పుష్కర పనులౖపై సమీక్ష | puskaraworks in riview | Sakshi
Sakshi News home page

పుష్కర పనులౖపై సమీక్ష

Published Sun, Jul 31 2016 12:58 AM | Last Updated on Sat, Sep 29 2018 6:11 PM

పుష్కర పనులౖపై సమీక్ష - Sakshi

పుష్కర పనులౖపై సమీక్ష

మేళ్లచెర్వు :  పుష్కరాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మండల పుష్కరఘాట్‌ల ప్రత్యేక అధికారి డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, సూర్యాపేట ఆర్డీఓ నారాయణరెడ్డి కోరారు.   మండల కేంద్రంలో జరుగుతున్న పుష్కర పనులను శనివారం వారు సమీక్షించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఆయా గ్రామాల్లోని ప్రజలందరూ సహకరించాలని కోరారు. మండలంలోని మూడు ఘాట్లలో 33 మంది అధికారులను,1000 మంది పోలీసులను నియమిస్తున్నట్లు తెలిపారు.  పార్కింగ్‌ విషయంలో, వన్‌వే రూట్లను దష్టిలో పెట్టుకొని భక్తులు ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం వారు పుఫ్కరఘాట్ల  పనులను పరిశీలించారు.  కార్యక్రమంలో ఎంపీపీ భూక్యా ఝమాచోక్లానాయక్, జెడ్పీటీసీ వెంకటలక్ష్మీ, తహసీల్దార్‌ శ్రీధేవి,ఆర్‌ఐ వీరయ్య, సర్పంచ్‌లు కొట్టె సైదేశ్వర్‌రావు, రుక్కయ్య యాదవ్, బిక్రి, ఎంపీటీసీలు, ఎస్‌ఐలు రవికుమార్, రాము, విజయ్‌ప్రకాశ్,వీఆర్‌ఓలు, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement