ఉన్నతాధికారి వేధింపులు భరించలేక కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్యయత్నం చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా తాళ్లూరు కస్తూరిభా గాంధీ బాలికల పాఠశాలలో శివపార్వతి కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తోంది. అయితే గత కొంత కాలంగా స్పెషల్ ఆఫీసర్ సుజిత, తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు సెల్ఫీ వీడియోలో ఆరోపించింది. వేధింపులు భరించలేకే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్టు పేర్కొంది. తన చావుకు కారణం స్పెషల్ ఆఫీసర్ సుజితనే కారణం అని వీడియోలో తెలిపింది.