promises no implimentation
-
కరువుకు తోబుట్టువు!
వ్యవసాయమే ఆధారం.. కష్టాన్నే నమ్ముకున్న ప్రజలు ఏళ్ల తరబడి కరువు దెబ్బకు అతలాకుతలమయ్యారు. కరువు జనాలకు 2014 ఎన్నికల్లో చంద్రబాబు హామీల గాలం వేశారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, పారిశ్రామిక ప్రగతి.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. కులానికో హామీ.. వర్గానికో న్యాయం అనే తరహాలో మాయమాటలు చెప్పారు. చివరకు వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తాం, బలిజలను బీసీల్లో చేరుస్తామని మాట ఇచ్చారు. ఇవన్నీ నిజమేనని నమ్మిన జిల్లా ప్రజానీకం టీడీపీకి పట్టం కట్టారు. 14 అసెంబ్లీ స్థానాల్లో 12 చోట్ల టీడీపీ అభ్యర్థులనే గెలిపించారు. 2 ఎంపీ స్థానాల్లోనూ వారికే కట్టబెట్టారు. కానీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు జిల్లా అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. ఒకటి... రెండు కాదు.. ఐదేళ్లూ హామీలతోనే కాలం నెట్టుకొచ్చారు. జిల్లాకు ఇంత అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించాల్సిన ఇద్దరు ఎంపీలతో పాటు 12 మంది ఎమ్మెల్యేలు మిన్నకుండిపోయారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అందినకాడికి దోచుకోవడం మినహా జిల్లా అభివృద్ధిని కాంక్షించలేకపోయారు. అందుకే ప్రకృతి సహకరించక.. పాలకులు పట్టించుకోక.. అప్పుల బాధతో ఈ ఐదేళ్లలో 274 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇన్‌పుట్‌సబ్సిడీ మంజూరులో మోసం వర్షాభావంతో పంటలు ఎండిపోయినా.. ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సురెన్స్‌తో ప్రభుత్వాలు ఆదుకుంటాయనే ఆశతో రైతులు పంటసాగుకు ఉపక్రమిస్తుంటారు. 2013లో పంటలు దెబ్బతినగా...రూ.643 కోట్లు ఇన్‌పుట్‌సబ్సిడీ రావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని మంజూరు చేస్తామని ఎన్నికల్లో, ఎన్నికల తర్వాత సీఎం, మంత్రులు ప్రకటించారు. గద్దెనెక్కిన తర్వాత ఇచ్చేది లేదని రైతులకు మోసం చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటాగా వచ్చిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం బొక్కేసి మోసం చేసింది. తాగునీటికీ కటకటే.. జిల్లాలో తాగునీటి సమస్య కొన్నేళ్లుగా వేధిస్తోంది. ‘అనంత’ వాసుల తాగునీటి కష్టాలకు చెక్ పెట్టేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ శ్రీరామరెడ్డి, జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకాలకు శ్రీకారం చుట్టారు. పీఏబీఆర్ నుంచి శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ద్వారా హిందూపురం వరకూ తాగునీరు అందించారు. ఇక రూ.507 కోట్లతో 5 నియోజకవర్గాలకు నీరిచ్చేందుకు వైఎస్సార్‌జిల్లా గండికోట నుంచి జేసీనాగిరెడ్డి మంచినీటి పథకానికి వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. 2013 వరకూ 90 శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం 10 శాతం పనులు మాత్రమే మిగిలిపోయాయి. కానీ ఈ ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఈ పనులు కూడా చేయలేకపోయింది. దీంతో తాడిపత్రి, గుంతకల్లు, ధర్మవరం, శింగనమల, అనంతపురం రూరల్ నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య తీవ్రతరమైంది. క్యాన్సర్ ఆస్పత్రి ఊసేలేదు టీడీపీ అధికారంలోకి వస్తే హిందూపురంలో బసవతారకం కేన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబుతో పాటు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హామీ ఇచ్చారు. బాలయ్యను ‘పురం’వాసులు గెలిపించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ‘కాన్సర్ ఆస్పత్రి’ని పక్కనపెట్టారు.. బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో ‘ఎన్టీఆర్ వైద్యసేవ’ అమలయ్యేలా చూస్తానని చెప్పారు. ఐదేళ్లలో క్యాన్సర్ ఆస్పత్రి లేదు..ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో వైద్యసేవ లేదు. పారిశ్రామిక ప్రగతీ శూన్యం జిల్లాలో వ్యవసాయం అంతంతమాత్రమే. అందువల్ల ఉపాధి కోసం విరివిగా పరిశ్రమలు స్థాపించాల్సిన అవసరం ఉంది. తెలుగురాష్ట్రాల్లో అన్ని జిల్లాలో కంటే బీడుభూములు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటును ప్రభుత్వం విస్మరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు యాజమాన్యం కలిసి ‘ట్రైపార్టీ’ ఆధ్వర్యంలో ఏర్పాటుకు బీజం పడిన కుద్రేముఖ్ ఇనుప పిల్లెట్ల పరిశ్రమను నిర్లక్ష్యం చేసింది. ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా..దాని ఊసే లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసిన ‘బెల్’ మినహా ఒక్క పరిశ్రమకూ పునాది పడలేదు. ఇందులో కూడా స్కిల్డ్ లేబర్ మినహా జిల్లా వాసులకు ఉపాధి లభించడం కష్టమే. తిరుపతిలో ఎయిర్‌పోర్టు ఉన్నా, తిరిగి కుప్పంలో ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేశారు. ‘అనంత’కు గత ప్రభుత్వంలో మంజూరైన ఎయిర్‌పోర్టు, పుట్టపర్తిలో విమాన విడిభాగాల తయారీ పరిశ్రమనూ చంద్రబాబు అటకెక్కించారు. ఇళ్ల నిర్మాణంలో అన్యాయం చంద్రబాబు 2014 జూన్‌లో సీఎంగా అధికారం చేపట్టారు. రెండున్నరేళ్లపాటు ఒక్క పక్కా ఇల్లు కూడా నిర్మించలేకపోయారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడంతో ఆ తర్వాత అరకొరా మంజూరు చేశారు. అందువల్లే ఈ ఐదేళ్లలో 60 వేల ఇళ్లు మాత్రమే పూర్తయినట్లు అధికారికంగా లెక్క చూపిస్తున్నారు. ఇందులో వాస్తవానికి 60 శాతం కూడా పూర్తయి, లబ్ధిదారులు ఇళ్లలో చేరని పరిస్థితి. ప్రభుత్వం చెప్పినట్లు ఐదేళ్లలో 60 వేల ఇళ్లు పూర్తయినట్లు లెక్కించినా... జిల్లాలోని 3,500 గ్రామాల్లో గ్రామానికి 17 ఇళ్లు మాత్రమే మంజూరైనట్లు. పింఛన్లు అందక విలవిల రాష్ట్ర వ్యాప్తంగా ఐదెకరాల్లోపు భూమి ఉన్నవారే పింఛన్‌కు అర్హులు. కానీ ‘అనంత’లో మాత్రం పదెకరాలున్నవారికి కూడా పింఛన్‌కు అందేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లా కోసం ప్రభుత్వం తీసుకున్న సానుకూల నిర్ణయం ఇదొక్కటే. కానీ పింఛన్ల కోసం జన్మభూమి సభలు, ‘మీ కోసం’లో 89 వేల దరఖాస్తులు రాగా... 49,543 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. పోని వీటికైనా పింఛన్ మంజూరు చేశారా..? అంటే అదీ లేదు. దీంతో పింఛన్‌లేక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జిల్లా అభివృద్ధిని విస్మరించిన ఎమ్మెల్యేలు కరువు జిల్లా ‘అనంత’ అభివృద్ధిని అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా పూర్తిగా విస్మరించారు. అందిన కాడికి దోచుకుంటూ వారు మాత్రమే అభివృద్ధి చెందారు. అభివృద్ధి పేరుతో ఎన్నికల ముందు సాగునీటి ప్రాజెక్టుల అంచనాలు పెంచి, నీరిచ్చే పేరుతో కొత్త ప్రాజెక్టులు మంజూరు చేసి కుంభకోణం చేశారు. పేరూరు పేరుతో మంత్రి పరిటాల సునీత, బీటీపీ పేరుతో కాలవ శ్రీనివాసులు, 36వ ప్యాకేజీలో పయ్యావుల కేశవ్, కాంట్రాక్టుల పేరుతో వరదాపురం సూరి, ‘కియా’లో భూములు చదును చేసే పేరుతో బీకే పార్థసారథి, గుంతకల్లు–తాడిపత్రి హైవే పేరుతో జేసీ దివాకర్‌రెడ్డి ఇలా...జిల్లాలోని ప్రతీ అధికారపార్టీ ప్రజాప్రతినిధి రూ.వందల కోట్లు కొల్లగొట్టారు. ఇలా ఆర్థికంగా వారు అభివృద్ధి చెందడం మినహా జిల్లాకు చేసిందేమీ లేదు. హంద్రీ–నీవా ఆయకట్టుకు నీరేదీ? హంద్రీనీవా ద్వారా రాయలసీమలో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యం. ఇందులో అత్యధికంగా ‘అనంత’లో 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. వీటిలో ఫేజ్–1లో 1.18 లక్షల ఎకరాలకు నీరివ్వాలి. 2012కు ఫేజ్–1 పూర్తయి జీడిపల్లి రిజర్వాయర్‌కు నీళ్లొస్తున్నాయి. ఏడాదిలో ఆయకట్టుకు నీళ్లిస్తామని 2014 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రకటించారు. డిస్ట్రిబ్యూటరీలు చేయాలంటే 6 నెలల సమయం సరిపోతుంది. కానీ నీళ్లిస్తామని చెప్పిన ఏడాదికి ప్రభుత్వం 2015 ఫిబ్రవరిలో డిస్ట్రిబ్యూటరీలు చేయొద్దని జీఓ 22 జారీ చేసింది.దీంతో కళ్లెదుట నీళ్లుపోతున్నా...పొలంలో పారించుకోలేని దుస్థితి నెలకొంది. దీనిపై ఏ అధికార పార్టీ నాయకుడూ ప్రశ్నించలేకపోయారు. కుప్పానికి నీళ్లు తీసుకెళ్లేదాకా ఆయకట్టుకు ఇచ్చే ప్రసక్తే లేదని 2017 సెప్టెంబరు 1 రాత్రి ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో చంద్రబాబు తేల్చి చెప్పారు. అయినా జిల్లా ఎంపీలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు నోరు మెదపలేదు. దీంతో కృష్ణా జలాల కోసం ఆశగా ఎదురుచూసిన రైతులు చంద్రబాబు వైఖరితో రగిలిపోతున్నారు. ‘నిన్ను నమ్మం బాబూ’ అంటూ తీర్పు చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఇచ్చిన హామీలు ప్రస్తుతం ఉన్నతీరు హిందూపురంలో బసవతారకం కేన్సర్ ఆస్సత్రి ఇప్పటి వరుకు అతీగతీ లేదు 5 ఎకరాల వరకూ వందశాతం సబ్సిడీతో డ్రిప్, 10 ఎకరాల వరకూ 90శాతం సబ్సిడీతో డ్రిప్ వైఎస్ హయాం నుంచి ఈ 90 శాతం సబ్సిడీ అనంతలో అమలవుతోంది. ఏడాదిలోపు హంద్రీ-నీవా పూర్తి ఐదేళ్లయినా పూర్తి చేయలేదు. ఆయకట్టుకు సాగునీరు ఇవ్వలేదు జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తా ఆ ఊసే లేదు పింఛన్ల అర్హతను 5 ఎకరాలుగా ఉంది.‘అనంత’లో మాత్రం 10 ఎకరాల వరకూ సడలింపు ఆ మేరకు జీఓ మాత్రం జారీ రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తా పాక్షికంగా కూడా చెల్లించలేదు సబ్బుల ఫ్యాక్టరీని నిర్మిస్తాం అబద్ధపు హామీ హెచ్చెల్సీ ఆధునికీకరణ పూర్తి చేస్తాం తీసుకున్న చర్యలు నామమాత్రమే ఉద్యానవన కేంద్రం లేదు సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రప్రభుత్వ రంగ సంస్థ ఎయిమ్స్ అనుబంధ కేంద్రం గుంటూరుకు తరలించి మోసం చేశారు నూతన పారిశ్రామిక నగరం అతీగతీ లేదు ‘అనంత’ను స్మార్ట్‌సిటీగా చేస్తాం ఇంత అధ్వాన్నమైన కార్సొరేషన్ బహుశా రాష్ట్రంలో ఏదీ లేదు టెక్స్‌టైల్‌పార్క్ లేదు ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ క్లస్టర్ అదీ లేదు సోలార్, విండ్ పవర్ హబ్ ఎన్పీ కుంట సోలార్ ఎన్టీపీసీ ప్లాంటు నిర్మించింది.ఇది గత ప్రభుత్వం ప్రతిపాదించిన హబ్ పెనుకొండలో ఇస్కాగ్ ప్రాజెక్టు లేదు బీఈఎల్(భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్) కేంద్ర ప్రభుత్వ సంస్థ. దీని ఏర్సాటుకు అప్పటి కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ శంకుస్థాపన చేశారు. ఆధ్యాత్మిక నగరంగా పుట్టపర్తి పుట్టపర్తి అలాగే ఉంది పుట్టపర్తిలో విమానాల నిర్వహణ, మరమ్మతుల కేంద్రం ఏదీ లేదు కుద్రేముఖ్ ఇనపఖనిజ ఆధారిత ప్రాజెక్టు గతంలో ఎలా ఉందో, ఇప్పుడు అలాగే ఉంది -
బాబూ... హామీలు గుర్తున్నాయా?
సాక్షి,మడకశిర: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీడీపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడానికి బుధవారం మడకశిరకు వస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా 2016 డిసెంబర్ 2వ తేదీ మడకశిరకు వచ్చారు. ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు మడకశిర నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో హామీలిచ్చారు. కానీ వాటిని ఇంతవరకూ నెరవేర్చలేదు. దీంతో ఇక్కడి ప్రజలు ఇప్పుడు ఆయన పర్యటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు మడకశిర ప్రాంతంలో ఓట్లడిగే అర్హత లేదంటున్నారు. హంద్రీ – నీవా కాలువ: మడకశిర నియోజకవర్గానికి హంద్రీ – నీవా పథకం ద్వారా సాగునీరు అందించి రైతులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. నెరవేర్చలేదు. సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హంద్రీ – నీవా ద్వారా సాగునీరు అందిస్తామని హడావుడి చేసిన స్థానిక టీడీపీ నాయకులు చివరకు చేతులెత్తేశారు. పారిశ్రామిక వాడ: మడకశిరలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు 1,600 ఎకరాలు సేకరించారు. ఈ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఒక్క పరిశ్రమను కూడా ఏర్పాటు చేయలేదు. భూములిచ్చిన రైతులకు నష్ట పరిహారం కూడా అందించలేదు. దీంతో రైతులు, నిరుద్యోగులు చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ: మడకశిరలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయిస్తానని, అందుకోసం నిధులు పెద్దఎత్తున అందిస్తానని ప్రకటించారు. ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదు. కార్యరూపం దాల్చని రింగ్ రోడ్డు: మడకశిరలో రింగ్‌రోడ్డు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.45 కోట్ల నిధులను మంజూరు చేశామని చెప్పారు. అయితే ఇప్పటికీ రింగ్ రోడ్డు పూర్తి కాకపోవడంపై పట్టణ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏర్పాటు కాని డిగ్రీ కళాశాలలు: అమరాపురం, గుడిబండలో డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. కానీ చేయలేదు. దీంతో ఈ రెండు మండలాల విద్యార్థులు అనేక అగచాట్లు పడుతున్నారు. 100 పడకల ఆస్పత్రి: మడకశిర ప్రభుత్వ ఆస్పత్రి స్థాయి 50 పడకలైతే 100 పడకలకు పెంచుతామని చెప్పారు. నిన్నమొన్నటి వరకూ పట్టించుకోకుండా నెలరోజుల క్రితం 100 పడకల ఆస్పత్రిగా మారుస్తూ జీఓ జారీ చేశారు. తదుపరి చర్యలు తీసుకోలేదు. పర్యాటక కేంద్రాలు: నియోజకవర్గంలోని రత్నగిరి, హేమావతి, భక్తరహళ్లి, జిల్లేడుగుంటలను పర్యాటక కేంద్రాలుగా మారుస్తానని హామీ ఇచ్చారు. కానీ వాటి గురించి పట్టించుకోలేదు. రాళ్లపల్లి రిజర్వాయర్: గుడిబండ మండలం రాళ్లపల్లి వద్ద హంద్రీ – నీవా రిజర్వాయర్ నిర్మించి నియోజకవర్గంలోని అన్ని చెరువులనూ నింపుతామన్నారు. ఇంతవరకూ అది కార్యరూపం దాల్చకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హామీలు నెరవేర్చి మడకశిరకు రావాలి 2016లో చంద్రబాబు మడకశిరకు వచ్చినప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు. అయితే ఇంతవరకూ అవి నెరవేరలేదు. వాటిని నెరవేర్చిన తర్వాతే ఆయన మళ్లీ మడకశిరకు రావాలి. హామీలను నెరవేర్చని సీఎంను మడకశిర ప్రజలు నిలదీయాలి. – లక్ష్మీనారాయణ, హరేసముద్రం, మడకశిర చంద్రబాబు మోసం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మడకశిర ప్రజలను మోసం చేశారు. ముఖ్యంగా పారిశ్రామికవాడ ఏర్పాటు చేయకుండా నిరుద్యోగులను ముంచేశారు. మళ్లీ మడకశిరకు వచ్చి ఓట్లు అడిగే అర్హతను కోల్పోయారు. – మంజునాథ్, జిల్లేడుగుంట, మడకశిర -
అన్నదాతలకు ‘బాబు’ కుచ్చుటోపీ!
సాక్షి, బాలాయపల్లి: ఎన్నికల వేళ రైతన్నలను మరోసారి మభ్యపెట్టేందుకు తెలుగుదేశం నాయకులు కొత్త ఎత్తులు వేస్తూ మోసపూరిత హామీలు గుప్పిస్తూ అన్నదాతలను వంచించే ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఎన్నికల నేపథ్యంలో...! అన్నదాత సుభీభవతో రైతులను అభివృద్ధి చేస్తామని, సన్న, చిన్నకారు రైతులకు రూ.15 వేలు ఇస్తామని, పోస్ట్‌డేటెడ్ చెక్కులతో అన్నదాతలకు నగదు ఆందేలా చూస్తాం అంటూ ప్రకటిస్తూ మరోమారు రైతులను మోసం చేసేందుకు కొత్త›కొత్త పథకాలు అమలు చేస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీపై తొలి సంతకం. ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతా, ఎరువుల ధరలను తగ్గిస్తా, గిట్టుబాటు ధరలు కల్పిస్తామంటూ సీఎం చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. పేస్కేల్ ఆధారంగా రుణమాఫీ ఉంటుందని రూ 1.50 లక్షల వరకు బ్యాంకు రుణం తీసుకున్న రైతులకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉంది. ఏకకాలంలో మాఫీ చేయడం సాధ్యం కాదన్నారు. ఆదికూడా 5 విడతలుగా మాఫీ మాత్రం మొండిచేయి చూపించారు రైతన్నలు ఏమంటున్నారంటే..! ఏరు దాటే వరకు ఓడ మలన్న.... ఏరుదాటక బోడి మల్లన్న అన్న చందంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు మరోమారు రైతులను నట్టేట మంచడానికి పచ్చి హామీలు ఇస్తున్నారని మండిపడతున్నారు. నియోజకవర్గంలోని సుమారు 56,789 మంది రైతులు అధికంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం మామిడి, జామా, వరి, నిమ్మ, బొప్పాయి, వివిధ రకాల కురగాయల పంటలు 23,314 హెక్టార్లలో సాగవుతోంది. 56,789 మంది రైతులు వ్యవసాయ రంగాన్నే నమ్ముకుని పూట గడుపుతున్నారు. అయితే రైతులకు వాతావరణం అనుకూలించాక, వరుణుడు కరుణించకపోవడంతో ఏటా నష్టాలు తప్పడం లేదు. అప్పులు చేసి పంట పండిస్తే పెట్టిన పెట్టుబడి చేతికందే పరిస్థితి కనిపించడం లేదు. గత ఏడాది మామిడికి గిట్టుబాటు ధరల్లేకపోవడంతో పంట నేలమట్టమైంది. రైతులు రోడ్డుపైకి రావడంతో ప్రభుత్వం కేజీకి రూ.2 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. ఆ తర్వాత ఆ రూ.2 రూపాయలు కొంతమంది రైతులకు దక్కలేదు. ఇక వర్షాలు పడకపోవడంతో నియోజకవర్గంలో కొంతమేరకు ఎండిపోయింది. ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించి నష్టపోయిన రైతు వివరాలను సేకరించి చేతులు దులుపుకుంది. తీరా ఏడాది ఆపుతున్నా నష్టపరిహారం చెల్లించలేదు. దీంతో రైతులు ఏ పంటలు సాగు చేయాలన్న జంకుతున్నారు. ప్రభుత్వం ఆర్థిక సాయం ఆందించడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. రుణమాఫీకి షరుతులు.. 2014 ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీని నెరవేర్చడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో రుణమాఫీకి షరతులు పెట్టడంతో చాలా మంది రైతన్నలు రుణమాఫీకి దూరమయ్యారు. ఐదు విడతల్లో మూడు విడతల వరకు మాఫీ పరిమితం కావడంతో రైతులు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యతిరేకత చేస్తున్నారు. బ్యాంకుల నుంచి నోటీసులు రావడంతో భయాందోళనకు గురవుతున్నారు. 2019 ఎన్నికలు సమీపించడంతో చంద్రబాబు పాత పల్లవి ఆందుకున్నారని ఆరోపణలు వెల్లువేత్తున్నాయి. ఇక ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్తామని పలువురు రైతులు చెబుతున్నారు. సాగు విస్త్తరణ తగ్గుముఖం తెలుగుదేశం పాలనలో రైతాంగం పూర్తిగా డీలా పడింది. సాగు విస్తీర్ణం ఏటా తగ్గుతూ వస్తోంది. అప్పులు చేసి పంటలు పండించే స్థాయిలో రైతులు లేరు. – సురేష్‌రెడ్డి, చిలమనూరు రైతు ప్రభుత్వం మోసం చేసింది.. ప్రభుత్వం రుణమాఫీ విషయంలో మోసం చేసింది. ఇంత వరకు రూపాయి మాఫీ చేయలేదు. కొత్త రుణాలు కావాలంటే బ్యాంకర్లు ఇవ్వనంటున్నారు. ఇప్పుడు అన్నదాత సుభీభవ అంటూ నాటకాలు మొదలు పెట్టారు. – రామయ్య, బొల్లవారిపాళెం రైతు బుద్ధి చెబుతాం.. రైతులు బాబు గారిని నమ్మే పరిస్థితి లేదు. గతంలో చెప్పిన మాటలు నమ్మి పూర్తిగా మోసపోయాం. ఇప్పుడు పోస్ట్›డేటెడ్ చెక్కులు ఇస్తామని అంటున్నారు. అవి ఎవరికి కావాలండి ఇచ్చిన మాట ప్రకారం రైతులకు న్యాయం చేయాలి. లేకుంటే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తాం. – కరణం శ్రీనివాసులు నాయుడు, బాలాయపల్లి రైతు -
ఇదేమి ఆడంబరం
‘జాతీయ స్థాయి మహిళా పార్లమెంట్’ ‘సాక్షి’గా ఇవిగో ఆధారాలు జిల్లాలో పెరిగిన వేధింపులు .. అవమానాలు అధికార పార్టీలోని మహిళలకే సాధికారికత లేదాయే 2015తో పోల్చితే 2016లో పెరిగిన కేసులు డ్వాక్రా...ఆశా వర్కర్లకు హామీల మోసం జాతీయ సదస్సు అనంతరమైనా మంచి జరిగితే అదే చాలంటున్న వనితలు అమరావతిలో జాతీయ స్థాయి మహిళా పార్లమెంట్ సదస్సు ఎంతో ప్రతిషా్ఠత్మకంగా స్పీకర్ కోడెల శివప్రసాద్ నేతృత్వంలో చంద్రబాబు దర్శకత్వంలో శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఓ వైపు ప్రశంసిస్తూనే మరో వైపు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు జిల్లాలో మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపులు ప్రతి ఏటా పెరిగిపోతున్నాయి... డ్వాక్రా రుణాల రద్దు ... ఆశా వర్కర్ల వేతనాల పెంపు ... అంతెందుకు ‘మీ పార్టీలోని తెలుగు మహిళలపై తెలుగు తమ్ముళ్లు చేస్తున్న అవమానాలు.. మాటేమిటని ఆ గొంతులు నినదిస్తున్నాయి. లైంగిక దాడుల వివరాలిలా... జిల్లాలో మహిళలపై లైంగిక దాడుల సంఖ్య పెరిగింది. 2015లో 99 లైంగిక దాడి కేసులు నమోదుకాగా, 2016లో 113కు పెరిగింది. 2015 సంవత్సరంలో 60 మంది బాలికలు లైంగిక దాడులకు గురవగా 2016లో ఆ సంఖ్య 45 కు చేరింది. ఆ ‘ఆశే’ లేదు జిల్లా ఆరోగ్య శాఖలో సుమారు 4,500 మంది ఆశా కార్యకర్తలు పని చేస్తున్నారు. గత అక్టోబర్ నెల నుంచి పారితోషికం ఇవ్వడం లేదు. రూ.5 వేలు జీతం ఇవ్వాలని అనేక పోరాటాలు చేస్తున్నా స్పందనే లేదు. మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధానాలను అవలంబిస్తున్నారని, కండోమ్‌లు తీసుకెళ్లి పురుషులకు విక్రయించాలని ఆశా వర్కర్లను వైద్యా«ధికారులు ఆదేశించడం ఎంత వరకు భావ్యమని ప్రశ్నిస్తున్నారు. డ్వాక్రా చెల్లెమ్మలకు చీటింగ్ జిల్లాలో 89, 994 మహిళా శక్తి సంఘాలున్నాయి. వీటిలో 8, 77, 586 మంది సభ్యులున్నారు. ఎన్నికల ముందు ‘తాను అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తానని’ హామీ ఇచ్చిన బాబు మహిళలు రుణాలు కట్టాల్సిన అవసరం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత మాఫీ కాదని, సంఘానికి రూ.లక్ష చొప్పున పెట్టుబడి నిధులు అందిస్తామని నమ్మబలికి ఆ మాటనూ నిలుపుకోలేకపోయారు. ‘తెలుగు మహిళ’లకే దిక్కులేదు ‘తెలుగు’ మహిళలకు సొంత పార్టీ నేతల నుంచే అవమానాలు ఎదురవుతున్నాయి. కాకినాడ బాలత్రిపుర సుందరి ఆలయ ట్రస్టు బోర్డు సభ్యురాలిగా పార్టీలో విధేయత కలిగిన సలాది ఉదయలక్షి్మని నియమించి ఉత్తర్వులు కూడా విడుదల చేసి తరువాత కాదు పొమ్మన్నారు. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం తంటి కొండ గ్రామ ఎంపీటీసీ ముర్ల నాగలక్ష్మి కూడా దాదాపు ఇదే రకమైన అవమానాన్నిఎదుర్కొన్నారు. ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామ సర్పంచి బుద్దరాజు రామలక్షి్మని అభివృద్ధి పనుల్లో ప్రాధాన్యం లేకుండా చేసి అవమానించారు. రాజమహేంద్రవరం కార్పొరేష¯ŒSకు మేయర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న పంతం రజనీశేష సాయి కూడా ‘తనను అడుగడుగునా అవమానిస్తున్నారని’ ఇటీవలే విలేకర్ల సమామావేశం లో వాపోయారు.