MNREGA Works
-
ఉపాధి హామీ పనుల్లో ఏపీ సరికొత్త రికార్డు
సాక్షి, అమరావతి: ఉపాధిహామీ పనుల్లో ఏపీ సరికొత్త రికార్డు నమోదు చేసింది. లక్ష్యాన్ని మించి పనిదినాలను కల్పించిన ప్రభుత్వ యంత్రాంగం చరిత్ర సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం జూన్ 30 నాటికి 16 కోట్ల పనిదినాలు కల్పించాల్సిం ఉండగా.. ఏపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 16.7 కోట్ల పనిదినాలు కల్పించి రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా లక్ష్యం చేరుకోవడంలో ఎంతో శ్రమించిన ఉద్యోగులను పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది ప్రశంసించారు. -
వేతన కూలీలతో పనులు గుర్తించాలి
డ్వామా పీడీ హరిత నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట) : గ్రామాల్లో ఉపాధి పనులు గుర్తించే సమయంలో ఉపాధి సిబ్బంది తప్పనిసరిగా ఆయా గ్రామాల వేతన కూలీల భాగస్వామ్యంతోనే చేపట్టాలని డ్వామా పీడీ డి.హరిత అన్నారు. నగరంలోని పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రణాళిక ప్రక్రియలో జిల్లాలోని ఉపాధిహామీ సాంకేతిక సహాయకులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ లేబర్ బడ్జెట్ తయారీలో పటిష్టమైన ప్రణాళిక అవసరమన్నారు. లేబర్ బడ్జెట్‌ను ఎన్ని రోజులకు ముందుగా రూపొందించాలనే విషయాలపై వివరించారు. ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వాటర్ కన్జర్వేషన్ మిషన్ మోడ్‌లో ప్రణాళికా ప్రక్రియ ఉండాలని తెలిపారు. వాటర్ కన్జర్వేషన్ మిషన్ ప్రక్రియలో ప్రధానంగా డ్వామా, గ్రౌండ్ వాటర్, ఇరిగేషన్, అగ్రికల్చర్, ఫారెస్ట్ శాఖల భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు. ఆయా శాఖల సమన్వయంతో 2017–18 లేబర్ బడ్జెట్ ప్రణాళికను రూపొందించాలని తెలిపారు. ఈ శిబిరంలో ఏపీడీలు వెంకట్రావ్, గోపి, శంకర్‌నారాయణ, రీసోర్స్ పర్సన్స్ విశ్వనా«ద్, షామీర్, పెంచలయ్య పాల్గొన్నారు. -
వంద రోజులు పని కల్పించాల్సిందే
డ్వామా పీడీ హరిత అనంతసాగరం(సోమశిల) : జాతీయ ఉపాధిహామీ పథకంలో ప్రతి కూలీకి వంద రోజులు పని కల్పించాలని డ్వామా పీడీ హరిత తెలిపారు. మండల కేంద్రమైన అనంతసాగరంలో గురువారం అనంతసాగరం, మర్రిపాడు, ఆత్మకూరు మండలాలకు చెందిన జాతీయ ఉపాధి హామీ సిబ్బందితో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తొలుత ఇస్కపల్లి, మినగల్లు, పాతదేరాయపల్లి తదతర గ్రామాల్లో ఆమె పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కూలీకి రూ.131 కూలి వస్తోందని, అయితే ఆ మొత్తం రూ.160కు తగ్గకుండా చూడాలన్నారు. ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు మండలాలు ఫాంపాండ్స్ నిర్మాణ లక్ష్యంలో వెనకంజలో ఉన్నాయన్నారు. జిల్లాలో 10 వేల పాండ్స్ లక్ష్యం కాగా ఈ మూడు మండలాలల్లో ఆరువేలు ఏర్పాటుచేయాలన్నారు. నాడెప్ కంపోస్టు తొట్టెలు ప్రతి గ్రామంలో కనీసం 25కి తగ్గకుండా ఏర్పాటుకావాలన్నారు. సమావేశంలో ఆత్మకూరు డ్వామా ఏపీడీ మృదుల, ఎంపీడీఓలు ఐజాక్ ప్రవీణ్, రమేష్, ఏపీఓలు దయానంద్, లక్ష్మీనర్సయ్య, మురళీ పాల్గొన్నారు. -
అవకతవకలకు పాల్పడితే చర్యలు
డ్వామా చీఫ్ విజిలెన్స్ అధికారి రమాంజనేయప్రసాద్ కలిగిరి: ఉపాధిహామీ పనుల్లో అవకతవకలకు పాల్పడితే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని డ్వామా చీఫ్ విజిలెన్స్ ఆఫిసర్ బి.రామాంజనేయప్రసాద్ హెచ్చరించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధిహామీ పథకం సామాజిక తనిఖీ, మండల స్థాయి బహిరంగ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015- సెప్టెంబర్ 1 నుంచి 2016- ఆగష్టు 31వరకు మండలంలోని 23 పంచాయతీల పరిధిలో రూ.8.86 కోట్ల విలువ చేసే 3,107 పనులకు గ్రామస్థాయిలో తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. కొలతలు, చెక్‌డ్యాంలు (అలుగు) నిర్మాణాలపై ఉపాధిహామీ సిబ్బంది ఇచ్చిన వివరణపై తీవ్ర అసహానం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకుంటే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. టీఏ నుంచి రూ.19.353 రికవరికి ఆదేశించారు. ఆరు చెక్‌డ్యామ్‌ల నాణ్యత, ప్రమాణాలు పరిశీలించాలని క్వాలీటీ కంట్రోల్‌కు సిఫార్సు చేశారు. వందల్లో రికవరి: ఉపాధిహామీ పథకం పనుల్లో సామాజిక తనిఖీలో పలు పంచాయతీల్లో రూ.వందల రికవరీలు వచ్చాయి. గ్రామాల్లో రూ.లక్షల్లో జరిగిన ఉపాధి పనుల్లో అవకతవకలు జరిగాయని బలంగా ఆరోపణలు ఉన్నప్పటికీ రికవరీ వందల్లో ఉండటం విశేషం. డ్వామా ఏపీడీ ( ఫైనాన్స్ మేనేజర్ ) బీవీ ప్రభాకర్, జిల్లా విజిలెన్స్ అధికారి టి.శ్రీనివాసులురెడ్డి, ఏపీడీ వెంకటరావు, సీనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారి ఓవీ విజయ్‌కుమార్, ఎంపీపీ మద్దసాని వెంకటేశ్వరరావు, ఏపీఓ జ్యోతిరెడ్డి, పాల్గొన్నారు. -
ఉపాధి హామీ పనులు వేగవంతం
కోవూరు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులను త్వరతగతిన పూర్తి చేయాలని డ్వామా పీడీ హరిత కోరారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం కొడవలూరు, విడవలూరు, కోవూరు ఉపా«ధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 27 కరువు మండలాల్లో 150 దినాలు ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నామన్నారు. ఆట స్థలాలు, శ్మశానవాటికలను జియోట్యాగింగ్ చేయడం వాటి ద్వారా అవసరమైన చోట ఉపా«ధి హామీ నిధులు ఖర్చు చేవచ్చన్నారు. ప్రతి పంచాయతీలో ఉన్న వారందరికీ జాబ్‌కార్డు ఉండే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ 40 రోజులు తక్కువ లేకుండా పని కల్పించాలన్న ఆలోచనతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఏపీడీ శ్రీహరి, కొడవలూరు, విడవలూరు ఎంపీడీవోలు వసుంధర, విజయకుమార్, ఈవోపీఆర్డీ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
పనులు చేయకుంటే ఇంటికే
కలెక్టర్ ముత్యాలరాజు కావలిఅర్బన్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు సక్రమంగా చేయని సిబ్బందిని ఇంటికి పంపిస్తామని కలెక్టర్ ముత్యాలరాజు హెచ్చరించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం క్లస్టర్ పరిధిలోని ఆరు మండలాల ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందికి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, పంట సంజీవని, జియోట్యాగింగ్, ఫాంపాండ్స్, మొక్కల పెంపకం, జాబ్‌కార్డులు, మేట్ గ్రూపులు, సిబ్బందికి ఇచ్చిన టార్గెట్లు, పనిచేస్తున్న కూలీలు, డిమాండ్లు, ఎస్టిమేషన్లు, పూర్తైన పనులు, కూలీలు పనులకు రాకపోవడానికి గల కారణాలు వంటి పలు అంశాలపై చర్చించారు. విధి నిర్వహణలోని పనుల్లో పురోగతి చూపని బోగోలు మండలానికి చెందిన ముగ్గురు, దగదర్తి మండలానికి చెందిన ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లను సమీక్షా సమావేశం నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. డ్వామా పీడీ హరిత మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందికి ఇచ్చిన టార్కెట్లు పూర్తి చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన టార్గెట్లు త్వరగా చేపడతామని సమాధానం ఇచ్చిన సిబ్బందిని ఇంతకాలం పూర్తిచేయని పనులు ఇప్పుడు ఎలా చేయగలదని ప్రశ్నించారు. ఇప్పటికైనా చిత్తశుద్ధితో పనులు చేపట్టి త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డ్వామా ఏపీడీ ప్రసాద్‌రావు, కావలి, జలదంకి, కొండాపురం, అల్లూరు, బోగోలు మండలాల ఎంపీడీఓలు లింగారెడ్డి జ్యోతి, రవీంద్ర, ఖాజాబీ, కనకదుర్గా భవాని, వెంకట శేషయ్య, దగదిర్తి ఈఓపీఆర్డీ వెంకటేశ్వర్లు, కావలి ఏపీఓ శ్యామల, ఆయా మండాలల ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఈసీలు, సీనియర్, జూనియర్ మేట్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
లక్ష్యానికి మంచి ఉపాధి పనులు
డ్వామా పీడీ హరిత వాకాడు : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో 72.43 లక్షల మందికి ఉపాధి పనులు కల్పించాలన్నదే తమ లక్ష్యమని, అయితే ఇప్పటికే లక్ష్యాన్ని మించి 78.91 లక్షల మందికి పనులు కల్పించినట్లు డ్వామా పీడీ హరిత పేరొన్నారు. మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను ఆమె మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె కొండాపురం గ్రామంలో జరుగుతున్న పనులను పరిశీలించి స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సిబ్బందితో సమావేశమయ్యారు. ఉపాధి హామీ పథకం ద్వారా 100 రోజులు పని కల్పించడంలో రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉందని పీడీ హరిత అన్నారు. జిల్లాలో 23 మండలాల్లో 711 పంచాయతీలకు గాను 26 వేల మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించామని, ఇప్పటి వరకు 5175 మరుగుదొడ్లు నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. పనుల పట్ల నిర్లక్ష్యం వహించిన మండలంలోని పలువురి సిబ్బందిని ఆమె మందలించారు. ఈమెతోపాటు ఏపీడీ గోపి, ఎంపీడీఓ ప్రమీలారాణి, వైస్ ఎంపీపీ పాపారెడ్డి పురుషోత్తమరెడ్డి, ఏపీఓ పెంచలమ్మ, సిబ్బంది బాలకృష్ణ, శాంతి, తదితరులు ఉన్నారు.