తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టర్ కార్యాలయం గ్రీవెన్స్ సెల్‌లో సోమవారం ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుడిపూడి సాయిబాబా అనే రైతు(45) తాను సాగు చేసుకుంటున్న సెంటు భూమిని ఎమ్మార్వో మరో వ్యక్తికి పట్టా చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానకి పాల్పడినట్లు తెలిసింది. రైతు స్వస్థలం అమలాపురం మండలం మెట్లకాలనీ. ప్రస్తుతం సాయిబాబా కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.