బాలాయపల్లి, న్యూస్‌లైన్: జిల్లాలో వేర్వేరు ప్రాం తాల్లో బుధవారం భారీగా ఎన్నికల మద్యాన్ని స్వాధీ నం చేసుకున్నారు. మండలంలోని గొట్టికాడులో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారు లు కాంగ్రెస్ పార్టీకి చెందిన 412 మ ద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ గొట్టికాడు గ్రామస్తులు సమాచారం మేరకు వీరయ్య ఇంటిని తనిఖీ చేశామన్నారు. అక్కడ ఉన్న 412 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మద్యం సీసాలను బాలాయపల్లి ఎస్సై శ్రీహరిబాబుకు అప్పజెప్పామన్నారు. దాడుల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులు టీవీ రమణయ్య, శ్యామంత్ కుమార్, బాలాయపల్లి పోలీసులు రామకృష్ణ పాల్గొన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
140 మద్యం సీసాల పట్టివేత
చేజర్ల: చేజర్ల మండలం బిల్లుపాడు సమీపంలో 140 మద్యం సీసాలను బుధవారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సీహెచ్ ఉరుకుందా తెలిపారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టడానికి కొందరు వ్యక్తులు మద్యం తీసుకెళ్తుండడంతో అనుమానం వచ్చి తనిఖీ చేయగా మద్యం సీసాలు దొరికాయన్నారు. మద్యాన్ని తీసుకెళ్తున్న యనమదల మస్తానయ్య, ఉదయగిరి శ్రీనును అరెస్టు చేసినట్లు తెలిపారు.
27 కేసుల మద్యం స్వాధీనం
వాకాడు: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రహస్యంగా తరలిస్తున్న 27 కేసుల మద్యాన్ని స్థానిక ఎక్సైజ్ సీఐ కరిమాబేగం, ఎస్సై యస్ధాని తన సిబ్బందితో కలసి బుధవారం స్వాధీనం చేసుకున్నారు. మండల పరిధిలోని గంగన్నపాళెం, పుచ్చలపల్లి సమీపాన 25 కేసులు, దుగ్గరాజపట్నం పంచాయితీ కొత్తూరు పొలాల్లో రెండు కేసులు పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితులు పరారయ్యినట్లు పేర్కొన్నారు.
70 మద్యం సీసాల స్వాధీనం
రాపూరు: రాపూరు సిద్దలయ్య సెంటర్ సమీపంలో బుధవారం రాత్రి 70 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐలు విశ్వనాధ్‌రెడ్డి, జిలానీబాషా తెలిపారు. సిద్దలయ్య సెంటర్‌వద్ద ఒక దుకాణంలో మద్యం ఉన్నట్లు సమాచారం అందడంతో తనిఖీ చేశామని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం సీసాల విలువ సుమారు రూ.10 వేలు ఉంటుందని తెలిపారు.
తనిఖీల పేరుతో పోలీసుల దోపిడీ
వాకాడు: రెండో విడత పరిషత్ ఎన్నికలు ఈ నెల 11న జరగనున్న నేపథ్యంలో అక్రమ మద్యాన్ని అరికట్టి ప్రశాంత వాతావరణాన్ని కల్పించాల్సిన అధికారులు తనిఖీల పేరుతో నిలువునా దోచుకుంటున్నారు. బుధవారం వాకాడులో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అక్రమంగా మద్యాన్ని పెద్ద మొత్తంలో తరలిస్తున్న వాహనాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి నట రాజ్ బృందం అధికారులు పట్టుకున్నారు. అనంతరం నాయకులు, అధికారుల మధ్య బేరం కుదరడంతో ఆ వాహనాన్ని వదిలేశారు. రెండు ఖాళీ అట్టపెట్టెల్లో 17 బాటిళ్లు అమర్చి ఎక్సైజ్ సీఐ కరిమాబేగంకు అప్పజెప్పారు. ఇదేమటని ‘న్యూస్‌లైన్’ అధికారులను వివరణ కోరగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రెండు కేసులను పడేసి వెళ్లినట్లు తెలి పారు. ఇలా మండలంలో పలు చోట్ల తనిఖీల పేరుతో ఎన్నికల నిఘా అధికారులు మామూళ్లు వసూలు చేసుకుంటూ అధికార పార్టీకి చెందిన నాయకులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలున్నాయి.
భారీగా మద్యం స్వాధీనం
Published Thu, Apr 10 2014 2:58 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement