
విన్నపాలు..కన్నీళ్లు
సమస్యలపై స్పందించని అధికారగణం
గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం
నెలల తరబడి జెడ్పీ చుట్టూ తిరుగుతున్నా ఫలితం శూన్యం
అధికారులు స్వయంగా ప్రకటించిన పెండింగ్ ఫిర్యాదులు 16,741
గుంటూరు వెస్ట్ 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం 200 ఎకరాలు ఇచ్చింది. 2003లో 100 ఎ కరాలకు పాస్ పుస్తకాలు ఇచ్చా రు. ఇప్పటివరకు టైటిల్ డీడ్‌లు ఇవ్వలేదు. ఫలితంగా బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు కావడంలేదంటూ కారంపూడి మండ లం నరమాలపాడు గ్రామానికి చెందిన వై.లక్ష్మి అనే మహిళతోపాటు గ్రామస్తులు ఫిర్యాదు.
గ్రామంలోని గంగాభవానీ వాటర్ ఫిల్లింగ్ సెంటర్ నిర్వాహకులు. పంచాయతీ అనుమతులు లేకుం డా వాటర్ ఫిల్లింగ్ చేస్తున్నారు. మురుగుకాల్వల మధ్య ఏర్పాటు చేసిన ప్లాంట్ నుంచి వాటర్ ఫిల్లింగ్ చేస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నారంటూ తెనాలి మండలం కొలకలూరు గ్రా మానికి చెందిన కాలిశెట్టి భావన్నారాయణ, కాలి శెట్టి రమేష్‌బాబు, బద్దుల చంద్రశేఖర్ ఫిర్యాదు.
పూర్వార్జితంగా వచ్చిన పొలాన్ని నా తమ్ముడు కం చేటి రమేష్ ఆక్రమించుకుని పాస్ పుస్తకాలు పొం దాడు. 2012లో అప్పటి వీఆర్‌ఓ ద్వారా కంచేటి రమేష్ తన కుమారుడి పేరుతో రిజిస్టర్ చేయించుకున్నాడు. న్యాయం చేయమని అధికారులను కో రుతున్నా ప్రయోజనం లేకుండాపోతుందంటూ క్రోసూరు మండలం పీసపాడు గ్రామానికి చెందిన కంచేటిసాంబశివరావు, కంచేటి రమ్యల ఫిర్యాదు.
వీరంతా ఇప్పటివరకు ఐదుసార్లు పైబడి గ్రీవెన్స్‌సెల్‌లో దరఖాస్తులు అందజేసినవారే. ఇటువంటి ఉదాహరణలు చాలా...చాలా ఉన్నాయి.
గుంటూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజా సమస్యలపై ‘మీ కోసం’ వేదికలో జిల్లా ఉన్నతాధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తుంటారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వృద్ధులు, వికలాంగులు, మహిళలు, రైతులు ఇలా అన్నివర్గాల ప్రజలు ఎన్నో వ్యయప్రయాసలు భరించి తమ గోడును అధికారులకు మొరపెట్టుకునేందుకు ఇక్కడకు వస్తుంటారు. అయితే సమస్యలు పరిష్కారమవుతా యని ఇక్కడకు వచ్చేవారికి నిరాశే మిగులుతుంది. దరఖాస్తులైతే స్వీకరిస్తున్నారుగానీ, వాటిని పరిష్కరించడంలో అధికారుల వైఫల్యం కనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవు తోంది. నెలలతరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్యలు పరిష్కరించడంలో కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.
అధికారుల పిలుపునకు స్పందన కరువు ...
జిల్లాలోని వివిధ విభాగాలలో 16,741 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నట్లు జిల్లా అధికారులు స్వయంగా ప్రకటించారు. 18,311 దరఖాస్తులు స్వీకరించిన అధికారులు కేవలం 1570 ఫిర్యాదులను మాత్రమే పరిష్కరించారు. ఈ నెల 6వ తేదీ లోపు సగమైనా పూర్తిచేయాలని జిల్లా అధికారులు ఇచ్చిన పిలుపునకు స్పందన కరువైంది. జిల్లా పరిషత్ అధికారులు నెలవారీ జరిపే మండల పరిషత్ సూపరింటెండెంట్‌ల సమావేశాల్లో కూడా గ్రీవెన్స్‌సెల్ ఫిర్యాదులపై చర్చిస్తున్నా ఫలితం నామమాత్రమే.
జిల్లా అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు ...
సర్వే, భూ రికార్డుల ఏడీ వద్ద..79, మీసేవ ఏవో వద్ద..62, డీపీఓ 49, ఎండోమెంట్ ఈవో 21, జెడ్పీ సీఈఓ 23, వికలాంగుల సంక్షేమశాఖ 20, జీజీహెచ్ 18, రిజి స్ట్రార్10, మైనర్ ఇరిగేషన్14, మైనింగ్ ఏడీ(గుం టూరు), ఆర్‌డబ్ల్యూఎస్ 9, మైనార్టీ వెల్ఫేర్ 8, ఎక్సైజ్, హయ్యర్ ఎడ్యుకేషన్ వద్ద 7 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని విభాగాలకు చెందిన జిల్లా అధికారుల వద్ద పెండింగ్‌లో ఉ న్న దరఖాస్తులు. ఇవికాక మండలాల్లోని ప్రభుత్వ కా ర్యాలయాల్లో వందలసంఖ్యలో ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి.
పరిష్కారానికి కృషి ఏదీ?
గ్రీవెన్స్ ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, వాటి పరిష్కారానికి కృషి జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి, వాటిని పరిష్కరించాల్సిన అధికారుల తీరుపై ప్రజలు అసహ నం వ్యక్తంచేస్తున్నారు. ఇకనైనా అధికారులు తమ సమస్యలపై మానవతా దృక్పథంతోనైనా పరిష్కరించాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు.