మరీ ఇంత ఘోరమా? | More so frightful? | Sakshi
Sakshi News home page

మరీ ఇంత ఘోరమా?

Published Tue, Nov 22 2016 1:44 AM | Last Updated on Sat, Sep 29 2018 6:11 PM

More so frightful?

 

అనంతపురం టౌన్ :  
‘జిల్లా కరువును దృష్టిలో పెట్టుకుని స్పెషల్‌ ప్రాజెక్ట్‌ మంజూరైతే అధికారులంతా నిర్లక్ష్యం చేస్తున్నారు. పది రోజుల ముందు నుంచి ’నీరాంచల్‌’పై సర్పంచులు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించి వర్క్‌షాప్‌నకు  తీసుకురావాలని చెప్పినా ఒక్కరూ చెవికెక్కించుకోలేదు. మరీ ఇంత ఘోరమా? విజయవాడ నుంచి పనులు వదిలిపెట్టి నేనొచ్చా. ఇక్కడున్న మీరు సకాలంలో రావడానికి ఇబ్బంది ఏమిటి?  సినిమాలౖకెతే పది నిమిషాల ముందే వెళ్తారా?’ అంటూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ రామాంజనేయులు  జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) అధికారులపై మండిపడ్డారు. ’నీరాంచల్‌’ వాటర్‌షెడ్‌ ప్రాజెక్ట్‌పై అధికారులు, సర్పంచులు, ఎంపీపీలకు సోమవారం స్థానిక డ్వామా మీటింగ్‌ హాల్‌లో వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై కమిషనర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.100 కోట్లతో చేపట్టే ’నీరాంచల్‌’తో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. వాటర్‌షెడ్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు ఈ పథకంపై అవగాహన కల్పించకపోవడం శోచనీయమన్నారు.  ఆయా ప్రాజెక్టుల పరిధిలోని పీఓలందరికీ తక్షణం వేతనాలు నిలిపివేయాలని డ్వామా పీడీ నాగభూషణంను ఆదేశించారు. మంత్రి కార్యక్రమం ఉండడంతో మడకశిర పీఓ రాలేదని కింది స్థాయి సిబ్బంది చెప్పగా.. ఈ పథకం కన్నా ఏదీ ముఖ్యమైంది కాదన్నారు. తక్షణం సదరు పీఓకు నోటీస్‌ పంపాలన్నారు. నార్పల పీఓ రాకపోవడంతో చార్జ్‌మెమో ఇచ్చి తాను చెప్పే వరకు వేతనం మంజూరు చేÄñæ¬ద్దని ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థ ఆ ప్రాజెక్టును చేపడుతున్నట్లు అధికారులు చెప్పారు. అయితే ఆ సంస్థ ప్రతినిధులు కూడా రాకపోవడంతో అవసరమైతే వాళ్లకు ప్రాజెక్ట్‌ రద్దు చేసి మరొకరికి ఇస్తామని స్పష్టం చేశారు. రాప్తాడు పీఓ నరేశ్‌ తీరుపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయనే గుత్తి పీఓగా కూడా ఉండడంతో రెండు ప్రాజెక్టులకు ఒక్కరినే ఎలా పెడతారని పీడీని ప్రశ్నించారు. సిబ్బంది తక్కువగా ఉన్నట్లు చెప్పగా.. ’నీ పరిధిలోని నలుగురు సర్పంచుల పేర్లు చెప్పు’ అంటూ నరేశ్‌ను కమిషనర్‌ అడిగారు. దీంతో ఆయన నీళ్లు నమలడంతో ’ఇదీ పరిస్థితి. సర్పంచుల పేర్లు కూడా తెలీకుండా పని చేస్తున్నారు. కనీస అవగాహన లేదు. ఇలాంటి వ్యక్తి మనకొద్దు. వేతనం కట్‌ చేసి తక్షణం మార్చండి’ అని ఆదేశించారు. డీ హీరేహాళ్‌ నుంచి పీఓ శ్రీవిద్య హాజరుకాకుండా జేఈ రావడంతో ఆమె ఎందుకు రాలేదని ప్రశ్నించారు. గర్భిణి అని తెలపడంతో ఇ¯ŒSచార్జ్‌ రాలేదా అని అడిగారు. అయితే, ఆమె సెలవు పెట్టలేదని చెప్పడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ’మెటర్నిటీ లీవ్‌ పెట్టి వెళ్లమనండి. సెలవులూ తీసుకోకుండా.. మీటింగులకూ రాకుండా ఉంటే ఎలా? అక్కడ మరొకరికి అడిషనల్‌ చార్జ్‌ ఇవ్వండి’ అని పీడీని ఆదేశించారు.   
అనంత అభివృద్ధికి ’నీరాంచల్‌’  వరం  
జిల్లాలో ’నీరాంచల్‌’ పథకం అందరి జీవితాలను మారుస్తుందని కమిషనర్‌ రామాంజనేయులు, కలెక్టర్‌ కోన శశిధర్‌ అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే వనరులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామాలను అభివృద్ధి చేయడంలో సర్పంచుల పాత్ర కీలకమన్నారు. వర్కుల కోసం పోటీపడకుండా, అవినీతికి తావులేకుండా పనులు చేపట్టాలని సూచించారు.  పనులను మాత్రం ప్రజలకు చెప్పే చేయాలన్నారు.  ప్రాజెక్ట్‌ అమలయ్యాక జరిగే అభివృద్ధి, చేయాల్సిన పనులు, సర్పంచుల పాత్రపై వివరించారు. కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు శివప్రసాద్, శ్రీనివాసులు, వాటర్‌షెడ్‌ అదనపు పీడీ కృష్ణానాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement