వెలవెలబోయిన గ్రీవెన్‌‌ససెల్ | Nobady in greevence cell | Sakshi
Sakshi News home page

వెలవెలబోయిన గ్రీవెన్‌‌ససెల్

Published Tue, Nov 22 2016 2:36 AM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM

వెలవెలబోయిన గ్రీవెన్‌‌ససెల్ - Sakshi

వెలవెలబోయిన గ్రీవెన్‌‌ససెల్

శ్రీకాకుళం పాతబస్టాండ్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్‌‌స సెల్ ఫిర్యాదు దారులు, వినతులు ఇచ్చేవారు లేక వెలవెల బోరుుంది. గ్రీవెన్‌‌స సెల్‌లో శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ పీఏ శోభ, డీఆర్‌డీఏ పీడీ కిశోర్‌కుమార్, డ్వామా పీడీ ఆర్.కూర్మనాథ్, సెట్‌శ్రీ సీఈఓ వీవీఆర్‌ఎస్ మూర్తి తదితరులు పాల్గొని వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు.

నరసన్నపేటలోని కస్తూర్బా లెప్పర్సీ కాలనీని పునర్నిర్మించాలని కాలనీకి చెందిన సీహెచ్ పాపారావు విన్నవించారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తే  బ్రైట్ ఫ్యూచర్ ఆర్గనైజేషన్ వారు కాలనీ ఇళ్ల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నారని, అనుమతులు మంజూరు చేయాలని కోరారు.

కుమార్తె వివాహం వచ్చేనెల 3న జరగనుందని, బ్యాంకులో దాచుకున్న డబ్బులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కొత్తూరు మండలం నివగాం గ్రామానికి చెందిన నల్లాన హరిచంద్రరావు అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎల్‌డీఎం వెంకటేశ్వరరావు స్పందిస్తూ డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

గూనభద్ర గ్రామానికి నిర్వాసిత గ్రామంగా గుర్తించి ప్యాకేజీలు, పరిహారం అందజేయాలని ఆ గ్రామానికి చెందిన వై.సింహాచలం, సూరయ్య తదితరులు కోరారు.

2007 నుంచి 2010 సంవత్సరం వరకు ఏపీ ఎరుుడ్‌‌స కంట్రో సోసైటీ పరిధిలోని పీపీటీసీటీ ప్రాజెక్టులో పనిచేశామని, ఇప్పుడు సీఎస్‌ఆర్ పవర్ గ్రీడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తున్న తమను ఎలాంటి నోటీసులు అందజేయకుండా తొలగించారని,  ఉద్యోగం, జీతాలు చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని డి.సురేష్, ఎన్.లక్ష్మణ్, బి.జానకి, ఎం.పద్మావతి తదితరులు కోరారు.

శ్రీకాకుళం రూరల్ మండలంలోని రాగోలులో నిత్యవసర సరుకుల తూకంలో మోసాలకు పాల్పడుతున్నారని పలుసార్లు ఫిర్యాదు చేసినా పౌర సరఫరాల అధికారులు చర్యలు తీసుకోవడంలేదని ఆ గ్రామానికి చెందిన కూటికుప్పల ధనుంజయరావు ఫిర్యాదు చేశారు.

ఆమదాలవలస మండలం తోటాడ పంచాయతీ పరిధిలోని గోపీనగర్ ప్రాంతంలో నాగావళి నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని అదే గ్రామానికి చెందిన బి.తులసీరావు, రాజారావులు ఫిర్యాదు చేశారు.
 
ఎస్పీ గ్రీవెన్‌‌స సెల్‌కు 21 వినతులు  
శ్రీకాకుళం సిటీ: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్‌‌స సెల్‌కు 21 వినతులు వచ్చారుు. వచ్చిన వినతులను ఎస్‌బీ డీఎస్పీ టి.మోహనరావు స్వీకరించారు. వాటిలో కుటుంబ తగాదాలకు నాలుగు, సివిల్ కేసులు ఐదు, పాత కేసుల విషయమై మూడు, ఇతర కారణాలకు చెందినవి తొమ్మిది వినతులు వచ్చారుు. మహిళా పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ జి.శ్యామలరావు ఆధ్వర్యంలో జరిగిన ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు 8 వినతులు రాగా, వాటిలో నాలుగు పరిష్కరించారు. మిగిలినవి వారుుదా వేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఎస్‌ఐ రాజేశ్వరరావు, సిటిజన్ ఫోరం ఆధ్యక్షుడు బరాటం కామేశ్వరరావు, డీఆర్‌డీఏ, ఐసీడీఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.  
 
డయల్ యువర్ కలెక్టర్‌కు 6 వినతులు  
శ్రీకాకుళం పాతబస్టాండ్:  డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 6 వినతులు వచ్చాయని డీఆర్‌డీఏ పీడీ కిశోర్‌కుమార్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దళితవాడలో బోరు వేయాలని మందస మండలం బాలిగాం గ్రామానికి చెందిన బి.కూర్మారావు,  సమాచార హక్కు చట్టంపై తప్పుడు సమాచారం ఇచ్చిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఆమదాలవలసకు చెందిన పైడి శ్రీనివాసరావు, వీధి దీపాలు వెలగడంలేదంటూ కాశీబుగ్గ సమీపంలోని పద్మాపురానికి చెందిన కె.సుజాతలు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు, నిరుద్యోగులకు పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ సరఫరా చేయాలని వంగర మండలం ఎంఎస్‌ఆర్ పురం గ్రామానికి చెందిన కేటీ బాబ్జి విన్నవించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement