నిధులివ్వకపోవడంపై పీడీ అసంతప్తి
Published Wed, Aug 10 2016 11:51 PM | Last Updated on Sat, Sep 29 2018 6:11 PM
మర్రిపాడు : మండలంలో ఇంకుడుగుంతలు నిర్మించుకున్నప్పటికీ లబ్ధిదారులకు నిధులివ్వకపోవడంపై డ్వామా పీడీ హరిత అసంతప్తి వ్యక్తంచేశారు. మండల కేంద్రమైన మర్రిపాడులోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఆమె మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూలీల రిజిష్టర్లను పరిశీలించారు. అనంతరం ఫారంపాండ్స్, ఇంకుడుగుంతలు, వర్మికంపోస్ట్‌లను రికార్డులన్నింటిని పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇంకుడుగుంతలు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు వెంటనే ఇవ్వాలని, ఆలస్యం చేయొద్దని ఆదేశించారు. ఉపాధిహామీ పథకం పనులు కూడా వేగవంతం చేయాలన్నారు. అధికమంది కూలీలకు పని కల్పించాలని సూచించారు. అనంతరం అనంతసాగరం మండలానికి చెందిన రికార్డులను కూడా పరిశీలించారు. ఆమె వెంట ఏపీడీ మదుల, ఎంపీడీఓ నాసర్‌రెడ్డి, ఏపీఓ లక్ష్మీనరసయ్య, పలువురు అధికారులు, ఎన్‌ఆర్‌జీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement