- ‘జాతీయ స్థాయి మహిళా పార్లమెంట్’ ‘సాక్షి’గా ఇవిగో ఆధారాలు
- జిల్లాలో పెరిగిన వేధింపులు .. అవమానాలు
- అధికార పార్టీలోని మహిళలకే సాధికారికత లేదాయే
- 2015తో పోల్చితే 2016లో పెరిగిన కేసులు
- డ్వాక్రా...ఆశా వర్కర్లకు హామీల మోసం
- జాతీయ సదస్సు అనంతరమైనా మంచి జరిగితే అదే చాలంటున్న వనితలు
ఇదేమి ఆడంబరం
Published Fri, Feb 10 2017 11:43 PM | Last Updated on Fri, Aug 10 2018 5:54 PM
అమరావతిలో జాతీయ స్థాయి మహిళా పార్లమెంట్ సదస్సు ఎంతో ప్రతిషా్ఠత్మకంగా స్పీకర్ కోడెల శివప్రసాద్ నేతృత్వంలో చంద్రబాబు దర్శకత్వంలో శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఓ వైపు ప్రశంసిస్తూనే మరో వైపు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు జిల్లాలో మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపులు ప్రతి ఏటా పెరిగిపోతున్నాయి... డ్వాక్రా రుణాల రద్దు ... ఆశా వర్కర్ల వేతనాల పెంపు ... అంతెందుకు ‘మీ పార్టీలోని తెలుగు మహిళలపై తెలుగు తమ్ముళ్లు చేస్తున్న అవమానాలు.. మాటేమిటని ఆ గొంతులు నినదిస్తున్నాయి.
లైంగిక దాడుల వివరాలిలా...
జిల్లాలో మహిళలపై లైంగిక దాడుల సంఖ్య పెరిగింది. 2015లో 99 లైంగిక దాడి కేసులు నమోదుకాగా, 2016లో 113కు పెరిగింది. 2015 సంవత్సరంలో 60 మంది బాలికలు లైంగిక దాడులకు గురవగా 2016లో ఆ సంఖ్య 45 కు చేరింది.
ఆ ‘ఆశే’ లేదు
జిల్లా ఆరోగ్య శాఖలో సుమారు 4,500 మంది ఆశా కార్యకర్తలు పని చేస్తున్నారు. గత అక్టోబర్ నెల నుంచి పారితోషికం ఇవ్వడం లేదు. రూ.5 వేలు జీతం ఇవ్వాలని అనేక పోరాటాలు చేస్తున్నా స్పందనే లేదు. మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధానాలను అవలంబిస్తున్నారని, కండోమ్‌లు తీసుకెళ్లి పురుషులకు విక్రయించాలని ఆశా వర్కర్లను వైద్యా«ధికారులు ఆదేశించడం ఎంత వరకు భావ్యమని ప్రశ్నిస్తున్నారు.
డ్వాక్రా చెల్లెమ్మలకు చీటింగ్
జిల్లాలో 89, 994 మహిళా శక్తి సంఘాలున్నాయి. వీటిలో 8, 77, 586 మంది సభ్యులున్నారు. ఎన్నికల ముందు ‘తాను అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తానని’ హామీ ఇచ్చిన బాబు మహిళలు రుణాలు కట్టాల్సిన అవసరం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత మాఫీ కాదని, సంఘానికి రూ.లక్ష చొప్పున పెట్టుబడి నిధులు అందిస్తామని నమ్మబలికి ఆ మాటనూ నిలుపుకోలేకపోయారు.
‘తెలుగు మహిళ’లకే దిక్కులేదు
‘తెలుగు’ మహిళలకు సొంత పార్టీ నేతల నుంచే అవమానాలు ఎదురవుతున్నాయి. కాకినాడ బాలత్రిపుర సుందరి ఆలయ ట్రస్టు బోర్డు సభ్యురాలిగా పార్టీలో విధేయత కలిగిన సలాది ఉదయలక్షి్మని నియమించి ఉత్తర్వులు కూడా విడుదల చేసి తరువాత కాదు పొమ్మన్నారు. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం తంటి కొండ గ్రామ ఎంపీటీసీ ముర్ల నాగలక్ష్మి కూడా దాదాపు ఇదే రకమైన అవమానాన్నిఎదుర్కొన్నారు. ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామ సర్పంచి బుద్దరాజు రామలక్షి్మని అభివృద్ధి పనుల్లో ప్రాధాన్యం లేకుండా చేసి అవమానించారు. రాజమహేంద్రవరం కార్పొరేష¯ŒSకు మేయర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న పంతం రజనీశేష సాయి కూడా ‘తనను అడుగడుగునా అవమానిస్తున్నారని’ ఇటీవలే విలేకర్ల సమామావేశం లో వాపోయారు.
Advertisement
Advertisement