marripadu
-
ఎమ్మెల్యే కబ్జా పర్వమంటూ కల్లబొల్లి కథనం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ ప్రాంతాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సొంత నిధులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నంపై పచ్చ మీడియా విషం కక్కింది. టీడీపీ అధికారంలో ఉన్న కాలంలో ఆ పార్టీ నేతలు ఏకంగా రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి, విలువైన భూములను కబ్జా చేశారు. ‘పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు’గా అటవీ ప్రాంతాన్ని తలపిస్తున్న ప్రభుత్వ స్థలంలో ఎమ్మెల్యే సొంత నిధులు వెచ్చించి శుభ్రం చేసి పార్కుగా తీర్చిదిద్దుతుంటే ఆ పచ్చ మీడియాకు కబ్జా పర్వంగా కనిపించింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పచ్చ మీడియా బరితెగించి పైత్యం ప్రదర్శిస్తోంది. కంప చెట్లు, పిచ్చి మొక్కలు, జంతు మల, మూత్రాలతో అపరిశుభ్రంగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సొంత నిధులతో సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా పార్కుగా తీర్చిదిద్దుతున్నారు. అయితే ఆ పచ్చ మీడియా కబ్జాపర్వమంటూ కల్లబొల్లి కుల్లు కథనాన్ని రాసింది. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో రూ.కోట్లాది విలువైన తమ సొంత భూములను ప్రజా అవసరాలకు ప్రభుత్వానికి అప్పగించిన చరిత్ర మేకపాటి సోదరులది. అటువంటిది మార్కెట్ ధర ప్రకారం పట్టుమని పాతిక లక్షల రూపాయల విలువ చేయని ఆ స్థలానికి రూ.2 కోట్ల విలువ కట్టి మేకపాటి కుటుంబంపై బురద జల్లే ప్రయత్నం చేయడాన్ని స్థానిక ప్రజలు సైతం మండి పడుతున్నారు. మండల కేంద్రం మర్రిపాడులో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి భూములు కొనుగోలు చేసి గెస్ట్‌హౌస్ నిర్మించుకున్నారు. ఆ తదనంతర కాలంలో వైఎస్సార్ అకాల మరణం చెందడంతో తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఊరూరా ఆయన విగ్రహాలు ఆవిష్కరించారు. ఇదే సమయంలో మేకపాటి చంద్రశేఖరరెడ్డి తన గెస్ట్‌హౌస్ సమీపంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబరు 428/2లో కొంచెం స్థలంలో 2010లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో ఓదార్పు యాత్రలో జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ తర్వాత ఆ ప్రాంతమంతా కంప చెట్లు, పిచ్చి మొక్కలు, జంతు మలమూత్రాలతో అపరిశుభ్రంగా మారింది. దివంగత సీఎం వైఎస్సార్ వీర భక్తుడు అయిన చంద్రశేఖరరెడ్డి తన గెస్ట్‌హౌస్ పక్కన తానే ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహ ప్రాంతం అపరిశుభ్రంగా మారడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ ప్రదేశాన్ని సుందరవనంగా వైఎస్సార్ ఘాట్‌గా తీర్చిదిద్దాలని సంకల్పించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి పచ్చదనం పరిఢవిల్లేలా మొక్కలు తెచ్చి నాటారు. తన సొంత నిధులతో పార్కుగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తుంటే ‘వైఎస్సార్ సాక్షిగా భూ కబ్జా’ అంటూ ఎమ్మెల్యేపై దుష్ప్రచారానికి దిగింది. ప్రభుత్వ స్థలాన్ని పార్కుగా మారిస్తే తప్పా? నిరుపయోగంగా ముళ్ల పొదలతో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆహ్లాదకరమైన పార్కుగా తీర్చిదిద్దడం తప్పా. పార్కులను ప్రభుత్వ స్థలాల్లో కాకుండా ప్రైవేట్ స్థలాల్లో నిర్మిస్తారా?. ఎమ్మెల్యే సొంత నిధులతో పార్కు వాతావరణాన్ని కల్పించే విధంగా చేస్తుంటే పచ్చ విషపు రోత రాతలు రాయడం వెనుక పచ్చ మీడియా సొంత అజెండా ఉందనే అర్థమవుతోంది. వైఎస్సార్ విగ్రహ ప్రాంతాన్ని పార్కుగా మలుస్తున్నారే కానీ.. బిల్డింగులు కట్టడం లేదే. నాటిన మొక్కలు పశువుల పాలు కాకుండా చుట్టూ ఫెన్సింగ్ వేస్తే కబ్జా అని వక్రభాష్యం చెబుతారా అని స్థానిక ప్రజలు సైతం మండి పడుతున్నారు. సుందరంగా తీర్చిదిద్దుతున్నా.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజలకు చేసిన మేలు మరువలేనిది. తెలుగువారి గుండెల్లో కొలువై ఉన్నారు. నేను వైఎస్సార్ వీర భక్తుడిని. విగ్రహా ఘాట్‌ను సుందరంగా తీర్చిదిద్దాలనే తపనతో ప్రాంగణాన్ని శుభ్రం చేశాం. గార్డెన్ ఏర్పాటు చేస్తున్నాం. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారు సైతం కాసింత సేద తీరే విధంగా పార్కుగా రూపొందిస్తున్నాం. భూ కబ్జాలు చేయాల్సిన అవసరం తమ కుటుంబానికి లేదు. – మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్యే, ఉదయగిరి -
ఘోర రోడ్డు ప్రమాదం; ఇద్దరి మృతి
సాక్షి, నెల్లూరు: జిల్లాలోని మర్రిపాడు మండలం ఎపిలగుంట సమీపంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన లారీ కారును ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. -
నిధులివ్వకపోవడంపై పీడీ అసంతప్తి
మర్రిపాడు : మండలంలో ఇంకుడుగుంతలు నిర్మించుకున్నప్పటికీ లబ్ధిదారులకు నిధులివ్వకపోవడంపై డ్వామా పీడీ హరిత అసంతప్తి వ్యక్తంచేశారు. మండల కేంద్రమైన మర్రిపాడులోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఆమె మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూలీల రిజిష్టర్లను పరిశీలించారు. అనంతరం ఫారంపాండ్స్, ఇంకుడుగుంతలు, వర్మికంపోస్ట్లను రికార్డులన్నింటిని పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇంకుడుగుంతలు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు వెంటనే ఇవ్వాలని, ఆలస్యం చేయొద్దని ఆదేశించారు. ఉపాధిహామీ పథకం పనులు కూడా వేగవంతం చేయాలన్నారు. అధికమంది కూలీలకు పని కల్పించాలని సూచించారు. అనంతరం అనంతసాగరం మండలానికి చెందిన రికార్డులను కూడా పరిశీలించారు. ఆమె వెంట ఏపీడీ మదుల, ఎంపీడీఓ నాసర్‌రెడ్డి, ఏపీఓ లక్ష్మీనరసయ్య, పలువురు అధికారులు, ఎన్ఆర్జీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
మా భూములు అప్పగించండి
మర్రిపాడు : మండలంలోని పొంగూరు గ్రామానికి చెందిన దళితులు తమ భూములు తమకు అప్పగించాలని శుక్రవారం తహసీల్దారు సులోచనకు ఫిర్యాదుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో భూపంపిణీ 6, 7 విడతల్లో ప్రభుత్వం తమకు భూములు మంజూరుచేసిందన్నారు. ఆ సమయంలో కొంతమందికి మాత్రమే పాసుపుస్తకాలు ఇచ్చారని చెప్పారు. పాసుపుస్తకాలు ఇచ్చినప్పటికీ పేదవారం కావడంతో భూములు సాగుచేసుకోలేకపోయామన్నారు. దీంతో బీడుగా వాటిని ఆక్రమించారని ఆవేదన వ్యక్తంచేశారు. భూములకు సంబంధించిన పాసుపుస్తకాలు, రికార్డులను చూపించారు. ప్రస్తుతం సోమశిల హైలెవల్ కెనాల్ నిర్మాణ పనుల్లో భాగంగా భూములన్నీ మునకకు గురవుతున్నాయన్నారు. దీంతో వాటికి గిరాకీ ఏర్పడిందన్నారు. మరికొంతమంది భూములను రికార్డుల్లో అక్రమంగా మారుస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారాన్ని స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. విచారణ జరిపి న్యాయం చేయకపోతే నిరాహారదీక్ష చేపడుతామన్నారు. దీనిపై తహసీల్దార్ మాట్లాడుతూ భూముల విషయమై ఇప్పటికే ఆర్ఐ, వీఆర్వో ద్వారా విచారణ జరిపిస్తున్నామన్నారు. మిగిలిన భూములపై కూడా పూర్తిస్థాయిలో విచారణ జరిపి అర్హులైన వారికి భూములను అందచేస్తామని చెప్పారు. -
ఆస్పత్రికి పశువైద్యుడి డుమ్మా
చికిత్స అందక గొర్రె మతి వైద్యసేవలు అందండంలేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసినా ఫలితం శూన్యం శుక్రవారం ఉదయం మండలంలోని నందవరంలో ఉన్న పశువైద్యశాలకు గ్రామానికి చెందిన యర్రమళ్ల లక్ష్మీరెడ్డి తన గొర్రెపిల్లకు ఆరోగ్యం బాగోలేదని తీసుకొచ్చాడు. అయితే ఆ సమయంలో అక్కడ వైద్యుడులేడు. కేవలం కాంపౌండర్ మాత్రమే ఉన్నాడు. లక్ష్మీరెడ్డి గొర్రెపిల్లకు తీవ్ర అనారోగ్యంగా ఉందని నయం చేయాలని కాంపౌడర్‌ను అడిగాడు. అతను డాక్టర్‌ను తాను కాదని నిర్లక్ష్యంగా సమాధామమిచ్చాడు. కొంత సమయం గడిచిన తర్వాత వైద్యం అందక గొర్రెపిల్ల మతిచెందింది. మర్రిపాడు : నందవరం పశువైద్యశాలలో వైద్యం సక్రమంగా అందడంలేదని చెప్పేందుకు పై సంఘటన ఒక ఉదాహరణ మాత్రమే.. గతంలోనూ మూగజీవాలకు సరిగ్గా వైద్యం అందక మతిచెందిన సంఘటనలున్నాయి. ఈ ఆస్పత్రి నుంచే అన్ని ప్రాంతాలకు వైద్యసేవలు అందాల్సి ఉంది. అయితే ఏనాడు కూడా పశువులకు సక్రమంగా వైద్యం అందకపోవడంతో పలుమార్లు రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా మండలం మారుమూల ఉండటంతో ఎవరూ పట్టించుకోలేదు. శుక్రవారం చనిపోయిన గొర్రెపిల్లను పశువైద్యశాలలోనే ఉంచి కొంతమంది నిరసన తెలిపారు. జీవాలపైనే ఆధారపడి జీవిస్తున్నామని, అలాంటి జీవాలు మతిచెందింతే ఏం తమ పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మూగజీవాలకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ఒకరి అరెస్ట్ మర్రిపాడు : మండలంలోని ఎర్రకొండ అడవి నుంచి అక్రమంగా తరలిస్తున్న 53 ఎర్రచందనం దుంగలను, ఓ వ్యక్తిని పట్టుకున్నట్లు మర్రిపాడు ఎస్సై వైవీ సోమయ్య తెలిపారు. గురువారం ఆయన మర్రిపాడు పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎర్రకొండ అడవుల్లో ఎర్రచందనం తరులుతుందనే సమాచారంతో గురువారం ఉదయం కూంబింగ్ చేపట్టామన్నారు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోస్తూ తారసపడ్డారని వెంటనే వారిని వెంబండించగా ఓ వ్యక్తి పరరయ్యాడని, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అతని ద్వారా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 53 దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందన్నారు. పట్టుబడిన వ్యక్తి ఏఎస్‌పేటకు చెందిన చిలకపాటి వేణుగా గుర్తించామన్నారు. పరారైన వ్యక్తి మానం రామాంజనేయులుగా గుర్తించామని, అతని కోసం గాలింపు చేపడుతున్నామని తెలిపారు. -
మోడల్ స్కూల్లో నేటి నుంచి ప్రవేశాలు
మర్రిపాడు : మండలంలోని నందవరంలో నూతనంగా నిర్మించిన మోడల్ పాఠశాలలో సోమవారం నుంచి ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శారదకుమారి తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ స్కూల్లో ప్రవేశాల కోసం ఇటీవల ప్రవేశపరీక్ష నిర్వహించామన్నారు. అందులో ఉత్తీర్ణులైన విద్యార్థుల జాబితాను ప్రచురించామని చెప్పారు. జాబితాలో పేర్లు ఉన్న విద్యార్థులు తమ టీసీలు, స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డులను సోమవారం నుంచి బుధవారం లోగా అందచేయాలని సూచించారు. అలాగే మోడల్స్కూల్లో ఉపాధ్యాయ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 21వ తేదీన జరిగే డెమో తరగతులకు హాజరుకావాలన్నారు. అదే రోజున ఉపాధ్యాయుల ఎంపిక కూడా జరుగుతుందని తెలియజేశారు. -
తాగునీటి సంఘం ఎన్నికల్లో ఉద్రిక్తత
నెల్లూరు: తాగునీటి సంఘం నీటి ఎన్నికల్లో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తాజాగా ఆదివారం నాడు నెల్లూరు జిల్లా మర్రిపాడులో తాగునీటి సంఘం ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల అధికారి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడంటూ వైఎస్సార్సీపీ ఆందోళనకు దిగింది. నెల్లూరు జాతీయ రహదారిపై వైఎస్సార్సీపీ ధర్నా నిర్వహించింది. దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. -
కాంగ్రెస్, టీడీపీలకు గుణపాఠం చెప్పాలి
మర్రిపాడు, న్యూస్‌లైన్ : అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న రాష్ట్రాన్ని స్వార్థ రాజకీయాల కోసం విభజించిన కాంగ్రెస్, టీడీపీలకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యులు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. మర్రిపాడులో శుక్రవారం వైఎస్సార్సీపీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహనరెడ్డిని ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటికే పలు సర్వేలు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతుందని చెబుతున్నాయన్నారు. తొమ్మిదేళ్లుగా సీఎంగా చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి పట్టించుకోలేదని, మళ్లీ తనకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని సింగపూర్, మలేషియాగా చేస్తాననడం ప్రజలను మరోసారి మోసం చేయడానికేనన్నారు. సోనియాగాంధీ రాష్ట్రంపై కక్ష గట్టి విభజించారన్నారు. యువనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు బనాయించి 16 నెలలు జైల్లో పెట్టారన్నారన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎన్టీఆర్ హయాంలో రాష్ట్రాన్ని ఏనాడు విభజించాలనుకోలేదని, నేడు స్వార్థ రాజకీయాలతో రాష్ట్రాన్ని విభజించాలనుకోవటం దుర్మార్గమన్నారు. జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని రాష్ట్ర ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారన్నారు. నీల్సన్- ఎన్టీవీ సర్వేలో 2 లక్షల మంది అభిప్రాయాలు తెలుసుకుని సర్వే చేసి 130 స్థానాలు వస్తాయని నిర్ధారించారన్నారు. అయితే సీఎన్ఎన్ సంస్థ కేవలం 1,300 మందితోనే సర్వే చేసి ప్రకటించటం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే ఇలాంటి సర్వేలు చేస్తున్నాయన్నారు. ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ టీడీపీ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రగల్భాలు పలికారన్నారు. జనమంతా జగన్ వెంటే ఉన్నారని కేంద్రంలో కూడా జగన్మోహన్ రెడ్డే చక్రం తిప్పుతారన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి వంద రోజుల్లో ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని కితాబిచ్చారు. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకు మేకపాటి కుటుంబం వరప్రసాదం అన్నారు. యువనేత గౌతమ్‌రెడ్డి జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో దృష్టి సారించడం అభినందనీయమన్నారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు తన వంతు కృషి చేస్తానన్నారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావటం తథ్యమన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ఆయన విజయాన్ని ఆపలేరన్నారు.; ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మండలంలోని 12 ఎంపీటీసీ సెగ్మెంట్లతో పాటు జెడ్పీటీసీ స్థానాన్ని సైతం వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. పాదయాత్రలో ఎన్నో సమస్యలను చూశానని, సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు బిజివేముల వెంకటసుబ్బారెడ్డి, సురేం ద్రనాథ్‌రెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు పెనగలూరి వెంకటేష్, జెడ్పీటీసీ అభ్యర్థిని చంద్రకళ, పడమటినాయుడుపల్లి ఎంపీటీసీ అభ్యర్థి రమణయ్య, పార్టీ నాయకులు రాములు నాయుడు, శ్రీనివాసులునాయుడు, అంబటి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.