ఎండుతున్న నిమ్మ చెట్లు, ఎండిపోతున్న వరి నాట్లు
సాక్షి, బాలాయపల్లి: ఎన్నికల వేళ రైతన్నలను మరోసారి మభ్యపెట్టేందుకు తెలుగుదేశం నాయకులు కొత్త ఎత్తులు వేస్తూ మోసపూరిత హామీలు గుప్పిస్తూ అన్నదాతలను వంచించే ప్రయత్నం చేస్తున్నారు.
2019 ఎన్నికల నేపథ్యంలో...!
అన్నదాత సుభీభవతో రైతులను అభివృద్ధి చేస్తామని, సన్న, చిన్నకారు రైతులకు రూ.15 వేలు ఇస్తామని, పోస్ట్‌డేటెడ్ చెక్కులతో అన్నదాతలకు నగదు ఆందేలా చూస్తాం అంటూ ప్రకటిస్తూ మరోమారు రైతులను మోసం చేసేందుకు కొత్త›కొత్త పథకాలు అమలు చేస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీపై తొలి సంతకం. ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతా, ఎరువుల ధరలను తగ్గిస్తా, గిట్టుబాటు ధరలు కల్పిస్తామంటూ సీఎం చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. పేస్కేల్ ఆధారంగా రుణమాఫీ ఉంటుందని రూ 1.50 లక్షల వరకు బ్యాంకు రుణం తీసుకున్న రైతులకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉంది. ఏకకాలంలో మాఫీ చేయడం సాధ్యం కాదన్నారు. ఆదికూడా 5 విడతలుగా మాఫీ మాత్రం మొండిచేయి చూపించారు
రైతన్నలు ఏమంటున్నారంటే..!
ఏరు దాటే వరకు ఓడ మలన్న.... ఏరుదాటక బోడి మల్లన్న అన్న చందంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు మరోమారు రైతులను నట్టేట మంచడానికి పచ్చి హామీలు ఇస్తున్నారని మండిపడతున్నారు. నియోజకవర్గంలోని సుమారు 56,789 మంది రైతులు అధికంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం మామిడి, జామా, వరి, నిమ్మ, బొప్పాయి, వివిధ రకాల కురగాయల పంటలు 23,314 హెక్టార్లలో సాగవుతోంది. 56,789 మంది రైతులు వ్యవసాయ రంగాన్నే నమ్ముకుని పూట గడుపుతున్నారు. అయితే రైతులకు వాతావరణం అనుకూలించాక, వరుణుడు కరుణించకపోవడంతో ఏటా నష్టాలు తప్పడం లేదు.
అప్పులు చేసి పంట పండిస్తే పెట్టిన పెట్టుబడి చేతికందే పరిస్థితి కనిపించడం లేదు. గత ఏడాది మామిడికి గిట్టుబాటు ధరల్లేకపోవడంతో పంట నేలమట్టమైంది. రైతులు రోడ్డుపైకి రావడంతో ప్రభుత్వం కేజీకి రూ.2 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. ఆ తర్వాత ఆ రూ.2 రూపాయలు కొంతమంది రైతులకు దక్కలేదు. ఇక వర్షాలు పడకపోవడంతో నియోజకవర్గంలో కొంతమేరకు ఎండిపోయింది. ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించి నష్టపోయిన రైతు వివరాలను సేకరించి చేతులు దులుపుకుంది. తీరా ఏడాది ఆపుతున్నా నష్టపరిహారం చెల్లించలేదు. దీంతో రైతులు ఏ పంటలు సాగు చేయాలన్న జంకుతున్నారు. ప్రభుత్వం ఆర్థిక సాయం ఆందించడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
రుణమాఫీకి షరుతులు..
2014 ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీని నెరవేర్చడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో రుణమాఫీకి షరతులు పెట్టడంతో చాలా మంది రైతన్నలు రుణమాఫీకి దూరమయ్యారు. ఐదు విడతల్లో మూడు విడతల వరకు మాఫీ పరిమితం కావడంతో రైతులు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యతిరేకత చేస్తున్నారు. బ్యాంకుల నుంచి నోటీసులు రావడంతో భయాందోళనకు గురవుతున్నారు. 2019 ఎన్నికలు సమీపించడంతో చంద్రబాబు పాత పల్లవి ఆందుకున్నారని ఆరోపణలు వెల్లువేత్తున్నాయి. ఇక ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్తామని పలువురు రైతులు చెబుతున్నారు.
సాగు విస్త్తరణ తగ్గుముఖం
తెలుగుదేశం పాలనలో రైతాంగం పూర్తిగా డీలా పడింది. సాగు విస్తీర్ణం ఏటా తగ్గుతూ వస్తోంది. అప్పులు చేసి పంటలు పండించే స్థాయిలో రైతులు లేరు.
– సురేష్‌రెడ్డి, చిలమనూరు రైతు
ప్రభుత్వం మోసం చేసింది..
ప్రభుత్వం రుణమాఫీ విషయంలో మోసం చేసింది. ఇంత వరకు రూపాయి మాఫీ చేయలేదు. కొత్త రుణాలు కావాలంటే బ్యాంకర్లు ఇవ్వనంటున్నారు. ఇప్పుడు అన్నదాత సుభీభవ అంటూ నాటకాలు మొదలు పెట్టారు.
– రామయ్య, బొల్లవారిపాళెం రైతు
బుద్ధి చెబుతాం..
రైతులు బాబు గారిని నమ్మే పరిస్థితి లేదు. గతంలో చెప్పిన మాటలు నమ్మి పూర్తిగా మోసపోయాం. ఇప్పుడు పోస్ట్›డేటెడ్ చెక్కులు ఇస్తామని అంటున్నారు. అవి ఎవరికి కావాలండి ఇచ్చిన మాట ప్రకారం రైతులకు న్యాయం చేయాలి. లేకుంటే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తాం.
– కరణం శ్రీనివాసులు నాయుడు, బాలాయపల్లి రైతు
Comments
Please login to add a commentAdd a comment