజీ ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజినీర్, డీఆర్డీఏ పీడీలను ఆదేశించారు. మత్య్సకారులకు ఫైబర్ తెప్పలు, చిన్న ఇంజిన్లు, వలలు మంజూరు చేయాలని శ్రీకాాకుళం మండలం పెద్దగనగళ్లపేటకు చెందిన మైలపల్లి ప్రసాద్, పోలీస్ తదితరులు విన్నవించారు. 2013లో రూ.9వేలు వ్యవసాయ రుణం తీసుకున్నానని, ఇప్పుడు అసలు, వడ్డీ కలిపి రూ.25000 అరుు్యందని, రుణ మాఫీ వర్తింప జేయాలంటూ రేగిడి ఆమదాలవలస మండలం పుర్లి గ్రామానికి చెందిన రైతు తుమ్మ శ్రీరామ్మూర్తి విన్నవించారు. ప్రభుత్వం గుర్తించిన ర్యాంపుల నుంచి ఇసుక తరలిస్తున్నా అధికారులు ట్రాక్టర్‌ను సీజ్ చేశారని, అధికారులు స్పందించి న్యాయం చేయాలని చిలకపాలెంకు చెందిన సంతోష్‌కుమార్ వినతిపత్రం అందజేశారు. ఎస్పీ గ్రీవెన్‌ససెల్‌కు 20 వినతులు శ్రీకాకుళం సిటీ: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఓఎస్డీ(అడ్మిన్) తిరుమలరావు ఆధ్వర్యంలో గ్రీవెన్స సెల్ నిర్వహించారు. దీనికి 20 అర్జీలు వచ్చాయి. వాటిలో కుటుంబ తగాదాలకు సంబంధించి-4, సివిల్- 4, పాత తగాదాలు-4, ఇతర కారణాలకు చెందినవి-8 ఉన్నాయి. వీటిని త్వరతిగతిన పరిష్కరించాలని సంబంధిత డీఎస్పీ, సీఐ, ఎస్ఐలను ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ వి.సుబ్రహ్మణ్యం, విశ్రాంత ఎస్ఐ పి.రాజేశ్వరరావు, లీగల్ అడ్వైజర్ కె.ఆఫీసునాయుడు, న్యాయవాది టి. వరప్రసాదరావులు హాజరయ్యారు. ఓఎస్డీ ఆధ్వర్యంలో జరిగిన ఫ్యామిలీ కౌన్సెలింగ్‌నకు 14 అర్జీలు రాగా, వాటిలో 6 అక్కడికక్కడే రాజీ పరిచారు. మిగతా 8 పెండింగ్‌లో ఉన్నారుు. కార్యక్రమంలో న్యాయవాది సీహెచ్ జ్యోతి, డీఆర్డీఏ, ఐసీడీఎస్ సిబ్బంది డి.విజయకుమారి, కె.నిర్మల, సీనియర్ సభ్యులు బరాటం కామేశ్వరరావులు పాల్గొన్నారు. -
ఆన్లైన్ అర్జీ
నెట్ ద్వారా ఫిర్యాదు చేసుకునే అవకాశం ప్రతి సమస్యకూ ప్రత్యేక నంబర్ కేటాయింపు అధికారుల్లో జవాబుదారీతనం పెంచేందుకు కలెక్టర్ కృషి ఇక నుంచి గ్రీవెన్స్ మరింత సరళతరం కానుంది. కార్యాలయాలకు వెళ్లకుండా ఇంటర్నెట్ ద్వారా ఇంటి నుంచే ఫిర్యాదు చేసుకోవచ్చు. సమస్య పరిష్కార స్థితిని పరిశీలించుకోవచ్చు. నేరుగా, ఆన్ లైన్ ద్వారా అందిన ప్రతి అర్జీని కంప్యూటరీకరించి 15 రోజుల్లో సమస్యకు సంబంధించిన ప్రగతిపై సెల్‌కు మెసేజ్ పంపించనున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంతోపాటు మధిర, కల్లూరులో గ్రీవెన్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఖమ్మం సహకారనగర్ : ఇప్పటివరకు ఏదైనా ఫిర్యాదు చేయాలంటే జిల్లా కేంద్రమైన ఖమ్మానికి రావాలి. ప్రజావాణిని ప్రజలకు మరింత చేరువ చేయాలని జిల్లా అధికార యంత్రాంగం సంకల్పించింది. ప్రజలకు వ్యయప్రయాసాలు తగ్గించాలనే భావనతో జిల్లా కలెక్టర్ మొదటి, నాలుగో సోమవారం ఖమ్మంలో, 2వ సోమవారం కల్లూరు, 3వ సోమవారం మధిరలో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వారం వరకు ప్రజలు వేచి చూడకుండా ఉండటంతో పాటు ఖమ్మంలో జరిగే ప్రజావాణికి రాకుండా ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ కలిగిన వారు ఇంట్లో ఉండైనా శాఖల వారీగా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రజలు cpframr.tr.in.ac.in సైట్లోకి వెళ్లి మన జిల్లా, ఫిర్యాదుకు సంబంధించిన శాఖ వివరాలతో పాటు ఫిర్యాదు చేసే వివరాలు నింపి సబ్మిట్ చేస్తే ఆ ఫిర్యాదుకు ఓ ప్రత్యేక నంబర్వస్తుంది. ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంచేందుకు కలెక్టర్ ఈ సంస్కరణలు చేపట్టారు. ఈ క్రమంలో కలెక్టరేట్, జిల్లా పరిషత్‌కు వచ్చే వారికి ప్రజావాణిపై అధికారులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్ని శాఖలకూ అనుసంధానం జిల్లాలో ప్రస్తుతం ఉన్న అన్ని శాఖలకు ప్రజావాణిని అనుసంధానం చేశారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ప్రతి ఒక్కటి ఆయా శాఖలకు ప్రజావాణి సిబ్బంది పంపిస్తుంటారు. ఆ శాఖాధికారులు ఆ సమస్యలను పరిష్కరిస్తారు. ప్రస్తుతం సమస్య పరిష్కారానికి సంబంధించిన అంశాలను కలెక్టరేట్లోని ప్రజావాణిలో లేదంటే ఆయా శాఖల కార్యాలయాల్లో మాత్రమే చూసుకునే వీలుంది. ఫిర్యాదుకు కేటాయించి నంబర్ ద్వారా సమస్య పరిష్కార ప్రగతిని బాధితులు కార్యాలయాలకు రాకుండానే ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవచ్చు. పైన తెలిపిన సైట్లోకి వెళ్లి కేటాయించిన నంబర్‌ను ఎంటర్ చేస్తే సమస్య పరిష్కారం ఏ దశలో ఉందో చూపిస్తుంది. త్వరలో ఎస్ఎంఎస్ అలర్ట్ ప్రజావాణిలో నేరుగా లేదా ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసే వారికి ఎస్ఎంఎస్ పంపనున్నారు. ఫిర్యాదు పరిష్కారమయ్యాక మరో ఎస్ఎంఎస్, పరిష్కారం కాకపోయినా ఫిర్యాదుదారుడికి సమాచారాన్ని అందించేందుకు ఎస్ఎంఎస్ పంపనున్నారు. ఎస్ఎంఎస్ అలర్ట్‌పై బీఎస్ఎన్ఎల్ అధికారులకు లేఖ రాసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. -
స్నేహమంటే ఇదేరా..!
దివ్యాంగుడికి ట్రైసైకిల్ ఇప్పించిన స్నేహితులు విజయనగరం కంటోన్మెంట్: ఆపదలో ఆదుకునే నిజమైన స్నేహితుడు అన్న నానుడిని అక్షరాలా నిజం చేశారు ఓ దివ్యాంగుని స్నేహితులు. ఆ దివ్యాంగుడికి ట్రైసైకిల్ ఇచ్చేందుకు అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో వారంతా చలించి దివ్యాంగుడైన స్నేహితుడితో కలిసి కలెక్టరేట్‌కు వచ్చి ట్రైసైకిల్ సాధించి మిత్రుడి కళ్లలో ఆనందం చూసి సంతోషంగా ఇళ్లకు వెళ్లారు. వివరాలిలా ఉన్నారుు. డెంకాడ మండలం గొడ్డుపల్లి గ్రామానికి చెందిన ఎర్రా రమేష్ ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. రోజూ స్కూల్‌కు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇతను ట్రైసైకిల్ కోసం ఎన్నిమార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోరుుంది. దీంతో అతని స్నేహితులు నేరుగా కలెక్టర్‌ను కలిసేందుకు సోమవారం నిర్వహించిన గ్రీవెన్‌ససెల్‌కు తీసుకువచ్చారు. కలెక్టర్ వివేక్ యాదవ్‌ను కలిసి సమస్యను వివరించారు. దీంతో స్పందించిన కలెక్టర్ వెంటనే మూడు చక్రాల సైకిల్‌ను మంజూరు చేశారు. ఈ మేరకు రమేష్‌ను విభిన్న ప్రతిభావంతుల శాఖ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ సైకిల్ ఇవ్వడంతో స్నేహితులంతా అమితానందంగా ఇంటికెళ్లారు. -
వెలవెలబోయిన గ్రీవెన్ససెల్
శ్రీకాకుళం పాతబస్టాండ్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స సెల్ ఫిర్యాదు దారులు, వినతులు ఇచ్చేవారు లేక వెలవెల బోరుుంది. గ్రీవెన్స సెల్లో శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ పీఏ శోభ, డీఆర్డీఏ పీడీ కిశోర్‌కుమార్, డ్వామా పీడీ ఆర్.కూర్మనాథ్, సెట్‌శ్రీ సీఈఓ వీవీఆర్‌ఎస్ మూర్తి తదితరులు పాల్గొని వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. నరసన్నపేటలోని కస్తూర్బా లెప్పర్సీ కాలనీని పునర్నిర్మించాలని కాలనీకి చెందిన సీహెచ్ పాపారావు విన్నవించారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తే బ్రైట్ ఫ్యూచర్ ఆర్గనైజేషన్ వారు కాలనీ ఇళ్ల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నారని, అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కుమార్తె వివాహం వచ్చేనెల 3న జరగనుందని, బ్యాంకులో దాచుకున్న డబ్బులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కొత్తూరు మండలం నివగాం గ్రామానికి చెందిన నల్లాన హరిచంద్రరావు అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎల్డీఎం వెంకటేశ్వరరావు స్పందిస్తూ డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. గూనభద్ర గ్రామానికి నిర్వాసిత గ్రామంగా గుర్తించి ప్యాకేజీలు, పరిహారం అందజేయాలని ఆ గ్రామానికి చెందిన వై.సింహాచలం, సూరయ్య తదితరులు కోరారు. 2007 నుంచి 2010 సంవత్సరం వరకు ఏపీ ఎరుుడ్‌స కంట్రో సోసైటీ పరిధిలోని పీపీటీసీటీ ప్రాజెక్టులో పనిచేశామని, ఇప్పుడు సీఎస్ఆర్ పవర్ గ్రీడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తున్న తమను ఎలాంటి నోటీసులు అందజేయకుండా తొలగించారని, ఉద్యోగం, జీతాలు చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని డి.సురేష్, ఎన్.లక్ష్మణ్, బి.జానకి, ఎం.పద్మావతి తదితరులు కోరారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని రాగోలులో నిత్యవసర సరుకుల తూకంలో మోసాలకు పాల్పడుతున్నారని పలుసార్లు ఫిర్యాదు చేసినా పౌర సరఫరాల అధికారులు చర్యలు తీసుకోవడంలేదని ఆ గ్రామానికి చెందిన కూటికుప్పల ధనుంజయరావు ఫిర్యాదు చేశారు. ఆమదాలవలస మండలం తోటాడ పంచాయతీ పరిధిలోని గోపీనగర్ ప్రాంతంలో నాగావళి నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని అదే గ్రామానికి చెందిన బి.తులసీరావు, రాజారావులు ఫిర్యాదు చేశారు. ఎస్పీ గ్రీవెన్స సెల్‌కు 21 వినతులు శ్రీకాకుళం సిటీ: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స సెల్‌కు 21 వినతులు వచ్చారుు. వచ్చిన వినతులను ఎస్బీ డీఎస్పీ టి.మోహనరావు స్వీకరించారు. వాటిలో కుటుంబ తగాదాలకు నాలుగు, సివిల్ కేసులు ఐదు, పాత కేసుల విషయమై మూడు, ఇతర కారణాలకు చెందినవి తొమ్మిది వినతులు వచ్చారుు. మహిళా పోలీస్‌స్టేషన్ ఎస్ఐ జి.శ్యామలరావు ఆధ్వర్యంలో జరిగిన ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు 8 వినతులు రాగా, వాటిలో నాలుగు పరిష్కరించారు. మిగిలినవి వారుుదా వేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఎస్ఐ రాజేశ్వరరావు, సిటిజన్ ఫోరం ఆధ్యక్షుడు బరాటం కామేశ్వరరావు, డీఆర్డీఏ, ఐసీడీఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. డయల్ యువర్ కలెక్టర్‌కు 6 వినతులు శ్రీకాకుళం పాతబస్టాండ్: డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 6 వినతులు వచ్చాయని డీఆర్డీఏ పీడీ కిశోర్‌కుమార్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దళితవాడలో బోరు వేయాలని మందస మండలం బాలిగాం గ్రామానికి చెందిన బి.కూర్మారావు, సమాచార హక్కు చట్టంపై తప్పుడు సమాచారం ఇచ్చిన ఫుడ్ ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకోవాలని ఆమదాలవలసకు చెందిన పైడి శ్రీనివాసరావు, వీధి దీపాలు వెలగడంలేదంటూ కాశీబుగ్గ సమీపంలోని పద్మాపురానికి చెందిన కె.సుజాతలు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు, నిరుద్యోగులకు పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ సరఫరా చేయాలని వంగర మండలం ఎంఎస్ఆర్ పురం గ్రామానికి చెందిన కేటీ బాబ్జి విన్నవించారు. -
ఆన్లైన్ గ్రీవెన్స్
ఇంటి నుంచే ఫిర్యాదు చేసే వెసులుబాటు కార్యాలయాలకు వెళ్లే భారానికి చెక్ ఇప్పటికే 55 ప్రభుత్వ శాఖలకు ఐడీలు {పతీ ఫిర్యాదుకు నంబర్ ఏ స్థారుులో ఉందో తెలుసుకునే అవకాశం వరంగల్ రూరల్ : ప్రతీ సోమవారం కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్స్ సెల్(ప్రజావాణి)లో ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేయడమంటే పెద్ద ప్రహసనమేనని చెప్పాలి. అరుుతే, ప్రజలకు పాలనను దగ్గర చేయాలన్న భావనతో రాష్ట్రప్రభుత్వం తాజాగా జిల్లాల పునర్విభజన చేపట్టింది. ఈ మేరకు ఏర్పడిన వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రశాంత్ జీవన్ పాటిల్ గ్రీవెన్ససెల్ను తీరును నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్సకు రావడం ఇబ్బందే అరుునా తప్పని పరిస్థితుల్లో ప్రజలు వస్తున్నారని గుర్తిం చారు. వారికి వ్యయప్రయాసాలు తగ్గించాలన్న భావనతో డివిజన్, మండల కేంద్రాల్లో ప్రజావాణిని రెండు వారాల క్రితం ప్రారంభించారు. అరుుతే, ఆ వారం కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్సకు ఏ మాత్రం రద్దీ తగ్గలేదు. కొంచెం ప్రచారమైతే జిల్లా కేంద్రానికి వచ్చే వారి సంఖ్య తగ్గుతుందనే భావనకు వచ్చారు. మొత్తం తగ్గించేందుకు.. కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్‌ససెల్‌కు వరంగల్ రూరల్ జిల్లా ఏర్పడ్డాక మొదటివారం 75, రెండో వారం 170, మూడో వారం 75, నాలుగో వారం 120 ఫిర్యాదులు అందారుు. ఇలా కలెక్టరేట్‌కు వచ్చే వారి సంఖ్య తగ్గించేందుకు మం డల స్థారుులో రెండు వారాలుగా గ్రీవెన్స నిర్వహిస్తున్నారు.అరుుతే, జిల్లా, మండల కా ర్యాలయాలకు వచ్చే వారి సంఖ్య తగ్గించేందు కు తాజాగా ‘ఆన్లైన్ గ్రీవెన్ససెల్’కు శ్రీకారం చుట్టారు. దీంతో ఇంటర్నెట్ కనెక్షన్ కలిగిన కంప్యూటర్ లేదా స్మార్ ఫోన్ ఉంటే చాలు ఇం ట్లో కూర్చునే శాఖల వారీగా మనం ఫిర్యాదు చేయొచ్చు. ఈ విధానం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ వరంగల్ రూరల్ జిల్లాలో మాత్రం 55 శాఖలకు ప్రత్యేక ఐడీలు కేటారుుంచారు. ఈ మేరకు ప్రజలు ఛిఞజట్చఝట.్టట.జీఛి.జీ సైట్లోకి వెళ్లి మన జిల్లా, ఫిర్యాదుకు సంబంధించి శాఖ తదితర వివరాలతో పాటు ఫిర్యాదు చేసే వివరాలు నింపి సబ్మిట్ చేస్తే ఆ ఫిర్యాదుకు ఓ ప్రత్యేక నంబర్ వస్తుంది. ఆ నంబర్ ద్వారా ఫిర్యాదు ఏ స్థారుులో ఉందో తెలుసుకోవచ్చు. అలాగే, శాఖల వారీగా ఎన్ని ఫిర్యాదులు నమోదయ్యా రుు. ఎన్నింటిని పరిష్కరించారు, పరిష్కరించకపోతే కారణాలేమిటన్నవివరాలనుకలెక్టర్తో పా టు శాఖల ఉన్నతాధికారులు తెలుసుకునే వెసలుబాటు ఉంది. తద్వారా ఉద్యోగుల్లో జవాబుదారీ తనం పెరిగి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారనేది కలెక్టర్ భావన. ఈ మేరకు ఆన్లైన్లో గ్రీవెన్స పద్ధతిపై జిల్లాలో విసృ్తతంగా ప్రచారం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే ఎస్ఎంఎస్ అలర్ట్ ప్రజావాణిలో నేరుగా లేదా ఆన్లైన్లో ఫిర్యాదు చేసే వారికి ఎస్ఎంఎస్ అందుతుంది. అలాగే, ఆ ఫిర్యాదు పరిష్కారమయ్యాక మరో మెసేజ్, పరిష్కరించలేకపోతే అందుకు కారణాలు చెబుతూ మెసేజ్‌లు అందుతారుు. అరుుతే, ఒక్కో మెసేజ్‌కు ఐదు పైసల ఖర్చవుతుండగా.. దీనిని భరించేందుకు వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అంగీకరించారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎంఎస్ చార్జీలు ఎవరు చెల్లించాలనే అంశంపై స్పష్టత లేకపోవడంతో ఫిర్యాదుదారుల సెల్ నంబర్లకు మెసేజ్ సౌకర్యం అందుబాటులోకి రాలేదు. త్వరలోనే ఈ విధానం ప్రారంభమయ్యే అవకాశముంది. -
ఇక్కడి వరకు రానివ్వొద్దు..
క్షేత్రస్థాయిలోనే సమస్యలు పరిష్కరించాలి అప్పుడు గ్రీవెన్స్ కు దరఖాస్తులు రావు.. అధికారులు గ్రామాల్లో పర్యటిస్తేనే ఫలితం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వరంగల్ రూరల్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన వరంగల్ రూరల్ జిల్లాలో పరిధిలోని మండలాల ప్రజల సమస్యలను అధికారులు ఎక్కడికక్కడ పరిష్కరించాలని కలెక్టర్ జీవన్ ప్రశాంత్ పాటిల్ సూచించారు. తద్వారా గ్రీవెన్స్ సెల్‌కు వచ్చే వారు తగ్గిపోతారని.. ఇందుకోసం అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని ఆదేశించారు. కొత్తగా జిల్లా ఏర్పడిన అనంతరం సోమవారం కలెక్టరేట్లో తొలి గ్రీవెన్స్ సెల్ జరిగింది. ఈ సందర్భంగా హాజరైన అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ పరిపాలనలో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. పరిధి తక్కువే.. ‘తొలి గ్రీవెన్స్ సెల్‌కు పెద్దసంఖ్యలో దరఖాస్తులు దారులు వచ్చారు... వీరి సంఖ్య ఎప్పటికప్పుడు తగ్గుతుండాలి... అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరిస్తే ఇది సాధ్యమవుతుంది’ అని కలెక్టర్ జీవన్ ప్రశాంత్ పాటిల్ అన్నారు. అలాగే, కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్స్ సెల్‌కు వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై శ్రద్ధ చూపాలని సూచించారు. జిల్లాలో తక్కువ మండలాలే ఉన్నందున.. అధికారులు వారంలో మూడు రోజులు గ్రామాల్లో పర్యటించి, ప్రజలకు అందుబాటులో ఉండాలని.. తద్వారా వారి సమస్యలు తెలియడంతో పాటు పరిష్కారానికి మార్గం సులువవుతుందని తెలిపారు. ఆన్లైన్ లో ఫిర్యాదులు వచ్చే సోమవారం నుంచి ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను ఆన్లైన్ లో నమోదు చేస్తామని కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ చెప్పారు. ఆ తర్వాత విభాగాల వారీగా ఫిర్యాదులను ఆయా శాఖల అధికారుల లాగిన్ లో వేస్తామని తెలిపారు. ఇందులో ప్రతీ సమస్యను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని, లేనిపక్షంలో కారణాలను ఫిర్యాదుదారులకు మెసేజ్ రూపంలో పంపించాలని సూచించారు. అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు, వాట్సప్‌లో కూడా జిల్లా పరిపాలనా యంత్రాంగానికి అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రీవెన్స్ సెల్లో జాయింట్ కలెక్టర్ ఎం.హరిత, డీఆర్ఓ వెలమపల్లి నాగరాజారావు, రూరల్ ఆర్డీఓ సురేందర్‌రావు, ఏఓ పి.సత్యనారాయణరావు, జిల్లా వెనకబడిన తరగతుల, దళిత అభివృద్ధి, మైనార్టీ అభివృద్ధి శాఖ అధికారులు ఎం.నరసింహస్వామి, పి.రవీందర్‌రెడ్డి, ఎం.డీ.సర్వర్మియా, జిల్లా ఉపాధి కల్పన అధికారి పి.నిరుపమ, డీఎస్ఓ విలియం పీటర్, డీపీఆర్ఓ కిరణ్మయి, జిల్లా గిరిజన అభివృద్ది అధికారి టి.నిర్మల, డీఈఓ నారాయణరెడ్డి, డీఎఫ్ఓ కె.పురుషోత్తం, డీఎంహెచ్ఓ డాక్టర్ అశోక్ ఆనంద్ పాల్గొన్నారు. రక్షణ కోసం మొదటి దరఖాస్తు భూమి విషయంలో మాజీ మిలిటెంట్ పెండ్లి రఘుతో తనకు ప్రాణభయం ఉందని నల్లబెల్లి మండలం రాంతీర్థం గ్రామానికి చెందిన మనికంటి రాజిరెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పెండ్లి రఘుతో పాటు ఎరుకల సునీత, ఎరుకల మల్లారెడ్డితో ప్రాణభయం ఉన్నందున రక్షణ కల్పించాలని కోరారు. దీనికి స్పందించిన కలెక్టర్ తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. -
అయినా.. తగ్గలేదు!
గ్రీవెన్ సెల్‌కు 191 దరఖాస్తులు కొత్త జిల్లాలు ఏర్పడినా గత స్థాయిలోనే రాక వినతులు స్వీకరించిన కలెక్టర్, జేసీ, డీఆర్వో హన్మకొండ అర్బన్ : వరంగల్ జిల్లా కలిసి ఉన్నప్పటికీ... విడిపోయి కొత్తగా ఏర్పడిన అర్బన్ జిల్లాలోనూ గ్రీవెన్ సెల్‌కు వచ్చే ఫిర్యాదుల సంఖ్యలో ఏ మాత్రం తేడా రాలేదు. 51మండలాలు ఉన్నప్పుడు వచ్చిన మాదిరిగానే 11 మండలాల వరంగల్ అర్బన్ జిల్లాలో సోమవారం తొలిసారిగా నిర్వహించిన గ్రీవెన్స్ కు 191 దరఖాస్తులు రావడం గమనార్హం. ఉదయం 10.30 నుంచి కలెక్టరేట్లో గ్రీవెన్స్ లో వినతులు ఇచ్చేందుకు జనం క్యూలో నిలబడ్డారు. అయితే, కలెక్టర్ ఆమ్రపాలి 11.15 గంటలకు ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించారు. జేసీ దయానంద్, డీఆర్వో శోభ ఇతర అధికారులు కూడా వినతిపత్రాలు స్వీకరించగా.. ప్రతీ దరఖాస్తును కలెక్టర్ నిశితంగా పరిశీలిస్తూ సంబంధిత అధికారులకు అందజేశారు. అయితే, కొన్ని దరఖాస్తులను కలెక్టర్ తన వద్దే ఉంచుకోవడం విశేషం. ఈ మేరకు గ్రీవెన్స్ కు వచ్చిన దరఖాస్తుల్లో కొన్నింటి వివరాలు... పహాణీలో పేర్లు రావట్లేదు.. మాకు గ్రామంలో 13 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా.. 1958నుంచి 2003వరకు మా కుటుంబ సభ్యుల పేర్లు వచ్చాయి. ఆ తర్వాత పహాణీల్లో ఒకరి పేరుకు బదులు మరొకరి పేరు వస్తోంది. ఈ విషయంలో తహసీల్దార్, వీఆర్వోలకు చాలా సార్లు చెప్పినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. చిట్యాల పాపయ్య, పైడిపల్లి నాలుగు నెలలుగా రేషన్ లేదు.. మాది కాజీపేట. రేషన్ షాపు నంబర్ 12లో మా కార్డు ఉంది. గత నాలుగు నెలలుగా మా కార్డు డిలీట్ అయ్యాయని సరుకులు ఇవ్వడంలేదు. గతంలో కూడా తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు చెప్పాం. అయినా ఫలితం లేదు. మాకు వెంటనే రేషన్ కార్డులు వచ్చేలా చూడాలి. సిరిమళ్ల అనసూర్య, కాజీపేట ఉద్యోగుల వేతనాలు ఇవ్వండి సంవత్సర కాలంగా ఉన్న వేతన బకాయిలను చెల్లించాలి. గతంలో పీడీపై ఆరోపణలు రావడంతో మా వేతనాలు నిలిపివేశారు. ఆ తర్వాత ఇచ్చినా అరవై శాతమే చెల్లించారు. మిగతా 40 శాతం వేతనాలు వెంటనే చెల్లించేలా చూడాలి. ఎన్ సీఎల్పీ ఉద్యోగులు వరద బాధితులకు పరిహారం ఇవ్వండి ఇటీవల కురిసిన వర్షాలకు వచ్చిన వరదలతో నయీంనగర్ పెద్దమోరీ సమీప ప్రాంతాలో పూర్తిగా జలమయ్యాయి. తద్వారా తమ ఇళ్లలోని సామగ్రి కొట్టుకుపోయినందున ఆదుకోవాలని స్థానిక కాలనీ ప్రజలు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. బాధితుల వెంట స్థానిక కార్పొరేటర్ దేవేందర్ ఉన్నారు. 40వ డివిజన్ ప్రజలు పట్టా భూముల్లో నిర్మాణాలు తొలగించాలి వరంగల్‌లోని సర్వేనెంబర్ 140, 142లోని పట్టాభూముల్లో సీపీఎం, సీపీఐ నాయకులు గుడిసెలు వేసుకున్నారు. ప్రస్తుతం శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయంలో చాలాకాలం నుంచి అధికారులకు వినతులు ఇస్తున్నా సమస్య పరిష్కరం కావడం లేదు. వెలుగు సుధాకర్, వరంగల్ మా సమస్యలు పరిష్కరించాలి 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం హామీ మేరకు సమస్యలు పరిష్కరించాలి. ఉద్యోగ భద్రత, బకాయిల చెల్లింపు, పనికి తగిన వేతనం ఇవ్వాలనేది తమ డిమాండ్లు అని నాయకులు రమేష్, వెంకటేష్, సాంబయ్య, ప్రవీణ్, రాంబాబు తెలిపారు. 108 ఉద్యోగ సంఘం నాయకులు ఎంజీఎంలో మందులు లేవు పేదలకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ధర్మాసుపత్రిలో గత 20 రోజుల నుంచి మందులు సరిగ్గా అందుబాటులో లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో చొరవ తీసుకుని మందులు అందుబాటులో ఉండేలా చూడాలని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ నాయకులు రాజనాల శ్రీహరి, మంద వినోద్‌కుమార్, శ్రీనివాస్, రాజు, పోశాల పద్మ, వెంకటేశ్వరు తదితరులు కలెక్టర్‌ను కోరారు. – గ్రేటర్ కాంగ్రెస్ నాయకుల సదరం సర్టిఫికెట్ ఇవ్వడం లేదు.. నాకు కాలు పూర్తిగా లేదు. పింఛన్ కోసం సదరం సర్టిఫికెట్ కావాలని ఎంజీఎంకు వెళ్తే ఇవ్వడం లేదు. గాయం ఉన్నందున ఇప్పుడు సర్టిఫికెట్ ఇచ్చేది లేదంటున్నారు. వాస్తవానికి నా కాలి గాయం పూర్తిగా తగ్గింది. అధికారులు సదరం సర్టిఫికెట్ ఇస్తేనే పింఛన్ వస్తుంది. ఓరుగంటి రాజ్‌కుమార్, కాశిబుగ్గ -
గ్రీవెన్స్‌కు కొత్త కళ
నేటి నుంచి నిర్మల్‌లో జిల్లా ప్రజా ఫిర్యాదుల విభాగం అర్జీలు స్వీకరించనున్న కలెక్టర్, జేసీ, ఉన్నతాధికారులు తగ్గిన దూరభారం.. జిల్లా ప్రజల్లో స్థానికత సంబరం.. సాక్షి, నిర్మల్ : నిర్మల్‌లోనే ప్రజా ఫిర్యాదుల విభాగం.. ఎప్పటి లాగే ఇప్పుడు ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి అర్జీ ఇవ్వడమే.. అయితే ఇప్పుడు పెద్ద మార్పు.. ఇప్పుడది ఆర్డీవో కార్యాలయం కాదు.. మన కొత్త జిల్లా కలెక్టర్ కార్యాలయం.. ఈసారి గ్రీవెన్స్‌లో డివిజినల్ అధికారులు కాదు.. జిల్లా కలెక్టర్ నుంచి మొదలుకుంటే అన్ని శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉంటారు.. విజయదశమికి కొత్త జిల్లా ఆవిర్భవించిన అనంతరం మొదట సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగం కొత్త కళ సంతరించుకుంది. ఇప్పుడు నిర్మల్ జిల్లా ప్రజలకు ఈ సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. తొలి గ్రీవెన్స్‌కు ఏర్పాట్లు పూర్తి ప్రజా ఫిర్యాదుల విభాగం కోసం నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రధాన ముఖ ద్వారం నుంచి ఎదురుగా ఉన్న హాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభిస్తారు. కలెక్టర్ ఇలంబరిది, జేసీ సీహెచ్.శివలింగయ్య తదితరులు పాల్గొనున్నారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు సోమవా రం రోజు ప్రజా ఫిర్యాదుల విభాగానికి హాజరు కావాలని జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు వెళ్లా యి. దీంతో కలెక్టరేట్ కార్యాలయంలో సోమవా రం కొత్త సందడి కనిపించనుంది. జిల్లా ఆవిర్భావానికి ముందు ఉమ్మడి ఆదిలాబాద్‌లో నిర్మల్ ప్రజలు ఆర్డీవో కార్యాలయంలో అర్జీలు అందజేసేవారు. ల్జేజీజ్డౌ ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వె ళ్లి అర్జీ ఇచ్చేవారు. అప్పుడు కలెక్టరేట్‌కు వెళ్లాలం టే నిర్మల్ నుంచి 80 కిలోమీటర్లు, అదే ముథోల్ నియోజకవర్గ ప్రజలకైతే 130 కిలోమీటర్లకు పైగా వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు నిర్మల్‌లోనే కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులకు అర్జీలు అందజేసే వీలుండడంతో ప్రజల్లో ఉత్సాహం వ్యక్తమవుతుంది. దూరభారం తగ్గడంతో పాటు ఒకవేళ పని పూర్తయినా కాకపోయినా మళ్లీ వచ్చేందుకు సులువుగా ఉంటుందని ఖర్చు కూడా తగ్గుతుందని ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. సమస్యల పరిష్కారంపై కోటి ఆశలు ప్రజా ఫిర్యాదుల విభాగంలో అందజేసే అర్జీల పరిష్కారంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఒక అర్జీ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి పరిష్కారం అయింది, కానిది సమాచారం అర్జీదారుడికి తెలియజేయాల్సి ఉంటుంది. ప్రజలు అర్జీ అందజేసిన తర్వాత వారికి అర్జీ అందజేసినట్లు ఒక పత్రం అందజేస్తారు. మొదట అర్జీ తీసుకునే సమయంలోనే అతని పేరు, ఫోన్ నంబర్, చిరునామా, అర్జీకి సంబంధించిన వివరాలు, ఏ అధికారి శాఖ పరిధిలోకి వస్తుంది అనేది ఆ పత్రంలో నమోదు చేస్తారు. అర్జీ అందజేసిన నెల రోజుల్లో బాధితుడి సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయిలో స్వీకరించిన ఈ అర్జీని క్షేత్ర స్థాయిలో పరిశీలనకు డివిజనల్ నుంచి మండల, గ్రామ స్థాయి వరకు పంపించాల్సి ఉంటుంది. దీనికి ఆయా స్థాయిల్లో నిర్ధారిత గడువు ప్రకారం పూర్తి చేసి నెల రోజుల్లో బాధితుడికి న్యాయం చేయాలి ఇది గ్రీవెన్స్ ముఖ్య ఉద్దేశం. సాధారణంగా గ్రీవెన్స్‌కు ఎక్కువగా భూ సంబంధిత సమస్యలే అధికంగా వస్తుంటాయి. పింఛన్లు ఇవ్వాలని అధికారులను కోరేందుకు ఇక్కడికి వస్తారు. గతంలో రేషన్‌కార్డుల కోసం కూడా అధికంగా అర్జీలు వచ్చేవి. ఇవే కాకుండా చౌక ధరల దుకాణాల్లో అవకతవకలు, వివిధ పథకాల్లో అన్యాయాలు, తదితర సమస్యలపై కూడా పలువురు గ్రీవెన్స్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్తుంటారు. ఈ నేపథ్యంలో గ్రీవెన్స్‌పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. grievance cell , nirmal, collector offdice, -
జెడ్పీ కార్యాలయంలో గ్రీవెన్స్‌సెల్
కాకినాడ సిటీ : జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో బుధవారం జడ్పీ చైర్మన్ నామన రాంబాబు గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. పలువురు జెడ్పీటీసీ సభ్యులతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు సమస్యలపై వినతులు అందజేశారు. తొండంగి మండలం వేమవరం ఎంపీటీసీ ఎన్.హైమవతి గ్రామంలోని తాగునీరు, సీసీ రోడ్లు, డ్రెయిన్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని కోరారు. వాటిపై చైర్మన్ సానుకూలంగా స్పందించి మంజూరుకు అధికారులకు సూచించారు. ఐ.పోలవరం జెడ్పీటీసీ పేరాబత్తుల రాజశేఖర్, మామిడికుదురు మండలం మగటపల్లి ఎంపీటీసీ నామన నగేష్‌లు వివిధ సమస్యలపై వినతులు అందజేశారు. సీపీడబ్ల్యూస్, ఆర్డబ్ల్యూఎస్ ప్రాజెక్ట్‌లలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు బకాయి వేతనాల కోసం వినతిపత్రం అందజేయగా చైర్మన్ స్పందించి చర్యలకు ఆదేశించారు. జెడ్పీ సీఈవో కె.పద్మ, కార్యాలయ విభాగాల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
గ్రీవెన్స్ సెల్ లో రైతు ఆత్మహత్యాయత్నం.
-
గ్రీవెన్స్ సెల్ లో రైతు ఆత్మహత్యాయత్నం
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టర్ కార్యాలయం గ్రీవెన్స్ సెల్లో సోమవారం ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుడిపూడి సాయిబాబా అనే రైతు(45) తాను సాగు చేసుకుంటున్న సెంటు భూమిని ఎమ్మార్వో మరో వ్యక్తికి పట్టా చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానకి పాల్పడినట్లు తెలిసింది. రైతు స్వస్థలం అమలాపురం మండలం మెట్లకాలనీ. ప్రస్తుతం సాయిబాబా కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. -
స్వీపర్ పోస్టును లాక్కుంటున్నారు
* అధికార పార్టీ నేతలపై ఫిర్యాదుల వెల్లువ * గ్రీవెన్స్‌సెల్‌కు 232 ఫిర్యాదులు విజయనగరం కంటోన్మెంట్: నిరుపేదనైన తనను పాఠశాల స్వీపర్‌గా నియమించుకోమని గ్రామైక్య సంఘం శానిటరీ రిపోర్టు పంపిస్తే తనను కాకుండా..ఏ అర్హతలూ లేని మరొకరిని నియమించారని కొమరాడ మండలం కందివలసకు చెందిన బచ్చల భవాని అధికారుల ముందు వాపోయింది. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు 232 అర్జీలు వచ్చాయి. కలెక్టర్ ఎంఎం నాయక్, జేసీ శ్రీకేశ్ బి లఠ్కర్, డీఆర్వో మారిశెట్టి జితేంద్రలు ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా బచ్చల భవాని మాట్లాడుతూ దళిత సామాజిక వర్గానికి చెందిన తనకు వచ్చిన స్వీపర్ పోస్టును తనకు కాకుండా చేసేందుకు నాయకులు రాజకీయంగా ప్రయత్నిస్తున్నారని దానికి అధికారులు కూడా సహకరిస్తున్నారని ఫిర్యాదులో పొందుపరిచింది. తనకు న్యాయం చేయాలని కోరింది. భూములను ఇవ్వడం లేదు 30 ఏళ్ల క్రితం బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన 14 మంది దళితులకు నాలుగెకరాల చొప్పున ప్రభుత్వం ఇచ్చిన భూమిని తమకు కాకుండా చేస్తున్నారని గ్రామానికి చెందిన కురమాన పైడియ్య, రాయి వెంకయ్య, గర్భాపు చిన్నమ్మి, కాగాన సింహాచలం తదితరులు ఫిర్యాదు చేశారు. గొర్లె సీతారాం పురంలో తమకు కేటాయించిన భూమిని వెంటనే ఇప్పించాలని కోరారు. కోళ్ల ఫారాలతో దుర్గంధం పూసపాటి రేగ మండలం కుమిలి గ్రామం చుట్టూ ఇప్పటికే పెద్ద పెద్ద కోళ్ల ఫారాలు ఏర్పాటు చేసి ఉండడం వల్ల తీవ్ర దుర్గంధంతో ప్రజానీకం ఇబ్బందులు పడుతోందని, ఇప్పుడు ఎస్సీ కాలనీలో కొత్తగా కోళ్ల ఫారం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని గ్రామానికి చెందిన జి నాగిరెడ్డి, బి రాము తదితరులు ఫిర్యాదు చేశారు. కోళ్ల ఫారాలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకుని గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని వారు కోరారు. అనుమతిలేని క్రషర్లతో అవస్థలు వేపాడ మండలం రామస్వామి పేటలో అనుమతులు లేకుండా ఏడు క్రషర్లు నడుస్తున్నాయని అధికారులు వెంటనే చర్యలు తీసుకుని వాటిని నిలిపివేయించాలని గ్రామ సర్పంచ్ పత్రి బాలకృష్ణ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. కేవలం కిలోమీటరు పరిధిలో ఏడు క్రషర్లనూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి లేకుండా నడుపుతున్నారన్నారు. వీఆర్ఏకు ఎస్సీ కార్పొరేషన్ రుణమిచ్చారు. సీతానగరం మండలం పెదంకలాం గ్రామానికి చెందిన అర్హులు ఎంతో మంది రుణాలకు దరఖాస్తు చేసుకున్నా రుణాలివ్వని అధికారులు, బ్యాంకర్లు ఓ ప్రభుత్వోద్యోగి అయిన వీఆర్యే పెంటకోట శంకరరావుకు సబ్సిడీ రుణం మంజూరు చేశారని గ్రామానికి చెందిన చింతాడ పైడయ్య ఫిర్యాదు చేశారు. ఇతనికి లోను రద్దు చేయించి అర్హులకు రుణాలు మంజూరు చేయాలని కోరారు. -
కట్టలు తెగిన దోపిడీ
గ్రీవెన్స్‌సెల్‌కు 185 వినతులు విజయనగరం కంటోన్మెంట్: ఏళ్లతరబడి నీరిస్తూ శిథిలావస్థకు చేరిన బలిజిపేట మండలం పెదంకలాం ఆనకట్ట మరమ్మతుల పేరిట విడుదలైన రూ.74 లక్షల హుద్‌హుద్ తుపాను నిధులను తెలుగు తమ్ముళ్లు దోచుకుతిన్నారని ఆరోపిస్తూ ఆనకట్ట ఆయకట్టు రైతుల పోరాట కమిటీ సభ్యులు గ్రీవెన్స్‌సెల్‌ను ఆశ్రయించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు 178 వినతులు వచ్చాయి. జాయింట్ కలెక్టర్ శ్రీకేశ్ బి లఠ్కర్, డీఆర్వో మారిశెట్టి జితేంద్రలు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పెందకలాం ఆయకట్టు రైతులు మాట్లాడుతూ హుద్‌హుద్ తుపాను బీభత్సానికి షట్టర్లు మరమ్మతులకు గురైతే కాలువల్లో పొడిపొడి పనులు చేసి నిధులు దోచేశారని ఆరోపించారు. ఈ విషయం ఎమ్మెల్యేకు తెలిసినా పట్టించుకోలేదని తిరిగి జపాన్ నిధులకోసం ప్రయత్నాలు చేస్తున్నారని ప్రాజెక్టు పనుల్లో అవినీతిని గుర్తించి ప్రాజెక్టును కాపాడాలని ఐక్యపోరాట వేదిక సభ్యులు గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో మామిడి సింహాద్రి నాయుడు, నందిగాం గౌరీశ్వరరావు, పొదిలాపు నర్సింగరావు, మండల రామారావు తదితరులు పాల్గొన్నారు. ఇళ్లనిర్మాణానికి ‘చెర’వులు మెరకముడిదాం మండలం పెద మంత్రిపేట గ్రామంలోని మంత్రిపూని చెరువును ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకుంటున్నారని గ్రామానికి చెందిన ఆయకట్టు దారులు మంత్రి అప్పలనాయుడు, మంత్రి అప్పారావు, గొళ్లెం రామారావు, ఎం దాలినాయుడు తదితరులు గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. 5ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ చెరువును ఆక్రమించుకుంటుండడం వల్ల సుమారు 30 ఎకరాల ఆయకట్టుకు నీరందడం లేదని ఫిర్యాదులో వాపోయారు. పేదల స్థలాల్లో పంచాయతీ భవనం గంట్యాడ మండలంలోని తాటిపూడి ఎస్సీ కాలనీలో నిర్మించుకున్న ఎస్సీల గృహ నిర్మాణ ప్రాంతాల్లో పంచాయతీ భవనం నిర్మించాలని కక్షగటికట తనకు నోటీసులు ఇస్తున్నారని గ్రామానికి చెందిన కొయ్య సన్యాసి రావు ఫిర్యాదు చేశారు. పేదల స్థలంలో సర్పంచ్‌కూ ఇంటి జాగా ఉందని, అయితే ఇంకెవరి కాకుండా వ్యక్తిగతంగా నోటీసులు పంపిస్తున్నారని చర్యలు తీసుకోవాలని కోరారు. కాల్ లెటర్ ఇచ్చి పోస్టింగ్ ఇవ్వలేదు వికలాంగ కోటాలో తనకు సబార్డినేటు పోస్టు వచ్చిందని కాల్ లెటర్ అందించి ఇప్పటికీ పోస్టింగ్ ఇవ్వలేదని విజయనగరం కొత్తపేటకు చెందిన కొంచాడ మురళీ కృష్ణ ఫిర్యాదు చేశాడు. జూలై 2014లో నోటిఫికేషన్ ఇచ్చి వైద్యపరీక్షలకు హైదరాబాద్ కూడా తీసుకెళ్లారని, ఇప్పటికీ పోస్టింగ్ ఇవ్వలేదని, పేదవాడినైన తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి డెంకాడ మండలం శింగవరం, నాతవలస గ్రామాల పరిధిలోని చంపావతి నదిలో ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయని, జాతీయ రహదారిపై వంతెనకు కూడా ముప్పు ఏర్పడుతోందని గ్రామానికి చెందిన జీవీ రమణా రావు తదితరులు ఫిర్యాదు చేశారు. ఇసుక తవ్వకాలను నియంత్రించేందుకు రక్షణ గోడలను నిర్మించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రభుత్వ భూమి కొని వెనుక డీఆర్వో ఉన్నారని చెబుతున్నారు సాలూరు పట్టణంలోని సర్వే162/2 నంబరులోని విలువైన ప్రభుత్వ భూమిని సాలూరు జమిందారు విక్రమ చంద్ర సన్యాశిరాజు, పీబీ శ్రీనివాస్ అనే ఇద్దరు రాయపాటి ప్రభాకరరావు అనే వ్యక్తికి రూ.కోటీ 5 లక్షలకు అమ్మేశారు. దీనిపై స్థానిక దుకాణ దారులు ప్రశ్నిస్తే తన వెనుక మంత్రులు, డీఆర్వో ఉన్నారని ప్రభాకరరావు చెబుతున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడి ఇక్కడ చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారికి రక్షణగా నిలవాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి గొంప ప్రకాశరావు ఎం అప్పలనాయుడు తదితరులు గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశారు. -
విన్నపాలు..కన్నీళ్లు
సమస్యలపై స్పందించని అధికారగణం గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం నెలల తరబడి జెడ్పీ చుట్టూ తిరుగుతున్నా ఫలితం శూన్యం అధికారులు స్వయంగా ప్రకటించిన పెండింగ్ ఫిర్యాదులు 16,741 గుంటూరు వెస్ట్ 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం 200 ఎకరాలు ఇచ్చింది. 2003లో 100 ఎ కరాలకు పాస్ పుస్తకాలు ఇచ్చా రు. ఇప్పటివరకు టైటిల్ డీడ్లు ఇవ్వలేదు. ఫలితంగా బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు కావడంలేదంటూ కారంపూడి మండ లం నరమాలపాడు గ్రామానికి చెందిన వై.లక్ష్మి అనే మహిళతోపాటు గ్రామస్తులు ఫిర్యాదు. గ్రామంలోని గంగాభవానీ వాటర్ ఫిల్లింగ్ సెంటర్ నిర్వాహకులు. పంచాయతీ అనుమతులు లేకుం డా వాటర్ ఫిల్లింగ్ చేస్తున్నారు. మురుగుకాల్వల మధ్య ఏర్పాటు చేసిన ప్లాంట్ నుంచి వాటర్ ఫిల్లింగ్ చేస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నారంటూ తెనాలి మండలం కొలకలూరు గ్రా మానికి చెందిన కాలిశెట్టి భావన్నారాయణ, కాలి శెట్టి రమేష్‌బాబు, బద్దుల చంద్రశేఖర్ ఫిర్యాదు. పూర్వార్జితంగా వచ్చిన పొలాన్ని నా తమ్ముడు కం చేటి రమేష్ ఆక్రమించుకుని పాస్ పుస్తకాలు పొం దాడు. 2012లో అప్పటి వీఆర్ఓ ద్వారా కంచేటి రమేష్ తన కుమారుడి పేరుతో రిజిస్టర్ చేయించుకున్నాడు. న్యాయం చేయమని అధికారులను కో రుతున్నా ప్రయోజనం లేకుండాపోతుందంటూ క్రోసూరు మండలం పీసపాడు గ్రామానికి చెందిన కంచేటిసాంబశివరావు, కంచేటి రమ్యల ఫిర్యాదు. వీరంతా ఇప్పటివరకు ఐదుసార్లు పైబడి గ్రీవెన్స్‌సెల్‌లో దరఖాస్తులు అందజేసినవారే. ఇటువంటి ఉదాహరణలు చాలా...చాలా ఉన్నాయి. గుంటూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజా సమస్యలపై ‘మీ కోసం’ వేదికలో జిల్లా ఉన్నతాధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తుంటారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వృద్ధులు, వికలాంగులు, మహిళలు, రైతులు ఇలా అన్నివర్గాల ప్రజలు ఎన్నో వ్యయప్రయాసలు భరించి తమ గోడును అధికారులకు మొరపెట్టుకునేందుకు ఇక్కడకు వస్తుంటారు. అయితే సమస్యలు పరిష్కారమవుతా యని ఇక్కడకు వచ్చేవారికి నిరాశే మిగులుతుంది. దరఖాస్తులైతే స్వీకరిస్తున్నారుగానీ, వాటిని పరిష్కరించడంలో అధికారుల వైఫల్యం కనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవు తోంది. నెలలతరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్యలు పరిష్కరించడంలో కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారుల పిలుపునకు స్పందన కరువు ... జిల్లాలోని వివిధ విభాగాలలో 16,741 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నట్లు జిల్లా అధికారులు స్వయంగా ప్రకటించారు. 18,311 దరఖాస్తులు స్వీకరించిన అధికారులు కేవలం 1570 ఫిర్యాదులను మాత్రమే పరిష్కరించారు. ఈ నెల 6వ తేదీ లోపు సగమైనా పూర్తిచేయాలని జిల్లా అధికారులు ఇచ్చిన పిలుపునకు స్పందన కరువైంది. జిల్లా పరిషత్ అధికారులు నెలవారీ జరిపే మండల పరిషత్ సూపరింటెండెంట్ల సమావేశాల్లో కూడా గ్రీవెన్స్‌సెల్ ఫిర్యాదులపై చర్చిస్తున్నా ఫలితం నామమాత్రమే. జిల్లా అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు ... సర్వే, భూ రికార్డుల ఏడీ వద్ద..79, మీసేవ ఏవో వద్ద..62, డీపీఓ 49, ఎండోమెంట్ ఈవో 21, జెడ్పీ సీఈఓ 23, వికలాంగుల సంక్షేమశాఖ 20, జీజీహెచ్ 18, రిజి స్ట్రార్10, మైనర్ ఇరిగేషన్14, మైనింగ్ ఏడీ(గుం టూరు), ఆర్డబ్ల్యూఎస్ 9, మైనార్టీ వెల్ఫేర్ 8, ఎక్సైజ్, హయ్యర్ ఎడ్యుకేషన్ వద్ద 7 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని విభాగాలకు చెందిన జిల్లా అధికారుల వద్ద పెండింగ్‌లో ఉ న్న దరఖాస్తులు. ఇవికాక మండలాల్లోని ప్రభుత్వ కా ర్యాలయాల్లో వందలసంఖ్యలో ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. పరిష్కారానికి కృషి ఏదీ? గ్రీవెన్స్ ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, వాటి పరిష్కారానికి కృషి జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి, వాటిని పరిష్కరించాల్సిన అధికారుల తీరుపై ప్రజలు అసహ నం వ్యక్తంచేస్తున్నారు. ఇకనైనా అధికారులు తమ సమస్యలపై మానవతా దృక్పథంతోనైనా పరిష్కరించాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు. -
‘మీకోసం’ ఏం చేశారు..!
విజయనగరం కంటోన్మెంట్: మొదటి దానికి మొగుడు లేడు..కడదానికి కల్యాణం అన్నట్లు ఉంది ప్రభుత్వం తీరు. వారానికి ఒకసారి నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చే అర్జీలే పరిష్కారం కాని పరిస్థితి ఉండగా..ఇకనుంచి ప్రతిరోజూ గ్రీవెన్స్ సెల్‌ను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్ ఎంఎం నాయక్ ప్రకటించారు. వారానికి ఒక్క రోజు నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌సెల్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా నిత్యం తీసుకుంటున్న అర్జీలను కూడా మీకోసం సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేస్తుంటారు. వారానికి ఒకసారి తీసుకున్న అర్జీలన్నీ ఇప్పటికే చాంతాడంత జాబితాతో పెండింగ్ ఉండిపోగా ఇక రోజూ నిర్వహిస్తే మరింత పెండింగ్ తప్పదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాలో రెండు నెలల క్రితం మీ కోసం సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించారు. గ్రీవెన్స్ విధానం పాతదయినా ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియకు మాత్రం హంగులద్దారు. ఇందులో చంద్రబాబు ఫొటోతో ఉన్నట్టు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. అయితే ఇప్పటికీ ఆ సాఫ్ట్‌వేర్‌లో పొందుపరుస్తున్న సమస్యలు, వినతులు అలానే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,68,082 అర్జీలు మీకోసం సాఫ్ట్‌వేర్‌లో నమోదయ్యాయి. ఈ అర్జీల్లో పరిష్కారమయినవి 5,446 మాత్రమే! అంటే గ్రీవెన్స్ ద్వారా వచ్చే సమస్యలకు ఎంతటి పరిష్కారం లభిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో పరిష్కారానికి గడువున్న అర్జీలు 4938 ఉండగా గడువు దాటిపోయినవే ఎక్కువ! జిల్లా వ్యాప్తంగా సోమవారం, ఇతర దినాల్లోనూ కలెక్టర్‌కు వచ్చిన అర్జీలన్నీ ఇందులో పొందుపరుస్తారు. వీటన్నిటికీ ఓ గడువు ఇచ్చి సరిచూసుకోమని అధికారులు సూచిస్తారు. అయితే మీకోసం సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసినప్పటినుంచి ఇప్పటివరకూ వచ్చిన 1.68 లక్షల అర్జీల్లో 1,57,698 అర్జీలకు అధికారులు పరిష్కారానికి ఇచ్చిన గడువు ఏనాడో దాటిపోయింది. అంటే పరిష్కారానికి నోచుకున్నది కేవలం 3.24 శాతమే! రెవెన్యూ సమస్యలే అధికం ! జిల్లా వ్యాప్తంగా వస్తున్న అర్జీల్లో ఇతర శాఖల కన్నా రెవెన్యూ సమస్యలపైనే అధికంగా వస్తున్నాయి. భూ సమస్యలు, చెల్లింపులు, పరిహారాలు, వన్బిలు, సర్వే నంబర్ల తప్పులు, ఆక్రమణల వంటి రెవెన్యూ కార్యాలయాల్లో పరిష్కారానికి నోచుకోని అర్జీలు కలెక్టర్ కార్యాలయానికి వస్తున్నాయి. ఈ సమస్యలు ఇక్కడ కూడా పరిష్కారానికి నోచుకోకపోవడం విచారకరమని వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మీకోసం వెబ్సైట్లో నమోదైన అర్జీల్లో రెవెన్యూ శాఖకు సంబంధించి 1,33,265 వచ్చాయి. వీటిని సంబంధిత వెబ్సైట్లో నమోదు చేసిన అధికారులు వాటికి పరిష్కారాలు చూపలేకపోయారు. 1.33 లక్షల అర్జీల్లో కేవలం 4,808 అర్జీలు మాత్రమే పరిష్కరించారు. గడువులోపల ఉన్నవి 932 అర్జీలు. గడువు దాటిపోయిన అర్జీలు ఏకంగా 1,27,525 ఉన్నాయి. సమస్య పరిష్కారమంటే...తీరిపోయినట్లా? మీకోసం వెబ్సైట్లో ఉన్న ఫిర్యాదులను ఏదో ఒక విధంగా పరిష్కరించేటట్టు కనిపించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పరిష్కరింపబడిందంటే మీ అర్జీకి విలువలేనిదనీ, అర్థం లేనిదని, వీలు కాదని, నిబంధనలకు విరుద్ధమని ఇలా ఏదో ఒక కారణంతో క్లోజ్ చేస్తే అవి పరిష్కారం జాబితాలో చేరిపోతాయి. అదేవిధంగా సమస్య తీర్చినవీ ఉంటాయి. కానీ అది చాలా చిన్న సంఖ్య మాత్రమే! ఇవన్నీ కూడా సీఎం డాష్‌బోర్డులో దర్శనమివ్వడం కొసమెరుపు! -
కలెక్టర్ ఆదేశించినా !
ఇందూరు: దేవుడు వరమిచ్చినా... పూజారి కరుణించలేదు’ అన్న చందంగా ఉంది బీసీ స్టడీ సర్కిల్ అధికారి తీరు. తనకు అన్యాయం జరిగిందని.., న్యాయం చేసి ఆదుకోవాలని బాధిత ప్రభుత్వ ఉద్యోగి కలెక్టర్‌ను వేడుకున్నాడు. దీంతో బాధితుడి ఆవేదనలో న్యాయం ఉందని గ్రహించిన కలెక్టర్ బకారుులు చెల్లించాలని బీసీ స్టడీ సర్కిల్ అధికారిని ఆదేశించారు. కానీ, సదరు అధికారి మాత్రం తన నీచబుద్ధిని చూపించాడు. బాధితుడిని ముప్పుతిప్పలు పెట్టడంతో బాధితుడు ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించాడు. జిల్లా కేంద్ర శివారు నాగారం ప్రాంతంలో ఉన్న జిల్లా బీసీ స్టడీ సర్కిల్లో ఎన్. లక్ష్మి నరసింహచారి 2010 డిసెంబర్ 1వ తేదీన కంప్యూటర్ ఆపరేటర్‌గా ఔట్సోర్సింగ్ పద్దతిపై నియామకమయ్యూడు. అప్పటి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆయనకు నెలసరి వేతనం రూ.8 వేలు ఉండగా, కొన్ని రోజుల తరువాత రూ.9500కు పెంచుతూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు అదనంగా పెరిగిన రూ.1500 వేతనాన్ని పొందుతున్నారు. ఇతడికి మాత్రం పెరిగిన వేతనం నేటి వరకు అమలు కాలేదు. ఈ విషయమై తనకు న్యాయం చేయూలని గతంలో జిల్లా బీసీ స్టడీ సర్కిల్ అధికారి, కలెక్టర్, ప్రజా ప్రతినిధులకు విన్నవించినా న్యాయం జరగలేదు. దీంతో సదరు బాధిత ఉద్యోగి తనకు రావాల్సిన సుమారు రూ.70 వేలు నష్టపోయూడు. ఇటీవల మరోసారి ఆయన కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌ను కలిసి న్యాయం చేయూలని వేడుకున్నాడు. తనకు న్యాయం చేయూలని గ్రీవెన్స్ సెల్లో విన్నవించుకున్నాడు. దీంతో స్పందించిన ఆయన స్టడీ సర్కిల్ అధికారికి ఫైలు సమర్పించమని ఆయన సూచించారు.దీంతో ఆయన ఏజేసీకి ఫైలు సమర్పించగా పరిశీలించిన ఆయన కంప్యూటర్ ఆపరేటర్ వేతనం కోల్పోయిన విషయం వాస్తవమే అని గ్రహించి ఫైలును కలెక్టర్‌కు పంపించారు. దానిని పరిశీలించిన కలెక్టర్ బాధిత ఉద్యోగికి రావాల్సిన బకాయి వేతనాలు ఇవ్వాలని స్టడీ సర్కిల్ అధికారిని ఆదేశించారు. దీంతో బాధిత ఉద్యోగి తనకు ఇన్నాళ్లకు న్యాయం జరిగిందని ఆనందం వ్యక్తం చేశాడు. మరుసటి రోజు బీసీ స్టడీ సర్కిల్ అధికారి వద్దకు వెళ్లి బాకాయి వేతనంపై వివరణ కోరగా సదరు అధికారి నేనివ్వని మోకాలడ్డాడు. ఏజేసీ, కలెక్టర్ ఫైలును సరిగా చూడకుండా సంతకం పెట్టారు. మరోసారి నేను వారితో మాట్లాడుతానని అన్నట్లు బాధితుడు తెలిపాడు. చేతుల వరకు బాకాయి డబ్బులు చేజారి పోయూయని బాధిత ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు.అయినా పట్టువదలని బాధితుడు తనకు న్యాయం చేయూలని కోరుతూ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయిచాడు. పర్సంటేజీ కోసమేనా...? కంప్యూటర్ ఆపరేటర్‌గా మూడేళ్లు పనిచేసిన బా ధితుడు తనకు రావాల్సిన బకాయి వేతనాలు ఇవ్వాలని తిరుగుతున్నా అధికారులు సతాయించడం వెనుక ఆం తర్యమేమిటనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్సం టేజీ ఇస్తే డబ్బులు ఇచ్చే వారేమో అనే ఆరోపణలు విని పిస్తున్నాయి. స్వయంగా కలెక్టర్, ఏజేసీ ఆదేశించినా బకాయిలు ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యమేమిటో అనే వాదనలు ఉన్నాయి. ‘అతడికి చెప్పు... అందులోం చి పర్సంటేజీ ఇవ్వాలని. అలా చేస్తే రావాల్సిన బాకాయిలు ఇప్పిస్తా’ అని కార్యాలయంలోని ఓ మధ్యవర్తితో సదరు ఉద్యోగి అన్నట్లు విశ్వసనీయ సమాచారం. -
పింఛన్ల మంజూరులో నిర్లక్ష్యం వద్దు
విజయనగరం కంటోన్మెంట్ : పదవీ విరమణ చేసిన ప్రభుత్వ సిబ్బంది పింఛన్ల మంజూరులో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని కలెక్టర్ ఎంఎం నాయక్ హెచ్చరించారు. సోమవారం ఆయన గ్రీవెన్స్ సెల్ అనంతరం పెండింగ్ వినతులపై అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన నాటికి అందరికీ పింఛన్ మంజూరు చేయాలన్నారు. కార్మిక శాఖకు సంబంధించి క్లయిమ్‌లు, కేసుల పరిష్కారానికి ముందు పరిశ్రమల వివాదాల చట్టం, వేతనాల చట్టాలను పరిశీలించాలన్నారు. అనంతరం ఏయే శాఖలకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? వాటిలో ఎన్ని పరిష్కారమయ్యాయి..? ఎన్ని ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయన్న విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలాల అధికారులతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించి, పెండింగ్ ఫైళ్లను పరిష్కరించాలని డీఆర్ఓ నరసింహారావును ఆదేశించారు. త్వరగా తప్పులు సరిదిద్దండి మొదటి విడత రుణమాఫీ పొందని రైతులు రెండో జాబితాలో పొందేలా త్వరతిగతిన తప్పులు సరిదిద్దాలని కలెక్టర్ నాయక్ ఆదేశించారు. సోమ వారం ఆయన తన కార్యాలయంలో ఎంపీడీఓలు, తహశీల్దార్లు, ఏఓ లు, ఏపీఎంలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భగా కలెక్టర్ మా ట్లాడుతూ రుణమాఫీ వివరాలతో రైతుల వద్దకు వెళ్లాలని, లేకపోతే రైతు సాధికార సదస్సులకు అర్ధం ఉండదన్నారు. జాబితాను పారదర్శకంగా ఉం చాలన్నారు. తహశీల్దార్లు రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితాలను నింపి, జన్మభూమి కమిటీలతో సంతకం చేయించి, వాటిని బ్యాంకులకు పం పించాలన్నారు. ఇప్పటివరకూ 724 గ్రామాల్లో రైతు సాధికార సదస్సులు నిర్వహించినట్టు చెప్పారు. రుణమాఫీ పత్రాలను 82,733 మందికి అందజేశామ న్నా రు. రెండో దశ ప్రక్రియను తహశీల్దార్లు పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. అలాగే ఇసుక రీచ్‌లు పెంచాలని ఆదేశించారు. ఇప్పటివరకూ 11 మండ లాల్లో 29 ఇసుక రీచ్‌లను ప్రారంభించినప్పటికీ అవి సరిపడా ఇసుకను అందించడం లేదన్నారు. ఈ సమావేశంలో డీఆర్ఓ వై నరసింహారావు, వ్యవసా య శాఖ జేడీ ప్రమీల, సీపీఓ మోహనరావు, ఆర్డీఓ వెంకటరావు, ఎల్డీఎం శివబాబు, డీఆర్డీఏ ఏపీడీ సుధాకర్, డీఐఓ నరేంద్ర, తది తరులు పాల్గొన్నారు. -
విన్నపాలు వినేదెవరు?
ఒంగోలు టూటౌన్: సర్కారు నిర్వాకంతో పింఛన్లు కోల్పోయిన వేలాది మంది కలెక్టర్‌కు తమ గోడు చెప్పుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి సోమవారం ఒంగోలు తరలి వచ్చారు. జన్మభూమి అనంతరం కలెక్టరేట్లో తిరిగి ప్రారంభమైన ప్రజావాణి వృద్ధులు, వితంతువులు, వికలాంగులతో నిండిపోయింది. నడవలేని వారు..కర్ర ఊతంతోనో..కుటుంబ సభ్యుల సాయంతోనో మారుమూల ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వచ్చారు. పింఛన్లు తీసేశారంటూ వచ్చిన వారిని పలకరించే నాథుడే లేకుండాపోయారు. ఉదయం 10.30కు గ్రీవెన్స్‌సెల్ ప్రారంభించగా 12 కాకుండానే వేరే కార్యక్రమాలున్నాయంటూ కలెక్టర్ విజయకుమార్, ఇతర ఉన్నతాధికారులు వెళ్లిపోయారు. కొత్తగా వచ్చిన డీఆర్వో ఎన్ఆర్ ఖాసీం, అదనపు జాయింట్ కలెక్టర్ ప్రకాష్‌కుమార్ మాత్రమే మిగిలారు. దీంతో అర్జీ ఎవరికి ఇవ్వాలో తెలియక..ఎక్కువ దూరం నడవలేక ఎక్కడివారు అక్కడే నిరాశగా కూలబడిపోయిన దృశ్యాలు చూపరులను కలచివేశాయి. ఎవరైనా పలకరిస్తే చాలు.. ఆగని కన్నీళ్లతో అన్యాయంగా పింఛన్ తీసేశారంటూ విలపించిన పండుటాకుల పరిస్థితి వేదనాభరితం. పింఛన్లకు రాజకీయ రంగు: చూసేవాళ్లు లేక, ఆదరించే వాళ్లు కరువైన వృద్ధులకు ఏదో కంటితుడుపుగా ఇచ్చే పెన్షన్‌కు రాజకీయరంగు పులిమారు. కొన్ని చోట్ల వైఎస్సార్సీపీకి ఓట్లేశారని పగబట్టి పెన్షన్లు తొలగించారని పొన్నలూరు మండలం ఇప్పగుంట, పెద్ద వెంకన్నపాలెం గ్రామాలకు చెందిన దాదాపు 50 మంది బాధితులు వాపోయారు. తన పేరు మీద ఒకటిన్నర ఎకరపొలం ఉందని పెన్షన్ తొలగించారని కోడూరి తిరుపతయ్య వాపోయాడు. ఎక్కడో అమెరికాలో ఉంటున్న వారికి, 20 ఎకరాలు ఉన్న వాళ్లకి, అనర్హుల పేర్లను మళ్లీ ఇటివల జాబితా తయారు చేసి పంపారని.. అర్హులమైన తమ పేర్లు పంపలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులకు చేయూత: పెన్షన్ల కోసం అష్టకష్టాలు పడి ఒంగోలు గ్రీవెన్స్సెల్కి వచ్చిన వృద్ధులు, వితంతువులు, వికలాంగుల కష్టాలు చూడలేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ వరికూటి అశోక్ బాబు వారికి మధ్నాహ్నం భోజన సదుపాయం కల్పించారు. అనంతరం ఇళ్లకు వెళ్లేందుకు వాహనాలు సమకూర్చారు. కొండపి నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి బాధితులు వచ్చారు. వీరందరికీ స్థానిక అంబేద్కర్ భవనంలో భోజనాలు ఏర్పాటు చేశారు. కనిగిరి నియోజకవర్గం నుంచి దాదాపు వెయ్యి మందికి పైగా పెన్షన్ బాధితులు వచ్చారు. ఇలా అన్ని మండలాల నుంచి వేలాది మంది పండుటాకులు తరలిరావడం చూపరులను కలచివేసింది. కొందరు వృద్ధులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఇంత మంది వేదనకు కారణభూతమైన ప్రభుత్వంపై జనం దుమ్మెత్తిపోస్తున్నారు. -
బదిలీలు నిలుపుదల చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ప్రభుత్వం నిర్వహించే బదిలీ ల్లో సంక్షేమ వసతి గృహం అధికారులు, సిబ్బందికి మినహాయింపు ఇవ్వాలని సాంఘిక, బీసీ సంక్షేమ శాఖ వసతి గృహ అధికారుల సంఘం ప్రతినిధులు గ్రీవెన్స్‌లో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్థానికంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన కలెక్టర్ గ్రీవెన్స్‌సెల్‌లో వినతిపత్రం సమర్పించారు. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీల వల్ల పదో తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాలపై దీని ప్రభావం పడుతుందని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌కు వారు వివరించారు. అలాగే గ్రేడ్-1 వసతి గృహం అధికారుల జాబితాను సిద్ధం చేయాలని, అర్హులకు పదోన్నతులు కల్పించాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో ఎస్ ఆనందరావు, కే వెంకట్రావు, గురువి నాయుడు, లక్ష్మణరావు తదితరులు ఉన్నారు. ఈ గ్రీవెన్స్‌లో జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు అర్జీలు సమర్పించారు. కలెక్టర్‌తో పాటు అదనపు జాయింట్ కలెక్టర్ మహ్మాద్ హసన్ షరీఫ్, జిల్లా రెవెన్యూ ఆధికారి నూరు భాషా కాశీం తదితరులు పాల్గొన్నారు. గ్రీవెన్స్‌కు వచ్చిన వినతుల్లో కొన్నింటిని పరిశీలించగా... * ఎచ్చెర్ల మండలం కొంగరాం వద్దగల స్మార్టుకాం(వీబీసీ)కర్మాగారం వ్యర్థాలను పొలాల్లోకి విడిచిపెడుతోందని, దీంతో తాగు, సాగునీరు కలుషితం అవుతోందని బాధితులు ఫిర్యాదు చేశారు. వెంటనే పరిశ్రమను నిలిపివేయాలని కొంగరాం, ఏజీఎన్పేట గ్రామాలకు చెందిన అనపాల అప్పలస్వామి, డీ సన్యాసిరావు, సీహెచ్ గురువులు, గురివినాయుడు, సీతారాములు, లక్ష్మణరావు తదితరులు ఫిర్యాదు చేశారు. * వజ్రపు కొత్తురు మండలం నగరం పల్లి గ్రామంలో జన్మభూమి కమిటీ సభ్యులు రాజకీయ కక్షతో అర్హుల పింఛన్లు తొలగించారని, రీసర్వే చేయాలని ఆ గ్రామానికి చెందిన పీఏసీఎస్ అధ్యక్షుడు దువ్వాడ మధుకేశవరావు, వీ జయరాం చౌదరి, బమ్మిడి మోహనరావు, సనపల భాస్కరరావు, నందికేశ్వరరావు ఫిర్యాదు చేశారు. * వైద్య ఆరోగ్య శాఖలో ఈ ఏడాది జనవరిలో ఫ్యామిలీ కౌన్సిలర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేశారని, అయితే ఇంతరవరకూ పోస్టింగు ఇవ్వలేదని ఎంపికైన అభ్యర్థి విజయలత తదితరులు ఫిర్యాదు చేశారు. * మెలియాపుట్టి మండలం చాపరలోని ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకం నిర్వాహకులపై ఆ పాఠశాల హెచ్ఎం దొంగతనం అంటగట్టి విధుల నుంచి తొలగించారని ఫిర్యాదు అందింది. న్యాయం చేయాలని బాధితులు వరలక్ష్మి, దమయంతి, లక్ష్మి, సుందరమ్మ తదితరులు కోరారు. ఇంకా లావేరు మండలం గుర్రాల పాలెం గ్రామస్తులు రేషన్ సరుకులు సక్రమంగా అందడం లేదని, శ్రీకాకుళం మండలం నైర గ్రామానికి చెందిన అరటి, జీడిమామిడి తోటల రైతులు తుపాను సాయం అందించాలని గ్రీవెన్స్‌లో విజ్ఞఫ్తి చేశారు. -
ఇక ప్రజావాణిలో గ్రీవెన్స్‌సెల్ ఫిర్యాదులు
విజయనగరం కంటోన్మెంట్ : మారుమూల పల్లెల నుంచి వచ్చే సమస్యల పరిష్కారానికి వేదికవుతున్న గ్రీవెన్స్ సెల్ ఇక కొత్తరూపు సంతరించుకోనుంది. గ్రీవెన్స్‌సెల్ ఫిర్యాదుల విభాగం పేరు అలాగే ఉన్నా.. దీన్ని నిర్వహించే తీరు పూర్తిగా మారనుంది. జిల్లా వ్యాప్తంగా వచ్చే ఫిర్యాదులను ఇకపై ప్రజావాణి సాఫ్ట్‌వేర్‌లో పొందుపరచనున్నారు. ఇప్పటివరకూ స్థానికంగా ఉన్న సాఫ్ట్‌వేర్‌ను విని యోగించి ఫిర్యాదులను, వాటి పరిస్థితిని నమోదు చేసేవారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రజావాణి సాఫ్ట్‌వేర్‌లో ఫిర్యాదులను నమోదు చేస్తారు. ఇలా చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫిర్యాదులను పరిశీలించడానికి, తెలుసుకోవడానికి అవకాశముంటుంద ని అధికారులు చెబుతున్నారు. వచ్చిన ఫిర్యాదులను స్కానింగ్ చేస్తారు. అనంతరం ఆయా ఫిర్యాదులను సంబంధిత జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులకు పంపిస్తారు. ఆయాఅధికారులకు కేటాయించిన యూ జర్ ఐడీ, పాస్‌వర్డ్‌ల ఆధారంగా ఓపెన్‌చేసి తమపరిధిలో పరిష్కార మార్గం లేకపోతే ఉన్నతాధికారులకు అదే సాఫ్ట్ వేర్లో అప్లోడ్ చేస్తారు. ప్రస్తు తం దీనికి సంబంధించిన సర్వర్ అందుబాటులో లేకపోవడంతో వచ్చే వా రం నుంచి దీన్ని అమలుచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రజావాణిని తప్పనిసరిగా నిర్వహించాలని, ఇక నుంచి ఆన్లైన్ కార్యకలాపాలకు ప్రా ధాన్యమివ్వాలని కలెక్టర్ నాయక్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. సోమ వారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్ విభాగం, పెండింగ్ వినతుల సమీక్షల అనంతరం ప్రజావాణిపై కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. వచ్చే వా రం నుంచి దీన్ని అమలు చేసేందుకు సన్నద్ధం కావాలని ఆదేశించారు. అ నంతరం జేసీ రామారావు...జిల్లా అధికారులకు ఒక ప్రత్యేక అవగాహన కా ర్యక్రమం నిర్వహించారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) అధికారులను పిలి పించి ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఇకపై ఫిర్యాదులను ఏ వి ధంగా ఆన్లైన్లో నమోదు చేయాలి? సెల్ మెసేజ్‌లు ఇచ్చేదెలా అన్న వివరాలను వివరించారు. దీనికి సంబంధించి జిల్లా అధికారులు కానీ, మండ ల స్థాయి అధికారులు కానీ ఎన్ఐసీ అధికారుల నంబర్లకు ఫోన్ చేసి ఈ విధానానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఙానాన్ని తెలుసుకోవాలన్నారు. 28న సమావేశం జిల్లాలో ప్రజావాణి సాఫ్ట్ వేర్‌ను అమలు చేసేందుకు అధికారులు, వారి సాంకేతిక సహాయకులకు ఈనెల 28న మధ్యాహ్నం 3 గంటలకు సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ రామారావు తెలిపారు. ఆ రోజున ఆన్లైన్ గ్రీవెన్స్‌సెల్‌ను ఏ విధంగా అమలు చేయాలన్న విషయాలపై ఎన్ఐసీ అధికారులు సాంకేతిక సహాయకులకు, జిల్లా అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనన్నట్టు తెలిపారు. ప్రజావాణిలో నమోదు ఇలా... ప్రజావాణిలో వినతులను స్వీకరించేటప్పుడే ఫిర్యాదుదారుల ఫోన్ నంబర్‌ను సేకరిస్తారు. వినతులు, ఫిర్యాదులను ఏబీసీడీలుగా వర్గీకరిస్తారు. వచ్చిన వినతుల ప్రాధాన్యతను బట్టి ఈ వర్గీకరణ ఉంటుంది. గ్రేడింగ్‌ను అనుసరించి ఫిర్యాదుదారుని సెల్‌కు మెసేజ్ రూపంలో ఎక్నాలెడ్జ్మెంట్ పంపిస్తారు. ఫిర్యాదులను సంబంధిత అధికారులు చూసి పరిష్కరించేందుకు వారికి కూడా యూజర్ ఐడీ, పాస్వర్డ్ కేటాయిస్తారు. వీటిని ఓపెన్ చేసి తమ కార్యాలయానికి సంబంధించిన ఫిర్యాదులను చూడొచ్చు. అందులో వచ్చిన మెనూను సెలె క్ట్ చేసుకుని ఫిర్యాదులు తమపరిధిలోనివా లేకఉన్నతాధికారులకు పం పించాల్సినవా? అని అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఉన్నతాధికారులకు వెళ్లాల్సిన ఫిర్యాదా లేక తమ పరిధిలో పరిష్కరించాల్సిన ఫిర్యాదా అన్న విషయాన్ని ధ్రువీకరించి ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఇందులో మూడు వర్గీకరణలుంటాయి. అధికారులు పరిష్కరించగలిగినది దొకటి, పెండింగ్‌లో ఉన్నదొకటి, పరిష్కరించిన దొకటిగా వర్గీకరణ లుంటాయి. నెట్లో కూడా తమ అర్జీ నమోదైందా లేదా అన్న విషయాన్ని అర్జీదారు తెలుసుకునే వెసులు బాటు కల్పించారు. గెస్ట్123 అని ఆన్లైన్లో టైప్ చేస్తే ఫిర్యాదుదారునికి కూడా సమాచారం అందించే అవకాశం ఉంది. -
వలసకు వెళితే..భూమి కబ్జా చేశారు..
విజయనగరం కంటోన్మెంట్ :కుటుంబ పోషణ కోసం ఇతర ప్రాంతాలకు వలసపోతే తన భూమిని కబ్జా చేశారని ఎల్.కోట మండలం కొట్యాడ గ్రామానికి చెందిన ఎద్దు కృష్ణమ్మ సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేసింది. గ్రామానికి చెందిన కొట్యాడ అప్పలనరసయ్య తన భూమిని ఆక్రమించుకున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. కలెక్టర్ ముదావత్ ఎం. నాయక్ సెలవులో ఉండడంతో గ్రీవెన్స్‌సెల్‌ను జేసీ రామారావు నిర్వహించారు. ఈ సందర్భంగా 250 వినతులు స్వీకరించి వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చిన వాటిలో కొన్ని ఫిర్యాదులు మున్సిపల్ స్థలాలు ఆక్రమించుకున్నారు బూర్లిపేటలోని మున్సిపల్ స్థలాలను కొంతమంది ఆక్రమించుకుని షాపులు నిర్మించుకున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మాజీ కౌన్సిలర్ బలరాంసింగ్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. 38వ వార్డులోని ప్రభుత్వ స్థలంలో కొంతమంది ఐదు షాపులు నిర్మించారని, ఈ విషయాన్ని పలుమార్లు అధికారులకు తెలియజేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఇప్పటికైనా ఆక్రమణదారులను శిక్షించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. పాఠశాల స్థలం కబ్జా భోగాపురం మండలం ముంజేరు పంచాయతీ రెల్లిపేటలో ప్రభుత్వ పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని సకల రాజారావు కబ్జా చేశారని గ్రామానికి చెందిన డి శ్రీను, ధనాల సోమయ్య, రమణ, అప్పారావు, సన్యాసి, నర్సింగరావు, రాము, తదితరులు ఫిర్యాదు చేశారు. రెగ్యులర్ చేయాలి ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలల్లోని సోషల్, పీఈటీ, ఎస్జీటీ, తదితర పోస్టులను వెంటనే రెగ్యులర్ చేయాలని ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు జి అప్పలసూరి డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. ూ ఎంపీటీసీ మాజీ సభ్యుడు భూమిని ఆక్రమించుకున్నాడు గరివిడి మండలం మందిరివలసలో పోరంబోకు భూమిలో జీడి తోటలు వేసుకుంటే పక్క గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు తాళ్లవలస ఆదినారాయణ భూమిని ఆక్రమించుకున్నాడని గ్రామానికి చెందిన రేజేటి లక్ష్మి, టెక్కలి లక్ష్మి, సుక్క లక్ష్మి, తదితర మహిళలు ఫిర్యాదు చేశారు. దీనికి జేసీ రామారావు స్పందిస్తూ సమస్య పరిష్కరించాలని ఆర్డీఓ జెక వెంకటరావుకు ఫోన్ చేసి ఆదేశించారు. వినతుల వెల్లువ పార్వతీపురం : సబ్ కలెక్టర్, ఐటీడీఏ కార్యాలయాల్లో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు వినతులు వెల్లువెత్తాయి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎల్విన్‌పేట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ టి.సీతారామ్మూర్తి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా గంగాపురానికి చెందిన తిరుపతిరావు అన్నింటికీ ఆధార్ అనుసంధానం చేయడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారని, ముందు అందరికీ ఆధార్ కార్డులందేలా చూడాలని కోరారు. అలాగే గుమ్మలక్ష్మీపురం మండలంలో పనిచేస్తున్న జీసీసీ నిర్వాహకుడు మిన్నారావును తొలగించాలని మండల కేంద్రానికి చెందిన పలువురు ఫిర్యాదు చేశారు. పదేళ్లుగా సాగు చేస్తున్న బంజరుభూమికి పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ మంజూరు చేయాలని కురుపాం మండలం జి.శివడకు చెందిన ఆరిక జగ్గన్న వినతిపత్రం సమర్పించారు. అలాగే ఐటీడీఏ కార్యాలయంలో ఏపీఓ వసంతరావు నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో జియ్యమ్మవలస మండలం చాపరాయగూడకు చెందిన గ్రామస్తులు మంచినీటి ట్యాంకు నిర్మించాలని కోరారు. కురుపాం మం డలం పి.లేవిడికి చెందిన బి. చిన్నమ్మలు, తదితర 22 మంది తమకుసాగు చేసుకునేందుకు భూ మి మంజూరు చేయాలని కోరారు. మక్కువ మండలంలోని బం టుమక్కువకు చెందిన డి. గురవందొర, గుమ్మలక్ష్మీపురం మండలం మిరయగూడకు చెందిన బిడ్డిక లక్కోజులు తమ భూములను గిరజనేతరులు ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. సమస్యలన్నీ విన్న అధికారులు పరి ష్కరించడానికిచర్యలు తీసుకుంటామన్నారు. -
ప్రజావాణిగా గ్రీవెన్స్ సెల్
ప్రభుత్వ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ మంచినీటి సమస్య పరిష్కారానికి పెద్దపీట కుప్పంలో కలెక్టర్ సిద్ధార్థ జైన్ కుప్పం: సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్‌ను ఇక నుంచి ప్రజావాణిగా పేరు మారుస్తున్నట్టు కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. ఆయన ఆదివారం రాత్రి కుప్పం తహశీల్దార్ కార్యాలయుంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజావాణి కార్యక్రవూన్ని నిర్వహించి గ్రామస్థాయి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 1వ తేదీన అధికారులు హాస్టల్ నిద్ర కార్యక్రమం చేపట్టి అక్కడి వసతులు, ఆహారం, విద్యా విధానాలపై నివేదిక రూపొందిస్తారన్నారు. ప్రధానంగా గ్రామస్థాయి సమస్యలు అక్కడే పరిష్కారవుయ్యేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు. మండల స్థాయి అధికారులు ఇలాంటి సమస్యలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. జిల్లాలో మంచినీటి సమస్య పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. పరిపాలనకు సంబంధించి నూతన టెక్నాలజీని వినియోగించుకుంటామన్నారు. కుప్పం నియోజకవర్గంలో మోడల్ స్కూల్లో తరగతి గదులు కొరత, పింఛన్ల పంపిణీ, ఇసుక రవాణా విధానంలో సమస్యలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వీటిని పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదనపల్లి సబ్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్త పాల్గొన్నారు. -
ఉప్పల్ చేపట్టెన్ పగ్గాల్
శ్రీకాకుళం సిటీ: ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చిత్తశుద్ధి తో కృషి చేస్తానని కొత్త కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. సోమవారం ఉదయం 8.49 గంటలకు జిల్లా కలెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సహజసిద్ధమైన వనరులు పుష్కలంగా ఉన్న జిల్లాలో అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. కొత్త రాష్ట్రంతో సమానంగా ఈ జిల్లాను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానన్నారు. అధికారులందరూ బాధ్యతతో పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుందన్నారు. సామాన్యులకు సరైన న్యాయం జరగడం లేదని, గ్రీవెన్స్ ద్వారా అర్జీలే మిగులుతున్నాయన్న ఆరోపణలపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటానన్నారు. జిల్లాలో వలసలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో స్థానికంగా ఉపాధి అవకాశాలపై పూర్తి స్థాయిలో సమీక్షించి చర్యలు తీసుకుంటామన్నారు. పెట్రేగిపోతున్న ఇసుక మాఫియాను అరికట్టే విషయమై జిల్లా ఎస్పీతో మాట్లాడతానని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పా రు. అందరికీ అందుబాటులో ఉంటానని, ఎవరైనా, ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చునని అన్నారు. ఆ వెంటనే ఆయన కలెక్టరేట్ ఆవరణ లో పలు విభాగాలను పరిశీలించారు. ముందుగా గ్రీవెన్స్ సెల్‌కు వెళ్లి అర్జీదారులతో మాట్లాడారు. అక్కడ సిబ్బంది పనితీరును పరిశీలించారు. పౌరసరఫరాల ఆన్లైన్ కౌంటర్, ఆరోగ్య మిత్ర కౌంటర్, ఐటి విభాగం పనితీరును పరిశీలించారు. రోజువారీ కార్యక్రమాలు, గ్రీవెన్స్‌డే రోజు అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఉదయం ఉమారుద్ర కోటేశ్వరాలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు జరిపారు. పాత కలెక్టర్ సౌరభ్‌గౌర్‌తో కాసేపు మాట్లాడారు. జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్, ఏజేసీ షరీఫ్‌లు ఆయనతో ఉన్నారు. కలెక్టరేట్లోని ముఖ్య విభాగాల అధిపతులను కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పరిచయం చేసుకున్నారు. -
పూర్తిస్థాయిలో మొదలైన గ్రీవెన్స్‌సెల్
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: దాదాపు మూడు నెలల తర్వాత ప్రజాదర్బార్ పూర్తిస్థాయిలో జరగడంతో వినతులు వెల్లువెత్తాయి. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు, జిల్లా రెవెన్యూ అధికారి వేణుగోపాల్‌రెడ్డి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. హౌసింగ్ పీడీ రామసుబ్బు, డీఆర్డీఏ పీడీ నజీర్‌సాహెబ్, జేడీఏ ఠాగూర్‌నాయక్‌లు తమ శాఖలకు సంబంధించిన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కొద్దిసేపు సమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. ఇకపై ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజాదర్బార్, డయల్ యువర్ కలెక్టర్‌కు వచ్చిన సమస్యల పరిష్కారానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేయాలని వివరించారు. ఇంటి పట్టాలు ఇవ్వండి: గోస్పాడు మండలం బీవీనగర్‌లో కొన్నేళ్ల క్రితం చింతమానువనంలో ఇళ్లు, గుడిసెలు నిర్మించుకుని 70 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారికి పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని కలెక్టర్‌కు ప్రజాదర్బార్‌లో వినతిపత్రం సమర్పించాను. - శ్రీనివాసరెడ్డి -
గ్రీవెన్స్‌సెల్‌కు 205 వినతులు
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ :కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు అర్జీదారులు పోటెత్తారు. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తం 205 వినతులు అందాయి. కార్యక్రమాన్ని కలెక్టర్ కాంతిలాల్‌దండే, ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు, డీఆర్ఓ బి.హేమసుందరవెంకటరావు నిర్వహించారు. వచ్చిన వినతుల్లో కొన్ని ముఖ్యమైనవి... విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాలని నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామ మాజీ సర్పంచ్ జి.అప్పలనాయుడు ఆధ్వర్యంలో పలువురు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథక నిర్వహణకు గదిలేక పోయినా ఎంఈఓ సైతం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని వివరించారు. పైసలిస్తేనే పని... తమ గ్రామ పంచాయతీ సెక్రటరీ పైసలిస్తేనే పని చేస్తానని బహిరంగంగా చెప్పడంతో పాటూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దత్తిరాజేరు మండలం పెదమానాపురం ఉపసర్పంచ్ కె.కనకరాజు ఆధ్వర్యంలో పలువురు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. దీనిపై కలెక్టర్ తీవ్రస్థాయిలో స్పందించారు. తక్షణమే విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని డీఎల్పీఓ మోహనరావును ఆదేశించారు. అడ్డగోలుగా ‘దీపం’ పంపిణీ.. జిల్లాలో ‘దీపం’ కనెక్షన్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక అడ్డగోలుగా జరుగుతోందని మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దన్నానపేట గ్రామంలో సర్పంచ్‌కు తెలియకుండానే గ్రామ సభ నిర్వహించినట్లు ప్రకటించారంటే ఎంపికలో ఉన్న పారదర్శకత స్పష్టమవుతోందన్నారు. తమను కొనసాగించాలంటూ.. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు మెరుగుపర్చడానికి కృషి చేస్తున్న తమను విధుల్లో కొనసాగించాలని కోరుతూ ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో పని చేస్తున్న మండల కోఆర్డినేటర్లు వినతిపత్రం అందజేశారు. ఇళ్లు మంజూరు చేయాలంటూ.. చెవిటి, మూగ వారికి ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ జిల్లా చెవిటి, మూగ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతపత్రం అందజేశారు. నివాసాకి సరైన సౌకర్యం లేక తీవ్రఅవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. జిల్లాకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి.. రాష్ట్రంలో వెనుకబడిన విజయనగరం జిల్లాకు ప్రత్యేక బడ్జెట్ వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. వ్యవసాయం, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకుడు మర్రాపు సూర్యనారాయణ తదితరులు కోరారు. -
గ్రీవెన్స్‌సెల్‌కు హాజరుకాని అధికారులు
సాక్షి, కడప : జిల్లా వ్యాప్తంగా వేళకు విధులకు రావాల్సిన అధికారులు ఆలస్యంగా కార్యాలయాలకు వస్తున్నారు. వచ్చినా గ్రీవెన్స్ సెల్‌కు హాజరు కావడం లేదు. దీంతో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహించాల్సిన ‘గ్రీవెన్స్‌సెల్’కు మండలాధికారులు ఏమాత్రం ప్రాధన్యత ఇవ్వడంలేదు. సోమవారం... గ్రీవెన్స్ డే: ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ కోన శశిధర్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్‌సెల్ నిర్వహిస్తారు. ఇదే క్రమంలో ప్రతి మండల కేంద్రంలో కూడా సోమవారం గ్రీవెన్స్‌సెల్ కచ్చితంగా నిర్వహించాలని అధికారుల ఆదేశాలు ఉన్నాయి. సోమవారాన్ని ‘గ్రీవెన్స్‌డే’గా అధికారులు నిర్ణయించారు. జిల్లా కేంద్రంలో మినహా తక్కిన చాలా మండల కేంద్రాల్లో గ్రీవెన్స్డేలు నిర్వహించడం లేదు. ఎక్కడికి వెళ్లాలో... ఎన్ని సార్లు వెళ్లాలో.. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రజలు గ్రీవెన్స్ సెల్‌కు వస్తారు. అన్నిశాఖల అధికారులు ఆరోజు ఒకేచోట అందుబాటులో ఉంటారని, తమ సమస్య పరిష్కారమవుతుందని ఆశతో వెళతారు. తీరా మండలానికి పోయిన తర్వాత వేళకు కొంతమంది అధికారులు రారు. గ్రీవెన్స్‌సెల్‌కు పూర్తి గైర్హాజరవుతారు? దీంతో తమ సమస్య పరిష్కారం కోసం ఓశాఖ కార్యాలయానికి ఒకసారి, తర్వాత మరో అధికారి వద్దకు...ఆపై ఇంకో అధికారి వద్దకు ప్రజలు తిరగాల్సి వస్తోంది. అయినా సమస్య పరిష్కారం కావడం లేదు. జిల్లా కేంద్రంలో గ్రీవెన్స్‌సెల్‌కు వెళితే అక్కడ మండలాధికారులకు సమస్యను ఎండార్స్ చేస్తున్నారు. ఇక్కడికి వస్తే అసలు అధికారులే అందుబాటులో లేని పరిస్థితి. దీంతో తమ సమస్యల పరిష్కారానికి ఎక్కడికి వెళ్లాలో...ఎన్నిసార్లు వెళ్లాలో అర్థం కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందరూ హాజరు కావల్సిందే: ఈశ్వరయ్య, డీఆర్ఓ. గ్రీవెన్స్‌సెల్‌కు తహశీల్దార్‌తో పాటు అన్నిశాఖల అధికారులు కచ్చితంగా హాజరుకావాల్సిందే! ఈ మేరకు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సమస్య పరిష్కారానికి అందరూ ఒకేచోట ఉండాలని గ్రీవెన్స్‌డేను పెట్టాం. ఇకమీదట హాజరుకాని వారిపై తక్షణ చర్యలు ఉంటాయి. -
జవాబుదారీతోనే సత్ఫలితాలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: స్మితాసబర్వాల్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే పాలన యంత్రాంగాన్ని గాడిలో పెట్టారు. సమీక్షలు, క్షేత్ర స్థాయి పర్యటనలతో అధికారులు, సిబ్బందికి బుల్లెట్ వేగంతో దిశానిర్దేశం చేస్తున్నారు. విద్య, ఆరోగ్యం తన ప్రాధాన్యతలని చెప్తున్నా, అన్ని విభాగాల పనితీరుపై సమ స్థాయిలో దృష్టి సారించారు. ప్రజావాణిని ప్రక్షాళన చేయడంతో పాటు ‘మార్పు’, ‘సన్నిహిత’ వంటి కార్యక్రమాలతో ప్రజలు, అధికార యంత్రాంగాన్ని పాలనలో భాగస్వాములను చేస్తున్నారు. సమయపాలన, సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ చొరవతో పనిచేయాలని నిక్కచ్చిగా చెప్తున్నారు. సుమారు రెండు నెలల్లోనే జిల్లా పాలన యంత్రాంగంపై తనదైన ముద్ర వేసిన కలెక్టర్‌తో ‘సాక్షి ప్రతినిధి’ ముఖాముఖి. సాక్షి: ‘గ్రీవెన్స’లో పరిష్కారం కాకుంటేనే మీ వద్దకు రావాలనడం ఎంతవరకు సమంజసం? కలెక్టర్: ‘గ్రీవెన్స సెల్’లో వచ్చే సమస్యల పరిష్కారానికి ఇంతకంటే మెరుగైన మార్గం లేదని భావిస్తున్నా. నేరుగా కలెక్టర్‌ను కలిస్తేనే సమస్యలు పరిష్కారమవుతుందనేది తప్పుడు అభిప్రాయం. వ్యక్తి కేంద్రంగా నడిచే వ్యవస్థ ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉండదు. అన్ని ప్రభుత్వ విభాగాలు కలిసి కట్టుగా, జవాబుదారీతనంతో పనిచేయాలి. బృందంగా పనిచేయలేక పోతే ఫలితాలు సాధించలేం. ప్రజావాణిలో వచ్చిన విజ్ఞాపన 30 రోజుల్లో పరిష్కారం కాలేదంటే అధికారి ఫెయిల్యూర్‌గానే భావించాల్సి ఉంటుంది. అప్పుడు నేను కలెక్టర్‌గా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇద్దరు, ముగ్గురిని మినహాయిస్తే అందరూ విజ్ఞాపనల పరిష్కారం మీద దృష్టి పెడుతున్నారు. నాతో పాటు జాయింట్ కలెక్టర్, అదనపు జేసీ కూడా ఠమొదటిపేజీ తరువాయి ఎప్పటికప్పుడు ప్రజావాణి విజ్ఞప్తుల పరిష్కారంపై సమీక్ష చేస్తున్నాం. మండల స్థాయిలోనూ ఎంపీడీఓ, తహశీల్దార్ తదితరులు ఒకేచోట నుంచి విజ్ఞాపనలు తీసుకుంటున్నారు. ప్రజలు మండల స్థాయిలోనే ‘గ్రీవెన్స సెల్’కి వెళ్లాల్సిందిగా సూచిస్తున్నాం. మండల స్థాయిలో పరిష్కారం కానిపక్షంలోనే కలెక్టరేట్‌కు రావాలన్నది నా ఉద్దేశం. సాక్షి: ‘గ్రామదర్శిని’ మొక్కుబడిగా జరుగుతుందనే ఫిర్యాదులున్నాయి? కలెక్టర్: క్షేత్ర స్థాయిలో నెలకొన్న అనేక సమస్యలు గ్రామదర్శిని ద్వారా మా దృష్టికి వస్తున్నాయి. గ్రామాలకు వెళ్తున్న బృందాల నుంచి నివేదికలు తీసుకుని విశ్లేషిస్తున్నాం. దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలు, నిధుల విడుదలతో ముడిపడిన అంశాలకు తక్షణ పరిష్కారం వస్తుందని చెప్పలేం. గ్రామదర్శినిలో లేవనెత్తిన సమస్యలను సంబంధిత విభాగాలకు పంపిస్తున్నాం. ప్రజలు లేవనెత్తిన సమస్యలు పరిష్కారమయ్యాయా లేదా అనే అంశంపై ప్రతీ వారం సమీక్ష జరుపుతున్నాం. సాక్షి: ‘మార్పు’పై క్షేత్రస్థాయిలో ఇంకా అవగాహన ఏర్పడినట్లు లేదు? కలెక్టర్: మొదటిసారిగా స్వయం సహాయక సంఘాలను భాగస్వాములను చేస్తూ ‘మార్పు’ను చేపడుతున్నాం. ప్రస్తుతం అవగాహన కలిగించే దిశలో అనేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టాం. అధికారుల స్థాయిలో సమావేశాలు ముగిశాయి. నెలాఖరుకు గ్రామస్థాయిలో అవగాహన సమావేశాలు ముగిసేలా షెడ్యూలు రూపొందించాం. జనవరి, పిబ్రవరి వరకు ‘మార్పు’ ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. గర్భిణుల నమోదు, ప్రసూతికి ఎక్కడకు వెళ్తున్నారు. టీకాలు, చిన్నారుల పెరుగుదల, అభివృద్ధి తదితర అంశాలపై మహిళలకు విస్తృతస్థాయిలో అవగాహన కల్పించాలన్నదే ఉద్దేశం. ప్రజలు, ప్రభుత్వ విభాగాల సమన్వయంతోనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి. సాక్షి: ‘సన్నిహిత’పై మీ అంచనాలేమిటీ? కలెక్టర్: ప్రాథమికంగా సంక్షేమ హాస్టళ్ల పనితీరు మెరుగుపరిచేందుకే ‘సన్నిహిత’ అమలు చేస్తున్నాం. కొత్తగా నిధులు, నిర్మాణాలు చేపట్టడం ఈ కార్యక్రమం ఉద్దేశం కాదు. విద్యాపరంగా, సౌకర్యాలపరంగా హాస్టళ్లను మెరుగుపరచడమే ఈ కార్యక్రమం లక్ష్యం. వార్డెన్లు స్థానికంగా ఉంటున్నారా; మెనూ సక్రమంగా అమలవుతోందా, ప్రత్యేక తరగతులు జరుగుతున్నాయా, విద్యార్థుల హాజరు శాతం, ఫలితాల సాధన ఎలా ఉందనే కోణంలో సన్నిహిత అధికారులు చొరవ చూపుతారు. సాంఘిక సంక్షేమ శాఖ జేడీ సన్నిహిత కార్యక్రమం సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. హాస్టళ్లలో పారిశుద్ధ్యం, విద్యార్థుల ఆరోగ్యం, చదువుల్లో రాణింపు వంటి అంశాలు మెరుగవుతాయని ఆశిస్తున్నా. పరిశ్రమల నుంచి వచ్చే కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఫండ్ ద్వారా సౌకర్యాలను మెరుగుపరుస్తాం. సాక్షి: పరిశ్రమల నుంచే సీఎస్ఆర్ నిధిసక్రమంగా వసూలు కావడం లేదు కదా? కలెక్టర్: గడిచిన రెండు, మూడేళ్లుగా సీఎస్ఆర్ నిధి సక్రమంగా వసూలు కావడం లేదు. ప్రస్తుత డిమాండు ప్రకారం కోట్లాది రూపాయలు పరిశ్రమల నుంచి రావాల్సి వుంది. కొన్ని పరిశ్రమలు సొంతంగా ఖర్చు చేసి సీఎస్ఆర్ కింద చూపుతున్నారు. ఇకపై కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ అనుమతి మేరకు పరిశ్రమలు సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేయాలి. మార్గదర్శకాలు కూడా సిద్ధం చేశాం. సాక్షి: ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాలు, అర్బన్డేపై దృష్టి పెట్టారు. కానీ నిధుల కొరత ఉందని సర్పంచ్‌లు చెప్తున్నారు? కలెక్టర్: గ్రామ పారిశుధ్య నిధుల కోసం ప్రత్యేక అకౌంట్ ఉందనే విషయం చాలామందికి తెలియదు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ నుంచి చిన్న పంచాయతీలకు పది వేల రూపాయలు ఇస్తున్నాం. మేజర్ పంచాయతీలకు అంతకంటే ఎక్కువే వస్తుంది. నిధుల కొరత ఎక్కడా లేదు. కూలీ చెల్లింపు, బ్లీచింగ్ కొనుగోలు వంటివి వీటితో చేయొచ్చు. నిధులు వినియోగించాల్సిన తీరుపై జిల్లా పంచాయతీ అధికారి ద్వారా అప్రమత్తం చేయడం జరిగింది. వున్న నిధులు సక్రమంగా వినియోగిస్తే మరిన్ని నిధులు కూడా ఇస్తాం. సాక్షి: సబ్సెంటర్లలో సిబ్బంది అందుబాటులో ఉండటం లేదనే ఫిర్యాదులున్నాయి? కలెక్టర్: సబ్ సెంటర్లో వైద్య సిబ్బందిలో ఎవరో ఒకరు అందుబాటులో ఉండాల్సిందే. సబ్ సెంటర్లతో పోలిస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లేందుకు ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. ఏఎన్ఎంల కొరత వుంది. పీహెచ్‌సీల్లో ప్రసవాలపై దృష్టి సారించాం. 45 మంది స్టాఫ్ నర్సులను ఇటీవలే నియమించాం. వచ్చే రెండు మూడు నెలల్లో ఫలితాలు కనిపిస్తాయి. సాక్షి: ఆస్పత్రులు, హాస్టళ్లలో ‘స్కైప్’ పర్యవేక్షణ ఎందాక వచ్చింది? కలెక్టర్: ఇంటర్నెట్ సమస్య వున్న ఆస్పత్రులు మినహాయిస్తే 51 పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో స్కైప్ విధానంలో పర్యవేక్షణ జరుగుతోంది. 255 సంక్షేమ హాస్టళ్లు ఉన్నా 30 నుంచి 40 బా లికల హాస్టళ్లలో స్కైప్ ప్రవేశపెట్టాలనుకుంటున్నాం. అయితే కంప్యూటర్ల కొరత వల్ల ఆలస్యమవుతోంది. కంప్యూటర్లు కొనుగోలు బాధ్యత జాయింట్ కలెక్టర్ శరత్ చూస్తున్నారు. సాక్షి: ఇంజినీరింగ్ విభాగాల పనితీరుపై అంతగా సమీక్ష లేదెందుకు? కలెక్టర్: నేను రాకమునుపు జిల్లాలో ఆదర్శ పాఠశాలల నిర్మాణం, జడ్పీ, మండల పరిషత్ ద్వారా చేపట్టిన పనులు పెండింగులో ఉన్నాయి. ఎందుకు అమలు కాలేదనే అంశంపై లోతైన సమీక్ష చేశాం. 2010-11 నుంచి మంజూరైన పనులు కూడా నేటికీ పూర్తి కాలేదు. ఇందుకు సంబంధించిన లెక్కలు ఉన్నాయి. గడిచిన ఐదేళ్లలో 25వేలకు పైగా పనులు చేపడితే, జిల్లా, మండల పరిషత్ పరిధిలో ఇంకా మూడు వేలకు పైగా పనులు ప్రారంభమే కాలేదు. డిసెంబర్ ఆఖరుకల్లా 2010-11 నుంచి 2012-13 మధ్యకాలంలో చేపట్టిన పనులు పూర్తి చేయాలి. 2013-14 పనుల పూర్తికి ఏప్రిల్ నెలాఖరు గడువు విధించాం. గడువులోగా మోడల్ స్కూళ్ల నిర్మాణం పూర్తి చేయాల్సిందిగా ఆదేశించాం. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్ తదితర విభాగాల్లో వివిధ పథకాల కింద చేపట్టిన పనుల పురోగతిపైనా సమీక్ష జరుగుతోంది. వారు లేవనెత్తిన సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం. సాక్షి: అధికారుల హాజరును మెరుగు పరిచేం దుకు ఏమేరకు చర్యలు తీసుకుంటున్నారు? కలెక్టర్: జిల్లాస్థాయి అధికారుల పనితీరు ఎంత ముఖ్యమో మండలస్థాయిలో అంతే ప్రాధాన్యత ఉంటుంది. అధికారులు పనిచేసే చోట ఎవరు ఉంటున్నారో లేదో అనే అంశాలను పరిశీలిస్తున్నాం. మండల స్థాయి అధికారులకు సంబంధించి ఇప్పటికే సమాచారం సేకరించాం. జిల్లా అధికారి స్థానికంగా లేనపుడు కింద స్థాయిలో పని ఎలా జరుగుతుంది. ముఖ్యమైన ప్రభుత్వ శాఖల అధికారులు స్థానికంగా ఉండాలన్నదే నా భావన. ఈ మేరకు అధికారులకు అడ్వైజరీ మెమోలు కూడా జారీ చేశాం. అధికారుల పనితీరుకు సంబంధించి వివిధ మార్గాల్లో సమాచారం సేకరించాం. పనిచేసే అధికారులకు ఎప్పుడూ నా ప్రోత్సాహం ఉంటుంది. కొందరు అధికారులను పనిగట్టుకుని పంపిస్తున్నాననే ప్రచారంలో వాస్తవం లేదు. -
వినతులు అర్ధ సెంచరీ.. పింఛన్ సారీ
చిట్యాల, న్యూస్‌లైన్ : చిట్యాల మండలం నవాబుపేటకు చెందిన ఇతని పేరు గోస్కుల కృష్ణ. మూడేళ్ల క్రితం వరకు రాజాలా బతికాడు. ఆటో నడుపుకుంటూ భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకునేవాడు. చీకూచింత లేని కుటుంబం. ఉన్నంతలో సంతోషంగా జీవించేవారు. వారి ఆనందాన్ని చూసి విధి ఓర్వలేకపోయింది. మాయదారి రోగం ముసుగులో వచ్చి కృష్ణ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఓ రోజు కృష్ణ ఆటో నడుపుతుండగా ఉన్నట్టుండి ఎడమకాలు స్పర్శ కోల్పోయింది. ఆస్పత్రికి వెళితే డబ్బులు ఖర్చయ్యాయి తప్పితే రోగం నయం కాలేదు. ఖర్చుల కోసం జీవనాధారమైన ఆటోను అమ్ముకున్నాడు. అవీ సరిపోకపోతే మరో లక్ష రూపాయలు అప్పు చేశాడు. అయినా పరిస్థితిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. చివరికి ఆ కాలు ఉంటే ప్రాణానికే ప్రమాదమని వైద్యులు సూచించడంతో 2010లో ఎంజీఎంలో ఆపరేషన్ చేసి మోకాలు వరకు తొలగించారు. దీంతో కృష్ణ వికలాంగుడయ్యాడు. సదరం క్యాంపులో అతని వికలత్వాన్ని ధ్రువీకరించిన వైద్యులు 86శాతం వికలాంగుడని సర్టిఫికెట్ ఇచ్చారు. చికిత్స కోసం జీవనాధారమైన ఆటోను అమ్ముకోవడం.. కాలు కోల్పోయి వికలాంగుడిగా మారడంతో కృష్ణ జీవితం కకావికలమైంది. బతుకు దుర్భరమైంది. కనీసం పింఛన్ వస్తే కొంతైనా ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతో మూడేళ్ల నుంచి అధికారుల చుట్టూ విసుగులేకుండా తిరుగుతున్నాడు. ఇప్పటి వరకు గ్రీవెన్స్‌సెల్‌లో 20సార్లు, ఎంపీడీఓకు 30సార్లు వినతిపత్రాలు అందించాడు. అయినా మనసు కరగని అధికారులు వాటిని చెత్తబుట్టలో పడేస్తున్నారు. కుటుంబ పోషణ భారం కావడంతో ఇద్దరు పిల్లలను మొగుళ్లపల్లిలోని అత్తవారింటికి పంపించానని, అక్కడే వారు చదువుకుంటున్నారని కృష్ణ తెలిపారు. తన కష్టాలను అర్థం చేసుకుని కలెక్టర్ తనకు ఇందిరమ్మ ఇల్లు, పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని కన్నీటితో వేడుకుంటున్నాడు.