అనంతపురం టౌన్ : జిల్లా నీటియాజమాన్య సంస్థలో మెరుగైన పనితీరు కనబరచిన ఉద్యోగులకు అవార్డులు దక్కాయి. గురువారం రిపబ్లిక్ డే పురస్కరించుకుని జెండావిష్కరణ అనంతరం వివిధ హాదాల్లోని 29 మందికి డ్వామా కార్యాలయంలో పీడీ నాగభూషణం అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
అవార్డులు సాధించిన వారిలో విజయలక్ష్మి (ఏపీడీ, ఉరవకొండ), మంజుల (ఏపీఓ, ఓడీసీ), ప్రసాద్ (ఏపీఓ, వజ్రకరూరు), శ్రీనివాసులు (పీఓ, గుంతకల్లు), బబ్లూ (ఈసీ, ధర్మవరం), కళ్యాణదుర్గం, శింగనమల వాటర్‌షెడ్ జేఈలు రామచంద్ర, రాజ, హిందూపురం క్లస్టర్ అసిస్టెంట్ ఏపీడీ కృష్ణకుమార్, కదిరి డబ్ల్యూసీసీలోని కంప్యూటర్ ఆపరేటర్ అమ్మాజాన్, తాడిపత్రి ఎంసీసీలోని కంప్యూటర్ ఆపరేటర్ అనురాధ, పుట్టపర్తి డబ్ల్యూసీసీ టీఓ శరత్‌బాబు, గుమ్మఘట్ట టెక్నికల్ ఆఫీసర్ ఉస్మాన్ అలీఖాన్, ఏఎఫ్–ఆర్డీటీ డబ్ల్యూసీసీలో వాటర్‌షెడ్ అసిస్టెంట్ వీరేంద్ర ఉన్నారు.
డ్వామా కార్యాలయంలో పని చేసే సూపరింటెండెంట్లు హబీబాఖానం, అమృతవల్లి, డీవీఓ చంద్రశేఖర్, డిప్యూటీ ఎస్‌ఓ అంజాద్ హుస్సేన్, టైపిస్ట్ పర్వేశ్, ఆఫీస్ అసిస్టెంట్ రామ్మోహన్, కంప్యూటర్ ఆపరేటర్లు హనుమంతరెడ్డి, ఇర్ఫానా, వెంకటనారాయణ, నాగరాజు, ఆఫీస్ సబార్డినేట్ చంద్రశేఖర్, అటెండర్ తిమ్మప్ప, సిద్దార్థుడు, డ్రైవర్ రఫి, ప్రసాద్‌లకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
డ్వామాలో 29 మందికి అవార్డులు
Published Fri, Jan 27 2017 1:37 AM | Last Updated on Sat, Sep 29 2018 6:11 PM
Advertisement
Advertisement