లక్ష్యానికి మంచి ఉపాధి పనులు
-
డ్వామా పీడీ హరిత
వాకాడు : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో 72.43 లక్షల మందికి ఉపాధి పనులు కల్పించాలన్నదే తమ లక్ష్యమని, అయితే ఇప్పటికే లక్ష్యాన్ని మించి 78.91 లక్షల మందికి పనులు కల్పించినట్లు డ్వామా పీడీ హరిత పేరొన్నారు. మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను ఆమె మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె కొండాపురం గ్రామంలో జరుగుతున్న పనులను పరిశీలించి స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సిబ్బందితో సమావేశమయ్యారు. ఉపాధి హామీ పథకం ద్వారా 100 రోజులు పని కల్పించడంలో రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉందని పీడీ హరిత అన్నారు. జిల్లాలో 23 మండలాల్లో 711 పంచాయతీలకు గాను 26 వేల మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించామని, ఇప్పటి వరకు 5175 మరుగుదొడ్లు నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. పనుల పట్ల నిర్లక్ష్యం వహించిన మండలంలోని పలువురి సిబ్బందిని ఆమె మందలించారు. ఈమెతోపాటు ఏపీడీ గోపి, ఎంపీడీఓ ప్రమీలారాణి, వైస్ ఎంపీపీ పాపారెడ్డి పురుషోత్తమరెడ్డి, ఏపీఓ పెంచలమ్మ, సిబ్బంది బాలకృష్ణ, శాంతి, తదితరులు ఉన్నారు.