ఆస్పత్రికి పశువైద్యుడి డుమ్మా
ఆస్పత్రికి పశువైద్యుడి డుమ్మా
Published Sat, Aug 6 2016 12:44 AM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
చికిత్స అందక గొర్రె మతి
వైద్యసేవలు అందండంలేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసినా ఫలితం శూన్యం
శుక్రవారం ఉదయం మండలంలోని నందవరంలో ఉన్న పశువైద్యశాలకు గ్రామానికి చెందిన యర్రమళ్ల లక్ష్మీరెడ్డి తన గొర్రెపిల్లకు ఆరోగ్యం బాగోలేదని తీసుకొచ్చాడు. అయితే ఆ సమయంలో అక్కడ వైద్యుడులేడు. కేవలం కాంపౌండర్ మాత్రమే ఉన్నాడు. లక్ష్మీరెడ్డి గొర్రెపిల్లకు తీవ్ర అనారోగ్యంగా ఉందని నయం చేయాలని కాంపౌడర్‌ను అడిగాడు. అతను డాక్టర్‌ను తాను కాదని నిర్లక్ష్యంగా సమాధామమిచ్చాడు. కొంత సమయం గడిచిన తర్వాత వైద్యం అందక గొర్రెపిల్ల మతిచెందింది.
మర్రిపాడు : నందవరం పశువైద్యశాలలో వైద్యం సక్రమంగా అందడంలేదని చెప్పేందుకు పై సంఘటన ఒక ఉదాహరణ మాత్రమే.. గతంలోనూ మూగజీవాలకు సరిగ్గా వైద్యం అందక మతిచెందిన సంఘటనలున్నాయి. ఈ ఆస్పత్రి నుంచే అన్ని ప్రాంతాలకు వైద్యసేవలు అందాల్సి ఉంది. అయితే ఏనాడు కూడా పశువులకు సక్రమంగా వైద్యం అందకపోవడంతో పలుమార్లు రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా మండలం మారుమూల ఉండటంతో ఎవరూ పట్టించుకోలేదు. శుక్రవారం చనిపోయిన గొర్రెపిల్లను పశువైద్యశాలలోనే ఉంచి కొంతమంది నిరసన తెలిపారు. జీవాలపైనే ఆధారపడి జీవిస్తున్నామని, అలాంటి జీవాలు మతిచెందింతే ఏం తమ పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మూగజీవాలకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.
Advertisement
Advertisement