balayapalli
-
మతిస్థిమితం లేని యువతికి చిత్రహింసలు
సాక్షి, నెల్లూరు: మతిస్థిమితం లేని ఓ యువతిని బంధువులే చిత్రహింసలకు గురి చేస్తున్న హృదయ విదారక ఘటన బాలాయపల్లిలో వెలుగుచూసింది. ఐసీడీఎస్ అధికారుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం యార్లపూడి గ్రామానికి చెందిన పద్మకు చిన్న వయసు నుంచే మతిస్థిమితం లేదు. ఆమె చిన్న తనంలోనే తల్లి మృతి చెందగా, తండ్రి ఎటో వెళ్లిపోయాడు. పద్మ తన మేనమామ గగనం మల్లికార్జున, ప్రసన్న దంపతుల సంరక్షణలో ఉంటుంది. ఏడాది క్రితం పద్మకు అక్క వరసయ్యే బాలాయపల్లిలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న సుమతి, బావ వెంకటయ్య వద్ద మేనమామ వదిలి వెళ్లిపోయాడు. అయితే కొంతకాలం నుంచి పద్మను వారు చిత్రహింసలకు గురి చేసి తీవ్రంగా కొడుతున్నారు. పద్మను ఇంట్లో నిర్బంధించి పైశాచికంగా ప్రవర్తించేవారు. ఈ విషయం వైఎస్సార్సీపీ నాయకురాలు రాయి దేవికాచౌదరి దృష్టికి వెళ్లడంతో ఆమె అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఐసీడీఎస్ సీడీపీఓ జ్యోతి, ఎస్సై నరసింహారావు, నెల్లూరు దిశ పోలీసులు మంగళవారం పద్మ నివాసం వద్దకు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. గాయాలతో ఉన్న పద్మను చూసి నివ్వెరపోయారు. వెంటనే ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించి, పక్కనే ఉన్న సఖి కేంద్రానికి తరలించారు. పద్మకు ప్రభుత్వం నుంచి దివ్యాంగుల పింఛన్ వస్తున్న విషయం గమనార్హం. -
అన్నదాతలకు ‘బాబు’ కుచ్చుటోపీ!
సాక్షి, బాలాయపల్లి: ఎన్నికల వేళ రైతన్నలను మరోసారి మభ్యపెట్టేందుకు తెలుగుదేశం నాయకులు కొత్త ఎత్తులు వేస్తూ మోసపూరిత హామీలు గుప్పిస్తూ అన్నదాతలను వంచించే ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఎన్నికల నేపథ్యంలో...! అన్నదాత సుభీభవతో రైతులను అభివృద్ధి చేస్తామని, సన్న, చిన్నకారు రైతులకు రూ.15 వేలు ఇస్తామని, పోస్ట్‌డేటెడ్ చెక్కులతో అన్నదాతలకు నగదు ఆందేలా చూస్తాం అంటూ ప్రకటిస్తూ మరోమారు రైతులను మోసం చేసేందుకు కొత్త›కొత్త పథకాలు అమలు చేస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీపై తొలి సంతకం. ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతా, ఎరువుల ధరలను తగ్గిస్తా, గిట్టుబాటు ధరలు కల్పిస్తామంటూ సీఎం చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. పేస్కేల్ ఆధారంగా రుణమాఫీ ఉంటుందని రూ 1.50 లక్షల వరకు బ్యాంకు రుణం తీసుకున్న రైతులకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉంది. ఏకకాలంలో మాఫీ చేయడం సాధ్యం కాదన్నారు. ఆదికూడా 5 విడతలుగా మాఫీ మాత్రం మొండిచేయి చూపించారు రైతన్నలు ఏమంటున్నారంటే..! ఏరు దాటే వరకు ఓడ మలన్న.... ఏరుదాటక బోడి మల్లన్న అన్న చందంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు మరోమారు రైతులను నట్టేట మంచడానికి పచ్చి హామీలు ఇస్తున్నారని మండిపడతున్నారు. నియోజకవర్గంలోని సుమారు 56,789 మంది రైతులు అధికంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం మామిడి, జామా, వరి, నిమ్మ, బొప్పాయి, వివిధ రకాల కురగాయల పంటలు 23,314 హెక్టార్లలో సాగవుతోంది. 56,789 మంది రైతులు వ్యవసాయ రంగాన్నే నమ్ముకుని పూట గడుపుతున్నారు. అయితే రైతులకు వాతావరణం అనుకూలించాక, వరుణుడు కరుణించకపోవడంతో ఏటా నష్టాలు తప్పడం లేదు. అప్పులు చేసి పంట పండిస్తే పెట్టిన పెట్టుబడి చేతికందే పరిస్థితి కనిపించడం లేదు. గత ఏడాది మామిడికి గిట్టుబాటు ధరల్లేకపోవడంతో పంట నేలమట్టమైంది. రైతులు రోడ్డుపైకి రావడంతో ప్రభుత్వం కేజీకి రూ.2 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. ఆ తర్వాత ఆ రూ.2 రూపాయలు కొంతమంది రైతులకు దక్కలేదు. ఇక వర్షాలు పడకపోవడంతో నియోజకవర్గంలో కొంతమేరకు ఎండిపోయింది. ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించి నష్టపోయిన రైతు వివరాలను సేకరించి చేతులు దులుపుకుంది. తీరా ఏడాది ఆపుతున్నా నష్టపరిహారం చెల్లించలేదు. దీంతో రైతులు ఏ పంటలు సాగు చేయాలన్న జంకుతున్నారు. ప్రభుత్వం ఆర్థిక సాయం ఆందించడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. రుణమాఫీకి షరుతులు.. 2014 ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీని నెరవేర్చడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో రుణమాఫీకి షరతులు పెట్టడంతో చాలా మంది రైతన్నలు రుణమాఫీకి దూరమయ్యారు. ఐదు విడతల్లో మూడు విడతల వరకు మాఫీ పరిమితం కావడంతో రైతులు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యతిరేకత చేస్తున్నారు. బ్యాంకుల నుంచి నోటీసులు రావడంతో భయాందోళనకు గురవుతున్నారు. 2019 ఎన్నికలు సమీపించడంతో చంద్రబాబు పాత పల్లవి ఆందుకున్నారని ఆరోపణలు వెల్లువేత్తున్నాయి. ఇక ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్తామని పలువురు రైతులు చెబుతున్నారు. సాగు విస్త్తరణ తగ్గుముఖం తెలుగుదేశం పాలనలో రైతాంగం పూర్తిగా డీలా పడింది. సాగు విస్తీర్ణం ఏటా తగ్గుతూ వస్తోంది. అప్పులు చేసి పంటలు పండించే స్థాయిలో రైతులు లేరు. – సురేష్‌రెడ్డి, చిలమనూరు రైతు ప్రభుత్వం మోసం చేసింది.. ప్రభుత్వం రుణమాఫీ విషయంలో మోసం చేసింది. ఇంత వరకు రూపాయి మాఫీ చేయలేదు. కొత్త రుణాలు కావాలంటే బ్యాంకర్లు ఇవ్వనంటున్నారు. ఇప్పుడు అన్నదాత సుభీభవ అంటూ నాటకాలు మొదలు పెట్టారు. – రామయ్య, బొల్లవారిపాళెం రైతు బుద్ధి చెబుతాం.. రైతులు బాబు గారిని నమ్మే పరిస్థితి లేదు. గతంలో చెప్పిన మాటలు నమ్మి పూర్తిగా మోసపోయాం. ఇప్పుడు పోస్ట్›డేటెడ్ చెక్కులు ఇస్తామని అంటున్నారు. అవి ఎవరికి కావాలండి ఇచ్చిన మాట ప్రకారం రైతులకు న్యాయం చేయాలి. లేకుంటే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తాం. – కరణం శ్రీనివాసులు నాయుడు, బాలాయపల్లి రైతు -
రూ.12 కోట్లతో అభివృద్ధి పనులు
తిరుపతి ఎంపీ వెలగపల్లి కామకూరు(బాలాయపల్లి) : రూ.12 కోట్లుతో తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ అన్నారు. బుధవారం మండలంలోని కామకూరు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో రూ.7.50 లక్షలతో బస్‌షెల్టర్, సీసీరోడ్లు, తాగునీటికి, విద్యుత్ దీపాల ఏర్పాటుకు మంజూరుచేశామన్నారు. కామకూరు నుంచి గాజులపల్లి వరకు, చిలమనూరు గ్రామం నుంచి కామకూరు వరకు, నిడిగల్లు రైల్వేస్టేషన్ నుంచి కొత్తురు గ్రామం వరకు రోడ్డు వసతి కల్పించాలని జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపుతున్నామన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్యాకేజీ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. హోదా వస్తే పరిశ్రమలు ఏర్పాటై యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. ఈకార్యక్రమంలో సూళ్లూరుపేట గడపగడపకు వైఎస్సార్ పరిశీలకుడు గూడూరు భాస్కర్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ కిరణ్మయి, బాలాయపల్లి ఎంపీటీసీ రమేష్ ,పెరిమిడి రామయ్య, సురేంద్రరెడ్డి, కామకూరు రమణయ్య, వెంకటయ్య, పాల్గొన్నారు. -
డాక్టర్ సార్ ఎప్పుడొస్తారయ్యా..?
బాలాయపల్లి : బాలాయపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. డాక్టర్ ఉంటేనే సిబ్బందికి వైద్య సేవలు అందిస్తున్నారు. ఒకవేళ వైద్యుడు రాకపోతే ఆపూట రోగులకు చికిత్స చేయడం ఆపేస్తున్నారు. మంగళవారం కేంద్రానికి ఇన్చార్జి డాక్టర్ రాకపోవడంతో రోగులుపడ్డ ఇబ్బందులు అన్నిఇన్నీ కావు. ఈ సందర్భంగా పలువురు రోగులు మాట్లాడుతూ డాక్టర్ లేకపోతే మందులు లేవు వెంకటగిరి, బంగారుపేటకు వెళ్లాలని సిబ్బంది చెబుతున్నారని ఆవేనద వ్యక్తంచేశారు. పిగిలాం కొత్తపాళెం, చుట్టి, మన్నూరు గ్రామం నుంచి జ్వరంతో వస్తే సూది మందు ఇవ్వాకుండా పంపేశారని కన్నీరు పెట్టుకున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే స్తోమత లేక ఇక్కడికే వస్తున్నామని, సిబ్బంది రోగులపట్ల దురుసుగా ప్రవరిస్తున్నారని వాపోయారు. జిల్లా అధికారులు స్పందించాలని కోరారు. దీనిపై సూపర్వైజర్ లింగమూర్తిని వివరణ కోరగా ఇన్చార్జి డాక్టర్ వారంలో రెండు రోజులు వస్తారని, వైద్య సిబ్బందితో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
ఉపాధి కూలీల జీవనోపాధికి కుట్టుశిక్షణ
డ్వామా పీడీ హరిత బాలాయపల్లి : ఉపాధి హామీ పథకం కింద జిల్లాలోని 20,800 మంది కూలీలకు కుట్టు శిక్షణ ద్వారా జీవనోపాధి కల్పిస్తున్నామని డ్వామా పీడీ హరిత అన్నారు. బుధవారం మండలంలోని స్త్రీశక్తి భవనంలో కుట్టు శిక్షణ పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఆమెlమాట్లాడుతూ చిల్లకూరు, వింజమూరు, బాలాయపల్లి మండలాల్లో మహిళలకు శిక్షణ ఇస్తున్నామన్నారు. త్వరలో పురుషులకు సిమెంట్ వరలు రూపొందించడం, ఎయిర్‌కండీషన్, కంప్యూటర్ (హార్డ్‌వేర్), సెల్ఫోన్లు రీపేర్, మోటార్ రివైండింగ్ అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఏపీడీ శంకర్, గ్రామ సర్పంచ్ మస్తాన్‌నాయుడు, ఎంసీఎ వెంకయ్య, సీఆర్పీ చిరంజీవిపాల్గొ న్నారు. ఎంపీyీ ఓ, ఏపీఓపై ఆగ్రహం సమయపాలన పాటించడం అలవాటు లేదా? పీడీ ఎంపీడీఓ, ఏపీఓపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. 11.30 గంటలవుతున్నా కార్యాలయానికి రాకుండా ఎక్కడికెళ్లారు? మీరు ప్రభుత్వ ఉద్యోగులా? లేక ప్రైవేటు ఉద్యోగులా అని మండిపడ్డారు. ఉపాధి ఏపీఓ ఎందుకు రాలేదు. శాశ్వతంగా ఇంటి దగ్గర ఉండమని చెప్పండి అంటూ అసహనం వ్యక్తంచేశారు. ఏపీఓకు షోకాజ్ నోటీసు ఇస్తున్నట్లు చెప్పారు. -
బావిలో దూకి తల్లీకూతుళ్ల ఆత్మహత్య
నెల్లూరు : నెల్లూరు జిల్లా బాలాయపల్లిలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ బావిలో దూకి తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు. కాగా కుటుంబ కలహాల కారణంగానే వారు ఆత్మహత్యలు చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. మృతులు తల్లి సుజాత, చిన్నారులు సాత్విక్, జోషికగా గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భారీగా మద్యం స్వాధీనం
బాలాయపల్లి, న్యూస్‌లైన్: జిల్లాలో వేర్వేరు ప్రాం తాల్లో బుధవారం భారీగా ఎన్నికల మద్యాన్ని స్వాధీ నం చేసుకున్నారు. మండలంలోని గొట్టికాడులో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారు లు కాంగ్రెస్ పార్టీకి చెందిన 412 మ ద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ గొట్టికాడు గ్రామస్తులు సమాచారం మేరకు వీరయ్య ఇంటిని తనిఖీ చేశామన్నారు. అక్కడ ఉన్న 412 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మద్యం సీసాలను బాలాయపల్లి ఎస్సై శ్రీహరిబాబుకు అప్పజెప్పామన్నారు. దాడుల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులు టీవీ రమణయ్య, శ్యామంత్ కుమార్, బాలాయపల్లి పోలీసులు రామకృష్ణ పాల్గొన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. 140 మద్యం సీసాల పట్టివేత చేజర్ల: చేజర్ల మండలం బిల్లుపాడు సమీపంలో 140 మద్యం సీసాలను బుధవారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సీహెచ్ ఉరుకుందా తెలిపారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టడానికి కొందరు వ్యక్తులు మద్యం తీసుకెళ్తుండడంతో అనుమానం వచ్చి తనిఖీ చేయగా మద్యం సీసాలు దొరికాయన్నారు. మద్యాన్ని తీసుకెళ్తున్న యనమదల మస్తానయ్య, ఉదయగిరి శ్రీనును అరెస్టు చేసినట్లు తెలిపారు. 27 కేసుల మద్యం స్వాధీనం వాకాడు: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రహస్యంగా తరలిస్తున్న 27 కేసుల మద్యాన్ని స్థానిక ఎక్సైజ్ సీఐ కరిమాబేగం, ఎస్సై యస్ధాని తన సిబ్బందితో కలసి బుధవారం స్వాధీనం చేసుకున్నారు. మండల పరిధిలోని గంగన్నపాళెం, పుచ్చలపల్లి సమీపాన 25 కేసులు, దుగ్గరాజపట్నం పంచాయితీ కొత్తూరు పొలాల్లో రెండు కేసులు పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితులు పరారయ్యినట్లు పేర్కొన్నారు. 70 మద్యం సీసాల స్వాధీనం రాపూరు: రాపూరు సిద్దలయ్య సెంటర్ సమీపంలో బుధవారం రాత్రి 70 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐలు విశ్వనాధ్రెడ్డి, జిలానీబాషా తెలిపారు. సిద్దలయ్య సెంటర్‌వద్ద ఒక దుకాణంలో మద్యం ఉన్నట్లు సమాచారం అందడంతో తనిఖీ చేశామని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం సీసాల విలువ సుమారు రూ.10 వేలు ఉంటుందని తెలిపారు. తనిఖీల పేరుతో పోలీసుల దోపిడీ వాకాడు: రెండో విడత పరిషత్ ఎన్నికలు ఈ నెల 11న జరగనున్న నేపథ్యంలో అక్రమ మద్యాన్ని అరికట్టి ప్రశాంత వాతావరణాన్ని కల్పించాల్సిన అధికారులు తనిఖీల పేరుతో నిలువునా దోచుకుంటున్నారు. బుధవారం వాకాడులో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అక్రమంగా మద్యాన్ని పెద్ద మొత్తంలో తరలిస్తున్న వాహనాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి నట రాజ్ బృందం అధికారులు పట్టుకున్నారు. అనంతరం నాయకులు, అధికారుల మధ్య బేరం కుదరడంతో ఆ వాహనాన్ని వదిలేశారు. రెండు ఖాళీ అట్టపెట్టెల్లో 17 బాటిళ్లు అమర్చి ఎక్సైజ్ సీఐ కరిమాబేగంకు అప్పజెప్పారు. ఇదేమటని ‘న్యూస్‌లైన్’ అధికారులను వివరణ కోరగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రెండు కేసులను పడేసి వెళ్లినట్లు తెలి పారు. ఇలా మండలంలో పలు చోట్ల తనిఖీల పేరుతో ఎన్నికల నిఘా అధికారులు మామూళ్లు వసూలు చేసుకుంటూ అధికార పార్టీకి చెందిన నాయకులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలున్నాయి.