ఇక ప్రజావాణిలో గ్రీవెన్స్‌సెల్ ఫిర్యాదులు
విజయనగరం కంటోన్మెంట్ : మారుమూల పల్లెల నుంచి వచ్చే సమస్యల పరిష్కారానికి వేదికవుతున్న గ్రీవెన్స్ సెల్ ఇక కొత్తరూపు సంతరించుకోనుంది. గ్రీవెన్స్‌సెల్ ఫిర్యాదుల విభాగం పేరు అలాగే ఉన్నా.. దీన్ని నిర్వహించే తీరు పూర్తిగా మారనుంది. జిల్లా వ్యాప్తంగా వచ్చే ఫిర్యాదులను ఇకపై ప్రజావాణి సాఫ్ట్‌వేర్‌లో పొందుపరచనున్నారు. ఇప్పటివరకూ స్థానికంగా ఉన్న సాఫ్ట్‌వేర్‌ను విని యోగించి ఫిర్యాదులను, వాటి పరిస్థితిని నమోదు చేసేవారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రజావాణి సాఫ్ట్‌వేర్‌లో ఫిర్యాదులను నమోదు చేస్తారు. ఇలా చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా
ఈ ఫిర్యాదులను పరిశీలించడానికి, తెలుసుకోవడానికి అవకాశముంటుంద ని అధికారులు చెబుతున్నారు. వచ్చిన ఫిర్యాదులను స్కానింగ్ చేస్తారు. అనంతరం ఆయా ఫిర్యాదులను సంబంధిత జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులకు పంపిస్తారు. ఆయాఅధికారులకు కేటాయించిన యూ జర్ ఐడీ, పాస్‌వర్డ్‌ల ఆధారంగా ఓపెన్‌చేసి తమపరిధిలో పరిష్కార మార్గం లేకపోతే ఉన్నతాధికారులకు అదే సాఫ్ట్ వేర్‌లో అప్‌లోడ్ చేస్తారు. ప్రస్తు తం దీనికి సంబంధించిన సర్వర్ అందుబాటులో లేకపోవడంతో వచ్చే వా రం నుంచి దీన్ని అమలుచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రజావాణిని తప్పనిసరిగా నిర్వహించాలని, ఇక నుంచి ఆన్‌లైన్ కార్యకలాపాలకు ప్రా ధాన్యమివ్వాలని కలెక్టర్ నాయక్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
సోమ వారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్ విభాగం, పెండింగ్ వినతుల సమీక్షల అనంతరం ప్రజావాణిపై కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. వచ్చే వా రం నుంచి దీన్ని అమలు చేసేందుకు సన్నద్ధం కావాలని ఆదేశించారు. అ నంతరం జేసీ రామారావు...జిల్లా అధికారులకు ఒక ప్రత్యేక అవగాహన కా ర్యక్రమం నిర్వహించారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ) అధికారులను పిలి పించి ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఇకపై ఫిర్యాదులను ఏ వి ధంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి? సెల్ మెసేజ్‌లు ఇచ్చేదెలా అన్న వివరాలను వివరించారు. దీనికి సంబంధించి జిల్లా అధికారులు కానీ, మండ ల స్థాయి అధికారులు కానీ ఎన్‌ఐసీ అధికారుల నంబర్లకు ఫోన్ చేసి ఈ విధానానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఙానాన్ని తెలుసుకోవాలన్నారు.
28న సమావేశం
జిల్లాలో ప్రజావాణి సాఫ్ట్ వేర్‌ను అమలు చేసేందుకు అధికారులు, వారి సాంకేతిక సహాయకులకు ఈనెల 28న మధ్యాహ్నం 3 గంటలకు సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ రామారావు తెలిపారు. ఆ రోజున ఆన్‌లైన్ గ్రీవెన్స్‌సెల్‌ను ఏ విధంగా అమలు చేయాలన్న విషయాలపై ఎన్‌ఐసీ అధికారులు సాంకేతిక సహాయకులకు, జిల్లా అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనన్నట్టు తెలిపారు.
ప్రజావాణిలో నమోదు ఇలా...
ప్రజావాణిలో వినతులను స్వీకరించేటప్పుడే ఫిర్యాదుదారుల ఫోన్ నంబర్‌ను సేకరిస్తారు.
వినతులు, ఫిర్యాదులను ఏబీసీడీలుగా వర్గీకరిస్తారు.
వచ్చిన వినతుల ప్రాధాన్యతను బట్టి ఈ వర్గీకరణ ఉంటుంది.
గ్రేడింగ్‌ను అనుసరించి ఫిర్యాదుదారుని సెల్‌కు మెసేజ్ రూపంలో ఎక్‌నాలెడ్జ్‌మెంట్ పంపిస్తారు.
ఫిర్యాదులను సంబంధిత అధికారులు చూసి పరిష్కరించేందుకు వారికి కూడా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ కేటాయిస్తారు.
వీటిని ఓపెన్ చేసి తమ కార్యాలయానికి సంబంధించిన ఫిర్యాదులను చూడొచ్చు.
అందులో వచ్చిన మెనూను సెలె క్ట్ చేసుకుని ఫిర్యాదులు తమపరిధిలోనివా లేకఉన్నతాధికారులకు పం పించాల్సినవా? అని అధికారులు నిర్ణయం తీసుకుంటారు.
ఉన్నతాధికారులకు వెళ్లాల్సిన ఫిర్యాదా లేక తమ పరిధిలో పరిష్కరించాల్సిన ఫిర్యాదా అన్న విషయాన్ని ధ్రువీకరించి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు.
ఇందులో మూడు వర్గీకరణలుంటాయి. అధికారులు పరిష్కరించగలిగినది దొకటి, పెండింగ్‌లో ఉన్నదొకటి, పరిష్కరించిన దొకటిగా వర్గీకరణ లుంటాయి.
నెట్‌లో కూడా తమ అర్జీ నమోదైందా లేదా అన్న విషయాన్ని అర్జీదారు తెలుసుకునే వెసులు బాటు కల్పించారు.
గెస్ట్123 అని ఆన్‌లైన్‌లో టైప్ చేస్తే ఫిర్యాదుదారునికి కూడా సమాచారం అందించే అవకాశం ఉంది.