ఉపాధిహామీ సిబ్బందిపై డ్వామా పీడీ ఆగ్రహం
Published Sat, Jul 23 2016 11:31 PM | Last Updated on Sat, Sep 29 2018 6:11 PM
దుగ్గొండి : ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇంకుడు గుంతలు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో అలసత్వం ప్రదర్శించిన సిబ్బందిపై డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గుంతలు సరే..బిల్లులేవి’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. గ్రామాలవారీగా గుంతల వివరాలు.. బిల్లుల చెల్లింపులు తెలపాలంటూ మండల అధికారులకు ఆయన ఆదేశించారు. దీనిపై ఎంపీడీఓ వెంకటేశ్వర్‌రావు మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై గ్రామాలవారిగా పనులపై వివరాలు సేకరించారు. రెండు రోజుల్లోగా గుంతలు తీసిన వారందరి బిల్లులు సిద్ధం చేసి, ఎంబీ రికార్డుతో పాటు ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తిచేయాలని పీడీ ఆదేశించినట్లు ఎంపీడీఓ తెలిపారు.
Advertisement
Advertisement