ఉపాధి కూలీల జీవనోపాధికి కుట్టుశిక్షణ
డ్వామా పీడీ హరిత
బాలాయపల్లి : ఉపాధి హామీ పథకం కింద జిల్లాలోని 20,800 మంది కూలీలకు కుట్టు శిక్షణ ద్వారా జీవనోపాధి కల్పిస్తున్నామని డ్వామా పీడీ హరిత అన్నారు. బుధవారం మండలంలోని స్త్రీశక్తి భవనంలో కుట్టు శిక్షణ పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఆమెlమాట్లాడుతూ చిల్లకూరు, వింజమూరు, బాలాయపల్లి మండలాల్లో మహిళలకు శిక్షణ ఇస్తున్నామన్నారు. త్వరలో పురుషులకు సిమెంట్ వరలు రూపొందించడం, ఎయిర్‌కండీషన్, కంప్యూటర్ (హార్డ్‌వేర్), సెల్‌ఫోన్లు రీపేర్, మోటార్ రివైండింగ్ అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఏపీడీ శంకర్, గ్రామ సర్పంచ్ మస్తాన్‌నాయుడు, ఎంసీఎ వెంకయ్య, సీఆర్పీ చిరంజీవిపాల్గొ న్నారు.
ఎంపీyీ ఓ, ఏపీఓపై ఆగ్రహం
సమయపాలన పాటించడం అలవాటు లేదా? పీడీ ఎంపీడీఓ, ఏపీఓపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. 11.30 గంటలవుతున్నా కార్యాలయానికి రాకుండా ఎక్కడికెళ్లారు? మీరు ప్రభుత్వ ఉద్యోగులా? లేక ప్రైవేటు ఉద్యోగులా అని మండిపడ్డారు. ఉపాధి ఏపీఓ ఎందుకు రాలేదు. శాశ్వతంగా ఇంటి దగ్గర ఉండమని చెప్పండి అంటూ అసహనం వ్యక్తంచేశారు. ఏపీఓకు షోకాజ్ నోటీసు ఇస్తున్నట్లు చెప్పారు.