విజయనగరం కంటోన్మెంట్ : పదవీ విరమణ చేసిన ప్రభుత్వ సిబ్బంది పింఛన్ల మంజూరులో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని కలెక్టర్ ఎంఎం నాయక్ హెచ్చరించారు. సోమవారం ఆయన గ్రీవెన్స్ సెల్ అనంతరం పెండింగ్ వినతులపై అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన నాటికి అందరికీ పింఛన్ మంజూరు చేయాలన్నారు. కార్మిక శాఖకు సంబంధించి క్లయిమ్‌లు, కేసుల పరిష్కారానికి ముందు పరిశ్రమల వివాదాల చట్టం, వేతనాల చట్టాలను పరిశీలించాలన్నారు. అనంతరం ఏయే శాఖలకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? వాటిలో ఎన్ని పరిష్కారమయ్యాయి..? ఎన్ని ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయన్న విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలాల అధికారులతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించి, పెండింగ్ ఫైళ్లను పరిష్కరించాలని డీఆర్‌ఓ నరసింహారావును ఆదేశించారు.
త్వరగా తప్పులు సరిదిద్దండి
మొదటి విడత రుణమాఫీ పొందని రైతులు రెండో జాబితాలో పొందేలా త్వరతిగతిన తప్పులు సరిదిద్దాలని కలెక్టర్ నాయక్ ఆదేశించారు. సోమ వారం ఆయన తన కార్యాలయంలో ఎంపీడీఓలు, తహశీల్దార్లు, ఏఓ లు, ఏపీఎంలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భగా కలెక్టర్ మా ట్లాడుతూ రుణమాఫీ వివరాలతో రైతుల వద్దకు వెళ్లాలని, లేకపోతే రైతు సాధికార సదస్సులకు అర్ధం ఉండదన్నారు. జాబితాను పారదర్శకంగా ఉం చాలన్నారు. తహశీల్దార్లు రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితాలను నింపి, జన్మభూమి కమిటీలతో సంతకం చేయించి, వాటిని బ్యాంకులకు పం పించాలన్నారు. ఇప్పటివరకూ 724 గ్రామాల్లో రైతు సాధికార సదస్సులు నిర్వహించినట్టు చెప్పారు. రుణమాఫీ పత్రాలను 82,733 మందికి అందజేశామ న్నా రు. రెండో దశ ప్రక్రియను తహశీల్దార్లు పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. అలాగే ఇసుక రీచ్‌లు పెంచాలని ఆదేశించారు. ఇప్పటివరకూ 11 మండ లాల్లో 29 ఇసుక రీచ్‌లను ప్రారంభించినప్పటికీ అవి సరిపడా ఇసుకను అందించడం లేదన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ వై నరసింహారావు, వ్యవసా య శాఖ జేడీ ప్రమీల, సీపీఓ మోహనరావు, ఆర్‌డీఓ వెంకటరావు, ఎల్‌డీఎం శివబాబు, డీఆర్‌డీఏ ఏపీడీ సుధాకర్, డీఐఓ నరేంద్ర, తది తరులు పాల్గొన్నారు.
పింఛన్ల మంజూరులో నిర్లక్ష్యం వద్దు
Published Tue, Dec 16 2014 3:13 AM | Last Updated on Thu, Mar 21 2019 7:28 PM
Advertisement