ఆలస్యంగా ప్రారంభమైన గ్రీవెన్స్ సెల్
Published Tue, Nov 29 2016 3:48 AM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM
శ్రీకాకుళం పాతబస్టాండ్: సాధారణంగా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్‌ససెల్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే.. ఈ వారం 11.25 గంటలకు ప్రారంభించా రు. ముందుగా జేసీ చక్రధరబాబు హాజ రుకాగా, కాసేపటికి కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మినరసింహం వచ్చి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ఉదయం 8 గంటలకే కలెక్టరేట్‌కు చేరుకుని అర్జీలు ఇచ్చేందుకు క్యూ కట్టిన అర్జీదారులకు నిరీక్షణ తప్పలేదు. గంటల తరబడి నిల్చోవాల్సి రావడంతో అధికారుల తీరుపై అసహనం వ్యక్తంచేశారు. గ్రీవెన్‌ససెల్‌లో జేసీ -2 పి.రజనీకాంతారావు, డీఆర్‌డీఏ పీడీ కె.సి.కిశోర్‌కుమార్, డుమా పీడీ ఆర్.కూర్మనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
2002 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ నియామాకాలు వెంటనే చేపట్టాలన్న న్యాయస్థానం ఉత్తర్వులు అమలు చేయాలని డి.సింహాచలం, ఎస్.మురళీకృష్ణ, వై.భగవాన్, ఎం.షణ్ముఖరావులు కోరారు.
సరుబుజ్జిలి మండల కేంద్రంలోని నందికొండ సిమ్మయ్య కొనేరు వద్ద సర్వే నంబర్ 32-1, 32-1, 2లలోని మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని అధికార పార్టీకి చెందిన నాయకులు, పెద్దలు కలిసి ఆక్రమించారని, మండల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదంటూ సర్పంచ్ బెండి అన్నపూర్ణమ్మ, మండ సుదర్శనరావు, శ్రీనివాసరావు, రామారావులు ఫిర్యాదు చేశారు.
లావేరు మండలం బుడుమూరు గ్రామం ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు ఏర్పాటుచేయాలని కాలనీ వాసులు కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో వెంటనే సీసీ రోడ్లు, డ్రైనేజీ ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజినీర్, డీఆర్‌డీఏ పీడీలను ఆదేశించారు.
మత్య్సకారులకు ఫైబర్ తెప్పలు, చిన్న ఇంజిన్లు, వలలు మంజూరు చేయాలని శ్రీకాాకుళం మండలం పెద్దగనగళ్లపేటకు చెందిన మైలపల్లి ప్రసాద్, పోలీస్ తదితరులు విన్నవించారు.
2013లో రూ.9వేలు వ్యవసాయ రుణం తీసుకున్నానని, ఇప్పుడు అసలు, వడ్డీ కలిపి రూ.25000 అరుు్యందని, రుణ మాఫీ వర్తింప జేయాలంటూ రేగిడి ఆమదాలవలస మండలం పుర్లి గ్రామానికి చెందిన రైతు తుమ్మ శ్రీరామ్మూర్తి విన్నవించారు.
ప్రభుత్వం గుర్తించిన ర్యాంపుల నుంచి ఇసుక తరలిస్తున్నా అధికారులు ట్రాక్టర్‌ను సీజ్ చేశారని, అధికారులు స్పందించి న్యాయం చేయాలని చిలకపాలెంకు చెందిన సంతోష్‌కుమార్ వినతిపత్రం అందజేశారు.
ఎస్పీ గ్రీవెన్‌ససెల్‌కు 20 వినతులు
శ్రీకాకుళం సిటీ: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఓఎస్‌డీ(అడ్మిన్) తిరుమలరావు ఆధ్వర్యంలో గ్రీవెన్‌స సెల్ నిర్వహించారు. దీనికి 20 అర్జీలు వచ్చాయి. వాటిలో కుటుంబ తగాదాలకు సంబంధించి-4, సివిల్- 4, పాత తగాదాలు-4, ఇతర కారణాలకు చెందినవి-8 ఉన్నాయి. వీటిని త్వరతిగతిన పరిష్కరించాలని సంబంధిత డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలను ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ వి.సుబ్రహ్మణ్యం, విశ్రాంత ఎస్‌ఐ పి.రాజేశ్వరరావు, లీగల్ అడ్వైజర్ కె.ఆఫీసునాయుడు, న్యాయవాది టి. వరప్రసాదరావులు హాజరయ్యారు. ఓఎస్‌డీ ఆధ్వర్యంలో జరిగిన ఫ్యామిలీ కౌన్సెలింగ్‌నకు 14 అర్జీలు రాగా, వాటిలో 6 అక్కడికక్కడే రాజీ పరిచారు. మిగతా 8 పెండింగ్‌లో ఉన్నారుు. కార్యక్రమంలో న్యాయవాది సీహెచ్ జ్యోతి, డీఆర్‌డీఏ, ఐసీడీఎస్ సిబ్బంది డి.విజయకుమారి, కె.నిర్మల, సీనియర్ సభ్యులు బరాటం కామేశ్వరరావులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement