ఎర్రచందనం దుంగలు స్వాధీనం | Red sanders siezed | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Published Thu, Jul 21 2016 7:21 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

 
  • ఒకరి అరెస్ట్‌
మర్రిపాడు : మండలంలోని ఎర్రకొండ అడవి నుంచి అక్రమంగా తరలిస్తున్న 53 ఎర్రచందనం దుంగలను, ఓ వ్యక్తిని పట్టుకున్నట్లు మర్రిపాడు ఎస్సై వైవీ సోమయ్య తెలిపారు. గురువారం ఆయన మర్రిపాడు పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎర్రకొండ అడవుల్లో ఎర్రచందనం తరులుతుందనే సమాచారంతో గురువారం ఉదయం కూంబింగ్‌ చేపట్టామన్నారు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోస్తూ తారసపడ్డారని వెంటనే వారిని వెంబండించగా ఓ వ్యక్తి పరరయ్యాడని, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అతని ద్వారా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 53 దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందన్నారు. పట్టుబడిన వ్యక్తి ఏఎస్‌పేటకు చెందిన చిలకపాటి వేణుగా గుర్తించామన్నారు. పరారైన వ్యక్తి మానం రామాంజనేయులుగా గుర్తించామని, అతని కోసం గాలింపు చేపడుతున్నామని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement