District Water Management Agency (DWMA)
-
అవినీతిని సహించం..!
సాక్షి ప్రతినిధి, కడప : ఉపాధి హామీ పథకం జిల్లాకు వరం. నాలుగేళ్లుగా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వలసలు నియంత్రించేందుకు ప్రతి ఒక్కరికీ పని కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఇందుకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. రోజూ లక్ష పని దినాలు నమోదయ్యేలా క్షేత్ర సిబ్బంది ని నిత్యం పర్యవేక్షిస్తున్నాం. ఈ పథకం పరిధిలో ఏ స్థాయిలో కూడా అవినీతిని సహించేది లేదు. అవినీతికి ఎవరైనా పాల్పడుతున్నట్లు తెలిస్తే నేరుగా నాకు ఫిర్యాదు చేయొచ్చు. ఎవ్వరిని వదిలిపెట్టం. కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) పీడీ వై హరి హరనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 270 కోట్లు ఖర్చు చేశామని ఇందులో సింహభాగం కూలీలకే చెల్లించామని ఆయన వివరించారు. జిల్లాలో ఉపాధి, వాటర్షెడ్ల పనుల నిర్వహణ, సిబ్బంది పనితీరు..అక్రమాలు.. వంటి వాటిపై ‘సాక్షి’ ఆయనతో ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రతి కూలీకి పనికల్పిస్తాం.. ప్రతి కూలీకి పని కల్పించడమే కర్తవ్యంగా పెట్టుకున్నాం. ఆ దిశగా క్షేత్రస్థాయి సిబ్బందిని సమాయత్తం చేస్తున్నాం. కూలీలు అడిగినా పనులు కల్పించకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించాం. ఇప్పుడిప్పుడు పని దినాల సంఖ్య పెరుగుతోంది. రోజూ 80 వేల మంది దాకా కూలీలు పనులకు వస్తున్నారు. ఈ సంఖ్యను లక్షకుపైగా పెంచాలనేది లక్ష్యం. రాజంపేట, జమ్మలమడుగు, పులివెందుల ప్రాంతాల్లో పొలం పనులు జరుగుతున్నాయి. రానున్న రెండు మూడు రోజుల్లో పని దినాల సంఖ్య లక్షకుపైగా పెరిగే అవకాశం ఉంది. అలాగే 2018–19 ఆర్థిక సంవత్సరానికి 1.30 కోట్ల పని దినాలు లక్ష్యంగా పెట్టుకున్నాం. ∙రూ.270 కోట్లు ఖర్చు చేశాం.. ఈ ఆర్థిక సంవత్సరంలో పని దినాల నమోదు లక్ష్యం 1.39 కోట్లు. ఇప్పటికే 1.08 కోట్ల పని దినాలను పూర్తి చేశాం. మిగిలిన పని దినాలను మార్చి నాటికి పూర్తి చేస్తాం. ఈ ఏడాది ఉపాధి హామీ కింద రూ.330 కోట్లు ఖర్చు చేయాలన్నది లక్ష్యం. ఇప్పటి దాకా రూ.270 కోట్లు ఖర్చు చేశాం. ఇందులో కూలీలకే రూ.157 కోట్లు చెల్లించాం. సామగ్రి కొనుగోలు కింద మరో రూ.87 కోట్లు వ్యయం చేశాం. వేతనాలకు రూ.18 కోట్లు వెచ్చించాం. ∙బాధ్యతతో పనిచేయాలి.. క్లస్టర్లో సహాయ పీడీలు విధుల పట్ల ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించరాదు. కేవలం సిబ్బందిపై కర్ర పెత్తనం చేస్తామంటే కుదరదు. సమష్టిగా పని చేస్తేనే ఫలితాలు సాధ్యం. ఇదే విషయాన్ని ప్రతి వారం సమీక్షల్లో చెబుతున్నాం. రూ.2.36 కోట్ల అవినీతి జరిగింది.. పదమూడేళ్ల కిందట ఈ పథకం మొదలైంది. మొత్తం 12 విడతల సామాజిక తనిఖీలు జరిగాయి. ఉపాధి, వాటర్షెడ్ల పనుల్లో దాదాపు రూ.9.84 కోట్ల అక్రమాలు జరిగినట్లు సామాజిక తనిఖీ బృందాలు తేల్చాయి. ఇందులో రూ.4.86 కోట్లు విచారణ తర్వాత రద్దు చేశాం. మరో రూ.2.36 కోట్ల మేర వసూలు చేశాం. ఆర్ఆర్ చట్టం కింద రూ.1.53 కోట్లు, మిగిలిన రూ.96 లక్షలు వేతనాల రికవరీ కింద వసూలు చేయాల్సి ఉంది. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు.. ఉపాధి, వాటర్షెడ్ల పనుల్లో ఏస్థాయి అధికారైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి. ఏ స్థాయిలో అవినీతిని సహించేది లేదు. అధికారులెవరైనా అవినీతికి పాల్పడుతున్నట్లు తెలిస్తే.. నేరుగా నాకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. అవినీతి ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. పీఓలపై పని ఒత్తిడి ఉన్నది వాస్తవమే.. ఉపాధి హామీ పథకంలో ఎంపీడీఓలే పీఓలుగా పనిచేస్తున్నారు. వీరు సరిగా పనిచేయలేదన్నది వాస్తవం కాదు. నేను వచ్చిన తర్వాత తరచూ వారితో మాట్లాడుతున్నా.. మండల కంప్యూటర్ కేంద్రాల్లో ఎంపీడీఓలు ఉండి ప్రతి లావాదేవీని వారే చేస్తున్నారు. అయితే వారు ఇతర పనుల పట్ల దృష్టి సారించడంతో పని ఒత్తిడి ఉన్న మాట వాస్తమే. అలాగని వారు ఉపాధి పనిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడం లేదు. -
అవకతవకలు నిజమే.!
ఒంగోలు టౌన్: ‘జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయి. పనుల్లో అక్కడక్కడ యంత్రాలను వాడుతున్నారు’ అని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ పోలప్ప అంగీకరించారు. స్థానిక టీటీడీసీ సమావేశ మందిరంలో మంగళవారం డిస్ట్రిక్ట్ డవలప్మెంట్ కో ఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ(దిశ) సమావేశం నిర్వహించారు. ఆ కమిటీ చైర్మన్, ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో శాఖల వారీగా సమీక్షలు నిర్వహించే సమయంలో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలను సభ్యులు ఎండగట్టారు. ముందుగా వైవీ సుబ్బారెడ్డి జిల్లాలో ఉపాధి పనులకు ఎంత నిధులొచ్చాయి.. ఎంత ఖర్చు చేశారని పీడీని ప్రశ్నించారు. పీడీ స్పందిస్తూ.. ఎన్ఆర్ఈజీఎస్ కింద జిల్లాకు రూ.760 కోట్లు కేటాయిస్తే, ఇప్పటివరకు రూ.468 కోట్లతో వివిధ రకాల పనులు చేపట్టినట్లు వివరించారు. ఎంపీ వైవీ జోక్యం చేసుకుంటూ త్రిపురాంతకం, పెద్దారవీడు, తర్లుపాడు మండలాల్లో ఉపాధి పనుల్లో అవకతవకలు జరగలేదా..? అని ప్రశ్నించారు. కూలీలతో చేయించాల్సిన పనులను యంత్రాలతో చేయించారా.. లేదా..? అని ప్రశ్నించారు. ఇందుకు పీడీ కొద్దిసేపు నీళ్లు నమిలి అక్కడక్కడ అవకతవకలు జరిగినట్లు ఒప్పుకున్నారు. పనుల్లో జరిగిన అక్రమాలు సోషల్ ఆడిట్లో వెలుగులోకి రావడంతో సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అక్రమాలు జరిగినట్లు తన దృష్టికి వచ్చిన వెంటనే ఎంపీడీఓ, ఏపీఓలతో విచారణ జరిపిస్తున్నట్లు పీడీ చెప్పారు. ఎందుకయ్యా.. ఈ సమావేశాలు..? నాలుగు నెలల క్రితం జరిగిన దిశ సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలపై శాఖలకు సంబంధించిన నివేదికలు లేకపోవడంపై వైవీ సుబ్బారెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకయ్యా ఈ మీటింగ్‌లు, నివేదికలు లేకుండా ఎందుకొస్తారు. మీకు, నాకు టైమ్ వేస్ట్. అసలు మీటింగ్‌లు పెట్టాలా.. వద్దా..? అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో కిడ్నీ వ్యాధితో ఇప్పటివరకు ఎంతమంది మరణించారన్న వివరాలను అడిగితే డీఎంహెచ్ఓ నుంచి సమాధానం రాకపోవడంపై ఎంపీ అసహనం వ్యక్తం చేశారు. కొనకనమిట్ల మండలం చినారికట్ల గ్రామం నుంచి కనిగిరికి నీటిని అందించేందుకు ఇళ్ల ముందుగా పైపులైన్ వేసినా ఆ గ్రామస్తులకు మాత్రం నీరు ఇవ్వకపోవడంపై వైవీ సుబ్బారెడ్డి ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై మండిపడ్డారు. ఇటీవల తాను చినారికట్లకు వెళితే అక్కడి మహిళలు ఖాళీ బిందెలతో తన కాన్వాయ్‌ను ఆపారని, దీన్ని బట్టి అక్కడ నీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ విషయమై నెలరోజుల క్రితమే ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడినా ఇప్పటి వరకు సమస్య పరిష్కరించలేదన్నారు. చినారికట్ల, పెదారికట్ల గ్రామాల్లో పైపులైన్లు వేసి నీటి సమస్యను పరిష్కరించాలని, అందుకు అవసరమైతే నిధులు మంజూరు చేస్తానన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో రూ.కోట్లలో అవినీతి: ఎమ్మెలే జంకె జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని మార్కాపురం శాసనసభ్యుడు జంకె వెంకటరెడ్డి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. మండలాల్లో జరిగే అక్రమాలపై సంబం«ధిత ఎంపీడీఓ, ఏపీఓలతో విచారణ చేయించడం వల్ల వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలు లేవన్నారు. తన నియోజకవర్గ పరిధిలోని భూపతిపల్లిలో పనులు మరీ ఘోరంగా చేశారన్నారు. తర్లుపాడు మండలం మీర్జాపేటలో 240 మంది కూలీలతో చేయించాల్సిన పనులను రాత్రికి రాత్రి జేసీబీతో చేయించిన విషయాన్ని ప్రస్తావించారు. అక్రమాలకు పాల్పడిన వారిని సస్పెండ్ చేసి తిరిగి అక్కడే పోస్టింగ్‌లు ఇస్తున్నారన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేస్తేనే వాస్తవాలు వెలుగులోనికి వస్తాయన్నారు. కొనకనమిట్ల ఎంపీపీ రామనారాయణరెడ్డి జోక్యం చేసుకుంటూ తన మండలంలో చేపట్టిన ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో కోటి రూపాయల వరకు అవకతవకలు జరిగాయన్నారు. వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరగకుండా ఉండేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని పీడీని ఆదేశించారు. పదేళ్ల క్రితం కట్టిన వాటికి బిల్లులు.. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల లక్ష్యాల పేరుతో పదేళ్ల క్రితం కట్టిన వాటిని తాజాగా చూపించి బిల్లులు ఇచ్చారని ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. మార్కాపురం మండలంలోని వేములకోట గ్రామంలో 47 మందికి పదేళ్ల క్రితం కట్టిన మరుగుదొడ్లకు బిల్లులు చెల్లించారన్నారు. ఐదేళ్ల క్రితం కట్టిన వాటికి కూడా బిల్లులు చెల్లించారని, వీటిపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఎంపీడీఓ తప్పుచేస్తే ఆ ఎంపీడీఓతోనే విచారణ చేయిస్తే తప్పు బయటపడుతుందా..? అని ప్రశ్నించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల్లో జరుగుతున్న అక్రమాలపై ఆర్డబ్ల్యూఎస్, డ్వామా అధికారులపై విచారణ జరిపించాలన్నారు. కొనకనమిట్ల ఎంపీపీ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో సర్పంచ్, మండలస్థాయిలో ఎంపీపీ కన్వీనర్‌గా ఉండే జన్మభూమి కమిటీల్లో ప్రతిపక్ష పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. కొనకనమిట్ల ఎంపీడీఓ అక్రమాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీపీల సంతకాలు లేకుండా పింఛన్లు ఇస్తున్నారని, ఈ విషయమై హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయడం లేదన్నారు. వైఎస్సార్ సీపీ ప్రాతినిధ్యం కలిగిన పంచాయతీల్లో హౌసింగ్ స్కీమ్ అమలు చేయడం లేదన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, డీఆర్డీఏ పీడీ ఎంఎçస్ మురళి, సీపీఓ కేటీ వెంకయ్య పాల్గొన్నారు. -
చెత్త కారణాలు చెప్పొద్దు
పనుల్లో పురోగతి లోపిస్తే సస్పెండ్ చేస్తా – నెలాఖరు నాటికి అవెన్యూ ప్లాంటేషన్‌పై రిపోర్టులు పంపండి – ఫారంపాండ్స్‌లో వేగం పెరగాలి – మెసేజ్‌లను నిర్లక్ష్యం చేస్తే కష్టాలు తప్పవు – డ్వామా పీడీ డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి కర్నూలు(అర్బన్): మీరు చిన్న పిల్లలు కాదు.. పదే పదే చెప్పించుకోవద్దు.. బెదిరించి పనులు చేయించే స్థితికి తీసుకురావొద్దు.. చేపట్టిన పనుల పురోగతిపై చెత్త కారణాలు చెప్పకుండా, మర్యాదను పెంచుకోవాలంటు డ్వామా పీడీ డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం కలెక్టరేట్లోని డ్వామా సమావేశ భవనంలో ఏపీడీ, ప్లాంటేషన్ మేనేజర్లు, డీఆర్పీఎస్లతో పీడీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఎవెన్యూ ప్లాంటేషన్ కింద నాటిన మొక్కలు ఏ దశలో ఉన్నాయనే నివేదికలు పంపడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు? రాష్ట్రంలో మన జిల్లా 21.20 శాతం సాధించి చివరి స్థానంలో ఎందుకు ఉంది?’’ అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి ఈ నెలాఖరు నాటికి కనీసం 50 శాతానికి చేరుకోవాలన్నారు. అలాగే హార్టికల్చర్ ప్లాంటేషన్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని.. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కనీసం రెండు సంవత్సరాల వయస్సు, 1.1/2 మీటర్ల ఎత్తు ఉన్న మొక్కలను నాటేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఫారంపాండ్స్‌లో వేగం పెరగాలి తొలకరి వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో చేపట్టిన ఫారంపాండ్స్ పనుల్లో వేగం పెంచాలన్నారు. ఈ ఏడాది లక్ష్యంలో ఇప్పటి వరకు 4వేలు మాత్రమే పూర్తయ్యాయని, పురోగతిలో ఉన్న 11వేల ఫారంపాండ్స్‌ను వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లాలో వర్మీ కంపోస్టు యూనిట్ల టార్గెట్ 6వేలు కాగా, ఇప్పటి వరకు 464 మాత్రమే పూర్తయ్యాయని, 4276 పురోగతిలో ఉన్నాయని, వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతో వీటిని వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో 8,685 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 1026 పూర్తి అయ్యాయని, మిగిలినవన్నీ పురోగతిలో ఉన్నాయని, వీటిని నిర్ణీత సమయంలో పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మెసేజ్‌లను నిర్లక్ష్యం చేస్తే కష్టాలు తప్పవు డ్వామా ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ కార్యాక్రమాలకు సంబంధించి పురోగతిని పెంచేందుకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని మెసేజ్‌ల రూపంలో పంపుతున్నా కొందరు పట్టించుకోవడం లేదని పీడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయం నుంచే కాకుండా స్వయంగా తన సెల్‌ఫోన్ నుంచి మెసేజ్‌లు పంపుతున్నా స్పందించడం లేదన్నారు. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పీడీ హెచ్చరించారు. సమావేశంలో వాటర్‌షెడ్స్ ఏపీడీ రసూల్, ఎంఅండ్‌ఈ సులోచన, ఉపాధి హామీ పథకం సభ్యుడు సత్రం రామకృష్ణ పాల్గొన్నారు. -
డ్వామా విజిలెన్స్ ఆఫీసర్‌గా విజయలక్ష్మి
కర్నూలు(అర్బన్): డ్వామా విజిలెన్స్ ఆఫీసర్‌గా ఆళ్లగడ్డ ఎంపీడీఓ ఎం విజయలక్ష్మి నియమితులయ్యారు. గురువారం ఆమె డ్వామా పీడీ డా.సీహెచ్ పుల్లారెడ్డిని కలిసి బాధ్యతలు స్వీకరించారు. ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ అభ్యంతరాలపై విచారణ, రికవరీలను వేగవంతం చేయడం, డ్వామా ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి పనుల పరిశీలన తదితర అంశాలను ఆమె పర్యవేక్షిస్తారు. -
‘ఉపాధి’ వేతనాలకు ఢోకా లేదు
- 31లోగా పేమెంట్స్ అప్లోడ్ చేయండి - గ్రామీణాభివృద్ధి జాయింట్ కమిషనర్ బాల సుబ్రమణ్యం కర్నూలు(అర్బన్): జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కూలీల వేతనాలకు ఎలాంటి ఢోకా లేదని గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్ బాలసుబ్రమణ్యం తెలిపారు. బకాయి పడ్డ బిల్లులన్నింటినీ త్వరలోనే విడుదల చేస్తామన్నారు. శుక్రవారం ఆయన డ్వామా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కూలీల వేతనాలు, మెటీరియల్ పేమెంట్స్‌తో పాటు ఇతర పేమెంట్స్‌కు సంబంధించిన బిల్లులను ఈ నెల 31వ తేదీలోగా అప్లోడ్ చేయాలన్నారు. వారంలోగా బిల్లుల విడుదలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే వాటి విషయంలో కొంత జాప్యం జరుగుతున్నందునా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఫిబ్రవరి 2వ తేదీ నుంచి బకాయిపడిన మొత్తాలను విడుదల చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. కూలీల సంఖ్యను పెంచి పనుల లక్ష్యాన్ని సాధించాలన్నారు. హార్టికల్చర్ అవెన్యూ కింద రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారని, వాటిలో బతికి ఉన్న మొక్కలకు సంబంధించి కూడా పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేస్తామన్నారు. సమావేశంలో డ్వామా పీడీ డా.సీహెచ్ పుల్లారెడ్డి, ఏపీడీలు మురళీధర్, బీఎన్ సులోచన పాల్గొన్నారు. -
‘ఉపాధి’ కూలీల సంఖ్య పెంచండి
– డ్వామా పీడీ డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి కర్నూలు(అర్బన్): ఈ నెల 6వ తేదీ నాటికి జిల్లాలో ఉపాధి కూలీల సంఖ్య 1.50 లక్షలకు పెరగాలని అధికారులకు డ్వామా పీడీ డా.సీహెచ్ పుల్లారెడ్డి సూచించారు. మార్చి నెలతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులన్నీ పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలన్నారు. గురువారం సాయంత్రం ఆయన జెడ్పీ సీఈఓ బీఆర్ ఈశ్వర్‌తో కలిసి జిల్లాలోని ఎంపీడీఓ, ఏపీడీ, ఏపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ.. ప్రస్తుతం 1.05 లక్షల మంది కూలీలు వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్నారన్నారు. కూలీల సంఖ్య పెరగకుంటే నిర్ణీత లక్ష్యాన్ని చేరుకోవడం కష్టంగా ఉంటుందన్నారు. జిల్లాలో 10 వేల ఫారంపాండ్స్, తొమ్మిది వేల వ్యక్తిగత మరుగుదొడ్లను పూర్తి చేయాలన్నారు. ఉపాధి కూలీలకు పోస్టాఫీసు నుంచి కాకుండా బ్యాంకుల ద్వారా వేతనం చెల్లిస్తున్నామన్నారు. వివిధ కారణాలతో ఆయా బ్యాంకుల్లోని సస్పెన్షన్ ఖాతాలో 1.80 కోట్లు ఉన్నాయన్నారు. ఉపాధి పనుల్లో 25 శాతం కంటే తక్కువ పనులు జరిగిన మండలాలకు చెందిన 22 మంది ఎంపీడీఓలు, తొమ్మిది మంది ఏపీడీలు, 22 మంది ఏపీఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. ఒక వారం జీతం కట్ ... ఉపాధి హామీ పనుల్లో అలక్ష్యం వహిస్తూ.. కూలీల సంఖ్యను పెంచకుండా ఉన్న మండలాలకు సంబంధించి ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్లు, వాటర్‌షెడ్ పీఓలకు ఒక వారం జీతం నిలిపివేస్తున్నట్లు పీడీ స్పష్టం చేశారు. ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్ పీడీలు మురళీధర్, రసూల్ పాల్గొన్నారు. -
డ్వామాలో 29 మందికి అవార్డులు
అనంతపురం టౌన్ : జిల్లా నీటియాజమాన్య సంస్థలో మెరుగైన పనితీరు కనబరచిన ఉద్యోగులకు అవార్డులు దక్కాయి. గురువారం రిపబ్లిక్ డే పురస్కరించుకుని జెండావిష్కరణ అనంతరం వివిధ హాదాల్లోని 29 మందికి డ్వామా కార్యాలయంలో పీడీ నాగభూషణం అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. అవార్డులు సాధించిన వారిలో విజయలక్ష్మి (ఏపీడీ, ఉరవకొండ), మంజుల (ఏపీఓ, ఓడీసీ), ప్రసాద్ (ఏపీఓ, వజ్రకరూరు), శ్రీనివాసులు (పీఓ, గుంతకల్లు), బబ్లూ (ఈసీ, ధర్మవరం), కళ్యాణదుర్గం, శింగనమల వాటర్‌షెడ్ జేఈలు రామచంద్ర, రాజ, హిందూపురం క్లస్టర్ అసిస్టెంట్ ఏపీడీ కృష్ణకుమార్, కదిరి డబ్ల్యూసీసీలోని కంప్యూటర్ ఆపరేటర్ అమ్మాజాన్, తాడిపత్రి ఎంసీసీలోని కంప్యూటర్ ఆపరేటర్ అనురాధ, పుట్టపర్తి డబ్ల్యూసీసీ టీఓ శరత్‌బాబు, గుమ్మఘట్ట టెక్నికల్ ఆఫీసర్ ఉస్మాన్ అలీఖాన్, ఏఎఫ్–ఆర్డీటీ డబ్ల్యూసీసీలో వాటర్‌షెడ్ అసిస్టెంట్ వీరేంద్ర ఉన్నారు. డ్వామా కార్యాలయంలో పని చేసే సూపరింటెండెంట్లు హబీబాఖానం, అమృతవల్లి, డీవీఓ చంద్రశేఖర్, డిప్యూటీ ఎస్ఓ అంజాద్ హుస్సేన్, టైపిస్ట్ పర్వేశ్, ఆఫీస్ అసిస్టెంట్ రామ్మోహన్, కంప్యూటర్ ఆపరేటర్లు హనుమంతరెడ్డి, ఇర్ఫానా, వెంకటనారాయణ, నాగరాజు, ఆఫీస్ సబార్డినేట్ చంద్రశేఖర్, అటెండర్ తిమ్మప్ప, సిద్దార్థుడు, డ్రైవర్ రఫి, ప్రసాద్‌లకు ప్రశంసాపత్రాలు అందజేశారు. -
కూలి చెల్లింపుల్లో జిల్లాకు మొదటి స్థానం
నెల్లూరు(అర్బన్): పెద్ద నోట్లు రద్దు చేసిన కాలంలో కూడా ఉపాధి కూలీలందరికీ సకాలంలో డబ్బులు చెల్లించడంలో రాష్ట్రంలో నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని డ్వామా పీడీ హరిత తెలిపారు. స్థానిక దర్డామిట్టలోని డ్వామా కార్యాలయంలో గురువారం ఏపీఓలతో సమావేశం జరిగింది. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. పెద్ద నోట్లు రద్దు చేశాక ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో ఉపాధి కూలీలకు పోస్టల్ శాఖ ద్వారా రూ.10 కోట్లు చెల్లించాల్సి ఉండగా పోస్టాఫీసులకు చిల్లర నోట్లు రూ.16 కోట్లు పంపించామని తెలిపారు. వెంటనే రూ.7.53 కోట్లను కూలీలకు చెల్లించామన్నారు. మిగతా డబ్బులను రెండు రోజుల్లోనే చెల్లిస్తామని తెలిపారు. రాష్ట్రం మొత్తం మీద రూ.22.21 కోట్లను చెల్లించగా ఒక్క నెల్లూరులోనే రూ.7.53 కోట్లను చెల్లించడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు కలెక్టర్ ముత్యాలరాజు తీసుకున్న ప్రత్యేక చర్యలే కారణమన్నారు. ఇక మీదట నగదు రహిత చెల్లింపులు జరిపేందుకు కూలీలకు శిక్షణ ఇవ్వబోతున్నామని తెలిపారు. అకౌంట్లు లేని వారెవరైనా మిగిలి ఉంటే వారి చేత ఖాతాలు తెరిపిస్తామని చెప్పారు. జాబ్‌కార్డు కలిగి కోరిన ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తామని తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో శ్మశానాలు, సీసీరోడ్లు, చెరువుల పనులు , రహదారులు, సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. నాడాప్ , వర్మీ కంపోస్టు యూనిట్లను విరివిగా మంజూరు చేస్తున్నామని, పొదుపు మహిళలు వాటిని వినియోగించుకోవాలని సూచించారు. ఈ యూనిట్ల ద్వారా తయారైన ఎరువును పంట పొలాలకు వినియోగించుకోవాలని, లేదా అమ్ముకుని లాభాలు పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ పీడీ ప్రభాకర్ పాల్గొన్నారు. -
మరీ ఇంత ఘోరమా?
అనంతపురం టౌన్ : ‘జిల్లా కరువును దృష్టిలో పెట్టుకుని స్పెషల్ ప్రాజెక్ట్ మంజూరైతే అధికారులంతా నిర్లక్ష్యం చేస్తున్నారు. పది రోజుల ముందు నుంచి ’నీరాంచల్’పై సర్పంచులు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించి వర్క్‌షాప్‌నకు తీసుకురావాలని చెప్పినా ఒక్కరూ చెవికెక్కించుకోలేదు. మరీ ఇంత ఘోరమా? విజయవాడ నుంచి పనులు వదిలిపెట్టి నేనొచ్చా. ఇక్కడున్న మీరు సకాలంలో రావడానికి ఇబ్బంది ఏమిటి? సినిమాలౖకెతే పది నిమిషాల ముందే వెళ్తారా?’ అంటూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రామాంజనేయులు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) అధికారులపై మండిపడ్డారు. ’నీరాంచల్’ వాటర్‌షెడ్ ప్రాజెక్ట్‌పై అధికారులు, సర్పంచులు, ఎంపీపీలకు సోమవారం స్థానిక డ్వామా మీటింగ్ హాల్లో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.100 కోట్లతో చేపట్టే ’నీరాంచల్’తో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. వాటర్‌షెడ్ ప్రోగ్రాం ఆఫీసర్లు ఈ పథకంపై అవగాహన కల్పించకపోవడం శోచనీయమన్నారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలోని పీఓలందరికీ తక్షణం వేతనాలు నిలిపివేయాలని డ్వామా పీడీ నాగభూషణంను ఆదేశించారు. మంత్రి కార్యక్రమం ఉండడంతో మడకశిర పీఓ రాలేదని కింది స్థాయి సిబ్బంది చెప్పగా.. ఈ పథకం కన్నా ఏదీ ముఖ్యమైంది కాదన్నారు. తక్షణం సదరు పీఓకు నోటీస్ పంపాలన్నారు. నార్పల పీఓ రాకపోవడంతో చార్జ్‌మెమో ఇచ్చి తాను చెప్పే వరకు వేతనం మంజూరు చేÄñæ¬ద్దని ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థ ఆ ప్రాజెక్టును చేపడుతున్నట్లు అధికారులు చెప్పారు. అయితే ఆ సంస్థ ప్రతినిధులు కూడా రాకపోవడంతో అవసరమైతే వాళ్లకు ప్రాజెక్ట్ రద్దు చేసి మరొకరికి ఇస్తామని స్పష్టం చేశారు. రాప్తాడు పీఓ నరేశ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయనే గుత్తి పీఓగా కూడా ఉండడంతో రెండు ప్రాజెక్టులకు ఒక్కరినే ఎలా పెడతారని పీడీని ప్రశ్నించారు. సిబ్బంది తక్కువగా ఉన్నట్లు చెప్పగా.. ’నీ పరిధిలోని నలుగురు సర్పంచుల పేర్లు చెప్పు’ అంటూ నరేశ్‌ను కమిషనర్ అడిగారు. దీంతో ఆయన నీళ్లు నమలడంతో ’ఇదీ పరిస్థితి. సర్పంచుల పేర్లు కూడా తెలీకుండా పని చేస్తున్నారు. కనీస అవగాహన లేదు. ఇలాంటి వ్యక్తి మనకొద్దు. వేతనం కట్ చేసి తక్షణం మార్చండి’ అని ఆదేశించారు. డీ హీరేహాళ్ నుంచి పీఓ శ్రీవిద్య హాజరుకాకుండా జేఈ రావడంతో ఆమె ఎందుకు రాలేదని ప్రశ్నించారు. గర్భిణి అని తెలపడంతో ఇ¯ŒSచార్జ్ రాలేదా అని అడిగారు. అయితే, ఆమె సెలవు పెట్టలేదని చెప్పడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ’మెటర్నిటీ లీవ్ పెట్టి వెళ్లమనండి. సెలవులూ తీసుకోకుండా.. మీటింగులకూ రాకుండా ఉంటే ఎలా? అక్కడ మరొకరికి అడిషనల్ చార్జ్ ఇవ్వండి’ అని పీడీని ఆదేశించారు. అనంత అభివృద్ధికి ’నీరాంచల్’ వరం జిల్లాలో ’నీరాంచల్’ పథకం అందరి జీవితాలను మారుస్తుందని కమిషనర్ రామాంజనేయులు, కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే వనరులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామాలను అభివృద్ధి చేయడంలో సర్పంచుల పాత్ర కీలకమన్నారు. వర్కుల కోసం పోటీపడకుండా, అవినీతికి తావులేకుండా పనులు చేపట్టాలని సూచించారు. పనులను మాత్రం ప్రజలకు చెప్పే చేయాలన్నారు. ప్రాజెక్ట్ అమలయ్యాక జరిగే అభివృద్ధి, చేయాల్సిన పనులు, సర్పంచుల పాత్రపై వివరించారు. కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు శివప్రసాద్, శ్రీనివాసులు, వాటర్‌షెడ్ అదనపు పీడీ కృష్ణానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
వేతన కూలీలతో పనులు గుర్తించాలి
డ్వామా పీడీ హరిత నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట) : గ్రామాల్లో ఉపాధి పనులు గుర్తించే సమయంలో ఉపాధి సిబ్బంది తప్పనిసరిగా ఆయా గ్రామాల వేతన కూలీల భాగస్వామ్యంతోనే చేపట్టాలని డ్వామా పీడీ డి.హరిత అన్నారు. నగరంలోని పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రణాళిక ప్రక్రియలో జిల్లాలోని ఉపాధిహామీ సాంకేతిక సహాయకులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ లేబర్ బడ్జెట్ తయారీలో పటిష్టమైన ప్రణాళిక అవసరమన్నారు. లేబర్ బడ్జెట్‌ను ఎన్ని రోజులకు ముందుగా రూపొందించాలనే విషయాలపై వివరించారు. ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వాటర్ కన్జర్వేషన్ మిషన్ మోడ్‌లో ప్రణాళికా ప్రక్రియ ఉండాలని తెలిపారు. వాటర్ కన్జర్వేషన్ మిషన్ ప్రక్రియలో ప్రధానంగా డ్వామా, గ్రౌండ్ వాటర్, ఇరిగేషన్, అగ్రికల్చర్, ఫారెస్ట్ శాఖల భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు. ఆయా శాఖల సమన్వయంతో 2017–18 లేబర్ బడ్జెట్ ప్రణాళికను రూపొందించాలని తెలిపారు. ఈ శిబిరంలో ఏపీడీలు వెంకట్రావ్, గోపి, శంకర్‌నారాయణ, రీసోర్స్ పర్సన్స్ విశ్వనా«ద్, షామీర్, పెంచలయ్య పాల్గొన్నారు. -
వంద రోజులు పని కల్పించాల్సిందే
డ్వామా పీడీ హరిత అనంతసాగరం(సోమశిల) : జాతీయ ఉపాధిహామీ పథకంలో ప్రతి కూలీకి వంద రోజులు పని కల్పించాలని డ్వామా పీడీ హరిత తెలిపారు. మండల కేంద్రమైన అనంతసాగరంలో గురువారం అనంతసాగరం, మర్రిపాడు, ఆత్మకూరు మండలాలకు చెందిన జాతీయ ఉపాధి హామీ సిబ్బందితో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తొలుత ఇస్కపల్లి, మినగల్లు, పాతదేరాయపల్లి తదతర గ్రామాల్లో ఆమె పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కూలీకి రూ.131 కూలి వస్తోందని, అయితే ఆ మొత్తం రూ.160కు తగ్గకుండా చూడాలన్నారు. ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు మండలాలు ఫాంపాండ్స్ నిర్మాణ లక్ష్యంలో వెనకంజలో ఉన్నాయన్నారు. జిల్లాలో 10 వేల పాండ్స్ లక్ష్యం కాగా ఈ మూడు మండలాలల్లో ఆరువేలు ఏర్పాటుచేయాలన్నారు. నాడెప్ కంపోస్టు తొట్టెలు ప్రతి గ్రామంలో కనీసం 25కి తగ్గకుండా ఏర్పాటుకావాలన్నారు. సమావేశంలో ఆత్మకూరు డ్వామా ఏపీడీ మృదుల, ఎంపీడీఓలు ఐజాక్ ప్రవీణ్, రమేష్, ఏపీఓలు దయానంద్, లక్ష్మీనర్సయ్య, మురళీ పాల్గొన్నారు. -
ఉపాధి హామీ పనులు వేగవంతం
కోవూరు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులను త్వరతగతిన పూర్తి చేయాలని డ్వామా పీడీ హరిత కోరారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం కొడవలూరు, విడవలూరు, కోవూరు ఉపా«ధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 27 కరువు మండలాల్లో 150 దినాలు ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నామన్నారు. ఆట స్థలాలు, శ్మశానవాటికలను జియోట్యాగింగ్ చేయడం వాటి ద్వారా అవసరమైన చోట ఉపా«ధి హామీ నిధులు ఖర్చు చేవచ్చన్నారు. ప్రతి పంచాయతీలో ఉన్న వారందరికీ జాబ్‌కార్డు ఉండే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ 40 రోజులు తక్కువ లేకుండా పని కల్పించాలన్న ఆలోచనతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఏపీడీ శ్రీహరి, కొడవలూరు, విడవలూరు ఎంపీడీవోలు వసుంధర, విజయకుమార్, ఈవోపీఆర్డీ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
కరువు మండలాల్లో 150 పని దినాలు
– డ్వామా పీడీ డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి కర్నూలు(అర్బన్): జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన 36 కరువు మండలాల్లో ఉపాధి కూలీ పని దినాలను 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచినట్లు డ్వామా పీడీ డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి తెలిపారు. గురువారం ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ పని దినాలను పెంచుతూ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఆదేశాలు(లేఖ నెంబర్ 2133) జారీ చేశారన్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు కరువు మండలాల్లో ఉపాధి కూలీలు 150 రోజుల వరకు ఉపాధి పనుల్లో పాల్గొనే అవకాశం లభించిందన్నారు. కరువు మండలాలుగా ప్రకటించిన గ్రామాల్లో ఇప్పటికే 100 రోజులు పూర్తి చేసుకున్న కూలీలకు అదనంగా 50 రోజుల పనులు చేసే అవకాశం వచ్చిందన్నారు.ఽ జిల్లాలో ప్రకటించిన కరువు మండలాలు పెద్దకడుబూరు, హొళగుంద, ఆలూరు, శిరువెళ్ల, సంజామల, హాలహర్వి, మంత్రాలయం, నందవరం, సి.బెళగల్, గూడూరు, కొత్తపల్లి, ఓర్వకల్లు, కల్లూరు, కోడుమూరు, క్రిష్ణగిరి, వెల్దుర్తి, బేతంచెర్ల, పాణ్యం, గడివేముల, బండి ఆత్మకూరు, ఆళ్లగడ్డ, చాగలమర్రి, ఉయ్యాలవాడ, గోస్పాడు, కోయిలకుంట్ల, బనగానపల్లె, కొలిమిగుండ్ల, అవుకు, ప్యాపిలి, డోన్, తుగ్గలి, పత్తికొండ, మద్దికెర, చిప్పగిరి, ఆస్పరి, ఆదోని. మార్చి నాటికి 70వేల ఫాంఫాండ్స్ పూర్తి జిల్లాలో 70వేల ఫాంపాండ్స్‌ను 2017 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నట్లు పీడీ తెలిపారు. ఇప్పటి వరకు 34వేల ఫాంఫాండ్స్ పనులు చేపట్టామని, ఇందులో దాదాపు పూర్తయ్యాయని.. మిగిలిన 36వేలను నెలకు 6 వేల ప్రకారం మార్చి నాటికి పూర్తి చేస్తామన్నారు. ఒక్కో ఫాంఫాండ్ నిర్మాణానికి రూ.30 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వెచ్చించనున్నట్లు తెలిపారు. 6,500 వర్మీ కంపోస్టు యూనిట్ల పూర్తి జిల్లాలో వర్మీకంపోస్టు యూనిట్లను కూడా మార్చి నాటికి పూర్తి చేస్తామన్నారు. మొత్తం 15వేల యూనిట్లలో ఇప్పటి వరకు 6,500 పూర్తి చేశామమన్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలోని గ్రామ ఐక్య సంఘాల ద్వారా కూడా వర్మీ కంపోస్టు యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు పుల్లారెడ్డి వివరించారు. -
కూలీలకు బ్యాంక్ ఖాతా తప్పనిసరి
డ్వామా పీడీ హరిత చేజర్ల : ఉపాధి హామీ పథకంలో కూలీలుగా పనిచేసే వారు తప్పనిసరిగా బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని డ్వామా పీడీ హరిత తెలిపారు. శుక్రవారం ఆమె మండలంలోని గొల్లపల్లిలో ఉన్న చిన్న చెరువు వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కూలీలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఉపాధి సీనియర్ అసిస్టెంట్లు, మేట్లు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో ఉపాధి హామీ కూలీలకు చెల్లింపులు బ్యాంకుల ద్వారా చేస్తామన్నారు. ఽప్రతి గ్రామ పంచాయతీకి 100 ఫారంపాండ్స్, 25 నాడెప్ కంపోస్టు తొట్టెలు కట్టించాల్సిన బాధ్యత ఫీల్డ్ అసిస్టెంట్స్‌పై ఉందన్నారు. కూలీలకు 100 రోజులకు తగ్గకుండా పనిదినాలను కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ శ్రీహరి, ఎంపీడీఓ వాణి తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యానికి మంచి ఉపాధి పనులు
డ్వామా పీడీ హరిత వాకాడు : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో 72.43 లక్షల మందికి ఉపాధి పనులు కల్పించాలన్నదే తమ లక్ష్యమని, అయితే ఇప్పటికే లక్ష్యాన్ని మించి 78.91 లక్షల మందికి పనులు కల్పించినట్లు డ్వామా పీడీ హరిత పేరొన్నారు. మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను ఆమె మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె కొండాపురం గ్రామంలో జరుగుతున్న పనులను పరిశీలించి స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సిబ్బందితో సమావేశమయ్యారు. ఉపాధి హామీ పథకం ద్వారా 100 రోజులు పని కల్పించడంలో రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉందని పీడీ హరిత అన్నారు. జిల్లాలో 23 మండలాల్లో 711 పంచాయతీలకు గాను 26 వేల మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించామని, ఇప్పటి వరకు 5175 మరుగుదొడ్లు నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. పనుల పట్ల నిర్లక్ష్యం వహించిన మండలంలోని పలువురి సిబ్బందిని ఆమె మందలించారు. ఈమెతోపాటు ఏపీడీ గోపి, ఎంపీడీఓ ప్రమీలారాణి, వైస్ ఎంపీపీ పాపారెడ్డి పురుషోత్తమరెడ్డి, ఏపీఓ పెంచలమ్మ, సిబ్బంది బాలకృష్ణ, శాంతి, తదితరులు ఉన్నారు. -
ఆ రెండు శాఖలకు ఒక్కరే..
డీఆర్డీఏ, డ్వామా విలీనం డీఆర్డీఓగా నామకరణం సహాయకులుగా ఇద్దరు డీఆర్డీఓలు దసరా నుంచి అమల్లోకి.. నల్లగొండ : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ), జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ఈ రెండు శాఖలు విలీనం చేశారు. ఒకే స్వరూపం కలిగిన శాఖలను విలీనం చేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయానికి అనుగుణంగా తొలుత ఈ రెండు శాఖల్లో విలీన ప్రక్రియ ప్రార ంభించారు. డీఆర్డీఏ, డ్వామాను కలిపి కొత్తగా ‘డీఆర్డీఓ’ (జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యాలయం)గా నామకరణం చేశారు. కార్యాలయం చివరన ఉండే ‘సంస్థ’ అనే పదాన్ని తొలగించి ‘ఆఫీస్’ అనే పదం చేర్చారు. కొత్తగా ఏర్పాటయ్యే డీఆర్డీఓ కార్యాలయ సేవలు దసరా నుంచి ప్రారంభమవుతాయి. ఈ కార్యాలయాన్ని ఇప్పుడున్న డ్వామా ¿¶ వనం నుంచే కొనసాగిస్తారు. ఇప్పటి వరకు రెండు శాఖలకు కలిపి ఇద్దరు పీడీలు ఉండగా ఇక నుంచి ఒక్కరే డీఆర్డీఓగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం డీఆర్డీఏ పీడీగా పనిచేస్తున్న అధికారిని డీఆర్డీఓగా నియమిస్తారు. డ్వామా పీడీని కొత్త జిల్లాకు పంపిస్తారు. డీఆర్డీఓకు సహాయకులుగా ఇద్దరు అదనపు డీఆర్డీఓలు ఉంటారు. వీరిలో ఒకరు ఉపాధి హామీ పథకానికి, మరొకరు ఐకేపీ పథకాలకు సమన్వయ కర్తలుగా పనిచేస్తారు. ఐకేపీ, ఉపాధి ఉద్యోగులు ఒకే దగ్గర కలిసి పనిచేసినప్పటికీ ఉద్యోగుల పని విషయాల్లో కానీ, వారి సర్వీసుల్లో ఎలాంటి మార్పు ఉండదని అధికారులు తెలిపారు. -
బాధ్యతలు విస్మరిస్తే ఉపేక్షించేదిలేదు
ఉపాధి సిబ్బంది పనితీరుపై డ్వామా పీడీ ఆగ్రహం సైదాపురం: బాధ్యతలు విస్మరిస్తే సస్పెండ్ చేయకుండా ఇంటికే పంపుతానని డ్వామా పీడీ హరిత ఉపాధి సిబ్బందిని హెచ్చరించారు. సైదాపురం ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఉపాధి పనులపై క్షేత్రస్థాయిలో ఆమె సిబ్బందితో సమీక్షించారు. ఉపాధి సిబ్బంది పనితీరుపై పీడీ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. కనీసం జాబ్‌కార్డులు ఎన్ని ఉన్నాయి.. గ్రామంలో ఎంత మంది ఫారంఫాండ్స్ తవ్వకాలు సాగిస్తున్నారు.. ఎంత మందికి ఇంకుడు గుంతకు సంబంధించిన నిధులు మంజూరు చేశారు.. అనే విషయాలు కూడా తెలియకుండా పనులు ఎలా చేస్తున్నారంటూ సిబ్బందిని మందలించారు. మరుగుదొడ్ల నిర్మాణ పనుల విషయంలో ఐకేపీ, ఉపాధి సిబ్బంది మధ్య సమన్వయం కొరవడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల స్థాయిలో పనిచేసే సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మండల స్థాయిలో ఏ అధికారి పనిచేస్తున్నారనే విషయాలు తనకు తెలుసునని తెలిపారు. పర్యవేక్షించే అధికారులు కూడా తమ బాధ్యతలను పూర్తిగా విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. సిబ్బంది కొరత ఉన్న చోట్ల అధికారులే పనులు జరిగేలా చర్యలు తీసుకోవాల్సింది పోయి ఒకరిపై ఒకరు పొంతన లేని సమాధానాలు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఎఫ్‌ఏలు తమ పద్ధతిని మార్చుకోకపోతే క్రిమినల్ కేసులు పెడతామని స్పష్టం చేశారు. మొక్కల పెంపకంపై ఎఫ్‌ఏలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లాలో సిబ్బంది లేని చోట్ల పనులు చక్కగా సాగుతున్నాయని, పూర్తి స్థాయిలో ఉన్న చోట్ల మాత్రం జరగడం లేదన్నారు. కొందరు ఏపీఓలు పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇకనైనా తమ పద్ధతిని మార్చుకోకపోతే ఏపీఓలే అవసరమే లేదని ప్రభుత్వానికి నివేదిక పంపుతామని హెచ్చరించారు. ఏపీడీ శ్రీహరి, ఎంపీడీఓ విజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
క్వాలిటీ అధికారులపై విచారణ
నెల్లూరు(అర్బన్) : జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ పనులు, సామాజిక తనిఖీలు తదితర అంశాలకు సంబంధించి డ్వామాలోని జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారులు, విజిలెన్స్ అధికారులపై రాష్ట్ర చీఫ్ క్వాలిటీ కంట్రోలర్ ఆఫీసర్ బి.నాగేంద్ర విచారణ జరిపారు. నెల్లూరు దర్గామిట్టలోని డ్వామా కార్యాలయంలో గురువారం ఇంజనీరింగ్ కన్సెల్టెన్సీ అధికారుల, క్వాలిటీ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా పీడీ హరిత మాట్లాడుతూ విచారణ చేపట్టాల్సిన క్వాలిటీ అధికారులపైనే ఆరోపణలు రావడం దారుణమన్నారు. నాగేంద్ర రికార్డులు పరిశీలించారు. ఆరోపణలు వచ్చిన వారిని విచారించి వివరణ తీసుకున్నారు. తప్పు చేసినట్లు రుజువైతే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. -
భూగర్భ జలవనరుల సర్వేను పూర్తి చేయాలి
డ్వామా పీడీ హరిత నెల్లూరు(అర్బన్): ఎన్టీఆర్ జలసిరి పథకం కింద బోర్ల మంజూరుకు భూగర్భ జలవనరుల సర్వేను వెంటనే పూర్తి చేయాలని డ్వామా పీడీ హరిత జియాలజిస్టులకు సూచించారు. శనివారం ఆమె దర్గామిట్టలోని తన చాంబర్లో జియాలజిస్టులు, కార్యాలయ సిబ్బందితో ఎన్టీర్ జలసరి పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ జలసిరి కింద జిల్లాకు 15,249 బోర్లు మంజూరయ్యాయని తెలిపారు. 2016లో 5వేల బోర్లను వేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎంపీడీఓ, ఉపాధి హామీ పథకం సిబ్బంది సమన్వయంతో చిన్న, సన్నకారు రైతులను గుర్తించాలని కోరారు. భూగర్భ జల వనరుల శాఖ ఉపసంచాలకులు రమేష్ మాట్లాడుతూ భూగర్భజల వనరుల సర్వే నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డ్వామా అడిషనల్ పీడీ ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. -
నిధులు ‘తొట్టెల’ పాలు
ఇందూరు: పశువుల కోసం ఏర్పాటు చేసిన నీటి తొట్టెల నిర్మాణాల్లో నాణ్యత లోపించింది. దీంతో నాలుగు కూడా గడవక ముందే కుప్పకూలుతున్నాయి. వేసవిలో పశువుల దాహార్తిని తీర్చడానికి ‘డ్వామా’ అధికారులు ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో నీటి తొట్టెలు నిర్మించారు. అయితే, వాటిలో నాణ్యతా లోపాలు బయటపడుతున్నాయి. అధికారులు, గుత్తేదారులు ములాఖత్ అయి నామమాత్రంగా నిర్మాణాలు చేపట్టి భారీగా దండుకున్నారే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 2 వేల వరకు నిర్మించిన తొట్టెల నిర్మాణాల్లో భారీ అవినీతి చోటు చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో నిర్మించిన తొట్టెలకు స్వల్ప మరమ్మతులు చేపడితే అవి వినియోగంలోకి వచ్చేవి, కానీ వాటిని వదిలేసి కొత్తవి నిర్మించారు. మరోవైపు, కొన్ని చోట్ల అవసరం లేకున్నా కట్టేశారు. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. జిల్లాలో గత ఐదేళ్లలో వందల నీటి తొట్టేలను నిర్మించారు. అవన్నీ బాగానే ఉన్నా, వాటిని కాదని ఈ సంవత్సరం కొత్త నీటి తొట్టెల నిర్మాణాలు చేపట్టారు. పాతవి ఎందుకు నిరుపయోగంగా మారాయో తెలుసుకోకుండా, చిన్న మరమ్మతులు చేయిస్తే వినియోగంలోకి వస్తాయని తెలిసీ, మళ్లీ రూ.లక్షల నిధులతో కొత్త వాటిని నిర్మించారు. ఫలితంగా జిల్లాలో నిధుల దుబారా జరిగింది. పాత తొట్టెలు జిల్లాలో వెయ్యికిపైగా నిరూపయోగంగా ఉన్నాయి. ప్రయోజనం లేదే..! డ్వామా అధికారులు ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 2010–11 నుంచి గతేడాది వరకు రూ.1.10 కోట్లతో 1500 పశువుల తొట్టెలను నిర్మించారు. ఇవే కాకుండా జిల్లా నీటి యాజమాన్య పథకం కింద కొన్ని ప్రాంతాల్లో పశువుల కోసం నీటి తొట్టెలు నిర్మాణాలు చేపట్టారు. గ్రామాల్లో పశువులు సంచరించే ప్రాంతాల్లో చేతి పంపులు, బావుల దగ్గర వీటిని నిర్మించారు. తద్వారా వృథా నీటిని తొట్టెల్లోకి మళ్లించడంతో పాటు అవసరముంటే ఎవరైనా నీళ్లు తోడి తొట్టెలను నింపుకోవచ్చనే ఆలోచనతో ఈ నిర్మాణాలు చేపట్టారు. కానీ ప్రస్తుతం వీటిలో సింహభాగం ఎక్కడ పశువుల దాహార్తిని తీర్చడం లేదు. పైగా నిర్మాణాల్లో సాంకేతిక, నాణ్యతా లోపాల కారణంగా వీటిలో నీళ్లు నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది. మరమ్మత్తులతో సరిపోయేది.. నీటి తొట్టెలు నిరుపయోగంగా మారడానికి చిన్న చిన్న కారణాలున్నాయి. ఒకచోట చేతిపంపు చెడిపోయి నీళ్లురాని పరిస్థితి ఉండగా, మరో చోట పైపులైన్ మరమ్మతు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో చోట పూర్తిగా నీటి వసతి లేకుండా నీటి తొట్టెలను నిర్మించారు. దీంతో గతంలో నిర్మించి తొట్టెలు నిరుపయోగంగా మారాయి. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఒక తొట్టెకు రూ.1000–2000 ఖర్చు చేస్తే అవి వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇది తెలిసినా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అనవసరంగా కొత్తవి నిర్మించారు. గతంలో నిర్మించి ఒక్కో తొట్టె విలువ రూ.14,000–18,000 ఉండగా, కొత్తగా నిర్మిస్తున్న వాటి విలువ రూ.22 వేల వరకు ఉంది. జిల్లాలోని 36 మండలాల పరిధిలోని 71 గ్రామ పంచాయతీల్లో కొత్తగా 2,154 నీటి తొట్టెలను (ఒక జీపీకి మూడు చొప్పున) మంజూరు చేశారు. ఒక్కో దానికి రూ.22,190 కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 75శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి. నీటి సౌకర్యం లేకున్నా నిర్మాణాలు.. నీటి సౌకర్యం లేకున్నా తొట్టెలు నిర్మించడం విమర్శలకు తావిస్తోంది. వచ్చే నిధులకు ఆశపడి స్థానిక ప్రజాప్రతినిధులు గుత్తేదారు అవతారం ఎత్తారు. నాసిరకం పనులతో మమ అనిపిస్తున్నారు. కూలీలకు చెల్లించాల్సిన సొమ్మును కూడా వీరే అప్పనంగా తినేస్తున్నారు. నాణ్యత లేక కొద్ది నెలలకే వాటి గోడలు కూలుతున్నాయి. తొట్టెలకు శాశ్వత నీటి సౌకర్యం లేక కొద్ది రోజులకే నిరుపయోగంగా మారుతున్నాయి. కేస్ స్టడి–1 కూలిపోయిన నీటి తొట్టి జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామం లోనిది. రూ.22 వేలతో గత వేసవిలోనే ఈ తొట్టెను నిర్మించారు. గుత్తేదారు నాసిరకంగా పనులు చేపట్టడంతో ఇటీవలే కూలిపోయింది. అదే గుత్తెదారు ఈ మండలంలో నిర్మించిన మరో మూడు తొట్టెలు కూడా నాసిరకంగా ఉన్నాయి. ఈ ఒక్క మండలంలోనే కాదు. చాలా మండలాల్లో నాణ్యతా లోపాలు వెలుగు చూస్తున్నాయి. కేస్ స్టడీ–2 కనిపిస్తున్న నీటి తొట్టె గాంధారి మండలం దుర్గం గ్రామ పంచాయతీలోనిది. 2009–10 సంవత్సరంలో నిర్మించిన ఈ నీటి తొట్టెకు నీటిని సరఫరా చేసే పైపులైన్ పగిలిపోవడంతో వినియోగం లేక వృథాగా పడి ఉంది. ఈ గ్రామంలో గల పశువులకు తాగునీటి సదుపాయం లేకుండా పోయింది. ఈ ఒక్క గ్రామంలోనే కాదు దాదాపు 70 శాతం గ్రామాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. నీటి సౌకర్యం కల్పించాలి.. జక్రాన్‌పల్లి మండలంలో నిర్మించిన తొట్టెలు నీటి సౌకర్యం లేక నిరూపయోగంగా మారాయి. పశువులకు తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ తొట్టెలకు నీటి సౌకర్యం కల్పించాలి. – భాజన్న, యువ రైతు, జక్రాన్‌పల్లి -
వారంలో జియో ట్యాగింగ్ పూర్తి
డ్వామా పీడీ హరిత నెల్లూరు(అర్బన్): జిల్లాలోని రైతులకు చెందిన అన్ని రకాల వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు/ టెక్నికల్ సిబ్బంది వారం లోపు జియోట్యాగింగ్‌ను పూర్తి చేయాలని డ్వామా పీడీ హరిత అన్నారు. ఈ మేరకు ఆమె శనివారం దర్గామిట్టలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫిల్టర్ పాయింట్లు, బోరు బావులు, ఓపెన్ బావులు, కాలువలపై ఉంచిన మోటార్ల కనెక్షన్లకు సంబంధించి 100 శాతం జియోట్యాగింగ్‌ను వారం లోపు పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో 1,61,376 కనెక్షన్లు ఉన్నాయని, గత రెండు రోజుల్లో 21,800 కనెక్షన్లు జియోట్యాగింగ్ చేశార ని తెలిపారు. దీని వల్ల రైతులు వేసిన పంటల రకాలు, భూవిస్తీర్ణం, మెట్ట, మాగాణి తదితర వివరాలతోపాటు విద్యుత్ ఖర్చు, నీటి వినియోగం, కరువు పరిస్థితులు తెలుసుకోవచ్చన్నారు. రైతులు ఫీల్డ్ అసిస్టెంట్లకు సహకరించాలని కోరారు. సమావేశంలో అడిషనల్ పీడీ ప్రభాకర్ పాల్గొన్నారు. -
నిధులివ్వకపోవడంపై పీడీ అసంతప్తి
మర్రిపాడు : మండలంలో ఇంకుడుగుంతలు నిర్మించుకున్నప్పటికీ లబ్ధిదారులకు నిధులివ్వకపోవడంపై డ్వామా పీడీ హరిత అసంతప్తి వ్యక్తంచేశారు. మండల కేంద్రమైన మర్రిపాడులోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఆమె మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూలీల రిజిష్టర్లను పరిశీలించారు. అనంతరం ఫారంపాండ్స్, ఇంకుడుగుంతలు, వర్మికంపోస్ట్లను రికార్డులన్నింటిని పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇంకుడుగుంతలు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు వెంటనే ఇవ్వాలని, ఆలస్యం చేయొద్దని ఆదేశించారు. ఉపాధిహామీ పథకం పనులు కూడా వేగవంతం చేయాలన్నారు. అధికమంది కూలీలకు పని కల్పించాలని సూచించారు. అనంతరం అనంతసాగరం మండలానికి చెందిన రికార్డులను కూడా పరిశీలించారు. ఆమె వెంట ఏపీడీ మదుల, ఎంపీడీఓ నాసర్‌రెడ్డి, ఏపీఓ లక్ష్మీనరసయ్య, పలువురు అధికారులు, ఎన్ఆర్జీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
మేళ్లచెరువులో డ్వామా పీడీ..
మేళ్లచెర్వు: మండలంలోని బుగ్గమాధవరం,వజినేపల్లి పుష్కర ఘాట్లను శనివారం పుష్కరఘాట్లను డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, సూర్యాపేట ఆర్డీఓ నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఘాట్ల వద్ద పనుల తీరు, ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. వారి వెంట తహసీల్దార్ శ్రీదేవి, ఆర్ఐ వీరయ్య, ఐబీ ఈఈ సంజీవరెడ్డి, డీఈ స్వామి ఉన్నారు. -
ప్రజలు భాగస్వాములు కావాలి
నారాయణపేట రూరల్ : హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నారాయణపేటకు వచ్చిన ఆయన మండలంలోని అంత్వార్ గ్రామ స్టేజీ దగ్గర మొక్కలునాటి నీళ్లు పోశారు. ప్రభుత్వం గ్రామాలను పచ్చగా మార్చడానికి ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం చేపడుతోందని, ప్రజల సహకారం ఉంటేనే లక్ష్యం నెరవేరుతుందన్నారు. అధికారులకు ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేయాలని, నాటిన మొక్కలకు కంచెలు ఏర్పాటు చేసి నీళ్ళుపోస్తూ కాపాడలన్నారు. రైతుల పొలాల గట్లపై నాటిన మొక్కలను పర్యవేక్షిస్తూ వారికి రావాల్సిన డబ్బులను సకాలంలో అందించాలన్నారు. అనంతరం ఈజీఎస్ ద్వారా నాటిన మొక్కల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పీడీ వెంట ఏపీఓ జయమ్మ, ఫీల్డ్అసిస్టెంట్ రేణుక, మాజీ సర్పంచ్ పాకాల వెంకటయ్య, టీఏలు గోపాల్, బాలరాజు, ఈసీ రంజిత్ ఉన్నారు. -
పుష్కర పనులౖపై సమీక్ష
మేళ్లచెర్వు : పుష్కరాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మండల పుష్కరఘాట్ల ప్రత్యేక అధికారి డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, సూర్యాపేట ఆర్డీఓ నారాయణరెడ్డి కోరారు. మండల కేంద్రంలో జరుగుతున్న పుష్కర పనులను శనివారం వారు సమీక్షించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఆయా గ్రామాల్లోని ప్రజలందరూ సహకరించాలని కోరారు. మండలంలోని మూడు ఘాట్లలో 33 మంది అధికారులను,1000 మంది పోలీసులను నియమిస్తున్నట్లు తెలిపారు. పార్కింగ్ విషయంలో, వన్‌వే రూట్లను దష్టిలో పెట్టుకొని భక్తులు ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం వారు పుఫ్కరఘాట్ల పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ భూక్యా ఝమాచోక్లానాయక్, జెడ్పీటీసీ వెంకటలక్ష్మీ, తహసీల్దార్ శ్రీధేవి,ఆర్ఐ వీరయ్య, సర్పంచ్‌లు కొట్టె సైదేశ్వర్రావు, రుక్కయ్య యాదవ్, బిక్రి, ఎంపీటీసీలు, ఎస్ఐలు రవికుమార్, రాము, విజయ్‌ప్రకాశ్,వీఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి కూలీల జీవనోపాధికి కుట్టుశిక్షణ
డ్వామా పీడీ హరిత బాలాయపల్లి : ఉపాధి హామీ పథకం కింద జిల్లాలోని 20,800 మంది కూలీలకు కుట్టు శిక్షణ ద్వారా జీవనోపాధి కల్పిస్తున్నామని డ్వామా పీడీ హరిత అన్నారు. బుధవారం మండలంలోని స్త్రీశక్తి భవనంలో కుట్టు శిక్షణ పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఆమెlమాట్లాడుతూ చిల్లకూరు, వింజమూరు, బాలాయపల్లి మండలాల్లో మహిళలకు శిక్షణ ఇస్తున్నామన్నారు. త్వరలో పురుషులకు సిమెంట్ వరలు రూపొందించడం, ఎయిర్‌కండీషన్, కంప్యూటర్ (హార్డ్‌వేర్), సెల్ఫోన్లు రీపేర్, మోటార్ రివైండింగ్ అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఏపీడీ శంకర్, గ్రామ సర్పంచ్ మస్తాన్‌నాయుడు, ఎంసీఎ వెంకయ్య, సీఆర్పీ చిరంజీవిపాల్గొ న్నారు. ఎంపీyీ ఓ, ఏపీఓపై ఆగ్రహం సమయపాలన పాటించడం అలవాటు లేదా? పీడీ ఎంపీడీఓ, ఏపీఓపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. 11.30 గంటలవుతున్నా కార్యాలయానికి రాకుండా ఎక్కడికెళ్లారు? మీరు ప్రభుత్వ ఉద్యోగులా? లేక ప్రైవేటు ఉద్యోగులా అని మండిపడ్డారు. ఉపాధి ఏపీఓ ఎందుకు రాలేదు. శాశ్వతంగా ఇంటి దగ్గర ఉండమని చెప్పండి అంటూ అసహనం వ్యక్తంచేశారు. ఏపీఓకు షోకాజ్ నోటీసు ఇస్తున్నట్లు చెప్పారు. -
హైవే వెంట మొక్కల పరిశీలన
చౌటుప్పల్ : రెండో విడత హరితహారంలో కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండల పరిధిలో నాటిన మొక్కలను ఆదివారం ఇన్చార్జి కలెక్టర్ సత్యనారాయణ డ్వామా పీడీ దామోదర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. కొయ్యలగూడెం వద్ద ఆగి మొక్కలను పరిశీలించి వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవాటిని నాటాలని డ్వామా పీడీకి సూచించారు. అనంతరం ఇన్చార్జి కలెక్టర్ తిరిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి మల్కాపురం వరకు మొక్కలను పరిశీలించారు. మొక్కల రక్షణకు రాతి కడీలు పాతి, ఇనుప తీగలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందుకు గాను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామన్నారు. హైవే వెంట నాటిన మొక్కలను చౌటుప్పల్ మండల పరిధిలో హెచ్ఎండీఏ, మిగతా హైవే పరిధిలో అటవీ శాఖ పర్యవేక్షిస్తుందన్నారు. మొక్కలకు నెంబర్లను ఏర్పాటు చేసి, డీయోట్యాపింగ్‌తో అనుసంధానం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తద్వారా మొక్కల ఎదుగుదలను ఆన్లైన్లో చూసుకోవచ్చన్నారు. -
ఉపాధిహామీ సిబ్బందిపై డ్వామా పీడీ ఆగ్రహం
దుగ్గొండి : ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇంకుడు గుంతలు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో అలసత్వం ప్రదర్శించిన సిబ్బందిపై డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గుంతలు సరే..బిల్లులేవి’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. గ్రామాలవారీగా గుంతల వివరాలు.. బిల్లుల చెల్లింపులు తెలపాలంటూ మండల అధికారులకు ఆయన ఆదేశించారు. దీనిపై ఎంపీడీఓ వెంకటేశ్వర్రావు మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై గ్రామాలవారిగా పనులపై వివరాలు సేకరించారు. రెండు రోజుల్లోగా గుంతలు తీసిన వారందరి బిల్లులు సిద్ధం చేసి, ఎంబీ రికార్డుతో పాటు ఆన్లైన్ ప్రక్రియ పూర్తిచేయాలని పీడీ ఆదేశించినట్లు ఎంపీడీఓ తెలిపారు. -
అర్హులందరికీ ఉపాధి పనులు కల్పించాలి
కావలిఅర్బన్: అర్హులైన వారందరికీ జాతీయగ్రామీణ ఉపాధిహామీ పథకంలో జాబ్‌కార్డులు ఇచ్చి పనులు కల్పించాలని డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ హరిత ఆదేశించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం కావలి, బోగోలు, అల్లూరు, దగదర్తి మండలాల ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు, సిబ్బంతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అన్ని మండలాల అభివద్ధి పనులపై ఆరా తీశారు. పనుల్లో జాప్యం జరిగిన ప్రాంతాల అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి పంచాయతీకి కేటాయించిన వారందరి చేత జాబ్‌కార్డులకు దరఖాస్తులు చేయించాలన్నారు. కార్డులు తప్పకుండా ఇవ్వాలన్నారు. గ్రామ ప్రజలతో కలసి అభివద్ధికి అవసరమైన పనులను గుర్తించాలన్నారు. ఈ పథకంలో రైతులకు ఉపయోగపడే పనులను చేపట్టాలన్నారు. అదేవిధంగా నిర్ధేశించిన లక్ష్యాలను తప్పకుండా పూర్తి చేయాలన్నారు. పనులు జరిగే ప్రాంతాల్లో కూలీలకు అవసరమైన సదుపాయాలు తప్పకుండా కల్పించాలన్నారు. ఎంపీడీఓలు, ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు ఎప్పటికప్పడు పనులను పర్యవేక్షిస్తూ కూలీలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కావలి క్లస్టర్ ఏపీడీ వెంకట్రావు, కావలి ఎంపీడీఓ ఎల్.జ్యోతి, అల్లూరు ఎంపీడీఓ కనకదుర్గా భవాని, బోగోలు, దగదర్తి ఎంపీడీఓలతో పాటు, ఏపీఓలు శ్యామల, శ్రీనివాసులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్, జూనియర్ మేట్లు, పాల్గొన్నారు. -
‘ఉపాధి’లో జిల్లాను అగ్రగామిగా చేస్తాం
– ఎన్టీఆర్ జలసిరి, పంటసంజీవని అమలులో ప్రథమ స్థానం – సాక్షి ఇంటర్వ్యూలో జిల్లా నీటియాజమాన్య సంస్థ పీడీ కె. రమేష్ కడప కార్పొరేషన్: జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో జిల్లాను అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కె. రమేష్ తెలిపారు. డ్వామా పీడీగా ఏప్రిల్‌లో బాధ్యతలు స్వీకరించిన ఆయన ఉపాధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. పంట సంజీవని, ఎన్టీఆర్ జలసిరి పథకాల అమలులో జిల్లాను ప్రథమ స్థానంలోకి తీసుకొచ్చిన ఆయన ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు . ప్రశ్న: గత ఏడాది పథకం అమలులో జిల్లాకు జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది కదా, ఈ ఏడాది దాన్ని ఎలా రీచ్ కావాలనుకొంటున్నారు? జవాబు: ఈ విషయంలో కొంత ఒత్తిడి ఉందిగానీ, అది సమష్టి కృషి వల్లే సాధ్యమైందని నేను భావిస్తున్నాను. ఉపాధి హామీ పథకాన్ని విస్తృత పరిచేందుకు జిల్లాలో అనేక వనరులు, అందుకు తగిన సిబ్బంది ఉన్నారు. అన్నింటినీ సద్వినియోగం చేసుకొని ముందుకు పోతాం. ప్రశ్న: జాబ్ కార్డులకు ఆధార్ లింకేజీ కార్యక్రమం ఎంత వరకు వచ్చింది? జవాబు: జాబ్‌కార్డులకు ఆధార్ లింకేజీ 83 శాతం పూర్తయింది. వంద శాతం ఆధార్ సీడింగ్ చేయుటకు ప్రయత్నిస్తున్నాము. ప్రశ్న: ఈ ఏడాది ఇప్పటివరకూ ఎంతమందికి వందరోజులు పనికల్పించారు. దీనివల్ల ఎన్ని కుటుంబాలు లబ్ధిపొందాయి? జవాబు: ఈ మూడు నెలల కాలంలో 6149 మందికి వందరోజులు పనికల్పించాము. ఒక్కో కుటుంబానికి సగటున 60.99 పనిదినాలు కల్పించాము. ప్రశ్న: ఉపాధి హామీ పథకం కింద ఎన్ని ఎకరాల్లో పండ్లతోటలు పెంచుతున్నారు, ఎంత ఖర్చు చేశారు? జవాబు: 45వేల ఎకరాల్లో పండ్ల తోటలు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటివరకూ 25వేల ఎకరాల్లో పండ్ల తోటలు పెంచడానికి అనుమతులు ఇచ్చాము. 16,794 ఎకరాల్లో పండ్లతోటలు పనులు జరుగుతున్నాయి. 1170 ఎకరాల్లో పూర్తయింది. ప్రశ్న: పంట సంజీవని పథకం కింద ఎన్ని సేద్యపు నీటి కుంటలు తవ్వుతున్నారు? జవాబు: జిల్లాలో 40వేల సేద్యపు నీటి కుంటలు తవ్వాలని టార్గెట్ ఇచ్చారు. అయితే లక్ష్యానికి మించి 66845 సేద్యపు నీటి కుంటల తవ్వకానికి అనుమతులు ఇచ్చాము. 1735 కుంటలు వివిధ దశల్లో ఉండగా, 9వేల కుంటలు పూర్తయ్యాయి. ప్రశ్న: చంద్రన్న బాట ద్వారా ఎన్ని కిలోమీటర్లు సీసీరోడ్లు నిర్మిస్తున్నారు? జవాబు: చంద్రన్నబాట పథకం ద్వారా జిల్లాలో 244 కిలోమీటర్లు సిమెంటు రోడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించగా, 177 కిలోమీటర్ల మేర పనులు మంజూరు చేశాము. 169 కిలోమీటర్ల మేరకు సీసీ రోడ్లు పూర్తయ్యాయి. ప్రశ్న: ఈ ఏడాది ఉపాధి హామీ పథకం అమలుకు ఎంత బడ్జెట్ కేటాయించారు? జవాబు: జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలు ద్వారా కూలీలకు 97లక్షల పనిదినాలు కల్పించడానికి రూ.345కోట్లు బడ్జెట్ కేటాయించారు. ఇందులో 40 శాతం అనగా రూ.110 కోట్లుమెటీరియల్ కాస్ట్ ఉంటుంది. ఈ నిధులను సీసీరోడ్లు, మొక్కల పెంపకం, డబ్లు్యబీఎం రోడ్లు, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం వినియోగిస్తున్నాము.. ప్రశ్న: ఎన్టీఆర్ జలసిరి కార్యక్రమం ఎలా సాగుతోంది? జవాబు: ఎన్టీఆర్ జలసిరి పథకం ద్వారా రైతుల పొలాల్లో బోర్లు వేసి, కరెంటు ఇచ్చి, మోటర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం కింద 285 టార్గెట్ ఇవ్వగా 284 మంజూరు చేయడం జరిగింది. ఈ పథకం అమలులో కూడా మనమే మొదటి స్థానంలో ఉన్నాము. ప్రశ్న: చివరగా సోషల్ ఆడిట్లో రికవరీలు ఎలా ఉన్నాయి. సిబ్బంది సహకారం ఎంత? జవాబు: ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు సిబ్బంది పనిచేస్తే అభినందిస్తాం, లేదంటే ఒకట్రెండు ఛాన్సులచ్చి చర్యలు తీసుకుంటాము. సోషల్ ఆడిట్లో రికవరీలు బాగానే ఉన్నాయి. -
ఉపాధి సిబ్బందిపై డ్వామా పీడీ ఆగ్రహం
హరితహారంలో మొక్కలు నాటిన వాటిపై కాకిలెక్కలు చ్పెప్దొదని హెచ్చరిక తాండూరు రూరల్: తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడంపై కాకిలెక్కలు చెప్పవద్దని ఉపాధి సిబ్బందిపై డ్వామా పీడీ హరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలోని ఠాగూర్‌హాల్లో ఎంపీడీఓ జగన్మోహన్రావు ఆధ్వర్యంలో ఉపాధి హామీ సిబ్బందితో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమాన్ని నీరుగారిస్తే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా ఎన్ని మొక్కలు నాటారో వివరాలు వెల్లడించాలని ఫీల్డ్ అసిస్టెంట్లను కోరారు. తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఆమె ఫీల్డ్ అసిస్టెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హరితహారం కార్యక్రమం అంటే మీకు తమాషాగా ఉందా..? అని హెచ్చరించారు. నెలరోజుల నుంచి కార్యక్రమంపై చెబుతూనే ఉన్నా.. మీ పద్ధతి మార్చుకోవడం లేదన్నారు. గ్రామాల్లో ఎన్ని గుంతలు తవ్వారు? ఎన్ని మొక్కలు నాటారు..? అనే విషయాలపై సమగ్రంగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం మండలం మొత్తంపై నివేదిక ఇవ్వాలని ఏపీఓ శారదను కోరారు. ఆమె కూడా తప్పుడు నివేదిక ఇవ్వడంతో స్టోరీలు చెప్పొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నీ తప్పుడు లెక్కలే చెబుతున్నారని ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లపై అసహనం వ్యక్తం చేశారు. ఉపాధి పనులను విస్మరిస్తే ఊరుకునేది లేదు బషీరాబాద్: గ్రామాల్లో ఉపాధి కూలీలకు ఉపాధి కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని డ్వామా పీడీ హరిత ఉపాధి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి అధికారులు, సిబ్బందితో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీల వారీగా హరితహారం కార్యక్రమంపై సిబ్బందితో సమీక్షించారు. హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడంపట్ల చిత్తశుద్ధితో పనిచేయడం లేదని ఉపాధి సిబ్బందిపై మండిపడ్డారు. పాఠశాలల్లో ఇప్పటివరకు ఎన్ని మొక్కలు నాటారని అడిగి తెలుసుకున్నారు. వన నర్సరీల్లో నుంచి తరలించిన మొక్కలను నాటారా? లేదా? అనే విషయమై విచారణ జరుగుతుందన్నారు. హరితహారం మొక్కలు నాటినట్లు తప్పుడు నివేదికలు సమర్పిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. నాటిన మొక్కలను పరిరక్షించేలా అధికారులు, సిబ్బంది చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కరుణ, ఎంపీడీఓ ప్రమీల, ఏపీఓ జనార్ధన్, అటవీశాఖ బీట్ అధికారి జర్నప్ప, ఏపీఎం చినశేఖర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
పీడీని బురిడీ కొట్టించే యత్నం!
* కౌన్సిలర్‌గా వేరే వ్యక్తి పరిచయం * విలేకరుల రాకతో బట్టబయలు ఇచ్ఛాపురం రూరల్ : తనపై వచ్చిన ఆరోపణలను కప్పి పుచ్చుకునేందుకు కౌన్సిలర్ స్థానంలో వేరే వ్యక్తిని కౌన్సిలర్‌గా పరిచయం చేసి డ్వామా పీడీనే బురిడి కొట్టించే యత్నంలో ఓ కంప్యూటర్ ఆపరేటర్ అడ్డంగా దొరికిపోయూడు. వివరాల్లోకి వెళ్తే...ఇక్కడి సివిల్ సప్లై కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న గుజ్జు హేమసుందరరావు రేషన్ కార్డుల మంజూరు, ఆధార్ కార్డుల అనుసంధానంలో పలు అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఏఎస్‌పేటకు చెందిన ఎస్.చిన్నారావు యూదవ్ జిల్లా అధికారులు ఇటీవల ఫిర్యాదు చేశాడు. దీనిపై డ్వామా పీడీ రోణంకి కూర్మనాథ్ విచారించేందుకు తహశీల్దార్ కార్యాలయూనికి శుక్రవారం వచ్చి విచారణ చేపట్టారు. ఈ సమయంలో ఫిర్యాదుదారు చిన్నారావు అసలు ఉన్నదీ లేనిదీ స్థానిక కౌన్సిలర్‌ను తీసుకురావాల్సిందిగా కంప్యూటర్ ఆపరేటర్ హేమసుందర్‌ను పీడీ ఆదేశించారు. కొన్ని నిమిషాల తరువాత మూడో వార్డు కౌన్సిలర్ సాలిన ఢిల్లీ పేరున ఏఎస్‌పేటకు చెందిన పత్రి తవిటయ్య అనే వ్యక్తిని తీసుకువచ్చి ఇతనే కౌన్సిలర్‌గా పరిచయడం చేశాడు. దీంతో పీడీ ఆయన నుంచి ఫిర్యాదుదారుడు చిన్నారావుకు సంబంధించిన విషయూలపై ఆరా తీశారు. చిన్నారావు అనే వ్యక్తి నిరక్షరాస్యుడని, ఫిర్యాదులో ఇంగ్లిష్‌లో సంతకం చేయడం వల్ల ఫిర్యాదు బోగస్‌గా పీడీ తేల్చారు. ఇంతలోనే స్థానిక విలేకరులు రంగ ప్రవేశం చేయడంతో అసలు విషయం బయటపడింది. హేమసుందరరావు తెచ్చిన వ్యక్తి కౌన్సిలర్ కాదని, పరారుు వ్యక్తని చెప్పడంతో పీడీ కూర్మనాధ్ అవాక్కయ్యూరు. దీంతో పీడీ సీరియస్ అయ్యూరు. దీనిపై పూర్తి వివరాలను కలెక్టర్‌కు నివేదిస్తానని విలేకరులకు తెలిపారు. పాయితారి ఫీల్డఅసిస్టెంట్ సస్పెన్షన్ ఇటీవల ఉపాధి పనుల్లో కూలీల మస్టర్లలో అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు పాయితారి ఫీల్డ్ అసిస్టెంట్ రూపాను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఎంపీడీవోకు ఆదేశాలు జారీ చేసినట్టు ఎంపిడి కు పీడీ కూర్మనాథ్ తెలిపారు. -
‘మూడింది!
► ‘ఉపాధి’ కల్పనలో దిగజారిన ‘అనంత’ స్థానం ► తొలి నుంచి అగ్రస్థానంలో కొనసాగిన జిల్లా ► చివరి నిమిషంలో విశాఖ, విజయనగరం ముందంజ ► మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి కూలీలకు ‘ఉపాధి’ కల్పనలో ‘అనంత’ స్థానం దిగజారిపోయింది. తొలి నుంచి రాష్ట్రంలో అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చిన జిల్లా..ఈసారి మాత్రం మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) అధికారులు చివరి నిమిషంలో చేతులెత్తేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మొదట్నుంచీ అల్లంత దూరంలో ఉన్న విశాఖపట్నం ఇప్పుడు నెంబర్‌వన్ అయ్యింది. విజయనగరం రెండోస్థానాన్ని దక్కించుకుంది. అనంతపురం సెంట్రల్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పనుల కల్పనలో జిల్లా అధికారులు వెనుకబడిపోయారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా 93,611 కుటుంబాలకు మాత్రమే వందరోజుల పని కల్పించారు. ఇందుకోసం రూ.556 కోట్లు ఖర్చు చేశారు. పనులు పొందిన కుటుంబాల సంఖ్య తక్కువగా ఉండటంతో రాష్ట్రంలో ‘అనంత’ మూడోస్థానానికి పడిపోయింది. ఈ పథకం అమలుకు సంబంధించి ర్యాంకుల కేటాయింపునకు 100 రోజుల పని పొందిన కుటుంబాలను ప్రామాణికంగా తీసుకుంటారు. విశాఖపట్నం జిల్లాలో రూ.475 కోట్లు ఖర్చు చేసి 1,05,512 కుటుంబాలకు, విజయనగరం జిల్లాలో రూ.482 కోట్లు ఖర్చు చేసి 99,460 కుటుంబాలకు వంద రోజుల పని కల్పించారు. దీంతో అవి మొదటి, ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఈ రెండు జిల్లాలు నెల క్రితం మన జిల్లా కంటే పది వేల కుటుంబాలు వెనుకబడి ఉన్నాయి. అయితే.. చివరి నిమిషంలో ఎక్కువ మంది కూలీలు పనుల్లోకి వచ్చేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. నిధులు ఖర్చు చేయడంలో మాత్రం అనంతపురం జిల్లానే అగ్రస్థానంలో నిలవడం ఊరట కల్గించే అంశం. చేజేతులా.. జిల్లాస్థానం పడిపోవడానికి అధికారులు తీసుకున్న నిర్ణయాలు, వారి నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. మార్చి 26 నాటికి జిల్లాలో వంద రోజులు పూర్తి చేసుకోవడానికి మూడు రోజులు తక్కువ ఉన్న కుటుంబాలు 20వేల పైచిలుకు ఉన్నాయి. వీటిని ఆ మూడు రోజులు పనిలో పాల్గొనేలా చర్యలు తీసుకొని ఉంటే అగ్రస్థానానికి ఢోకా ఉండేది కాదు. ఈ విషయంలో అధికారులు విఫలమయ్యారు. ఉపాధిహామీ చట్టం ప్రకారం కూలీలు అడిగిన పని కల్పించాలి. జిల్లాలో మాత్రం ఫారంపాండ్లు చేపట్టాలని అధికారులు చెబుతున్నారు. కష్టతరమైన ఈ పనికి కూలీలు రావడం లేదు. ఎక్కువశాతం ఎర్రనేలలు ఉండటంతో మట్టిని తవ్వలేక ఇబ్బంది పడుతున్నారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో కూలీలు అడిగిన పని మంజూరు చేస్తున్నారు. దీనివల్ల అవి ర్యాంకింగ్‌ను మెరుగుపరచుకున్నాయి. ► జిల్లాలో జాబ్‌కార్డు పొందిన కుటుంబాలు : 7.87 లక్షలు ► పనులకు సక్రమంగా హాజరవుతున్న కూలీలు : 4.27 లక్షలు ► వందరోజుల పని కల్పించిన కుటుంబాలు : 93,611 ► కూలీలపై ఖర్చు : రూ. 226 కోట్లు ► మొత్తం ఖర్చు : రూ. 556 కోట్లు -
నల్లగొండలో కవుల సమ్మేళనం
నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్లగొండ పట్టణం కేంద్రంలో కవుల సమ్మేళనం నిర్వహించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో డ్వామా (జిల్లా నీటి యాజమాన్య సంస్థ) పీడీ (ప్రాజెక్ట్ డైరక్టర్) దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు. కవి సమ్మేళనంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు కవులను ఆయన సన్మానించారు. అంతేకాకుండా ఎన్టీ కాలేజీ అవరణలో తెలంగాణ యూత్ ఫెస్టివల్ ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. -
మంత్రి రావెలకు ‘హౌసింగ్’ సెగ
డ్వామా కార్యాలయం ఎదుట వర్క్ ఇన్స్పెక్టర్ల ధర్నా అనంతపురం సెంట్రల్ : ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తామంతా రోడ్డున పడ్డామని, వెంటనే తమను విధుల్లోకి తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ అవుట్సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం డ్వామాహాలులో మంత్రి రావెల కిశోర్‌బాబు ఎస్సీ,ఎస్టీ, గిరిజన సంక్షేమశాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో హౌసింగ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సమావేశాన్ని అర్ధంతరంగా ముగించిన మంత్రి వెంటనే కిందకు దిగివచ్చారు. ఆందోళనకారులతో మంత్రి మాట్లాడారు. వర్క్ ఇన్స్పెక్టర్లు మంత్రికి తమ గోడు వినిపించారు. 9 సంవత్సరాలుగా 93 మంది వర్క్ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్నామన్నారు. దీర్ఘకాలికంగా నుంచి పనిచేస్తుడడంతో కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగ వయో నియామక పరిమితి కూడా దాటిపోయిందన్నారు. ఈ సమయంలో అర్ధంతరంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తే తమ జీవితా లు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతో తమను ఉద్యోగాల్లో కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. దీని పై మంత్రి స్పంది స్తూ గృహనిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళినితో చర్చించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమం లో సీఐటియూ జిల్లా అధ్యక్షులు ఇంతి యాజ్, జిల్లా కార్యదర్శి నాగేంద్రకుమా ర్, అవాజ్ నాయకులు ముస్కిన్, సీఐటి యూ నాయకురాలు నాగవేణి, అవుట్ సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
బహిరంగం వద్దు!
మరుగుదొడ్డితో ఆరోగ్యకరమైన జీవనం బహిరంగ మల విసర్జనను విడనాడండి టాయిలెట్ల నిర్మాణానికి ప్రభుత్వ తరఫున ఆర్థిక సాయం ఒకప్పుడు పచ్చిగాలితో సేద తీర్చే పల్లెపట్టులు ఇప్పుడు దుర్గంధభూయిష్టంగా మారాయి. రోడ్లే బహిర్భూములుగా మారిపోయాయి. ముక్కుమూసుకోనిదే గ్రామాల్లోకి వెళ్లడం దుర్లభం. మహిళల ఇబ్బందులు వర్ణానాతీతం. సిగ్గు విడిచి...చేసేది లేక చెట్లు,పుట్టల మాటుకు వెళ్లవలసి వస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ బహిరంగ మలవిసర్జన జరుగుతోంది. దీన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. ఇదే విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు డ్వామా పీడీ ప్రశాంతి. పూసపాటిరేగ మండలం కుమిలి గ్రామంలోని పలు వీధుల్లో పర్యటించిన ఆమె గ్రామస్తులతో మాట్లాడారు. ఆ సంభాషణ ఇలా సాగింది... పీడీ : నీ పేరేంటమ్మ..? మహిళ: నా పేరు లక్ష్మి. పీడీ: మరుగుదొడ్డి లేకుండా ఇన్ని సంవత్సరాలు ఉన్నారా..? లక్ష్మి: లేదమ్మ కట్టుకుంటున్నాం. ఇటీవలే అందుకు అవసరమయ్యే గుంతను తవ్వించాం. పీడీ: ఎన్ని రోజుల్లో మరుగుదొడ్డి నిర్మాణ పనులు పూర్తి చేస్తారు ? లక్ష్మి : 15 రోజుల్లో పూర్తవుతుందమ్మ. పీడీ : ఆ తరువాత మరుగుదొడ్డిని వినియోగిస్తారా ? బయటకు వెళతారా ? లక్ష్మి: లేదమ్మ మరుగుదొడ్డినే వాడుతాం. ఆడ వాళ్లు బయటకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నాం. వర్షాకాలం వస్తే మరింత నరకం. అందుకేనమ్మ కొత్తగా కట్టుకుంటున్నాం. పీడీ : బహిరంగ మలవిసర్జన వల్ల వ్యాధులు ప్రబలడమేకాకుండా ఊరు కూడా అపరిశుభ్రంగా ఉంటుంది. అందుకే ప్రభుత్వం తరఫున పోత్సాహకం అందిస్తున్నాం. తెలుసా..? లక్ష్మి : తెలిసిందమ్మా, ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోనే దీనిని నిర్మిస్తున్నాం. రూ.15 వేలు చాలదు కాబట్టి మా ఇంట్లో డబ్బులతో కట్టుకుంటున్నాం. పీడీ : ఎందుకు చాలదు ? అందుకు తగిన కొలతలు ఇంజినీరింగ్ అధికారులు ఇవ్వలేదా ? లక్ష్మి : ఇచ్చారమ్మ. అయితే మా కుటుంబం పెద్దది. చాలదని మా సొంత డబ్బులు కలిపి పెద్దది కట్టుకుంటున్నాం. పీడీ : నీ పేరంటమ్మ ..? మీ ఇంట్లో ఎందమంది ఉంటున్నారు.... మరుగుదొడ్డి ఉందా..? మహిళ : నాపేరు ఎర్రా.లీలావతి. నేనూ, నా భర్త ఉంటున్నాం. ఇద్దరు ఆడపిళ్లకు పెళ్లిళ్లు అయిపోయాయి. అత్తవారింటికి వెళ్లిపోయారు. నెల రోజుల క్రితమే మరుగుదొడ్డి కట్టుకున్నాం. పీడీ : మరి వాడుతున్నారా..? మరుగుదొడ్డికి నీటి సరఫరా ఉందా..? లీలావతి: ఇంకా వాడలేదు. మామూలుగా బకెట్‌తో నీళ్లు పెట్టుకుని వాడుకోవటమే. పీడీ : కట్టుకున్న తరువాత మరుగుదొడ్డిని వాడలి..? ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి..? లీలావతి: అలాగేనమ్మ . తప్పకుండా వాడుతాం. పీడీ : మీ పేరంటమ్మ ..? మీ ఇంటికి మరుగుదొడ్డి ఉందా..? మహిళ: నా పేరు అనకం వీర్రాజు. ఇటీవలే మరుగుదొడ్డి కట్టుకున్నాం. పీడీ : మరి వాడుతున్నారా..? ముహూర్తం గురించి చూస్తున్నారా...? వీర్రాజు: ఇంకా వాడలేదు. గదికి తలుపులు వేయాల్సి ఉంది. వేసిన తరువాత ఉపయోగిస్తాం. పీడీ: ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే మంచిది కాదు. తప్పని సరిగా వాడాలి..? వీర్రాజు: అలాగేనమ్మ. మరుగుదొడ్డి కట్టినందుకు ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్ ఇంకా రాలేదు. పీడీ : సొమ్ము విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటాం పీడీ : నీపేరంటమ్మ ..? మీ ఇంటికి మరుగుదొడ్డి ఉందా..? మహిళ: నా పేరు వెంకటలక్ష్మి. మా ఇంటికి మరుగుదొడ్డి లేదమ్మ, పీడీ : ఎందుకు కట్టుకోలేదు...? వెంకట లక్ష్మి: స్థలం లేక కట్టుకోలేదమ్మ. పీడీ : కొద్ది పాటి స్థలం ఉన్నా అందులో మరుగుదొడ్డి కట్టుకోవచ్చు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి అవసరం, లేకపోతే అనారోగ్యాల పాలవుతారు.. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్లు ఇబ్బందులు పడతారు. ? వెంకటలక్ష్మి: ఎలా కట్టుకోవాలో తెలియకనే ఊరుకున్నాం.ఎలా కట్టాలో చెబితే కట్టుకుంటాం. పీడీ : మీ గ్రామ సర్పంచ్‌ను గాని, కార్యదర్శినిగాని సంప్రదించండి పీడీ : మీ పేరేంటండి..? పురుషుడు : నా పేరు దల్లి ముత్యాలరెడ్డి. గ్రామ సర్పంచ్‌ను మేడమ్. పీడీ : మీ ఊరిలో మొత్తం ఎన్ని ఇళ్లు ఉన్నాయి..? అందులో ఎంత మందికి మరుగుదొడ్డి సౌకర్యం ఉంది..? సర్పంచ్ : మా గ్రామ పంచాయతీ కుమిలితో పాటు మధుర గ్రామాలుగా మరో మూడు ఉన్నాయి. మొత్తంగా 2,300 వరకు ఇళ్లు ఉన్నాయి. అందులో 200 ఇళ్లకు మాత్రమే మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. మరో 200 ఇళ్ల వరకు కొత్తగా కట్టుకుంటున్నారు. పీడీ : మిగిలిన వారంతా ఎందుకు కట్టుకోవటం లేదు. భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది కదా..? ఎందుకు ప్రజల్లో అవగాహన రావటం లేదు. ? సర్పంచ్: లేదమ్మ. అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. ఇందుకోసం గ్రామంలో ఉన్న అంగన్వాడీ, మహిళా వారు మెంబర్లు, వైద్య ఆరోగ్యశాఖసిబ్బందితో అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. పీడీ: కట్టిస్తాం అని చెప్పటం కాదు... అందరూ కట్టుకునేలా చేస్తారా..? సర్పంచ్ : అందరి ఇళ్లల్లో మరుగుదొడ్డి నిర్మాణాలు జరిగేలా చూస్తా. మూడు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తాం. పీడీ : మరుగుదొడ్డి నిర్మాణాలుచేపట్టిన తరువాత కూడా బహిరంగ మలవిసర్జనకు అలవాటు పడిన వారు వెళుతుంటే ఏం చర్యలు తీసుకుంటారు..? సర్పంచ్: ముందుగా బహిరంగ మలవిసర్జనకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటా. గ్రామానికి సమీపంలో ఉన్న తుప్పలు, డొంకలను శుభ్రం చేస్తాం. అప్పటికీ వెళితే రూ 500 చొప్పున అపరాధ రుసం విధించేందుకు వెనుకాడం. పీడీ: గ్రామాల్లో మరుగుదొడ్లు ఉన్నా అవి మహిళల కోసమే అన్నట్టుగా పురుషులు బహిరంగ మలవిసర్జనకు వెళుతున్నారు. దీనిపై మీ సమాధానం..? సర్పంచ్: ఆడ, మగ, పిల్లలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు మరుగుదొడ్డిని వినియోగించేలా చర్యలు తీసుకుంటాం. త్వరలో స్వచ్ఛ కుమిలిగా మారుస్తాం. పీడీ: ఏమమ్మా.. మీ ఇంట్లో మరుగుదొడ్లు ఉన్నాయా..? మహిళ: నాపేరు జానకి అండి. మేం మరుగుదొడ్డి కట్టుకున్నాం. దానినే వాడుతున్నాం. బయటకు వెళ్లడం లేదు. పీడీ: మరి మీరో..? మహిళ: నా పేరు రాము. మాకు సొంత ఇళ్లు లేదు. కట్టుకోలేదమ్మ. పీడీ : మీ పేరు... ఈ ఊరిలో మీరు ఏం చేస్తుంటారు... కార్యదర్శి : నా పేరు సంతోష్‌కుమార్. నేను కుమిలి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నా. పీడీ : మీ పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. కార్యదర్శి: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించేలా చర్యలు తీసుకుంటాం. పంచాయతీ పరిధిలో మొత్తం 2,300 ఇళ్లు ఉండగా.. అందులో 200 మందికే మరుగుదొడ్లు ఉన్నాయి. పీడీ : మరి మిగిలిన వారి పరిస్థితి..? కార్యదర్శి:ప్రస్తుతం పంచాయతీ పరిధిలో 270 యూనిట్లు మంజూరుకాగా, అందులో 110 వరకు పూర్తయ్యాయి. మిగిలిన వారు బాగానే స్పందిస్తున్నారు. పీడీ : మీపేరు.. ఈ ఊరిలో ఏం చేస్తుంటారు..? ఏఈ: నాపేరు మురళీమోహన్, హౌసింగ్ ఏఈగా పని చేస్తున్నా. పీడీ: గ్రామంలో చాలా వరకు ఇళ్లల్లో పెద్ద పెద్ద ట్యాంక్‌లతో మరుగుదొడ్డి నిర్మాణం చేపడుతున్నారు. అందువల్ల వారికి ఆర్థిక భారం పెరుగుతుంది కాదా... మరి అవగాహన కల్పించలేదా..? ఏఈ: అవగాహన కల్పిస్తున్నాం, అయితే కొంతమందివి పెద్ద కుటుంబాలు కావటంతో పెద్ద ట్యాంక్‌లు కట్టుకుంటున్నారు. ఈవిషయంలో వార్డు మెంబర్లను సమన్వయం చేయటం ద్వారా లక్ష్యాలను చేరుకుంటాం. పీడీ : మీ పేరు.. ? ఎంపీడీఓ : నా పేరు లక్ష్మి, నేను పూసపాటిరేగ మండల ఎంపీడీఓగా పని చేస్తున్నా. పీడీ: మండలంలో మరుగుదొడ్ల నిర్మాణ ప్రగతి ఎలా ఉంది..? ఎంపీడీఓ: మొత్తం 17వేల వరకు ఇళ్లు ఉండగా... అందులో 2000 మందికి ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం యూనిట్ ధరను పెంచటం వల్ల లబ్ధిదారులు ముందుకు వస్తున్నారు. దీనిని మేము ఛాలెంజింగ్‌గా తీసుకుంటున్నాం. పీడీ: ప్రజల్లో ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు..? ఎంపీడీఓ : మండల స్థాయిలో ఉన్న అధికారుల సమన్వయంతో ఆయా శాఖల వారీగా ప్రతి సమావేశంలో అవగాహన కల్పిస్తున్నాం. గ్రామ స్థాయిలో ఉన్న 12 మంది అధికారులకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నాం. పీడీ: ఎక్కువ సంఖ్యలో నిర్మాణాలు జరిగే సమయంలో లబ్ధిదారులకు మెటిరీయల్ సప్లై చేస్తున్నారా..? ఎంపీడీఓ : ఇప్పటి వరకు ఎవరి వారే తెచ్చుకుంటున్నారు. కావాలని అడిగితే ఇంజినీరింగ్ అధికారులతో ఒకే మొత్తంలో తెప్పించే ఏర్పాటు చేస్తాం. బహిరంగ మలవిసర్జనకు స్వస్తి చెప్పాలి : పీడీ ప్రశాంతి బహిరంగ మలవిసర్జనకు స్వస్తి చెప్పాలి. బహిరంగ మల విసర్జన వల్ల ప్రధానంగా మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో రోగాల బారిన పడే అవకాశం ఉంది. అందుకే పతి ఒక్కరు మరుగుదొడ్డి నిర్మించుకుని ఆరోగ్యకరంగా జీవనం సాగించాలి. మరుగుదొడ్డి నిర్మాణం కోసం ప్రభుత్వ పరంగా కొంత మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నాం. ఆరు అడుగుల పొడవు , నాలుగు అడుగుల వెడల్పుతో నిర్మించే మరుగుదొడ్డికి రూ15వేలు, మూడు అడుగులు పొడవు, నాలుగు అడుగుల వెడల్పు కలిగిన మరుగుదొడ్డి రూ12వేలు చొప్పున ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ప్రధానంగా లీచ్పిట్ నమూన తరహా నిర్మాణాలు స్థలం తక్కువగా ఉన్న వారు కట్టుకోవచ్చు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద చేపడుతున్న కార్యక్రమాన్ని అన్ని వర్గాల వారు అర్ధం చేసుకుని విజయవంతం చేయాలి. ఈ గ్రామంలో యూనిట్ మంజూరైన బ్యాంక్ నుంచి నిధులు విడుదల కావడం లేదన్నది ప్రజలు చెబుతున్నారు. ఈవిషయంపై కలెక్టర్ ద్వారా బ్యాంక్ అధికారులను సంప్రదించి బిల్లులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటాం. ప్రతి ఇంట్లో రెండు బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉండటంతో పాటు వాటిని ఆధార్‌సీడింగ్ చేసుకోవటం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలను సద్వినియోగం చేసుకోవచ్చు. -
అభివృద్ధి దిశగా ముందుకు..
కలెక్టర్ వాకాటి కరుణ కలెక్టరేట్లో బాధ్యతల స్వీకరణ హన్మకొండ అర్బన్ : జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో ముందుకు తీసుకువెళ్లేందుకు కృషిచేస్తానని కలెక్టర్ కరుణ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం ఆమె కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు అర్హులైన ప్రజలకు అందేలా తన వంతు పాటుపడతానన్నారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కరుణకు జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఏజేసీ కృష్ణారెడ్డి, డీఆర్వో సురేంద్రకరణ్, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు తదితరులు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌కు డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, డీఎస్ఓ ఉషారాణి, తహసీల్దార్ల సంఘం జిల్లా నాయకులు, డీఆర్డీఏ పీడీ రాము, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. అధికారులను కలెక్టర్ కరుణ పేరుపేరునా పలకరించారు. ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నవంటూ తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆమె తల్లి ప్రమీల. అక్కయ్యలు అప్రాచిత, శిరీష, తమ్ము డు ఛైతన్య ఉన్నారు. కాగా, ఐకేపీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 2015 క్యాలెండర్‌ను కలెక్టర్ కరుణ ఆవిష్కరించారు. నాయకులు అనిల్, రవి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఆర్డీఓలు వెంకటమాధవరావు, మహేందర్‌జీ, వెంకట్‌రెడ్డి , భాస్కర్‌రావు, డీఈఓ చంద్రమోహన్, ఆర్వీఎం అధికారులు, వీఆర్వోల సంక్షేమ సంఘం నాయకులు విజయరామారావు, హేమానాయక్, సింగ్‌లాల్, జంపయ్య, రవీందర్, ట్రెస్సా నాయకులు సత్యనారాయణ, విశ్వనారాయణ, రాజ్‌కుమార్, శ్రీకాంత్ తదతరులు ఉన్నారు. ఇదిలా ఉండగా, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ కలెక్టరేట్లో బాద్యతలు స్వీకరించిన కరుణను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. సీపీఎం నాయకులు నాగయ్య, శ్రీనివాస్, దళిత రత్న బొమ్మల కట్టయ్య, ఎన్జీఓ నాయకులు, అధికారులు కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. కలెక్టర్‌కు జెడ్పీ చైర్పర్సన్ శుభాకాంక్షలు హన్మకొండ : కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వాకాటి కరుణను జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, నర్సింగరావు దంపతులు కలిశారు. కలెక్టరేట్లో ఆదివారం మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. -
తూచ్...
ఈ ప్రభుత్వంలో ఎప్పుడేం జరుగుతుందో... ఎప్పుడు ఎవర్ని మార్చేస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అలా ఉత్తర్వులిచ్చి...ఇలా రద్దు చేసేస్తున్నారు. ఉత్తర్వులకు విలువ లేకుండా తూచ్ అనేస్తున్నారు. వారం రోజుల క్రితం డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్‌గా శ్రీకాకుళం పీడీగా పనిచేస్తున్న కళ్యాణ చక్రవర్తిని నియమించారు. ఇంతలో ఏమైందో తెలియదు గాని ఆ ఉత్తర్వుల్ని రద్దు చేసి ఆ పోస్టులో ప్రస్తుతం గుంటూరులో డీఆర్డీఎ పీడీగా పనిచేస్తున్న ప్రశాంతిని నియమించారు. ఇలా రోజుల వ్యవధిలోనే నియామకాలు మార్చేయడం ప్రస్తుత సర్కార్‌కు కొత్తేమీ కాదు. ఆ మధ్య డీఆర్డీఏ అడిషనల్ పీడీగా పనిచేస్తున్న సుధాకర్‌ను ఇన్చార్జ్ పీడీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతలోనే తెరవెనుక ఒత్తిళ్లు రావడంతో హుటాహుటీన ఆ పోస్టులో అడిషనల్ పీడీగా పనిచేస్తున్న పెద్దిరాజును నియమించారు. అంతకుముందు వివాదాస్పదంగా నిలిచిన పంచాయతీరాజ్ డీఈఈ శ్రీనివాస్‌కు పీఎ టూ ఎస్ఈగా నియమించారు. ఆ ఉత్తర్వులిచ్చిన నాలుగురోజుల్లోనే రద్దు చేస్తూ మరో ఉత్తర్వులిచ్చారు. దీన్నిబట్టి సర్కార్ ఇస్తున్న ఉత్వర్వులకు విలువ ఎంతో అర్థం చేసుకోవచ్చు. చెప్పాలంటే నవ్వులాటగా మారిపోయింది. దంపతులిద్దరికీ కీలక పోస్టింగ్‌లు డీఆర్డీఎ పీడీగా ఢిల్లీరావు నియమితులైన రోజునే ఆయన భార్య ప్రశాంతి కోసం ఏదొక పోస్టు ఖాళీ చేయాల్సిందేనని ‘సాక్షి’ ముందే చెప్పింది. ఇప్పుడదే జరిగింది. ప్రస్తుతం ఢిల్లీరావు దంపతులిద్దరూ గుంటూరు జిల్లాలో పనిచేస్తున్నారు. అక్కడ డ్వామా పీడీగా ఢిల్లీరావు, డీఆర్డీఎ పీడీగా ప్రశాంతి పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో అనూహ్యంగా ఢిల్లీరావు ఇక్కడ డీఆర్డీఏ పీడీగా నియమితులయ్యారు. అదే సందర్భంలో డ్వామా పీడీగా శ్రీకాకుళంలో అదే పోస్టులో పనిచేస్తున్న కళ్యాణ చక్రవర్తి నియమితులయ్యారు. దీంతో స్పౌజ్ కోటాలో జిల్లాకొస్తున్న ప్రశాంతికి ఆ స్థాయి పోస్టు జిల్లాలో కనిపించలేదు. తొలుత ఆర్డీఓగా రావాలని భావించా రు. కానీ ప్రస్తుతం పనిచేస్తున్న వెంకటరావు తన రాజకీయ సన్నిహితుల ద్వారా గట్టిగా ప్రయత్నించి బదిలీని ఆపుకొన్నారు. దీంతో అప్పటికే ఖాళీగా ఉన్న డీఆర్ఓ పోస్టుపై దృష్టి సారించారు. ఇంతలోనే విశాఖపట్నం ఏజేసీగా పనిచేసిన వై.నర్సింహారావు యుద్ధ ప్రాతిపదికన డీఆర్ఓ పోస్టింగ్ వేయించుకున్నారు. ఇక హౌసింగ్ ప్రాజెక్టు డెరైక్టర్ పోస్టు తప్ప మరేది ఖాళీగా లేని పరిస్థితి నెలకొంది. ఒకానొక సందర్భంలో ఆమెను హౌసింగ్ పీడీగా నియమించారన్న ప్రచారం జరిగింది. అంతా అదే భావించారు. కానీ అనూహ్యంగా ప్రశాం తికి డ్వామా పీడీ పోస్టు వరించింది. పైరవీలు, ప్రయత్నాలు ఏ స్థాయిలో ఫలించాయో తెలియదు గాని కళ్యాణ చక్రవర్తికిచ్చిన ఉత్తర్వులను రద్దుచేసి ఆ స్థానంలో ప్రశాంతిని నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. మొత్తానికి భార్యాభర్తలిద్దరికీ కీలక పోస్టులు దక్కినట్టయింది. గుంటూరులో ఢిల్లీరావు డ్వామా పీడీగా పనిచేస్తే ఇక్కడ డీఆర్డీఎ పీడీగా నియమితులు కాగా, ప్రశాంతి అక్కడ డీఆర్డీఎ పీడీగా పనిచేస్తే ఇక్కడ డ్వామా పీడీగా నియమితులయ్యారు. జిల్లా మారడంతో వారిద్దరి పోస్టులు తారుమారైనట్టు అయింది. గతంలో జిల్లాలో పనిచేసినప్పుడు ఢిల్లీరావు విజయనగరం ఆర్డీఓగా పనిచేయగా, ప్రశాంతి పార్వతీపురం ఆర్డీఓగా పనిచేశారు. కొన్నాళ్ల తర్వాత ప్రశాంతి కేఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్, హౌసింగ్ స్పెషలాఫీసర్ పోస్టులో కూడా పనిచేశారు. కొంపముంచిన ఆలస్యం ఈ ప్రభుత్వంలో ఉత్తర్వులకున్న విలువ ఏంటో తెలియక ఇటీవల డ్వామా పీడీగా నియమితులైన కళ్యాణ చక్రవర్తికి అనూహ్య షాక్ తగిలింది. ఉత్తర్వులిచ్చిన వెంటనే జాయిన్ అవ్వకపోవడంతో కొంపమునిగినట్టయింది. ఎప్పుడెలా ఉంటుందో తెలియకే ఇలా చేసి ఉంటారన్న వాదనలు వినిపించాయి. బదిలీ ఉత్తర్వులు వచ్చి వారం రోజులైనా చేరకపోవడంతో ఇదే అవకాశంగా తీసుకుని ప్రశాంతిని అదే పోస్టులో నియమించారని అధికారులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో జెడ్పీ సీఈఓగా నియమితులైన గనియా రాజకుమారి, డీఆర్ఓగా నియమితులైన వై.నర్సింహారావు ముందు జాగ్రత్త పడ్డారని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు జెడ్పీ సీఈఓగా పనిచేసిన మోహనరావు ప్రయత్నాలు ముమ్మురం చేసి, మళ్లీ రిటెన్షన్ ఉత్తర్వులు తెచ్చుకుంటారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హుటాహుటీన వచ్చి గనియా రాజకుమారి ఇక్కడి బాధ్యతల్ని స్వీకరించారు. ఆమె ఏ మాత్రం ఆలస్యం చేసినా మోహనరావుకు రిటైన్షన్ వచ్చేదని, తిరిగి సీఈఓగా కొనసాగేవారని జెడ్పీలో ఇప్పటికీ చర్చ సాగుతోంది. డీఆర్ఓ వై.నర్సింహరావు విషయంలో కూడా అదే జరిగింది. వాస్తవానికి నర్సింహరావు అంతకుముందు విశాఖ అడిషనల్ జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. అదే పోస్టులో కొనసాగేందుకు రిటెన్షన్ వస్తుందని ఆశించారు. ఆ దృష్ట్యా మరో పోస్టు కోసం ప్రయత్నించలేదు. కానీ అకస్మాత్తుగా ఆయన కొనసాగుతున్న ఏజేసీ పోస్టులో వేరొకర్ని నియమించేశారు. దీంతో ఆయనకు పోస్టు లేని పరిస్థితి నెలకొంది. తీవ్రంగా ప్రయత్నించి అప్పటికే జిల్లాలో ఖాళీగా ఉన్న డీఆర్ఓ పోస్టింగ్‌ను వేయించుకున్నారు. ఆ ఉత్తర్వుల్ని రద్దు చేసి ఇంకొకరు వేయించుకుంటారేమోనన్న భయంతో బదిలీ ఉత్తర్వు వచ్చిన మరుసటి రోజునే విధుల్లో చేరిపోయారు. లేదంటే ఆ పోస్టులో ప్రశాంతి నియమతులయ్యే వారనే ప్రచారం జరిగిం ది. -
డ్వామా బరితెగింపు
సాక్షి ప్రతినిధి, అనంతపురం : అక్రమార్కులను వెనకేసుకు రావడంలో డ్వామా అధికారులు బరితెగించారు. అక్రమాలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్ల పట్ల నిస్సంకోచంగా ‘రాజును మించిన రాజ భక్తి’ చాటుకుంటున్నారు. అసలు వీరు ప్రభుత్వ అధికారులా.. లేక ఆ రూపంలో ఉన్న కాంట్రాక్టర్లా అనిపించేలా వ్యవహరిస్తున్నారు. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్న చందంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థలో చిరుధాన్యాల మినీ కిట్స్ పంపిణీ తయారైంది. శనివారం నగరంలో నకిలీ విత్తనాల ప్యాకింగ్ స్థావరంపై పోలీసులు, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా జరిపిన దాడుల్లో కళ్లకు కట్టినట్లు అక్రమాలు బయటపడ్డా... సదరు కాంట్రాక్టరుపై ఈగ కూడా వాలకుండా డ్వామా ఏపీడీ పోలీసుల వద్ద కూడా వాంగ్మూలం ఇచ్చారంటే అక్రమార్కులు, అధికారుల మధ్య బంధం ఎంత గట్టిగా పెనవేసుకు పోయిందో అర్థమవుతోంది. ‘డ్వామా’లో విత్తనాల సరఫరాను పర్యవేక్షించే ఏపీడీ నాగభూషణం కాంట్రాక్టరును వెనకేసుకొస్తున్న వైనం చూసి సంస్థలో సిబ్బందే ఆశ్చర్యపోతున్నారు. శనివారం నగరంలో అక్రమ విత్తనాల ప్యాకింగ్ స్థావరంపై పోలీసులు, వ్యవసాయ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ స్థావరంలో ‘డ్వామా’ పేరుతో ప్లాస్టిక్ కవర్లు ఉండటంతో డ్వామా అధికారులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. అక్రమ విత్తనాల ప్యాకింగ్ స్థావరం యజమాని, కంట్రాక్టరు అయిన శ్రీధర్ రెడ్డికి కూడా పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే కాంట్రాక్టరు మాత్రం ఆ ఛాయలకు రాలేదు. డ్వామా ఏపీడీ మాత్రం హాజరై విత్తనాల ప్యాకింగ్‌లో ఎలాంటి అక్రమాలు లేవని, అంతా సవ్యంగానే జరుగుతోందంటూ వాదించారు. అయితే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ఎలాంటి ధ్రువీకరణ లేని ధాన్యాన్ని విత్తనాల కింద సరఫరా చేయడం అక్రమమే అని తేల్చి చెప్పారు. ఆ మేరకు అక్కడున్న ధాన్యాన్ని సీజ్ చేసి కలెక్టర్‌కు నివేదిక పంపారు. సంబంధిత కాంట్రాక్టరుపై కేసు నమోదుకు సంబంధించి త్రీ టౌన్ ఎస్ఐ తమీమ్ అహ్మద్‌ని ‘సాక్షి’ సంప్రదించగా.. విత్తనాల ప్యాకింగ్ అంతా సవ్యంగానే జరుగుతోందని, అక్రమాలు లేవని డ్వామా ఏపీడీ వాంగ్మూలం ఇవ్వడంతో ఆ విషయాలనే ‘జనరల్ డైరీ’(జీడీ)లో నమోదు చేసుకున్నామని, ఫిర్యాదు లేక కేసు నమోదు చేయలేదని తెలిపారు. అసలు టెండర్లే పిలవలేదు : విత్తనాల సరఫరాకు సంబంధించి కాంట్రాక్టరుతో డ్వామా కుదుర్చుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్ కాపీ ఇవ్వాల్సిందిగా ‘సాక్షి’ సంబంధిత ఏపీడీని మంగళవారం కోరింది. అందుకు సంబంధించిన వివరాలు సాయంత్రం ఇస్తానన్న అధికారి, తీరా సాయంత్రం అసలు విషయం బయట పెట్టారు. విత్తనాల సరఫరాకు సంబంధించి తామేమీ టెండర్లు పిలవలేదని, ఇండెంట్‌పై నేరుగా సంబంధిత డీలర్ నుంచి ఒక్కో మినీ కిట్ రూ.350 చొప్పున 11 వేల మినికిట్స్ కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఒక్కో కిట్ రూ.350 చొప్పున 11 వేల కిట్లకు రూ.37.50 లక్షలు అవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో కొనుగోలు జరిపేటప్పుడు టెండర్ లేకుండా ఎలా చేశారని ప్రశ్నిస్తే.. డ్వామాలో ఇలా టెండర్లు లేకుండానే కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుందంటూ తన చర్యను సమర్థించుకున్నారు. అసలు విలువ : టెండర్ల విషయం అటుంచి.. వాస్తవంగా కాంట్రాక్టరు సరఫరా చేస్తున్న చిరుధాన్యాల విలువ ఎంత? అందుకు డ్వామా చెల్లిస్తోందెంత? అన్న వివరాలు చూస్తే ఎవరికైనా కళ్లు తిరగక మానవు. ప్రతి మినీ కిట్‌లో జొన్న, మొక్క జొన్న, సజ్జ, కొర్రలు అరకేజీ చొప్పున ఉంచి సరఫరా చేస్తున్నారు. ఈ చిరు ధాన్యాలు మార్కెట్ ధర కిలోకు.. జొన్న రూ.22, మొక్క జొన్న రూ.14, సజ్జ రూ.18, కొర్ర రూ.40 గా ఉన్నాయి. ఈ లెక్కన కాంట్రాక్టర్ మినీ కిట్‌లో ఉంచే నాలుగు రకాల ధాన్యం ధర రూ.47. సంచి, రవాణా ఖర్చులు మరో రూ.15 వేసుకున్నా మొత్తం ఖర్చు రూ.62. ఒక్కో కిట్‌పై వీరికి మిగిలేది రూ.288. 11వేల కిట్లకు రూ.31.68 లక్షలు. ఒక్క చిరుధాన్యాల సరఫరాలోనే రూ.31.68 లక్షలు ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయ్యిందంటే.. ఇక మిగతా ‘డ్వామా’ పథకాల్లో ఎంత అవినీతి చోటు చేసుకుని ఉంటుందో అన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అంతా సక్రమమేనంటూ వితండవాదం : ఈ విషయమై సంబంధిత ఏపీడీ నాగభూషణంను సంప్రదించగా.. విత్తనాల సరఫరాలో అక్రమాలు ఏమీ లేవని, మీరు సరైన అవగాహన లేక వార్త రాశారన్నారు. ఈ విషయమై తాము కలెక్టర్‌కు కూడా రెండు పేజీల వివరణ పంపుతున్నామని తెలిపారు. కలెక్టర్‌కు పంపిన నివేదిక ప్రతిని అడగ్గా దాన్ని యథాతథంగా ఇవ్వలేనని, కలెక్టర్‌కు పంపిన లేఖ సారాంశాన్ని తెలుగులో రాసి ‘సాక్షి’కి మెయిల్ చేశారు. తమకు విత్తనాలు సరఫరా చేసే కాంట్రాక్టరు లెసైన్సుడు విత్తన డీలర్ అని, లెసైన్సుడు డీలర్ తన గోడౌన్లో లూజు విత్తనాలను ప్యాకింగ్ చేయడంలో ఎలాంటి చట్ట వ్యతిరేకతకు పాల్పడలేదన్నారు. ఆ విత్తనాలను ధ్రువీకరణ లే ని విత్తనాలుగా వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొనడం దురదృష్టకరమం టూ.. వారిపైనా తన కడుపు మంటను వెళ్లగక్కారు. ప్రభుత్వ విత్తన ధ్రువీకరణ సంస్థ నుంచి ఎలాంటి ధ్రువీకరణ లేకుండా ప్యాక్ చేస్తుంటే ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? రూ.37.50 లక్షల విలువైన పనిని టెండర్లు నిర్వహించకుడానే ఒక కాంట్రాక్టరుకు ఎందుకు కట్టబెట్టినట్లు? సప్లై కాంట్రాక్టరు నిబంధనల మేరకు సర్టిఫైడ్ సీడ్ కాకుండా మండీలో ధాన్యాన్ని చిన్న ప్యాకెట్లలో పెట్టి సరఫరా చేస్తే ఎందుకు ‘డ్వామా’ అధికారులు ఎందుకు ప్రశ్నించలేదు? ఈ ప్రశ్నలకు ‘డ్వామా’ ఏపీడీ సమాధానం దాట వేయడం గమనార్హం. -
నకిలీ విత్తనం గుట్టు రట్టు
- 53 క్వింటాళ్ల చిరుధాన్యాల విత్తనం సీజ్ - డ్వామా అధికారి, ప్రైవేట్ డీలర్ కుమ్మక్కు? - రైతులకు నకిలీ విత్తనం అంటగట్టి సొమ్ము చేసుకుంటున్న వైనం - రూ.25 లక్షల కుంభకోణం అనంతపురం అగ్రికల్చర్/ క్రైం : నకిలీ విత్తనం గుట్టురట్టయింది. విత్తన ధ్రువీకరణ పత్రాలు లేకుండా పెద్ద ఎత్తున రైతులకు నాసిరకం విత్తనం అంటగడుతున్న వైనం వెలుగులోకొచ్చింది. త్రీటౌన్ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి 53 క్వింటాళ్ల విత్తనం సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో డ్వామా అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ముందస్తు సమాచారం మేరకు అనంతపురంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న రాజహంస ప్యారడైజ్ అపార్ట్మెంట్ సెల్లార్లో ఉన్న ఓ గదిపై శనివారం ఉదయం 11 గంటలకు అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా గదిలో కొందరు కూలీలు జొన్న, సజ్జ, మొక్క జొన్న తదితర చిరుధాన్యాలను ప్యాకెట్లలో నింపుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దాదాపు 53 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. ఇందులో 2.47 క్వింటాళ్ల సజ్జకు మాత్రమే ధ్రువీకరణ సర్టిఫికెట్ ఉంది. సాయిరాం ఫర్టిలైజర్స్ యజమాని, డీలర్ శ్రీధర్‌రెడ్డి ఈ నకిలీ విత్తనాల సూత్రధారిగా గుర్తించారు. ధ్రువీకరణ సంస్థ ద్వారా సర్టిఫై లేని విత్తనాన్ని అనధికారికంగా నిల్వ చేసిన శ్రీధర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక వ్యవసాయాధికారి అల్తాఫ్‌ఖాన్ తెలిపారు. కాంట్రాక్టర్‌కు సహకరించిన డ్వామా అధికారి జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ఆధ్వర్యంలో వాటర్‌షెడ్ కార్యక్రమం అమలవుతున్న 386 ఆవాస ప్రాంతాల్లోని సన్న, చిన్నకారు రైతులకు చిరుధాన్యాల విత్తనాలను అందించే కాంట్రాక్టును సాయిరాం ఫర్టిలైజర్స్ యజమాని శ్రీధర్‌రెడ్డి కుదుర్చుకున్నారు. ‘డ్వామా’తో ఒప్పందం మేరకు ఆ వ్యాపారి ఒక ఎకరాకు సరిపోయే చిరుధాన్యాల ధ్రువీకరణ విత్తనాలను (జొన్న, మొక్క జొన్న, సజ్జ, కొర్ర) రకానికి అర కిలో చొప్పున ఒక సంచిలో ప్యాక్‌చేసి సరఫరా చేయాలి. ఇందుకు గాను ఒక్కో మినీ కిట్‌కు ‘డ్వామా’ ఆ వ్యాపారికి రూ.350 చెల్లిస్తుంది. అయితే ఈ కాంట్రాకు పొందిన వ్యాపారి ‘సర్టిఫైడ్ సీడ్’కు బదులు మండీ బజారులో ధాన్యాన్ని కొనుక్కొచ్చి, ఆ ధాన్యాన్నే మినీ కిట్లలో నింపి ‘డ్వామా’కు అందజేస్తున్నాడు. విత్తనాల పంపిణీ పర్యవేక్షణ బాధ్యతను ‘డ్వామా’ ఏపీడీ (వాటర్‌షెడ్ విభాగం) నాగభూషణం చూస్తున్నారు. ఇప్పటికే ఈ అధికారి ఆధ్వర్యంలో మడకశిర, కళ్యాణదుర్గం, కదిరి ప్రాంతాల్లో ఈ నకిలీ విత్తనాలను కాంట్రాక్టరు రైతులకు సరఫరా చేశాడు. సరఫరా చేసిన విత్తనాలు సర్టిఫైడ్ సీడ్ కాదన్న విషయం స్పష్టంగా తెలిసినా ఈ విభాగాన్ని పర్యవేక్షించే ‘డ్వామా’ అధికారి ఏమాత్రం అభ్యంతరం పెట్టకుండా కాంట్రాక్టరుకు సహకరించారని తెలుస్తోంది. ‘డ్వామా’ అధికారి వెన్నుదన్నుతోనే కాంట్రాక్టరు యథేచ్ఛగా మండీల్లో ధాన్యాన్ని విత్తనంగా సొమ్ము చేసుకుంటున్నాడని.. ఈ వ్యవహారంలో అధికారులు, కాంట్రాక్టరు అక్రమార్జనను చెరి సగం పంచుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుంభకోణం విలువ రూ.25 లక్షలు ఒక్కో మినీ కిట్‌కు ప్రభుత్వం కాంట్రాక్టరుకు రూ.350 చెల్లిస్తుండగా జిల్లాలో 10 వేల మినీ కిట్ల సరఫరాకు కాంట్రాక్టు కుదిరింది. సర్టిఫైడ్ సీడ్ కాకుండా మండీల్లో దొరికే ధాన్యాన్ని మిని కిట్లలో నింపుతున్నారు. ఇందుకు గాను అన్ని ఖర్చులు కలుపుకున్నా ఒక్కో మినీ కిట్‌కు రూ.100 కన్నా ఎక్కువ ఖర్చు కాదని వ్యవసాయ శాఖ అధికారులే చెబుతున్నారు. ఈ లెక్కన ఒక్కో మినీకిట్పై రూ.250 చొప్పున 10 వేల మినీ కిట్లపై కాంట్రాక్టరు, అధికారులు నొక్కేస్తున్న సొమ్ము రూ.25 లక్షలు ఉంటుందని అంచనా. అవి మంచి విత్తనాలే నకిలీ విత్తన ప్యాకింగ్ కేంద్రంపై దాడి చేసిన పోలీసులు, వ్యవసాయ అధికారులు సంబంధిత ‘డ్వామా’ ఏపీడీని సంఘటనా స్థలానికి పిలిపించారు. ఆ సందర్భంగా ఈ విత్తనాలు మంచివే అని, కాంట్రాక్టరు నేషనల్ సీడ్ కార్పొరేషన్ అధీకృత డీలర్ కాబట్టే అతనికి కాంట్రాక్టు ఇచ్చామని మీడియా ఎదుటే వ్యవసాయ శాఖ అధికారుతో ‘డ్వామా’ ఏపీడీ వాదించారు. డ్వామా ఏపీడీ వాదనను వ్యవసాయ శాఖ జేడీ నిర్ద్వందంగా తోసిపుచ్చారు.