మోడల్‌ స్కూల్‌లో నేటి నుంచి ప్రవేశాలు | admissions in model schools | Sakshi
Sakshi News home page

మోడల్‌ స్కూల్‌లో నేటి నుంచి ప్రవేశాలు

Published Sun, Jul 17 2016 11:45 PM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM

admissions in model schools

 
 
మర్రిపాడు : మండలంలోని నందవరంలో నూతనంగా నిర్మించిన మోడల్‌ పాఠశాలలో సోమవారం నుంచి ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ శారదకుమారి తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ స్కూల్‌లో ప్రవేశాల కోసం ఇటీవల ప్రవేశపరీక్ష నిర్వహించామన్నారు. అందులో ఉత్తీర్ణులైన విద్యార్థుల జాబితాను ప్రచురించామని చెప్పారు. జాబితాలో పేర్లు ఉన్న విద్యార్థులు తమ టీసీలు, స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డులను సోమవారం నుంచి బుధవారం లోగా అందచేయాలని సూచించారు. అలాగే మోడల్‌స్కూల్‌లో ఉపాధ్యాయ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 21వ తేదీన జరిగే డెమో తరగతులకు హాజరుకావాలన్నారు. అదే రోజున ఉపాధ్యాయుల ఎంపిక కూడా జరుగుతుందని తెలియజేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement