* కౌన్సిలర్‌గా వేరే వ్యక్తి పరిచయం
* విలేకరుల రాకతో బట్టబయలు
ఇచ్ఛాపురం రూరల్ : తనపై వచ్చిన ఆరోపణలను కప్పి పుచ్చుకునేందుకు కౌన్సిలర్ స్థానంలో వేరే వ్యక్తిని కౌన్సిలర్‌గా పరిచయం చేసి డ్వామా పీడీనే బురిడి కొట్టించే యత్నంలో ఓ కంప్యూటర్ ఆపరేటర్ అడ్డంగా దొరికిపోయూడు. వివరాల్లోకి వెళ్తే...ఇక్కడి సివిల్ సప్లై కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న గుజ్జు హేమసుందరరావు రేషన్ కార్డుల మంజూరు, ఆధార్ కార్డుల అనుసంధానంలో పలు అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఏఎస్‌పేటకు చెందిన ఎస్.చిన్నారావు యూదవ్ జిల్లా అధికారులు ఇటీవల ఫిర్యాదు చేశాడు.
దీనిపై డ్వామా పీడీ రోణంకి కూర్మనాథ్ విచారించేందుకు తహశీల్దార్ కార్యాలయూనికి శుక్రవారం వచ్చి విచారణ చేపట్టారు. ఈ సమయంలో ఫిర్యాదుదారు చిన్నారావు అసలు ఉన్నదీ లేనిదీ స్థానిక కౌన్సిలర్‌ను తీసుకురావాల్సిందిగా కంప్యూటర్ ఆపరేటర్ హేమసుందర్‌ను పీడీ ఆదేశించారు. కొన్ని నిమిషాల తరువాత మూడో వార్డు కౌన్సిలర్ సాలిన ఢిల్లీ పేరున ఏఎస్‌పేటకు చెందిన పత్రి తవిటయ్య అనే వ్యక్తిని తీసుకువచ్చి ఇతనే కౌన్సిలర్‌గా పరిచయడం చేశాడు. దీంతో పీడీ ఆయన నుంచి ఫిర్యాదుదారుడు చిన్నారావుకు సంబంధించిన విషయూలపై ఆరా తీశారు.
చిన్నారావు అనే వ్యక్తి నిరక్షరాస్యుడని, ఫిర్యాదులో ఇంగ్లిష్‌లో సంతకం చేయడం వల్ల ఫిర్యాదు బోగస్‌గా పీడీ తేల్చారు. ఇంతలోనే స్థానిక విలేకరులు రంగ ప్రవేశం చేయడంతో అసలు విషయం బయటపడింది. హేమసుందరరావు తెచ్చిన వ్యక్తి కౌన్సిలర్ కాదని, పరారుు వ్యక్తని చెప్పడంతో పీడీ కూర్మనాధ్ అవాక్కయ్యూరు. దీంతో పీడీ సీరియస్ అయ్యూరు. దీనిపై పూర్తి వివరాలను కలెక్టర్‌కు నివేదిస్తానని విలేకరులకు తెలిపారు.
పాయితారి ఫీల్డఅసిస్టెంట్ సస్పెన్షన్
ఇటీవల ఉపాధి పనుల్లో కూలీల మస్టర్లలో అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు పాయితారి ఫీల్డ్ అసిస్టెంట్ రూపాను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఎంపీడీవోకు ఆదేశాలు జారీ చేసినట్టు ఎంపిడి కు పీడీ కూర్మనాథ్ తెలిపారు.
పీడీని బురిడీ కొట్టించే యత్నం!
Published Sat, May 28 2016 12:27 AM | Last Updated on Sat, Sep 29 2018 6:11 PM
Advertisement
Advertisement