టైటిల్: సింబా
నటీనటులు: జగపతిబాబు, అనసూయ, శ్రీనాథ్ మాగంటి, కబీర్‌సింగ్ తదితరులు
నిర్మాతలు: సంపత్ నంది, రాజేందర్
దర్శకత్వం: మురళీ మనోహర్ రెడ్డి
విడుదల తేది: ఆగస్ట్ 9, 2024
కథేంటంటే.. ?
హైదరాబాద్ నగరంలో ఓ దారణ హత్య జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి ప్రముఖ వ్యాపారవేత్త పార్థ(కబీర్ సింగ్) సన్నిహితుడు కావడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మంగా తీసుకుంటారు. విచారణ కోసం పోలీసాఫీసర్ అనురాగ్(వశిష్ఠ సింహ) నగరానికి వస్తాడు. ఈ క్రమంలో మరో హత్య కూడా అలానే జరుగుతుంది. ఈ రెండు హత్యల వెనుక స్కూల్ టీచర్ అనుముల అక్షిక(అనసూయ), ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఫాజిల్(శీనాథ్ మాగంటి) ఉన్నారని తెలిసి వారిద్దరిని అరెస్ట్ చేశారు. వారిని కోర్టుకి తరలించే క్రమంలో హత్య చేయాలని పార్థ ప్లాన్ వేస్తాడు. అయితే వీరిద్దరు కలిసి తమను చంపాడానికి వచ్చిన వ్యక్తిని పోలీసుల ముందే చంపేస్తారు.
ఈ హత్యలో డాక్టర్ ఇరానీ(అనీష్ కురువిళ్ళ) భాగస్వామి అవుతాడు. అసలు ఎలాంటి సంబంధంలే లేని ఈ ముగ్గురు ఎందుకు పార్థ మనుషులను చంపుతున్నారు? బొద్దింకను కూడా చంపడానికి ఇష్టపడని అక్షిక..దారుణ హత్యలు ఎలా చేసింది? పురుషోత్తమ్ రెడ్డి అలియాస్ సింబా(జగపతి బాబు) ఎవరు? ఆయనకు ఈ ముగ్గురికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? పార్థకి, పురుషోత్తమ్ రెడ్డి మధ్య ఉన్న వైరం ఏంటి? పోలీసాఫీసర్ అనురాగ్ ఈ కేసును ఎలా సాల్వ్ చేశారు? అనేది తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఇదొక రివేంజ్ డ్రామా.. బయోలజికల్ మెమరీ అనే కొత్త కాన్సెప్ట్‌ని టాలీవుడ్‌కు డైరెక్టర్ పరిచయం చేశారు. ఓటీటీలు వచ్చాక ఇతర భాషలలో వచ్చే థ్రిల్లర్ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారు. అయితే, ఇందులో వాటన్నింటికి భిన్నంగా ఆసక్తి రేకెత్తించేలా సినిమా ఉంటుంది. భవిష్యత్ సమాజం కోసం పర్యావరణ పరిరక్షణ అత్యవసరం. ఈ అంశాన్ని ఇందులో చూపించిన తీరుని డైరెక్టర్ మురళీ మనోహర్‌రెడ్డిని మెచ్చుకోవాల్సిందే. సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా పస్టాప్‌లోనే కథను ప్రేక్షకుడు అర్థం చేసుకుంటాడు. దాదాపు చాలా సీన్స్ ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే కనిపిస్తూ ఉంటాయి. వరుసగా హత్యలు జరుగుతున్న తీరును ఆసక్తిగా చూపించిన దర్శకుడు.. ఈ హత్యల వెనక ఎవరుంటారో అనేది చెప్పడంలో కాస్త విఫలం అయ్యాడు అనిపిస్తుంది.
అలా వరుస హత్యలతో పస్టాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్ మాత్రం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. వరుస హత్యలు జరుగుతున్న క్రమంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ సిల్లీగా అనిపిస్తుంది. ఈ హత్యల వెనుక ఉన్న వ్యక్తి ఎవరు అని ఆసక్తిగా చెప్పడం లో కాస్త విఫలం అయ్యాడు. ఫోన్ కాల్ లిస్ట్‌తోనే హంతకులను పట్టుకున్న తీరు ఏమాత్రం మెప్పించదు. సెకడాఫ్‌లో క బయాలాజికల్ మెమరీ అంశం అనేది తెరపైకి వస్తుంది. ఈ కాన్సెప్ట్ చాలా సినిమాల్లో చూసిందే. పురుషోత్తమ్ రెడ్డి (జగపతిబాబు ) కథ ఇక్కడే మొదలౌతుంది. సినిమాలో ఆయన పాత్రని చివరి వరకూ పెద్దగా ప్రభావం లేకుండా కథ నడపం కాస్త మైనస్ అనిపిస్తుంది. కథ సాధారణమై అయినా.. దర్శకుడు చూపించిన తీరు థ్రిల్లింగ్‌కు గురిచేస్తుంది.
ఎవరెలా చేశారంటే..
ముందుగా సింబా దర్శకుడు మురళీ మనోహర్‌రెడ్డిని మెచ్చుకోవాలి. ఉన్నంతలో బాగానే తీశాడు. జగపతిబాబు, అనసూయ లాంటి స్టార్స్‌ను పాత్రల మేరకు బాగానే ఉపయోగించుకున్నాడు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా వశిష్ఠ సింహా కీలక పాత్రలో కనిపిస్తారు. కథ చివర్లో ఆయన నటించిన తీరు మెప్పిస్తుంది. ఇందులో విలన్ పాత్రలో కనిపించిన కబీర్ పెద్దగా ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. బడ్జెట్ మేరకు సినిమా మించే ఉందని చెప్పవచ్చు. ఫైనల్‌గా అందరికీ మంచి సందేశాన్ని ఇచ్చే సింబా మెప్పిస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment