రూ.12 కోట్లతో అభివృద్ధి పనులు
-
తిరుపతి ఎంపీ వెలగపల్లి
కామకూరు(బాలాయపల్లి) : రూ.12 కోట్లుతో తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ అన్నారు. బుధవారం మండలంలోని కామకూరు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో రూ.7.50 లక్షలతో బస్‌షెల్టర్, సీసీరోడ్లు, తాగునీటికి, విద్యుత్ దీపాల ఏర్పాటుకు మంజూరుచేశామన్నారు. కామకూరు నుంచి గాజులపల్లి వరకు, చిలమనూరు గ్రామం నుంచి కామకూరు వరకు, నిడిగల్లు రైల్వేస్టేషన్ నుంచి కొత్తురు గ్రామం వరకు రోడ్డు వసతి కల్పించాలని జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపుతున్నామన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్యాకేజీ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. హోదా వస్తే పరిశ్రమలు ఏర్పాటై యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. ఈకార్యక్రమంలో సూళ్లూరుపేట గడపగడపకు వైఎస్సార్ పరిశీలకుడు గూడూరు భాస్కర్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ కిరణ్మయి, బాలాయపల్లి ఎంపీటీసీ రమేష్ ,పెరిమిడి రామయ్య, సురేంద్రరెడ్డి, కామకూరు రమణయ్య, వెంకటయ్య, పాల్గొన్నారు.