ఉపాధి హామీ పనులు వేగవంతం
కోవూరు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులను త్వరతగతిన పూర్తి చేయాలని డ్వామా పీడీ హరిత కోరారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం కొడవలూరు, విడవలూరు, కోవూరు ఉపా«ధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 27 కరువు మండలాల్లో 150 దినాలు ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నామన్నారు. ఆట స్థలాలు, శ్మశానవాటికలను జియోట్యాగింగ్ చేయడం వాటి ద్వారా అవసరమైన చోట ఉపా«ధి హామీ నిధులు ఖర్చు చేవచ్చన్నారు. ప్రతి పంచాయతీలో ఉన్న వారందరికీ జాబ్‌కార్డు ఉండే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ 40 రోజులు తక్కువ లేకుండా పని కల్పించాలన్న ఆలోచనతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఏపీడీ శ్రీహరి, కొడవలూరు, విడవలూరు ఎంపీడీవోలు వసుంధర, విజయకుమార్, ఈవోపీఆర్డీ శ్రీనివాసులు పాల్గొన్నారు.