వేతన కూలీలతో పనులు గుర్తించాలి
-
డ్వామా పీడీ హరిత
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట) : గ్రామాల్లో ఉపాధి పనులు గుర్తించే సమయంలో ఉపాధి సిబ్బంది తప్పనిసరిగా ఆయా గ్రామాల వేతన కూలీల భాగస్వామ్యంతోనే చేపట్టాలని డ్వామా పీడీ డి.హరిత అన్నారు. నగరంలోని పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రణాళిక ప్రక్రియలో జిల్లాలోని ఉపాధిహామీ సాంకేతిక సహాయకులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ లేబర్ బడ్జెట్ తయారీలో పటిష్టమైన ప్రణాళిక అవసరమన్నారు. లేబర్ బడ్జెట్‌ను ఎన్ని రోజులకు ముందుగా రూపొందించాలనే విషయాలపై వివరించారు. ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వాటర్ కన్జర్వేషన్ మిషన్ మోడ్‌లో ప్రణాళికా ప్రక్రియ ఉండాలని తెలిపారు. వాటర్ కన్జర్వేషన్ మిషన్ ప్రక్రియలో ప్రధానంగా డ్వామా, గ్రౌండ్ వాటర్, ఇరిగేషన్, అగ్రికల్చర్, ఫారెస్ట్ శాఖల భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు. ఆయా శాఖల సమన్వయంతో 2017–18 లేబర్ బడ్జెట్ ప్రణాళికను రూపొందించాలని తెలిపారు. ఈ శిబిరంలో ఏపీడీలు వెంకట్రావ్, గోపి, శంకర్‌నారాయణ, రీసోర్స్ పర్సన్స్ విశ్వనా«ద్, షామీర్, పెంచలయ్య పాల్గొన్నారు.