కూలీలకు బ్యాంక్ ఖాతా తప్పనిసరి
-
డ్వామా పీడీ హరిత
చేజర్ల : ఉపాధి హామీ పథకంలో కూలీలుగా పనిచేసే వారు తప్పనిసరిగా బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని డ్వామా పీడీ హరిత తెలిపారు. శుక్రవారం ఆమె మండలంలోని గొల్లపల్లిలో ఉన్న చిన్న చెరువు వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కూలీలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఉపాధి సీనియర్ అసిస్టెంట్లు, మేట్లు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో ఉపాధి హామీ కూలీలకు చెల్లింపులు బ్యాంకుల ద్వారా చేస్తామన్నారు. ఽప్రతి గ్రామ పంచాయతీకి 100 ఫారంపాండ్స్, 25 నాడెప్ కంపోస్టు తొట్టెలు కట్టించాల్సిన బాధ్యత ఫీల్డ్ అసిస్టెంట్స్‌పై ఉందన్నారు. కూలీలకు 100 రోజులకు తగ్గకుండా పనిదినాలను కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ శ్రీహరి, ఎంపీడీఓ వాణి తదితరులు పాల్గొన్నారు.