కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు(Republic Day celebrations) ఘనంగా నిర్వహించారు. రెడ్ రోడ్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సీఎం మమతా బెనర్జీ(CM Mamata Banerjee) కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఆర్మీ, నేవీ, వైమానిక దళం, బెంగాల్ పోలీసులు, కోల్‌కతా పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, విపత్తు నిర్వహణ బృందాలు కవాతు చేశాయి. పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు, ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
అయితే, ఈ పరేడ్‌లో ఆర్మీకి చెందిన రోబో శునకాలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాయి. మల్టీ యుటిలిటీ లెగ్డ్ ఎక్విప్‌మెంట్ (MULE)గా పేర్కొన్న రోబోటిక్ డాగ్‌కు సంజయ్‌గా నామకరణం చేశారు. ఈ రోబో డాగ్స్ మెట్లతో పాటు కొండలను నిటారుగా ఎక్కడంతో పాటు అడ్డంకులను దాటగలవు.
జీవ, రసాయన, అణు పదార్థాలను పసిగట్టే సెన్సార్లు కలిగి ఉన్న ఈ రోబో డాగ్స్.. నిఘాతో పాటు బాంబులను గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడం వంటి సేవల కోసం ఈ రోబో డాగ్స్‌ను ఆర్మీ ఉపయోగిస్తోంది.
ఇదీ చదవండి: గుజరాత్ శకటాన్ని చూసి మురిసిపోయిన ప్రధాని మోదీ.. కారణమిదే
15 కిలోల బరువును కూడా ఇవి మోయగలవు, అలాగే 40 డిగ్రీల నుంచి 55 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతల్లో కూడా పని చేస్తాయి. ఆర్మీలోని వివిధ యూనిట్లలో సుమారు వంద వరకు రోబో డాగ్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
#WATCH | West Bengal CM Mamata Banerjee takes part in #RepublicDay2025 celebrations at Kolkata.
(Source: Mamata Banerjee Social Media) pic.twitter.com/1KUWOvFFvL— ANI (@ANI) January 26, 2025
Comments
Please login to add a commentAdd a comment