Development works
-
పద..పదమంటూ ‘పోచారం’
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ఆయన డెబ్బై ఆరేళ్ల వయస్సులో కూడా నవ యువకుడిగా తిరుగుతూనే ఉంటారు. అడవి అయినా, గుట్ట, పుట్ట ఎక్కడికైనా సరే చలో అంటారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడమే కాదు... పనులు పూర్తయ్యే దాకా కాంట్రాక్టర్ల వెంట పడతారు. తనే స్వయంగా ఆ పనులను పర్యవేక్షిస్తుంటాడు. ఆయనే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి. మంత్రిగా స్పీకర్‌గా మూడు దశాబ్దాలకు పైగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు ఒకే రకమైన టెంపో కొనసాగిస్తున్నారు. అభివృద్ధి పనులకు నిధులు సాధించి వాటిని పూర్తి చేసేదాకా వెంటపడతారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్ల కాలంలో రూ.10 వేల కోట్లు తీసుకొచ్చాడని చెబుతారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా బాన్సువాడ నియోజకవర్గంలో 10 వేలకు పైగా డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించడంలో ఆయన కృషి ఎంతో ఉందంటారు. ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న తీరును ఆయన ఎన్నోసార్లు పర్యవేక్షించారు. రోడ్లు, ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, స్కూల్ భవనాలు... ఇలా ఏ పని అయినా సరే తను వెళ్లాల్సిందే. నియోజకవర్గ పరిధిలోని సిద్దాపూర్ అటవీ ప్రాంతంలో నిర్మిస్తున్న రిజర్వాయర్లకు శంకుస్థాపన చేసిన నాటి నుంచి ఇప్పటి దాకా ఆయన ప్రతి నెలలో ఒకటి రెండుసార్లు పరిశీలించారు. ఎంతదూరమైనా సరే, ఎంత లోపలకు ఉన్నా సరే వెళతారు. ఒకవేళ రోడ్డు మార్గం సరిగ్గా లేదని కార్లు వెళ్లే పరిస్థితి లేదంటే బైక్ మీద కూడా వెళ్లి వస్తారు. బాన్సువాడ పట్టణంలో జరిగే పనులను రెగ్యులర్‌గా పరిశీలిస్తారు. జోరువర్షం కురుస్తుందని అందరూ ఇళ్లలో ఉంటే తను మాత్రం బ్యాటరీ వాహనంలో ఊరంతా చుట్టేస్తారు. నీరు నిలిచిపోకుండా నాలాలను శుభ్రం చేయించమని ఆదేశిస్తారు. కాంట్రాక్టర్లు పనులు ఆపితే కారణాలు తెలుసుకొని బిల్లుల సమస్య అయితే ఉన్నతాధికారులతో మాట్లాడి బిల్లులు ఇప్పించి వారికి సహకరిస్తుంటారు. దీంతో అందరూ పోచారం స్టైలే వేరబ్బా అంటుంటారు. పెద్దాయనతో పోటీపడలేమని ఇతర ప్రజాప్రతినిధులు చెబుతుంటారు. -
సీఆర్డీఏలో మళ్లీ కన్సల్టెంట్ల రాజ్యం
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలన అంటేనే కన్సల్టెంట్లు, విదేశీ సంస్థలకు వందల కోట్లు దోచిపెట్టడమనే విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు గత పాలనంతా కన్సల్టెంట్ల మయం. ఇప్పుడూ అదే జరుగుతోంది. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ)లోనూ కన్సల్టెంట్ల రాజ్యానికి గేట్లు తెరుచుకున్నాయి. అభివృద్ధి పనుల కోసం ప్రోగ్రామ్ మేనేజ్మెంట్కు, అమరావతి ఆర్థికాభివృద్ధిలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఇలా రెండు రకాల కన్సల్టెంట్ల కోసం సీఆర్డీఏ వేర్వేరుగా రెండు ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఈ కన్సల్టెంట్లకు రూ.70.64 కోట్లు చెల్లించనున్నట్లు వెల్లడించింది.ఇందులో అభివృద్ధి పనుల ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కింద 63 మందికి రెండేళ్లలో రూ.62.36 కోట్లు చెల్లిస్తారు. అమరావతి ఆర్థికాభివృద్ధిలో ప్రైవేటు రంగం భాగసామ్యాన్ని ప్రోత్సహించేందుకు నియమితులయ్యే ఐదుగురు కన్సల్టెంట్లకు మూడేళ్లలో రూ.8.28 కోట్లు చెల్లించనున్నట్లు సీఆర్డీఏ పేర్కొంది. ఒక్కో కన్సల్టెంట్‌కు నెలకు రూ. 2 అక్షల నుంచి రూ. 5 లక్షల వరకు చెల్లించనున్నట్లు ప్రతిపాదనల ఆహ్వాన పత్రంలో సీఆర్డీఏ తెలిపింది. పనుల్లో నాణ్యత, సాంకేతికతకు ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్లు సహకారం అందిస్తారు.పనుల కాల వ్యవధిని ఏకీకృతం చేయడం, సమయానికి పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించడం, గడువులోగా బడ్జెట్ విడుదల ప్రణాళికను వీరు రూపొందిస్తారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులతో అమలు చేసే కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, పురోగతి నివేదికలను సమర్పించాలి. పనులకు అవసరమైన మెటీరియల్ సేకరణ కోసం ఐటీ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయాలి. పర్యావరణ, సామాజిక పర్యవేక్షణ, ఆస్తి నిర్వహణ కార్యకలాపాలను నిర్వహించడం వీరి విధులని సీఆర్డీఏ తెలిపింది.ప్రైవేటు రంగాన్ని భాగస్వామ్యం చేయడం కోసంఅమరావతి ఆర్థికాభివృద్ధిలో ప్రైవేటు రంగాన్ని భాగస్వామ్యం చేయడం, ప్రపంచంలో అగ్రశ్రేణి పెట్టుబడి గమ్యస్థానంగా రాజధానిని బ్రాండింగ్, ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి మార్కెటింగ్, ఔట్రీచ్ వ్యూహం అమలు వీరి విధి. ప్రభుత్వ, ప్రైవేటు ఆర్థిక వనరుల వినియోగంతోపాటు, ప్రైవేటు రంగాన్ని ప్రభావితం చేయడానికి పీపీపీ విధానంలో వినూత్న ఆర్థిక విధానాలతో పెట్టుబడులను తేవాలి. పారిశ్రామిక రంగంలో పోటీతత్వ పెట్టుబడి వాతావరణాన్ని సృష్టించాలి. ఆర్థిక అభివృద్ధి వ్యూహం ఆధారంగా రోడ్ మ్యాప్‌ను రూపొందించాలి. ఆర్థిక, ఆర్థికేతర ప్రోత్సాహకాల కోసం అవసరమైన నిధులు, పద్ధతులను గుర్తించి, వీటి అమలుకు వ్యూహాన్ని అభివృద్ధి చేయాలని సీఆర్డీఏ ఆ పత్రంలో పేర్కొంది. -
‘పూర్’.. పాలికలు!
పెద్ద కార్పొరేషన్ల నుంచి చిన్న మునిసిపాలిటీల వరకు అదే దుస్థితి రూ.1,000 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో.. చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు.. కొత్త పనులు చేపట్టేందుకు ససేమిరా కార్మీకులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో పలు మునిసిపాలిటీలు అయోమయంలో అధికారులు..కార్యాలయాలకు రాని చైర్మన్లు, మేయర్లుస్మార్ట్ రోడ్డు పనులూ సగం వరకే!⇒ వరంగల్ అభివృద్ధిలో భాగంగా రూ.44.50 కోట్లతో మునిసిపల్ ప్రధాన కార్యాలయం నుంచి భద్రకాళి నాలా వరకు, భద్రకాళి ఆర్చి నుంచి కాపువాడ వరకు, అక్కడి నుంచి ములుగు రోడ్డు వరకు, హనుమకొండ చౌరస్తా నుంచి పద్మాక్షి గుట్ట, న్యూ శాయంపేట రోడ్డు వరకు స్మార్ట్ రోడ్లను ప్రతిపాదించారు. వీటికి 2017 నవంబర్‌లో శంకుస్థాపన చేశారు. నాలుగు పనుల్లో మూడు పనులు 90% మేరకు పూర్తయ్యాయి. హనుమకొండ పద్మాక్షి గుట్ట నుంచి న్యూ శాయంపేట వరకు స్మార్ట్ సిటీ రోడ్డు పనులు 50 శాతం మాత్రమే పూర్తయ్యాయి. కాంట్రాక్టర్‌కు చేసిన పనులకు డబ్బులు చెల్లించకపోవడంతోనే రోడ్లు అసంపూర్తిగా మిగిలాయి.సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం లేదు. మౌలిక సదుపాయాల ముచ్చటే లేదు. చిన్న చిన్న పనులు కూడా జరగట్లేదు. కనీసం వర్షాకాలంలో పొంగిపొర్లే వరదనీటి కాలువలు, డ్రైనేజీల మరమ్మతులకు, పాడైన రోడ్ల రిపేర్లకు కూడా దిక్కులేదు. కార్మీకులకు వేతనాల్లేవు. పాత బిల్లులు కోట్లలో పేరుకుపోయాయి. దీంతో చేస్తున్న పనులను కాంట్రాక్టర్లు మధ్యలో ఆపేశారు. ఇక కొత్త పనులు చేపట్టేందుకు ససేమిరా అంటున్నారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో అధికారులుండగా, చైర్మన్లు, మేయర్లు కార్యాలయాలకు రావడం మానేశారు. ఇదీ రాష్ట్రంలోని దాదాపుగా అన్ని పురపాలికల పరిస్థితి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యవేక్షణలో ఉన్న మునిసిపల్ శాఖకు నిధులు కరువవడమే ఇందుకు కారణం. అన్ని పురపాలికలదీ అదే పరిస్థితి మునిసిపల్ సాధారణ నిధులు, 14, 15 ఆర్థిక సంఘం నిధులు, ప్రభుత్వ గ్రాంట్లతో పాటు తెలంగాణ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీయూఎఫ్ఐడీసీ) ద్వారా చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపు రూ.1,000 కోట్లకు పైగా బకాయిలు ఆయా మునిసిపాలిటీలకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నట్టు సమాచారం. దీంతో స్మార్ట్ సిటీలు వరంగల్, కరీంనగర్‌లతో పాటు పలు పెద్ద మునిసిపల్ కార్పొరేషన్లలో సైతం చిన్న చిన్న పనులు కూడా జరగడం లేదు. ఇక కొత్తగా ఏర్పాటైన మునిసిపాలిటీల్లో పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. కాగా కరీంనగర్ నగరపాలక సంస్థలో సాధారణ నిధులు, పట్టణ ప్రగతి తదితర నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి రూ.50 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉండగా.. ఆగస్టు 15వ తేదీ నాటికి బకాయిలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామంటూ మున్సిపల్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ కరీంనగర్ శాఖ హెచ్చరించింది. మరోవైపు బకాయిలు చెల్లించని కారణంగా రూ.2.46 కోట్లతో చేపట్టాల్సిన వనమహోత్సవానికి సంబంధించిన టెండర్, రూ.2 కోట్ల సాధారణ నిధులతో చేపట్టాల్సిన ఇతర పనుల టెండర్లను ఇక్కడి కాంట్రాక్టర్లు బహిష్కరించారు. ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో.. గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 129 మునిసిపాలిటీలు.. మునిసిపల్ పరిపాలన డైరెక్టర్ (సీడీఎంఏ) పరిధిలో ఉండగా, కేవలం మునిసిపాలిటీలకు సంబంధించి గత నెలాఖరు నాటికి ఆర్థిక శాఖలో రూ.508.90 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో రూ.345 కోట్లు రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఎస్ఎఫ్సీ) ద్వారా ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలలకు రావలసిన నిధులు కావడం గమనార్హం. ఒక్కో నెలకు రూ.115 కోట్ల చొప్పున కమిషన్ ద్వారా రావలసిన నిధులను ఆర్థిక శాఖ నిలిపివేసింది. మరోవైపు 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి 122 మునిసిపాలిటీలకు రావలసిన రెండో వాయిదా నిధులు రూ.60.65 కోట్లు ఆర్థిక శాఖ వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. మెడికల్, జీపీఎఫ్, ఎలక్రి్టసిటీ, ఎడ్యుకేషన్, ఔట్సోర్సింగ్ బిల్లులతో పాటు ఈఈఎస్ఎల్ (విద్యుత్ సంబంధిత) పద్దు కింద 49 మునిసిపాలిటీలకు సంబంధించిన బిల్లులు కూడా రూ.కోట్లలోనే ప్రభుత్వం బకాయి పడింది. ఇవి కాకుండా పట్టణ ప్రగతి కింద వైకుంఠధామాల నిర్మాణం పనుల పెండింగ్ బిల్లులు రూ.19.56 కోట్లు, వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ల బిల్లులు రూ.34.37 కోట్లు, కంటోన్మెంట్ బోర్డు ట్రాన్స్ఫర్ డ్యూటీకి సంబంధించి రూ 34.12 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. పట్టణ ప్రగతి, ఎస్సీ సబ్ ప్లాన్, జనరల్ ఫండ్, 14, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు రూ.180 కోట్లు కూడా నిలిచిపోయాయి. ఇక రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో టీయూఎఫ్ఐడీసీ ద్వారా గత రెండేళ్ల నుంచి సుమారు రూ.400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులు జరిగాయి. వీటి బిల్లులు కూడా చెల్లించలేదు. ఇవి కాకుండా మరో రూ.800 కోట్లకు సంబంధించిన పనులకు టెండర్లు పిలిచినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. వేతనాలు చెల్లించని మునిసిపాలిటీలు ప్రభుత్వం నుంచి నిధులు రాక, సొంతంగా సమకూర్చుకోలేక కొన్ని ముసినిపాలిటీలు చివరకు కార్మీకుల వేతనాలు సైతం చెల్లించడం లేదు. డోర్నకల్ మునిసిపాలిటీలో 2023 ఏప్రిల్, ఆగస్టు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి కార్మీకులకు చెల్లించాల్సిన వేతనాలు రూ.20.43 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. మహబూబాబాద్‌లో 2023 జనవరి, మే నెలలతో పాటు 2024కు సంబంధించి జనవరి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన వేతనాలు ఏకంగా సుమారు రూ.68 లక్షలు పేరుకుపోయాయి. కామారెడ్డి మునిసిపాలిటీకి సంబంధించి గత మే నెల బాపతు రూ.3.48 లక్షలు కార్మీకులకు చెల్లించాల్సి ఉండగా, జూన్ నెల వేతనాలు సుమారు రూ.21 లక్షల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఆత్మకూర్, నందికొండ, చండూర్, నర్సంపేట, మెట్పల్లి, సత్తుపల్లి, వైరా, పాల్వంచ, మణుగూరు, ఆదిలాబాద్ మునిసిపాలిటీల్లో కూడా కార్మీకులకు వేతనాలు చెల్లించలేదు. మొత్తంగా రూ.2.60 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. పాత బకాయిల కింద ప్రభుత్వం ఎగ్గొడుతుందేమోనని కార్మీకులు ఆందోళన చెందుతున్నారు. గ్రేటర్కూ నిధుల షార్టేజీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కొత్త పనులకు నిధుల్లేవు. ఇటీవలి రాష్ట్ర బడ్జెట్లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మూసీ, మెట్రో రైలు, వాటర్ బోర్డు తదితరాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినా అందులో జీహెచ్ఎంసీకి దక్కేది రూ.3,065 కోట్లే. జీహెచ్ఎంసీలో ఇప్పటికే చేసిన పనులకు గాను కాంట్రాక్టర్లకు రూ.1,200 కోట్ల మేర బకాయిలున్నాయి. దీంతో వారు కొత్త పనులకు ముందుకు రావటం లేదు. ఏవైనా కొత్త రుణాలు తీసుకోవాలన్నా నిబంధనలు అనుమతించేలా లేవు. కేంద్రం నుండి ఇప్పటికే నాలాల అభివృద్ధి (ఎస్ఎన్డీపీ కింద) కోసం రావాల్సిన సుమారు రూ.500 కోట్ల నిధులపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. దీంతో వర్షాకాలం కంటే ముందు పూర్తి చేయాల్సిన నాలాల విస్తరణ, డీసిలి్టంగ్ పనులు పూర్తవలేదు. వానాకాలంలో ప్రారంభించాల్సిన మొక్కల పెంపకానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించిన నిధులు వస్తేనే కొన్ని పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పరిస్థితి అధ్వానంగా ఉంది గత పాలకులు ప్రణాళిక లేకుండా మునిసిపాలిటీల్లో ఇష్టానుసారంగా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. పాత పనుల బిల్లులు రావనే భయంతో సొంత డబ్బులు ఖర్చు చేసి కొందరు కాంట్రాక్టర్లు కొత్త పనులు చేశారు. కానీ బిల్లులు మాత్రం రాలేదు. ట్రెజరీలను ఫ్రీజ్ చేశారు. దీంతో ఇప్పుడు మునిసిపాలిటీల్లో పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. నిధులు లేక, పనులు సాగక పాలకమండళ్లు ఆందోళన చెందుతున్నాయి. – వెన్‌రెడ్డి రాజు, మునిసిపల్ కౌన్సిల్స్ చైర్మన్ కాంట్రాక్టర్ల బిల్లులు వెంటనే విడుదల చేయాలి రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు సుమారు రూ.1,000 కోట్లకు పైగా బిల్లులు రావలసి ఉంది. అవి వెంటనే విడుదల చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి చొరవ చూపాలి. అప్పులు తెచ్చి పనులు పూర్తిచేసిన చిన్న, మధ్యతరగతి కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలి. – భూక్యా రాము నాయక్, మునిసిపల్ కౌన్సిల్ ఫోరం చైర్మన్ మధ్యలో ఆగిన ‘సీఎం హామీ’రోడ్డు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని కోతిరాంపూర్ నుంచి కట్టరాంపూర్ వరకు (1.2 కిలోమీటర్లు) రూ.4.5 కోట్ల ముఖ్యమంత్రి హామీ పథకం (సీఎంఏ) నిధులతో అధునాతన రోడ్డు, డ్రైనేజీ, వాటర్ పైప్‌లైన్ పనులను గత ఏడాది శంకుస్థాపన చేశారు. కొత్త రోడ్డు కోసం ఉన్న పాత రోడ్డును తవ్వారు. కొత్త రోడ్డు నిర్మాణం దాదాపు 35 శాతం పూర్తి చేశారు. గత డిసెంబర్లో అకస్మాత్తుగా కాంట్రాకర్ పని నిలిపివేశారు. దీంతో 8 నెలలుగా ప్రజలు నరకయాతన పడుతున్నారు. మధ్యలో కల్వర్టులు, డ్రైనేజీలు అసంపూర్తిగా వదిలేయడంతో ప్రమాదాలు కూడా చోటుచేసుకొంటున్నాయి. ఇప్పటివరకు చేసిన పనులకు బిల్లు రాకపోవడంతోనే కాంట్రాక్టర్ పనులు ఆపేశాడని అధికారులు చెబుతున్నారు. రూ.100 కోట్లు మంజూరుతోనే సరి నిజామాబాద్ కార్పొరేషన్లో ప్రధాన రోడ్ల అభివృద్ధి కోసం రెండేళ్ల క్రితం తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున రూ.100 కోట్లు మంజూరు చేశారు. గత సంవత్సరం మార్చి నుంచి సెప్టెంబర్ వరకు కాలనీల్లో రోడ్ల మరమ్మతు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణానికి నాటి ఎమ్మెల్యే గణేష్ గుప్తా శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా కాంట్రాక్టర్లు రూ.2.30 కోట్ల పనులు చేయగా, వీటికి సంబంధించిన బిల్లులు ఇప్పటివరకు విడుదల చేయలేదు. దీంతో కాంట్రాక్టర్లు ఈ పనులు మాకొద్దంటూ వెళ్లిపోయారు. గతంలో విడుదల చేసిన నిధులను కూడా ప్రస్తుత సర్కారు నిలిపివేసింది. -
సంపద సృష్టిస్తాం.. ప్రజలకు పంచుతాం: భట్టి విక్రమార్క
సాక్షి, ఖమ్మం: రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం మధిర నియోజకవర్గంలోని చింతకాని, మధిర మండలంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి డిప్యూటీ సీఎం మాట్లాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని వివరించారు.రాష్ట్ర సంపద రాష్ట్ర ప్రజలకు చెందాలని తమ ప్రభుత్వం ఈ గ్యారెంటీలను తీసుకువచ్చిందన్నారు. గత దశాబ్ద పాలనలో అప్పుల పాలైన తెలంగాణను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తున్నామని చెప్పారు. సంపదను సృష్టించి, సృష్టించిన సంపదను ప్రజలకు పంచుతామన్నారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంలో మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఆర్థికంగా ఎదగడానికి క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను అప్పగించామన్నారు. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయబోతున్న మీ సేవ సెంటర్ల నిర్వహణ కూడా మహిళలకు అప్ప చెప్తామని చెప్పారు. మహిళలు ఆర్థిక స్వావలంబన కొరకై తమ ప్రభుత్వం మహిళ స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తుందని వివరించారు.ఆసుపత్రి ప్రారంభం, అభివృద్ధి పనులకు శంకుస్థాపనహైద్రాబాద్ ప్రజాభవన్ నుంచి ఉదయం 7గంటలకు రోడ్డు మార్గాన ఖమ్మంకు చేరుకున్న డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కకు జిల్లా అధికార యంత్రాగం, పార్టీ జిల్లా నాయకులు, శ్రేణులు స్వాగతం పలికారు. ఉదయం 11 గంటలకు ఆర్సీఎం చర్చ్ ఎదురుగా స్థంబాద్రి హస్పిటల్‌ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఆసుపత్రి మూడవ అంతస్తులో క్యాత్ ల్యాబ్‌ను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఆక్కడి నుంచి చింతకాని మండలం గాంధినగర్ కు చేరుకొని రూ.175లక్షలతో గాంధినగర్ నుంచి బొప్పారం వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.ఆ తరువాత మధిర మండలం వంగవీడు గ్రామానికి చేరుకొని రూ. 30 కోట్లతో బోనకల్లు- అల్లపాడు- వంగవీడు గ్రామాల వరకు బిటి రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. చిలుకూరు గ్రామాంలోని శివాలయం వద్ద రూ.70 లక్షలతో బిటి రోడ్డు నిర్మాణ పనులకు, రూ.285 లక్షలతో చిలుకూరు నుంచి దొడ్డదేవరపాడు బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మధిర మండలం మర్లపాడు గ్రామానికి చేరుకొని. రూ.275 లక్షలతో మర్లపాడు నుంచి పెనుగొలను-సిద్దినేని గూడెం వరకు బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్తాపన చేశారు. ఆ తరువాత మాటూరు గ్రామానికి చేరుకొని రూ.500 లక్షలతో మాటూరు నుంచి ముస్లీం కాలనీ బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఆనంతరం స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన కార్యాక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దారి పొడవున ఆయా గ్రామాల ప్రజలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు ఘనంగా స్వాగతం పలికారు. -
అభివృద్ధికి నిదర్శనం.. పులివెందుల పట్టణం..!
సాక్షి, పులివెందుల: అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణం రాష్ట్రానికే ఆదర్శనీయం.. అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత గడ్డపై జనం ముందు సగర్వంగా పేర్కొన్నారు. ఒక్క రోజు వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా వచ్చిన సీఎం జగన్.. సోమవారం పులివెందుల పట్టణ, నియోజకవర్గ పరిధిలో రూ. 861.84 కోట్లతో అభివృద్ధి చేసిన పలు నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేసిన పలు నిర్మాణాల వివరాలు.. ► రూ. 500 కోట్ల నాబార్డ్, ఆర్.ఐ.డి.ఎఫ్-37 నిధులు వెచ్చించి.. అధునాతన వసతులతో నూతనంగా నిర్మనించిన డా. వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కళాశాల, గవర్నమెంట్ జెనరల్ హాస్పిటల్ (జిజిహెచ్) భవనాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఇందులో ప్రతి ఏడాది 150 మంది వైద్య విద్యార్థుల అడ్మిషన్ తో మొత్తం 750 మంది విద్యార్థులు, 627 పడకల కేపాసిటీతో టీచింగ్ హాస్పిటల్, మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, బాయ్స్, గర్ల్స్ హాస్టల్ భవనాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ప్రధానంగా ఓపిడి బ్లాక్, ఐపీడి బ్లాక్, 24/7 అక్యూట్ కేర్ బ్లాక్ భవనాలు ఉన్నాయి. ► పులివెందుల మైన్స్ సమీపంలో బనానా ప్రాసెసింగ్ యూనిట్ వద్ద.. రూ. 20.15 కోట్ల (రాష్ట్ర ప్రభుత్వం, పాడా నిధులతో) వ్యయంతో జిల్లాకే తలమానికంగా, అత్యాధునిక సాంకేతిక, సదుపాయాలతో 5 ఎకరాల్లో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ బనానా ప్యాక్ హౌస్ (పులివెందుల మార్కెట్ కమిటీ) భవనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో 600 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యమున్న నాలుగు (4×150) కోల్డ్ రూములు, 126 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆరు (6×21) ప్రీ కూలింగ్ ఛాంబర్లు, లేబర్ క్వార్టర్స్, మిషనరీ రూమ్స్, 60 మెట్రిక్ టన్నుల వేయింగ్ బ్రిడ్జితో పాటు.. బనానా, స్వీట్ లైం కు సంబంధించి వేర్వేరుగా నాలుగు గ్రేడింగ్, క్లినింగ్, ప్యాకింగ్ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ► పులివెందుల పట్టణంలో 2.79 ఎకరాల్లో రూ.38.15 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ (రూ.10కోట్లు), పాడా (రూ.28 కోట్లు) నిధులతో అత్యాధునిక హంగులతో నిర్మించిన డా.వైఎస్ఆర్ మినీ సెక్రెటేరియేట్ కాంప్లెక్స్ భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ లో ఆర్డీవో, స్పందన హాల్, అగ్రికల్చర్, పే&అకౌంట్స్, సబ్ ట్రెజరీ, 3.కాన్ఫరెన్స్ హాళ్లు, రెండు టాయిలెట్ బ్లాక్స్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్ లో పాడా ఆఫీస్, పీఆర్, ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీరింగ్ కార్యాలయాలు, సీడీపీవో కార్యాలయం, రెండు కాన్ఫరెన్స్ హాళ్లు, రెండు టాయిలెట్ బ్లాకులు ఉన్నాయి. ► పులివెందుల పట్టణ నడిబొడ్డున రూ.70 లక్షల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన వైఎస్ఆర్ జంక్షన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో ప్రధానంగా సర్వాంగ సుందరంగా ఆకర్షనీయంగా ఏర్పాటు చేసిన ల్యాండ్ స్కెప్ మధ్యలో చూపరులను ఆకట్టుకునేలా డా.వైఎస్ఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది. ► పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్ట్ లో భాగంగా... రూ. 11.04 కోట్లతో (రాష్ట్ర ప్రభుత్వం+ఏపీఎస్పీడిసిఎల్ నిధులు) అభివృద్ధి చేసిన సెంట్రల్ బౌలే వార్డుకు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. వైఎస్ఆర్ జంక్షన్ కు 500 మీటర్ల దూరంలో అభివృద్ధి చేసిన ఈ మార్గంలో.. అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్, రోడ్డుకు ఇరువైపులా 3 మీటర్ల ఫుట్ పాత్, 2.25 మీటర్ల సీటింగ్ ఏరియా, బెంచిలు, 3 మీటర్ల పార్కింగ్ ఏరియా, స్టోన్ బొల్లార్డ్స్, రోడ్డుకు ఇరువైపులా నగిషీలతో తయారైన విద్యుత్ దీపాలు, పూల కుండీల ఏర్పాటుతో.. 6 మీటర్ల బిటి క్యారేజ్ వే వంటి ప్రత్యేకతలు పులివెందుల పట్టణ సరికొత్త జీవనశైలికి నాంది కానున్నాయి. ► పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా.. రూ. 20.69 కోట్లతో అధునాతన వసతులతో 4595 చదరపు మీటర్లలో అధునాతన వసతులతో నిర్మించిన వైఎస్ జయమ్మ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ భావన సముదాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ లో 58 షాపులు, మొదటి ఫ్లోర్ లో 32 షాపులతో పాటు.. టాయిలెట్ బ్లాకులను ఏర్పాటు చేశారు. ► పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా.. పట్టణ నడిబొడ్డున రూ.80 లక్షల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన గాంధీ జంక్షన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సర్కిల్ లో అత్యంత సుందరంగా, జీవకళ ఉట్టి పడేలా ఆకర్షనీయంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహం, చుట్టూ పూలమొక్కలతో ల్యాండ్ స్కెప్, లైటింగ్స్ పులివెందుల పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ► పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా.. రూ.65.99 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన డా. వైఎస్ఆర్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఇందులో.. ఎంట్రన్స్ ప్లాజా, ఎంట్రన్స్ వాటర్ ఫౌంటెన్, "ఐ లవ్ పులివెందుల" ఎలివేటెడ్ స్టెప్స్, ఓ.ఏ.టి. ఏరియా, బ్రిడ్జి, మ్యూజికల్ లేజర్ ఫౌంటెన్, మేజ్ గార్డెన్, కిడ్స్ ప్లే ఏరియా, కనెక్టింగ్ బ్రిడ్జి, ఐస్ ల్యాండ్ -స్టోన్ గజాబొ, గజాబొ పార్క్, పెర్గోలా, బోటింగ్ జెట్టీ, అర్బన్ ఫారెస్ట్ తదితర ప్రత్యేక సదుపాయాలు పులివెందుల పట్టణ వాసులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందివ్వనున్నాయి. ► పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా.. ప్రయివేట్ పార్ట్నర్ ఆధ్వర్యంలో.. రూ.175 కోట్ల పెట్టుబడితో 16.63 ఎకరాల్లో నిర్మించిన.. రెడీమేడ్ సూట్స్, వస్త్ర ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన, పేరెన్నికగన్న "ఆదిత్య బిర్లా యూనిట్" ను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారభించారు. ఈ పరిశ్రమ స్థాపనతో 2100 మందికి ఉద్యోగావకాశాలు అందనున్నాయి. ఇప్పటికే 500 మంది ఉద్యోగాలను కూడా పొందారు. ► ఇడుపులపాయ ఎస్టేట్ లో రూ.39.13 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ, పాడా నిధులతో 16 ఎకరాల్లో నిర్మించిన డా. వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఇప్పటికే పరిసర అందాలు, నెమళ్ల పార్కు, పచ్చదనంతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఇడుపులపాయ ఎస్టేట్.. నూతనంగా ఏర్పాటు చేసిన డా. వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ తో మరింత పర్యాటక శోభను సంతరించుకుంది. ఇందులో 48 అడుగుల వైఎస్ఆర్ విగ్రహం, ఆడియో విజువల్ బ్లాక్, ఫోటో గ్యాలరీ, ఎంట్రన్స్ బ్లాక్, పెవిలియన్ బ్లాక్ లతో పాటు.. చిల్డ్రన్ పార్క్, డిపేక్షన్స్, ట్రాపికల్ గార్డెన్ లోటస్ పాండ్, స్టెప్పుడ్ గార్డెన్, ఫ్లోరల్ పార్క్, స్టోన్ గాజేబోస్, పాదయాత్రకు సంబందించిన 21 విగ్రహాల సమూహం, 3 టాయిలెట్ బ్లాకులు పర్యాటకులకు సంతృప్తి స్థాయిలో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని అందివ్వనున్నాయి. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. "ఈ రోజు తన సొంత గడ్డపై ముఖ్యమంత్రిగా మీ అందరిముందు నిలుచున్నానంటే.. మీ అందరి అభిమానం, ఆశీస్సులు, దీవెనలే" అన్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి.. పులివెందులలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతోందన్నారు. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి అనేది అనంతం అని.. కాలానుగుణంగా అభివృద్ధి కొనసాగుతూనే ఉంటుందన్నారు. సొంతగడ్డపై మమకారం ఎప్పటికీ తీరిపోయేది కాదన్నారు. ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాలన్నింటిలోను.. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు పాల్గొనగా.. జిల్లా ఎస్పి సిద్దార్థ్ కౌశల్, జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, కడప నగర కమీషనర్ ప్రవీణ్ చంద్, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆర్డీవోలు అన్ని కార్యక్రమాలను ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ అవినాష్ రెడ్డి లతో పాటు.. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఎం. టి.కృష్ణబాబు, పాడ ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, స్థానిక నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
తాడిపత్రి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రారంభం
-
పాడేరు మెడికల్ కాలేజీ.. సిద్ధం
గిరిజనుల జీవన ప్రమాణాలు పూర్తిస్థాయిలో పరిపుష్టం చేసేందుకు ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. పాడేరులో నిర్మిస్తున్న వైద్య కళాశాల పనులు ఓ వైపు వేగంగా పూర్తి చేస్తుండడంతో పాటు, ఆ స్థాయి వైద్య సేవలను ముందుగానే అందుబాటులోకి తెస్తోంది. సాక్షి,పాడేరు: గిరిజనులకు ఉన్నత వైద్యసేవలు కల్పించడం లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రతిపక్ష నేత హోదాలో ఆయన పాడేరులో మెడికల్ కళాశాలను నిర్మిస్తామని హమీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే రూ.500కోట్లతో పాడేరులో మెడికల్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.ప్రస్తుతం 35ఎకరాల విస్తీర్ణంలో తలారిసింగి పాలి టెక్నిక్ కళాశాల ప్రాంగణంలో మెడికల్ కళాశాల,సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి,నర్సింగ్ కళాశాల భవన నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. ఈఏడాదిలో మొత్తం అన్ని భవనాలను పూర్తి చేసే లక్ష్యంతో ఎన్సీసీ నిర్మాణ సంస్థ చురుగ్గా పనులు నిర్వహిస్తోంది. జిల్లా జనరల్ ఆస్పత్రిగా పేరుమార్పు వైద్య విధాన పరిషత్‌లో ఇంతవరకు పనిచేసిన పాడేరు జిల్లా ఆస్పత్రిని ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో ఇటీవల విలీనం చేసి జిల్లా జనరల్ ఆస్పత్రిగా పేరు మార్చారు. మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు ఇంకా గడువు ఉండడంతో ముందస్తుగానే పాడేరు జిల్లా జనరల్ ఆస్ప త్రిలో 420 బెడ్లలో రోగులకు 24గంటల పాటు ఉన్నత వైద్యసేవలకుచర్యలు చేపట్టింది. పాడేరు జిల్లా ఆస్పత్రిలో అదనపు అంతస్తును యుద్ధప్రాతిపదికన ఇటీవల పూర్తి చేసి, అన్ని సదుపాయాలతో పడకలను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో 50 ప్రత్యేకంగా గర్భిణులకు, మరో 50 మాతా శిశువుల ఆరోగ్యసేవలకు, 50 పడకలు రక్తహీనత సమస్య ఉన్న మహిళా రోగులకు కేటాయించనున్నారు. జాతీయ వైద్యమండలి పరిశీలనకు ఏర్పాట్లు జిల్లా జనరల్ ఆస్పత్రిలో అందుబాటులోకి తెచ్చిన 420 బెడ్లు,ఇతర సౌకర్యాలు,వైద్య నిపుణులు,అందించే సేవలను సమగ్రంగా పరిశీలించేందుకు జాతీయ వైద్య మండలి పర్యటించనుంది. ఈ మండలి పరిశీలన తరువాత మెడికల్ కళాశాలకు అనుబంధంగా జిల్లా జనరల్ ఆస్పత్రి సేవలు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయి. 256 పోస్టుల భర్తీకి చర్యలు మెడికల్ కళాశాల,అనుబంధ జిల్లా జనరల్ ఆస్పత్రులకు సంబంధించి వివిధ విభాగాల్లో 706 పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ముందుగా 256 పోస్టుల భర్తీని కలెక్టర్ అధ్యక్షతన కమిటీ వేగవంతం చేసింది. మిగిలిన వైద్యులు,నర్సింగ్,ఇతర విభాగాల పోస్టులకు వైద్య ఆరోగ్యశాఖ త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది. విధుల్లో వైద్య నిపుణులు పాడేరు మెడికల్ కళాశాల,అనుబంధ జిల్లా జనరల్ ఆస్పత్రి ద్వారా జిల్లా ప్రజలకు నిరంతర ఉన్నత వైద్యసేవలు అందించే లక్ష్యంతో ముందస్తుగానే ప్రభుత్వం వైద్యులను నియమించింది. పాడేరు మెడికల్ కళాశాలలో ప్రిన్సిపాల్‌తో పాటు నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫె సర్లు, 17మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. రోగులకు ఉన్నత వైద్యసేవలు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాల,అనుబంధ జిల్లా జనరల్ ఆస్పత్రి ద్వారా ఉన్నత వైద్యసేవలు అందించే లక్ష్యంతో చర్యలు తీసుకుంటోంది. భవనాల నిర్మాణాలతో సంబంధం లేకుండా 420 పడకలతో జిల్లా జనరల్ ఆస్పత్రిలో అన్ని వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చాం. అన్ని విభాగాల వైద్యపోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. – డాక్టర్ డి.హేమలతాదేవి, ప్రిన్సిపాల్,పాడేరు మెడికల్ కళాశాల -
కృష్ణా తీరాన..అభివృద్ధి పతాక
-
చింతలపూడి గిరిజన గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు
-
కాసేపట్లో వైఎస్ఆర్ జిల్లాకు సీఎం జగన్
-
సీఎం మార్క్ బ్రాండ్ సిటీ
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి : సువిశాల సాగరతీరం చెంతనే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఐటీ పరిశ్రమల్ని అభివృద్ధి చేసి.. సిటీ ఆఫ్ డెస్టినీని ఐటీ హబ్‌గా మార్చాలనే ఉద్దేశంతో.. బీచ్ ఐటీ కాన్సెప్ట్‌ని తొలుత ప్రమోట్ చేయాలని భావించారు. ఇందులో భాగంగానే ఇన్ఫోసిస్, టెక్‌మహీంద్ర, హెచ్‌సీఎల్, యాక్సెంచర్, రాండ్‌స్టాడ్, డబ్ల్యూఎన్ఎస్, అమేజాన్ తదితర ఐటీ, ఐటీ అనుబంధ దిగ్గజ సంస్థలు విశాఖ వైపు అడుగులు వేశాయి. వర్చువల్ డెస్క్‌టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(వీడీఐ), క్లౌడ్ ప్రాజెక్టులకు కేంద్రంగా విశాఖ క్యాంపస్‌ని మార్చాలని విప్రో నిర్ణయించింది. విశాఖలో స్టార్టప్‌ల ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కామ్) సీఈవో సంజీవ్ మల్హోత్రా ప్రకటించారు. ఐటీ రంగంలో తిరుగులేని నగరంగా విశాఖపట్నంని అభివృద్ధి చేసేందుకు ఇక్కడే ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీ రీసెర్చ్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఐటీ పరిశోధనలు, అభివృద్ధిలో భాగంగా.. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఎకోసిస్టమ్‌ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు కేంబ్రిడ్జిలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) సహకారంతో పాటు సంయుక్త సర్టిఫికేషన్ కోర్సుల్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సంస్థ చెగ్.. విశాఖలో కొత్త బ్రాంచ్ని ప్రారంభించింది. అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ స్వయంగా శంకుస్థాపన చేశారు. వైజాగ్ టెక్ పార్క్ కూడా డేటా సెంటర్‌తో పాటు బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీని రూ.21,844 కోట్ల పెట్టుబడితో 39,815 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఎన్టీపీసీ, ఇంధన రంగంలో హెచ్‌పీసీఎల్, పర్యాటక రంగంలో ఒబెరాయ్, తాజ్, ఇనార్బిట్‌మాల్, టర్బో ఏవియేషన్.. ఇలా.. విభిన్న రంగాల్లో బహుళ ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేస్తున్నారు. టైర్–1 సిటీలతో పోటీ నీతి ఆయోగ్ ఇటీవల వెల్లడించిన పట్టణ సుస్థిర అభివృద్ధి సూచిక ర్యాంకుల్లో విశాఖకు 18వ ర్యాంకు సాధించింది. దేశంలోని రాష్ట్రాల రాజధానులు, 10 లక్షల జనాభా పైబడిన నగరాలు.. మొత్తంగా 56 నగరాలకు ఈ ర్యాంకులు ఇచ్చారు. టైర్–1 సిటీల కంటే ద్వితీయ శ్రేణిలో ఉన్న వైజాగ్.. అందర్నీ ఆకర్షిస్తోంది. స్మార్ట్ సిటీ ర్యాంకింగ్‌లోనూ సత్తా చాటుతోంది. 2018–19లో 23వ ర్యాంకులో ఉన్న నగరం ఆ తర్వాత వరుసగా టాప్–10లోనే కొనసాగుతోంది. ఈ ఏడాది క్లైమేట్ స్మార్ట్ సిటీ ఫ్రేమ్ వర్క్‌లో 4 స్టార్ రేటింగ్ సాధించింది. ఐటీ ఉద్యోగాల జోరు.. రాష్ట్రంలోని ఐటీ రంగంలో 2014–19 కాలంలో 24,350 ఐటీ ఉద్యోగాల కల్పన జరిగితే ఆ తర్వాత రెండేళ్లు కోవిడ్ వంటి కష్టకాలం ఉన్నప్పటికీ ఈ నాలుగున్నర ఏళ్లల్లో కొత్తగా 29,500 ఉద్యోగాలు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల సంఖ్య 53,850కు చేరింది. ♦ డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్న అదానీ, ఎస్‌క్యూఎల్ సంస్థలు ♦ భారీ ఐటీ పార్కులు నిర్మి స్తున్న అదానీ, రహేజా, ఏపీఐఐసీ ♦ గడిచిన నాలుగున్నర ఏళ్లలో కొత్తగా 29,500 ఐటీ ఉద్యోగాలు \ ♦ విశాఖ కేంద్రంగా ఇన్ఫోసిస్, విప్రో, రాండ్‌స్టడ్, బీఈఎల్ కార్యకలాపాలు ♦ ఇప్పటికే ఉన్న సంస్థలు భారీ విస్తరణ ప్రణాళికలు ♦ ఎమర్జింగ్ ఐటీ సిటీగా విశాఖ ♦ విశాఖకు కంపెనీలు ఆకర్షించే విధంగా బీచ్ ఐటీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం -
అభివృద్ధికి నిదర్శనం
సాక్షి ప్రతినిధి, కడప: రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం వైఎస్సార్ జిల్లా చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ తొలిరోజు పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో రూ.64.54 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు. నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఏపీ కార్ల్‌లో అగ్రికల్చర్, హార్టికల్చర్ కాలేజీలతోపాటు అత్యాధునికంగా నిర్మించిన ల్యాబ్‌ను ప్రారంభించారు. శ్రీస్వామినారాయణ గురుకుల పాఠశాలకు భూమి పూజ నిర్వహించి ఆదిత్యా బిర్లా గార్మెంట్స్ తయారీ యూనిట్‌ను సందర్శించారు. అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణం దేశానికే ఆదర్శప్రాయమని సగర్వంగా చెబుతున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ముందుగా అన్నమయ్య జిల్లా రాయచోటిలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియాఖానం కుమారుడి వివాహానికి హాజరైన అనంతరం హెలికాప్టర్లో మధ్యాహ్నం 1.30 గంటలకు పులివెందుల భాకరాపురం హెలిప్యాడ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం లభించింది. సుందర శ్రీకృష్ణ దేవాలయం ప్రారంభం.. భాకరాపురం రింగురోడ్డు సర్కిల్లో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.4.54 కోట్ల వ్యయంతో అత్యంత సుందరంగా నూతనంగా శ్రీకృష్ణ దేవాలయాన్ని నిర్మించారు. ఆలయం వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు అందించారు. హార్టికల్చర్ కళాశాల.. అత్యాధునిక ల్యాబ్ పులివెందులలోని ఏపీ కార్ల్ ప్రాంగణంలో రూ.9.96 కోట్ల ‘పాడా’ నిధులతో నిర్మించిన అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కాలేజీలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. 60 సీట్లు బీఎస్సీ అగ్రికల్చర్లో, 61 సీట్లతో బీఎస్సీ హార్టికల్చర్ కోర్సులను అందిస్తున్నాయి. అక్కడే ఏపీ కార్ల్‌లో రూ.11 కోట్ల వ్యయంతో నిర్మించిన స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంట్రల్ టెస్టింగ్ ల్యాబొరేటరీని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. పాలు, పాల ఉత్పత్తుల తనిఖీ, నాణ్యతా పరీక్షలు, డయాగ్నొస్టిక్ సేవలు, నిర్దిష్ట వ్యాధి కారక క్రిముల ఉత్పత్తులను పరీక్షించడం, ఆహార ధాన్యాలు, తృణధాన్యాలు పప్పుల నమూనాల విశ్లేషణ, ఫార్మా అప్లికేషన్ పరీక్షల నిర్వహణ తదితరాలకు ఈ ల్యాబ్ సేవలు అందిస్తుంది. ఆహ్లాదకరంగా శిల్పారామం.. పులివెందుల వాసులకు అత్యంత ఆహ్లాదకర, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తూ 38 ఎకరాల్లో రూ.14.04 కోట్లతో నిర్మించిన శిల్పారామంలో ఫేస్ లిఫ్టింగ్ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో 28 ఎకరాల్లో శిల్పారామం ఉండగా 10 ఎకరాల్లో ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేశారు. మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ విత్ గ్యాలరీ, హిల్ టాప్ టవర్‌లో 16.5 అడుగుల దివంగత వైఎస్సార్ విగ్రహం, పార్టీ జోన్, జిప్ లైన్ (రోప్ వే), బోటింగ్ ఐలాండ్ పార్టీ జోన్, చైల్డ్ ప్లే జోన్, వాటర్ ఫాల్, ఫుడ్ కోర్టుతోపాటు దివంగత వైఎస్సార్ కూర్చుని ఉన్న భంగిమలో ఐదు అడుగుల విగ్రహంతో ఆకట్టుకునే ఎంట్రీ ప్లాజా, సీసీ రోడ్లు, పార్కింగ్ ఏరియా, ఆహ్లాదకరమైన గ్రీనరీ శిల్పారామంలో ఉన్నాయి. ఆకట్టుకున్న ప్రదర్శనలు.... సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి శిల్పారామం వద్ద సంప్రదాయ వాయిద్యాలైన సన్నాయి, డోలు బృందంతో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం సంప్రదాయ బూర వాయిద్యాలు, డప్పు కళాకారుల దరువు, మోరగల్లు ప్రదర్శనలు, తోలు బొమ్మలాట, చెక్క భజనలు, జానపద నృత్యాల నడుమ సీఎం జగన్ పల్లె సంస్కృతి ఉట్టి పడేలా రూపొందించిన ప్రదర్శనలను తిలకించారు. చేతి వృత్తుల కళాకారులు జూట్ బ్యాగ్‌లు, కలంకారీ పెయింటింగ్స్, చీరలు, ఆకట్టుకునే సంపద్రాయ ఆభరణాలను ప్రదర్శించారు. బోటింగ్ వద్ద భారీ స్క్రీన్‌పై క్రికెట్ మ్యాచ్ లైవ్ ప్రసారాలను ఏర్పాటు చేశారు. అక్కడికి సమీపంలోని ఎంబీ థియేటర్ వద్ద పులివెందుల ఉమెన్స్ డిగ్రీ కాలేజీ విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. హిల్ టాప్‌పై దివంగత వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్ శిల్పారామం వ్యూ పాయింట్‌ను పరిశీలించారు. మ్యూజిక్ వాటర్ ఫౌంటెన్‌ను వీక్షించారు. అధికారులతో గ్రూప్ ఫోటో దిగి శిల్పారామం అంతా ఉత్సాహంగా కలియతిరిగారు. శ్రీస్వామినారాయణ గురుకుల పాఠశాలకు భూమి పూజ దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీస్వామినారాయణ అంతర్జాతీయ గురుకుల విద్యాపీఠం ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమి పూజ చేశారు. పులివెందులలో ఏపీ కార్ల్ ఎదురుగా 12 ఎకరాల్లో రూ.60 కోట్ల వ్యయంతో శ్రీస్వామి నారాయణ గురుకుల విద్యాపీఠాన్ని నిర్మించనున్నారు. తొలి విడతలో రూ.26 కోట్లు ఖర్చు చేయనున్నారు. 2025 నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నట్లు విద్యాపీఠం తెలిపింది. హైదరాబాద్, జడ్చర్ల నుంచి వచ్చిన గురుకుల పీఠానికి చెందిన స్వామీజీలు, విద్యార్థులతో కలసి సీఎం జగన్ గ్రూప్ ఫోటో దిగారు. ఆదిత్యా బిర్లా యూనిట్ సందర్శన... పులివెందుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదిత్య బిర్లా గార్మెంట్స్ యూనిట్‌ను సందర్శించారు. వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 500 మంది అందులో పని చేస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలతో సీఎం కాసేపు ముచ్చటించారు. గార్మెంట్స్ ఉత్పత్తి వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్‌బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిన్నప్ప, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి ధనుంజయరెడ్డి, కలెక్టర్ వి.విజయ్‌రామరాజు, ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, ట్రైనీ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల వద్దకు అభివృద్ధి పనులు
న్యూఢిల్లీ: గత తొమ్మిదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని ప్రధాని మోదీ చెప్పారు. వచ్చే తొమ్మిది నెలల కాలంలో ఈ పనుల గురించి ప్రజలకు వివరించాలని మంత్రివర్గ సహచరులను ఆయన కోరారు. సోమవారం రాత్రి ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్లో మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ప్రధానిమాట్లాడారు. 2047లో వందో స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే నాటికి మౌలిక వసతులు మొదలుకొని బడ్జెట్ పరిమాణం వరకు ప్రగతి ప్రయాణాన్ని వివరించే పవర్ ప్రజెంటేషన్ కూడా జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటి నుంచి 2047వ సంవత్సరం వరకు స్వర్ణయుగం, అమృత్ కాల్‌గా ప్రధాని మోదీ పేర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించిన ప్రధాని, అదే సమయంలో దేశం సాధించిన ప్రగతిని ప్రశంసించారు. విదేశాంగ, రక్షణ సహా పలు మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులు కూడా ఈ సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా, ఈజిప్టు దేశాల్లో పర్యటనల సందర్భంగా సాధించిన విజయాలను వారు వివరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సుమారు నాలుగు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ కేటాయింపులను సరిగ్గా వినియోగించుకోవడమెలాగనే అంశంపైనా చర్చించారు. అనంతరం ప్రధాని మోదీ ట్విట్టర్లో..‘కేబినెట్ సమావేశం ఫలప్రదంగా సాగింది. వివిధ విధివిధానాలపై అభిప్రాయాలను పంచుకున్నాం’ అని పేర్కొన్నారు. త్వరలో పార్లమెంట్ సమావేశాలు జరగనుండటం, ఇటీవల బీజేపీ అగ్ర నాయకత్వం వరుస సమావేశాలు జరుపుతున్న నేపథ్యంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కేబినెట్ భేటీ చర్చిస్తుందన్న వార్తలు గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారమవుతున్న విషయం తెలిసిందే. -
ప్రజల వద్దకే పాలన అందిస్తోన్న ఏకైక నాయకుడు సీఎం జగన్
-
ఓయూ కీర్తి ప్రతిష్టలు పెంచేందుకు కృషి
లాలాపేట: ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో దాదాపుగా రూ. 120 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ యాదవ్ తెలిపారు. రీఫార్మ ఫర్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్లో భాగంగా రెండేళ్ల కాలంలో చేపట్టిన సంస్కరణల ప్రగతిని వచ్చే ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. ఓయూ వైస్ చాన్స్‌లర్‌గా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బుధవారం ఓయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణతో కలిసి ఇనిషి యేటివ్స్.. ఈవెంట్స్... అచీవ్మెంట్స్ 2021–23 పేరుతో రూపొందించిన ప్రగతి నివేదికను ఆవిష్కరించారు. పాలనా వ్యవస్థను గాడిలో పెట్టడం అకడమిక్ పరిపాలనా వ్యవస్థలను పటిష్టం చేయడం, విద్యా పరిశోధనా రంగాల్లో మేటిగా నిలపడమే ధ్యేయంగా తాము చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. చారిత్రాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ చాన్స్‌లర్‌గా పని చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. మరో వందేళ్ల పాటు ఓయూ తన కీర్తి ప్రతిష్టను కొనసాగించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్‌రావు, విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో యూనివర్సిటీని విద్యారంగంలో అగ్రగామిగా నిలిపే కార్యక్రమం కొనసాగతోందని స్పష్టం చేశారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో ఓయూ 22వ స్థానాన్ని సాధించడం, డబ్ల్యూసీఆర్‌సీ లీడర్స్ ఆసియా వరల్డ్స్ బెస్ట్ బ్రాండ్ 2022 యూకేలోని హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో అవార్డు అందుకోసం తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు. రూ. 120 కోట్లతో బాయిస్ హాస్టల్స్, శతాబ్ది నూతన పరిపాలనా భవనం, పైలాన్, ఓపెన్ ఎయిర్ థియేటర్‌తో పాటు అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని వీసీ వివరించారు. ఓయూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులను ఉత్సాహపరిచేందుకు తక్ష పేరుతో ప్రత్యేకంగా మూడు రోజుల కార్యక్రమాలతో పాటు ఉస్మానియా ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించామన్నారు. అకడమిక్ కేలండర్‌ను సరిదిద్దడం, ఏటా స్నాతకోత్సవం నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని వీసీ వెల్లడించారు. మార్కెట్‌కు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగు పరచడంతో పలు కొత్త కోర్సులు ప్రవేశపెట్టామన్నారు. ఇంజినీరింగ్‌లో కృత్రిమ మేధ మిషన్ లెరి్నంగ్, మైనింగ్, బీఏ హానర్స్, డిగ్రీలో ఏ కోర్సు చదివిన వారైనా ఆర్ట్స్ సోషల్ సైన్సెస్‌లో పీపీ చేసే వినూత్న అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చామని వీసీ వివరించారు. ఇది సివిల్ సర్విసెస్ వైపు వెళ్లేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. వివిధ అంశాలపై దాదాపు 10 విదేశీ యూనివర్సిటీలతో ఎంఓయూ చేసుకున్నామన్నారు. ఎలాంటి ఫైరవీలు, ఒత్తిళ్లకు తావు లేకుండా ఆన్లైన్ అర్హతా పరీక్షలు, అకడమిక్ మెరిట్ ఆధారంగా అర్హులైన వారికే పీహెచ్డీ ప్రవేశాలు కల్పించామన్నారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, బోధన, బోధనేతర సిబ్బంది యూనివర్సిటీ తీసుకునే నిర్ణయాల్లో భాగస్వాములై ఉస్మానియా యూనివర్సిటీ పతాకాన్ని ప్రపంచ స్థాయిలో ఎగరవేసేందుకు కలిసి రావాలనీ ఓయూ వీసీ రవీందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ప్రొఫెసర్లు స్టీవెన్సన్, జి.మల్లేషం, శ్రీరాం వెంకటేష్, గణేష్, వీరయ్య, ప్యాట్రిక్, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్, డైరెక్టర్లు, సీనియర్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. -
CM YS Jagan: నేడు విశాఖకు సీఎం జగన్
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని.. ప్రారంభోత్సవాలు చేస్తారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 3.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 3.50 గంటలకు పీఎం పాలెం వైఎస్సార్ స్టేడియానికి చేరుకుని.. అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 4.50 గంటలకు ఆరిలోవకు చేరుకుని అపోలో కేన్సర్ ఆస్పత్రిని ప్రారంభించి ప్రసంగిస్తారు. అనంతరం 5.50 గంటలకు బీచ్ రోడ్డుకు చేరుకుంటారు. అక్కడ వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన సీ హ్యారియర్ యుద్ధ విమాన మ్యూజియాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచే రామ్‌నగర్‌లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాలను కూడా ప్రారంభిస్తారు. అనంతరం ఎండాడలోని కాపు భవనం, భీమిలిలోని ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తారు. 6.15 గంటలకు బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్‌కు చేరుకుని ఎమ్మెల్యే గొల్ల బాబురావు కుమారుడి వివాహ రిసెప్షన్లో పాల్గొంటారు. అనంతరం రాత్రి 7 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 8.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. వెజాగ్ స్టాండ్స్ విత్యూ..! దశాబ్దాలుగా నిరాదరణకు గురైన ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊపిరి పోసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జనం జేజేలు పలుకుతున్నారు. వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ‘వైజాగ్ స్టాండ్స్ విత్యూ’.. ‘థాంక్యూ సీఎం సార్..’ అని నినదిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కోసం గురువారం విశాఖ వస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు భారీ హోర్డింగ్‌లతో స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యమంత్రి పర్యటించనున్న పలు ప్రాంతాల్లో, ముఖ్య కూడళ్ల వద్ద థాంక్యూ సీఎం సార్.. మన విశాఖ.. మన రాజధాని.. మీవెంటే మేముంటాం.. అనే నినాదాలతో స్వచ్ఛందంగా హోర్డింగులు ఏర్పాటు చేశారు. పీఎం పాలెంలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వద్ద సీఎం కార్యక్రమం ప్రాంతంలో దాదాపు 50 అడుగుల భారీ హోర్డింగ్ని కొందరు ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు. దారి పొడవునా ఏర్పాటైన హోర్డింగ్‌లు ప్రజల మనోగతంతోపాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేసిన సీఎం జగన్ పాలన పట్ల ఆదరణను చాటుతున్నాయని పేర్కొంటున్నారు. వలస ముద్ర స్థానంలో రాజముద్ర! వీఎంఆర్డీఏ, జీవీఎంసీ చేపట్టిన పలు ప్రాజెక్టులను ప్రారంభించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు విశాఖలో పర్యటించనున్నారు. దేశ విదేశీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న విశాఖ నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టిసారించారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో రూ.వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు రూపకల్పన చేసి భూమి పూజ చేయడంతోపాటు పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇన్నాళ్లూ వలస జిల్లాలుగా ముద్రపడిపోయిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ రూపు రేఖలు రాజధాని ఏర్పాటుతో సమూలంగా మారిపోతాయని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. సెప్టెంబర్ నుంచి విశాఖ వేదికగా పాలన సాగిస్తానని సీఎం జగన్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
సీఎం వైఎస్ జగన్ విశాఖ పర్యటన.. షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(గురువారం) విశాఖపట్నంలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 3.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి 3.50 గంటలకు పీఎం పాలెం వైఎస్సార్ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 4.50 గంటలకు ఆరిలోవ అపోలో ఆస్పత్రికి చేరుకుని, అపోలో కేన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 5.50 గంటలకు బీచ్ రోడ్డుకు చేరుకుంటారు, అక్కడ వీఎంఆర్డీఏ అభివృద్ది చేసిన సీ హారియర్ యుద్ద విమాన మ్యూజియంను ప్రారంభిస్తారు. దీంతోపాటు అక్కడి నుంచే రామ్‌నగర్‌లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాను ప్రారంభించనున్నారు. అనంతరం ఎండాడలోని కాపు భవనం, భీమిలిలోని ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు శంకుస్ధాపన చేయనున్నారు. అక్కడి నుంచి 6.15 గంటలకు బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న ఎమ్మెల్యే గొల్ల బాబురావు కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొంటారు, అనంతరం రాత్రి 7 గంటలకు తిరుగు ప్రయాణమై 8.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చదవండి: ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదు.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం -
శ్రీకాకుళం జిల్లా భవిష్యత్ లో మహానగరంగా ఎదగాలి
-
AP: 72 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు: రైల్వే శాఖ మంత్రి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో అమృత్ భారత్ పథకం కింద 72 స్టేషన్లలో అభివృద్ధి పనులు జరిగాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఏపీలో వివిధ రైల్వే ప్రాజెక్టులపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. 2022 ఏప్రిల్ నెల వరకు రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి సంబంధించి 16 కొత్త లైన్లు, 15 డబ్లింగ్ లైన్లు మొత్తం 31 ప్రాజెక్టులు కేటాయించామన్నారు. వాటి దూరం 5,581 కిలోమీటర్లు కాగా, 70,594 కోట్లుతో చేపట్టామన్నారు. ఈ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని, మార్చి 2022 వరకు 636 కిలోమీటర్ల దూరాన్ని 19,414 కోట్లతో నిర్మించినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే 2014-19 మధ్య 219 శాతానికి పైగా రైల్వే బడ్జెట్లో కేటాయింపులు పెంచడం జరిగిందని జీవీఎల్ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద 72 స్టేషన్ల అభివృద్ధి అమృత్ భారత్ స్టేషన్ స్కీం రైల్వే స్టేషన్ల అభివృద్ధికి దేశవ్యాప్తంగా 1275 రైల్వే స్టేషన్లను, వాటిలో 72 స్టేషన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించగా అందులో 53 స్టేషన్లలో ఇప్పటికే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. చదవండి: మా నమ్మకం నువ్వే.. ఏప్రిల్ 7 నుంచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం -
పేట్ల బురుజు ఆస్పత్రికి ప్రత్యేక స్థానం
సాక్షి, హైదరాబాద్: తాను జన్మించిన పేట్ల బురుజు ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ హామీ ఇచ్చారు. ఈ ఆస్పత్రి అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.కోటి వెచ్చిస్తానని గతంలో తానిచ్చిన హామీ మేరకు మొదటి విడతగా రూ.50 లక్షలు అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు రూ.50 లక్షలు మంజూరు ఉత్తర్వులను మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.మాలతికి అందజేశారు. -
మధురపూడికి మహర్దశ.. రూ.347 కోట్లతో ఎయిర్పోర్ట్ విస్తరణ
సాక్షి, రాజమహేంద్రవరం: ఉభయగోదావరి జిల్లాల వాసులకు గగనతల ప్రయాణ సేవలందిస్తున్న (రాజమహేంద్రవరం) మధురపూడి విమానాశ్రయానికి మహర్దశ పట్టనుంది. ఇందుకోసం భారత పౌర విమానయాన శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నది. ఈ మేరకు రూ.347.15 కోట్లు విడుదల చేస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. బిల్డింగ్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించేందుకు ఆ శాఖ సన్నాహాలు చేస్తోంది. పనులకు రాజమండ్రి ఎయిర్ పోర్ట్ ఇంజినీరింగ్ విభాగం నిర్వహించనుందని జాతీయ విమానాశ్రయం అధికారి అరుణ్‌కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇలా.. మధురపూడి విమానాశ్రయంలో ప్రస్తుతం 3,165 మీటర్ల పొడవున్న రన్‌వే, 11 పార్కింగ్ బేస్‌తో కూడిన ఏఫ్రాన్, 11 విమాన సర్వీసులు ఏకకాలంలో నిలుపుదలకు అవకాశం కలిగిన వసతి ఉంది. 4,065 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న టెర్మినల్ భవనంలో ఏకకాలంలో 225 మంది ప్రయాణికులు స్టే చేసేందుకు సరిపోతుంది. అంతర్జాతీయ స్థాయికి అవసరమైన సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయి. 90 శాతం ఆక్యుపెన్సీతో విమానాలు నడుస్తున్నాయి. విమానాశ్రయం నుంచి ప్రస్తుతం 12 సర్వీసులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నంకు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతి రోజూ 1,200 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. టెర్మినల్ భవన సామర్థ్యం పెంపు.. విమాన రాకపోకల సందర్భంగా ప్రయాణికుల తాకిడి పెరిగింది. ప్రతి రోజూ 1,200 మంది రాకపోకలు సాగిస్తుంటే.. ప్రస్తుతం ఉన్న భవనంలో కేవలం 225 మంది మాత్రమే స్టే చేసేందుకు అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం భవన సామర్థ్యం విస్తరించేందుకు నిధులు మంజూరయ్యాయి. రూ.347 కోట్లతో మరో 16,000 చదరపు గజాలకు విస్తరించేందుకు గానూ నూతన భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. భవన నిర్మాణం పూర్తయితే 1,400 మంది ప్రయాణికులు స్టే చేయవచ్చు. అంతేగాక ఒకేసారి 5 విమానాలు అరైవల్ అయినా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులుండవు. భద్రతలోనూ మేటి ప్రయాణికులు, విమానాశ్రయ భద్రత, రక్షణ విషయంలో మధురపూడి ఏయిర్ పోర్ట్ ప్రత్యేకంగా నిలుస్తుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దీని నిర్మాణం జరిగింది. యుద్ధ సమయంలో సముద్ర మార్గం ద్వారా రావాణాకు అనువైన ప్రాంతంగా ఖ్యాతి గడించింది. రెండో ప్రపంచ యుద్ధంలో యుద్ద విమానాలను ఇక్కడ ఉంచేవారు. సంతోషంగా ఉంది.. టెర్మినల్ భవన నిర్మాణ అనుమతులు, నిధుల విడుదల కోసం కొన్నేళ్లుగా చేస్తున్న కృషికి ఫలితం దక్కింది. గతేడాది డిసెంబరు 16న జరిగిన బోర్డు మీటింగ్‌లో తీర్మానం చేశాం. కాంపిటేటివ్ అథారిటీ, పరిపాలనా ఆమోదం, వ్యయం మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడటం సంతోషంగా ఉంది. ఇందుకు సంబంధించిన శాంక్షన్ ఆర్డర్స్ సంబంధిత ఉన్నతాధికారులకు అందాయి. –మార్గాని భరత్‌రామ్, ఎంపీ, రాజమహేంద్రవరం పనులు ప్రారంభిస్తాం.. టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు, నిధులు మంజూరయ్యాయి. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రయాణికులకు అధునాతన సేవలు అందించేందుకు భవన నిర్మాణం ఎంతగానో దోహదం చేస్తుంది. ప్రస్తుత సేవలను మరింతగా విస్తరించే వెసులుబాటు కలుగుతుంది. – ఎస్.జ్ఞానేశ్వరరావు, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ -
2026 నాటికి పూర్తి చేస్తాం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామప్ప దేవాలయం చుట్టూ అభివృద్ధి పనులు, పురాతన అనుబంధ దేవాలయాల పునరుద్ధరణ 2026 మార్చి నాటికి పూర్తి చేయనున్నట్లు కేంద్ర పురావస్తు శాఖ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్.. సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో)కు స్పష్టం చేసింది. ఈ మేరకు సమగ్ర నివేదికను ఆ సంస్థ అనుబంధ విభాగం ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ (ఐకొమాస్)కు సమర్పించింది. ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్పను గతేడాది యునెస్కో గుర్తించిన విషయం తెలిసిందే. యునెస్కో నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం ఆ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలి. అందు కు 8 అంశాలను సూచిస్తూ, వాటి ప్రకారం పనులు ఎలా చేస్తా రో, ఎప్పటిలోగా చేస్తారో డిసెంబర్ వరకు నివేదిక అందజేయా లని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, కాకతీయ హెరిటేజ్ ట్రస్టుతో సంప్రదించి రూపొందించిన నివేదికను తాజా గా ఐకొమాస్‌కు ఏఎస్ఐ సమర్పించింది. ఏం చేస్తారు..?: రామప్ప ఆలయం పక్కనే అదే సమయంలో నిర్మించిన కామేశ్వరాలయాన్ని పునరుద్ధరించడం కీలకం. 33 మీటర్ల వెడల్పు, 33 మీటర్ల పొడవుతో ఉండే ఈ మహా మండపాన్ని వేయి స్తంభాల మండపం తరహాలో పునరుద్ధరిస్తారు. 2023, జూన్ నాటికి ప్రదక్షిణ పథం వరకు, 2026, మార్చి నాటికి కక్షాసనతో పూర్తి పునరుద్ధరణ జరుగుతుందని యునెస్కోకు ఏఎస్ఐ తెలిపింది. 3 మీటర్ల లోతు నుంచి సాండ్ బాక్స్ పరిజ్ఞానంతో పునాదులు నిర్మిస్తారు. 8 శతాబ్దాల కిందట ఈ ఆలయం కట్టినప్పుడు వాడిన ఇసుకనే మళ్లీ వాడనున్నారు. దానిమీద అర మీటరు మందంతో డంగు సున్నం, ఇటుకలతో వేదిక నిర్మించి దానిమీద రాళ్లతో ప్రధాన ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించనుండటం విశేషం. రామప్ప చెరువు వద్దకు వెళ్లే దారిలో శిథిలమైన చిన్న ఆలయాలను, రామప్పకు చేరువలో నర్సాపూర్‌లోని చెన్నకేశవస్వామి, కొత్తూరులోని దేవునిగుట్ట, బుస్సాపూర్‌లోని నరసింహస్వామి ఆలయాలతోపాటు జాకారంలోని శివాలయం, రామానుజాపూర్లోని పంచకూటాలయాలను పునరుద్ధరించారు. రామప్పకు 25 కి.మీ. పరిధిలో టూరిజానికి మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తారు. పర్యాటకులకు సమస్త వసతులుండాలని యునెస్కో సూచించిన నేపథ్యంలో ఆ వివరాలను ఇందులో పొందుపర్చారు. దీని పరిధిలో ఉండే గ్రామాల అభివృద్ధి ఎలా ఉండాలో నిర్ధారిస్తూ ఓ పట్టణ ప్రణాళికను రూపొందించారు. వ్యవసాయానికి రామప్ప చెరువు నుంచి నీటిని మళ్లించే చానళ్లు, చెరువు కట్ట అభివృద్ధి చేయనున్నట్లు నివేదికలో పేర్కొ న్నారు. పాలంపేట స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో పనులు జరుగనున్నాయి. రామప్ప ఆలయ వైభవాన్ని పెంచడం, అక్కడి పవిత్రతను కాపాడటం, పురాతన కట్టడానికి ఏ రకంగానూ నష్టం వాటిల్లకుండా వ్యవహరించడం.. స్థానిక ప్రజలు, వ్యాపారులు, భక్తులు, అర్చకులకు అవగాహన సదస్సులు నిర్వహించడం లాంటివి నివేదికలో పొందురుపర్చారు. అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రూ.15 కోట్లను ఇటీవలే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంజూరు చేశారు. ఆ నిర్మాణాలతో పోలికలు పంపండి: యునెస్కో ఇప్పటికే ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన కట్టడాలతో రామప్పను పోలుస్తూ నివేదిక సమర్పించాలని యునెస్కో కోరింది. నిర్మాణానికి వాడిన రాయి, పునాదిలో వినియోగించిన పరిజ్ఞానం, ఆలయ నగిషీలు, శిల్పకళారీతుల వర్ణన, నాట్యరీతులతో కూడిన శిల్పాలకు సంబంధించి ఖజురహో, హంపి, తంజావూరు బృహదీశ్వరాలయం, పట్టదకల్లు, బాదామీ ఆలయాలతో పోలుస్తూ నివేదికను సమర్పించారు. కంబోడియా, థాయ్‌లాండ్ లాంటి దేశాల్లోని ఆలయాలతో పోలుస్తూ వచ్చే డిసెంబర్ నాటికి నివేదిక ఇవ్వనున్నట్లు అధికారులు హామీ ఇచ్చారు. -
మళ్లీ వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే
నాగోలు (హైదరాబాద్): అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారించి వివిధ కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నందున వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్ఎస్నే గెలిపిస్తారని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లుగా అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల మాదిరిగా సాగుతున్నాయన్నాయని తెలిపారు. మంగళవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలో సుమారు రూ.55 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఫతుల్లగూడలో జరిగిన సభలో మాట్లాడారు. పేదల్ని ఆదుకుంటున్న పథకాలు పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలని, సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో సంతృప్తికర స్థాయిలో ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేశామని కేటీఆర్ చెప్పారు. కల్యాణలక్ష్మి, ఆసరా పథకం, కేసీఆర్ కిట్ వంటి వంద రకాల సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది పేదలను ఆదుకుంటున్నాయని తెలిపారు. మెట్రో రైలు మొదటి దశలో నాగోలు వరకు నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగిందని, నాగోలు నుంచి ఎల్బీ నగర్ వరకు మిగిలిపోయిన 5 కిలోమీటర్ల మెట్రోను రెండో దశలో చేపడతామని తెలిపారు. వచ్చే ఎన్నికల తర్వాత ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామన్నారు. పెరిగిన తలసరి ఆదాయం.. తెలంగాణ వచ్చిన సమయంలో రాష్ట్ర తలసరి ఆదాయం 1.24 లక్షలని, తెలంగాణ వచ్చిన ఏడేళ్లలో 2.78 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని కేటీఆర్ తెలిపారు. జీఎస్డీపీ తెలంగాణ వచ్చిన సమయంలో 5.6 లక్షల కోట్లని, అదే ఈ రోజు 11.55 లక్షల కోట్లుగా ఉందన్నారు. దేశంలో అత్యుత్తమ 20 గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయని సర్వే చేస్తే..19 గ్రామాలు తెలంగాణలో ఉన్నాయని స్వయంగా కేంద్రమే చెబుతోందని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో రాష్ట్రానికి అత్యధికంగా 26 అవార్డులు కేంద్రం ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. 31.7 శాతానికి పెరిగిన గ్రీన్ కవర్.. రాజకీయ నాయకులు ఎన్నడూ చెట్లు, మొక్కలు, పర్యావరణం గురించి మాట్లాడరని కేటీఆర్ అన్నారు. చెట్లకు ఓట్లు ఉండవని, వాటితో ఎక్కువ లాభం ఉండదు కాబట్టే మాట్లాడరన్నారు. కానీ కేసీఆర్ నాయకత్వంలో 240 కోట్ల మొక్కలు నాటి సంరక్షిస్తుండడంతో గతంలో 24 శాతం ఉన్న గ్రీన్ కవర్ ఇవాళ 31.7 శాతానికి చేరిందని, ఇది రాష్ట్రానికే గర్వకారణమని పేర్కొన్నారు. గతంలో ఫతుల్లగూడ ఏరియా అడుగుపెట్ట వీల్లేకుండా దుర్వాసనతో అటవీ ప్రాంతంలా ఉండేదని, ప్రస్తుతం డంప్‌యార్డ్‌ను అపురూపమైన పార్క్‌గా తీర్చిదిద్దామని, దేశంలోని ఎక్కడా లేని విధంగా ముక్తిఘాట్‌ను ఏర్పాటు చేసి రూ.16 కోట్లతో అన్ని కులాలకు, మతాలకు చెందిన వారు ఒకే చోట దహన సంస్కారాలను చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మంత్రి మల్లారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
CM KCR: జగిత్యాలకు సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేడు(బుధవారం) జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు కేసీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సీఎం పర్యటనకు కావాల్సిన ఏర్పాట్లను మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీశ్‌రావు, గంగుల కమలాకర్ పూర్తిచేశారు. సాయంత్రం ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి దాదాపుగా 2 లక్షల మందిని సీఎం సభకు సమీకరించేందుకు స్థానిక నేతలు ఏర్పాట్లు చేశారు. జగిత్యాల సభలో సీఎం కేసీఆర్ చేసే ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు వరుసగా దాడులు, నోటీసులు జారీ చేయడంపై ముఖ్యమంత్రి మండిపడే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 11న కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణను ఎదుర్కోనున్న నేపథ్యంలో ఈ సభలో సీఎం ఏం మాట్లాడబోతున్నారన్న దానిపై నాయకులు, ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. జగిత్యాల అసెంబ్లీ స్థానం కూడా నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంటు పరిధిలో వస్తుండటంతో సభకు సంబంధించిన ఏర్పాట్లలో ఎమ్మెల్సీ కవిత కూడా తలమునకలయ్యారు. సీఎం కేసీఆర్ పర్యటన వివరాలు ►బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరుతారు. ►12.35 గంటలకు జగిత్యాల సమీకృత కలెక్టరేట్ సమీపంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►12.40 గంటలకు జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం ►ఒంటి గంటకు మెడికల్ కళాశాల భవనం, మధ్యాహ్నం 1.15 గంటలకు జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనం ప్రారంభం ►3.10 గంటలకు మోతె గ్రామంలో బహిరంగసభ ►సాయంత్రం 6 గంటలకు కరీంనగర్‌కు బయలుదేరి తీగలగుట్టపల్లిలోని ఆయన నివాసానికి చేరుకుంటారు. ►మరునాడు ఉదయం ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌ను ప్రారంభించి, అనంతరం మాజీ మేయర్ రవీందర్ సింగ్ కూతురు వివాహవేడుకకు హాజరుకానున్నారు. ఆ తరువాత కరీంనగర్‌లోని తీగలబ్రిడ్జి, మానేరు రివర్‌ఫ్రంట్ పనులను పరిశీలిస్తారు. అనంతరం హైదరాబాద్‌కు హెలికాప్టర్లో తిరుగుప్రయాణం కానున్నారు. -
ఏపీలో తొలి ఆక్వా వర్సిటీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఆక్వా కల్చర్ సుస్థిర అభివృద్ధి కోసం రాష్ట్రంలో మొట్టమొదటి ఆక్వా యూనివర్సిటీని నరసాపురంలో నెలకొల్పుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఇది దేశంలో మూడో ఆక్వా యూనివర్సిటీ కానుందని చెప్పారు. ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా నుంచి పీహెచ్డీ వరకు ఇక్కడ అందుబాటులోకి తెచ్చి ఆక్వా కల్చర్‌లో మానవ వనరుల కొరత తీరుస్తామన్నారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో రూ.3,300 కోట్ల విలువైన 15 అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆ వివరాలివీ.. నరసాపురం చరిత్రలో తొలిసారిగా.. పవిత్ర కార్తీక మాసంలో చివరి సోమవారం రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. ఒకేరోజు సుమారు రూ.3,300 కోట్ల నిధులతో 15 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించాం. ఇన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం నరసాపురం చరిత్రలో బహుశా మునుపెన్నడూ జరిగిన దాఖలాలు లేవు. నరసాపురం, నియోజకవర్గం రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలను మీ ముందుంచుతున్నా. ఫిషరీస్ యూనివర్సిటీ ఇక్కడ ఆక్వా కల్చర్ ప్రధానమని మనందరికీ తెలుసు. మెరైన్ ప్రొడక్షన్, ఎక్స్‌పోర్ట్స్‌లో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఆక్వా కల్చర్‌కు సంబంధించిన స్కిల్, పరిజ్ఞానం పిల్లలకు అందుబాటులోకి వస్తే మెరుగైన ఉద్యోగాలు, మెరుగైన జీతాలు లభిస్తాయి. ప్రపంచంలో ఎక్కడ అవసరమున్నా మన వారి నైపుణ్యాన్ని వినియోగించేలా గొప్ప చదువు అందించేందుకు ఇవాళ నాంది పలుకుతున్నాం. ఆక్వా కల్చర్ సుస్థిర అభివృద్ధి కోసం ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్స్, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ డిగ్రీ హోల్డర్లు, మాస్టర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ పీజీ, డిగ్రీ హోల్డర్లతో ఆక్వా కల్చర్‌లో మానవ వనరుల కొరత తీర్చేందుకు ఆక్వా విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటివరకు దేశంలో తమిళనాడు, కేరళలలో మాత్రమే ఇవి ఉండగా మూడో వర్సిటీ మన రాష్ట్రంలో ఏర్పాటవుతోంది. రూ.332 కోట్లతో ఈ యూనివర్సిటీని నరసాపురంలో నెలకొల్పుతున్నాం. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తై పనులు ప్రారంభించడానికి శ్రీకారం చుట్టాం. మత్స్యకారులకు మేలు చేస్తూ.. ముమ్మిడివరంలో ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల ప్రభావితమైన 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు ఇక్కడి నుంచే బటన్ నొక్కి రూ.108 కోట్లు విడుదల చేశాం. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల నష్టపోయిన మత్స్యకారులకు మంచి చేసేందుకు గత ప్రభుత్వం ఏనాడూ ముందుకు రాలేదు. ఇప్పుడు మన ప్రభుత్వ హయాంలో వారందరికీ మేలు చేసేలా చర్యలు చేపట్టాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకులాల్లోని పేదలంతా కూడా జగనన్న ప్రభుత్వమంటే మన ప్రభుత్వమనేలా ప్రతి అడుగూ వేస్తున్నాం. ఉప్పుటేరుపై రూ.188 కోట్లతో.. నరసాపురంలోనే ఉప్పుటేరుపై మోళ్లపర్రు వద్ద రెగ్యులేటర్ నిర్మించాలని ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. వారి కోరికను నెరవేరుస్తూ ఈరోజు శంకుస్థాపన చేశాం. ఉప్పునీరు కొల్లేరులోకి రాకుండా రైతులకు మంచినీరు ఇంకా మెరుగ్గా అందేలా, కొల్లేరులో ఐదో కాంటూరు వరకు మంచినీరు నిల్వ ఉండేలా ఉప్పుటేరుపై రూ.188 కోట్లతో రెగ్యులేటర్ కమ్ బ్రిడ్జి లాక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వంద పడకలతో ఏరియా ఆసుపత్రికి కొత్త భవనం నరసాపురంలో రూ.1,300 కోట్లతో ఏరియా ఆసుపత్రికి కొత్త భవనాన్ని నిర్మించి జాతికి అంకితం చేస్తూ ప్రారంభించాం. ఈ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచడంతో పాటు మరో రూ.66 లక్షల విలువైన వైద్య పరికరాలను అందించి ఆక్సిజన్ ప్లాంట్, జనరేటర్ కూడా అందుబాటులోకి తెచ్చాం. రూ.1,400 కోట్లతో వాటర్ గ్రిడ్ ఇక్కడ ఒకపక్క గోదావరి మరోపక్క సముద్రతీర ప్రాంతం ఉన్నా తాగడానికి గుక్కెడు నీళ్లు లేని దుస్థితిని నా పాదయాత్ర సమయంలో చూశా. బోరు వేస్తే ఉప్పునీరు వస్తోందని, ఆక్వా కల్చర్ సాగుతో ఉపరితల జలాలు కలుషితమవుతున్న నేపథ్యంలో తాగునీరు లేకుంటే ఎలా బతకాలన్న ఈ ప్రాంత ప్రజల ఆవేదనను తొలగిస్తూ ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1,400 కోట్లతో రక్షిత మంచినీటి సరఫరా వాటర్ గ్రిడ్ పథకానికి శంకుస్థాపన చేశాం. విజ్జేశ్వరం వద్ద గోదావరి నీటిని ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ల ద్వారా అక్కడే శుద్ధి చేసి పైప్‌లైన్ ద్వారా సరఫరా చేస్తాం. ఈ పథకం ద్వారా తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని నిడదవోలు, తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, ఉంగుటూరు, ఏలూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల ప్రజలతో పాటు కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, గుడ్లవల్లేరు మండలాల ప్రజలకు సురక్షిత తాగునీరు సరఫరా అవుతుంది. మొత్తం 26 మండలాల్లో 1,178 గ్రామాలకు చెందిన సుమారు 18.50 లక్షలమంది ప్రజలకు దీనిద్వారా మేలు జరుగుతుంది. 2,240 ఎకరాలకు సాగునీరు, తాగునీరు నరసాపురంలో రూ.87 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఫేజ్ 1కి శంకుస్థాపన చేశాం. మరో రూ.26 కోట్లతో వశిష్ట వారధి, బుడ్డిగవాని రేవు ఏటిగట్టు పటిష్టం చేయడంతోపాటు రూ.7.83 కోట్లతో శేషావతారం పంట కాలువ అభివృద్ధి, టైల్ డ్యామ్ నిర్మాణం, సీసీ లైనింగ్ పనులకు కూడా శ్రీకారం చుట్టాం. మొగల్తూరు పంట కాలువ అభివృద్ధి పనులను రూ.24 కోట్లతో చేపట్టాం. 2,240 ఎకరాలకు సాగునీరు, వాటి పరిధిలోని గ్రామాలకు తాగునీరు అందుతుంది. కాజ, ఈస్ట్ కొక్కిలేరు, ముస్కేపాలెం, మడుగు తూముల స్లూయిజ్‌ల పునర్నిర్మాణ పనులకు రూ.9 కోట్లతో శంకుస్థాపన చేశాం. ఒక్క నరసాపురం అభివృద్ధి పనుల గురించి చెప్పేందుకే ఇంత సమయం పట్టిందంటే ప్రజలకు ఎంత మంచి జరుగుతుందో ఆలోచించండి. పాలకొల్లు మెడికల్ కాలేజీ.. పాలకొల్లులో రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ పనులు ప్రారంభమయ్యాయి. వశిష్ట బ్రిడ్జి నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. కోర్టుల్లో వేసిన కేసులను పరిష్కరించి కేంద్రాన్ని ఒప్పించాం. జనవరిలో బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలుస్తాం. హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు.. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, తానేటి వనిత, సీదిరి అప్పలరాజు, అంబటి రాంబాబు, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మార్గాని భరత్, చింతా అనురాధ, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.3500 కోట్లతో 9 హార్బర్లు ఆరు వేల మంది మత్స్యకారులకు మేలు చేసేలా నరసాపురం ప్రాంతంలోని బియ్యపుతిప్ప వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. రూ.430 కోట్ల వ్యయంతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కానుంది. హార్బర్లో 640 మీటర్ల బెర్తు, 2,400 మీటర్ల బ్రేక్ వాటర్ నిడివి ఉండేలా బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్‌ను నిర్మిస్తున్నాం. ప్లాట్‌ఫామ్స్, వేలం కోసం హాల్స్, డ్రైయింగ్ యార్డ్స్, బోట్ పార్కింగ్ ఏరియా, మత్స్యకారులకు విశ్రాంతి గదులు, కోల్డ్ స్టోరేజీలు తదితర సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. మన రాష్ట్ర మత్స్యకారులు గుజరాత్ సహా ఇతర రాష్ట్రాలకు వెళ్లి బతకాల్సిన అవసరం రాకుండా ఇక్కడే తలెత్తుకుని జీవించేలా తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను రూ.3,500 కోట్లతో ఏర్పాటు చేస్తున్నాం. అగ్రికల్చర్ కంపెనీ భూములపై రైతులకు హక్కులు నరసాపురంలో అగ్రికల్చర్ కంపెనీ భూములపై పూర్తి హక్కులను రైతులకు ఈ రోజు నుంచి కల్పిస్తున్నాం. 1921లో బ్రిటీష్ ప్రభుత్వం దర్భరేవులో 1,754 ఎకరాల భూమిని నరసాపురం అగ్రికల్చర్ కంపెనీకి 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది. ఆనాటి నుంచి 1,623 మంది రైతులు సాగు చేస్తున్నప్పటికీ ఆ భూములపై వారికి ఎలాంటి హక్కులూ లేకపోవడంతో ప్రయోజనాలు అందని పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో నాడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వారికి రిజిస్ట్రేషన్ చేసి పట్టాలను అందిస్తున్నాం. రైతుల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపించాం. ఎకరానికి కేవలం రూ.100తో రైతులకు రిజిస్ట్రేషన్ చేసి వారికి హక్కులు కల్పించాం. నీటి ఎద్దడిని శాశ్వతంగా నివారించేలా.. నరసాపురంలో శాశ్వతంగా నీటి ఎద్దడి నివారణ, రక్షిత మంచి నీటి సరఫరా కోసం ఫిల్టరేషన్ ప్లాంట్, సర్వీస్ రిజర్వాయర్లు, వాటర్ సప్లై పైప్‌లైన్ పనులకు నేడు శంకుస్థాపన చేశాం. రూ.62 కోట్ల వ్యయంతో మంచినీటి సరఫరా ప్రాజెక్టు చేçపట్టాం. రూ.4 కోట్లతో నరసాపురం బస్‌స్టేషన్ అభివృద్ధి, కొత్త ప్లాట్‌ఫాంలు నిర్మించి నేడు వాటిని ప్రారంభించాం. బ్రిటీషర్ల కాలంలో నిర్మించిన ట్రెజరీ ఆఫీస్ బిల్డింగ్ నూతన భవనానికి శంకుస్థాపన చేశాం. పారిశ్రామిక, వ్యవసాయ, ఆక్వా రంగానికి మెరుగైన విద్యుత్ అవసరాల కోసం 220/132/33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి రూ.132 కోట్లు మంజూరు చేసి శంకుస్థాపన చేశాం. దీనివల్ల నరసాపురం, మొగల్తూరు, పాలకొల్లు, యలమంచిలి మండలాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుంది. పారదర్శకంగా రూ.1,76,516 కోట్లు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద ఓసీల అభివృద్ధికి కట్టుబడిన మన ప్రభుత్వ పాలనలో ఎలాంటి లంచాలు, అవినీతికి తావు లేకుండా బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో మూడేళ్ల ఐదు నెలల వ్యవధిలో రూ.1,76,516 కోట్లు జమ చేశాం. మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా భావించి 98 శాతం హామీలను నెరవేర్చాం. మేనిఫెస్టోలో చెప్పనివి కూడా అమలు చేస్తున్నాం. వైద్యం, ఆరోగ్యం, ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాలు, విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత.. ఇలా ఏ రంగం చూసినా పారదర్శకంగా పరిపాలన అందిస్తున్నాం. చంద్రబాబు 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ చేయనివిధంగా గత పాలకుల ఊహకు కూడా అందని విధంగా దేవుడి దయతో అన్ని వర్గాలకు అండగా, తోడుగా మీ బిడ్డ నిలబడ్డాడు. -
Narasapuram Tour: పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
Time: 01:16 PM టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారు: సీఎం జగన్ టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. జనసేనను రౌడీసేనగా మార్చేశారన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బైబై చెప్పారు. అన్ని ఎన్నికల్లో మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. చివరికి కుప్పంలో కూడా వైఎస్సార్సీపీనే గెలిపించారని సీఎం అన్నారు. Time: 12:46 PM నరసాపురంలో ఒకేసారి ఇన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎన్నడూ జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా యూనివర్శిటీకి శంకుస్థాపన చేశాం. నరసాపురం ఆక్వా రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని సీఎం అన్నారు. Time: 12:42 PM నర్సాపురం చరిత్రలో ఇదే మొదటిసారి: సీఎం జగన్ దేవుడి దయతో నర్సాపురంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని సీఎం జగన్ అన్నారు. ఒకే రోజు ఇన్ని ప్రారంభోత్సవాలు చేయడం నర్సాపురం చరిత్రలో ఇదే మొదటిసారి అని సీఎం పేర్కొన్నారు. Time: 12:34 PM గత ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదు: మంత్రి అప్పలరాజు మత్స్యకారులకు సీఎం జగన్ అండగా నిలిచారని మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మత్స్యకారుల జీవితాల్లో సీఎం వెలుగులు నింపారన్నారు. గత ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదని మంత్రి అన్నారు. Time: 12:25 PM దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం: ప్రసాదరాజు మత్స్యకారులకు అండగా నిలిచిన సీఎం జగన్‌కు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ రాకతో నర్సాపురం రూపురేఖలు మారబోతున్నాయన్నారు. దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం కానున్నాయన్నారు. గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందని ప్రసాదరాజు అన్నారు. Time: 12:13 PM పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఆంధ్రప్రదేశ్ ఆక్వా యూనివర్శిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్, జిల్లా రక్షితనీటి సరఫరా ప్రాజెక్ట్, ఉప్పు టేరు నదిపై మూలపర్రు రెగ్యులేటర్ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవనాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. నరసాపురం పురపాలక సంఘం మంచినీటి అభివృద్ధి పథకాన్ని సీఎం ప్రారంభించారు. Time: 12:05 PM పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. Time: 11:59 AM మత్స్యకార కుటుంబాలకు పరిహారం ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ అన్నారు. 23 వేల మంది మత్స్యకారులకు రూ. 107 కోట్ల పరిహారం అందిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం మత్స్యకారులను ఓటు బ్యాంకుగానే వాడుకుందన్నారు. Time: 11:05 AM సీఎం వైఎస్ జగన్ నరసాపురం చేరుకున్నారు. ముఖ్యమంత్రికి మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. కాసేపట్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. Time: 10:35 AM ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం బయల్దేరారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా విశ్వవిద్యాలయానికి, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్‌కు, రూ.1,400 కోట్లతో జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టులకు శంకుస్థాపన, నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవనానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇవీ ప్రారంభోత్సవాలు ♦నరసాపురం పట్టణం మధ్యలో ఉన్న ప్రాంతీయ వైద్యశాల ఇటీవలే 100 పడకల స్థాయికి అప్‌గ్రేడ్ అయింది. అందువల్ల చుట్టుపక్కల గ్రామాలలో నివసించే 2 లక్షల మందికి వైద్య సదుపాయాలు, సేవలు అందిస్తోంది. ఇప్పుడు అదే ఆస్పత్రిలో నూతనంగా మాతా శిశు సంరక్షణ విభాగం ఏర్పాటు చేశారు. రూ.13 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించారు. ♦నరసాపురం పట్టణంలో మంచి నీటి ఎద్దడి నివారణకు రూ.61.81 కోట్లతో నీటి సరఫరా అభివృద్ధి పథకం చేపట్టి పూర్తి చేశారు. ఈ పథకం వల్ల రాబోయే 30 ఏళ్ల వరకు నరసాపురం పట్టణానికి మంచి నీటి సరఫరాకు ఎటువంటి సమస్యా ఉండదు. ఇంకా శంకుస్థాపనలు ఇలా.. ♦రూ.4 కోట్ల వ్యయంతో నరసాపురం బస్‌స్టేషన్ పునరుద్ధరణ పనులు. ♦రూ.1.08 కోట్ల అంచనాతో నరసాపురం డివిజినల్ ఉప ఖజానా కార్యాలయం కొత్త భవన నిర్మాణం. ♦రుస్తుంబాద గ్రామంలో రూ.132.81 కోట్లతో 220/ 132/ 33 కె.వి సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు. ♦నరసాపురం పురపాలక సంఘం పరిధిలో రూ.237 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణం. రూ.87 కోట్లతో మొదటి ఫేజ్ పనులు. ♦రూ.26.32 కోట్లతో వశిష్ఠ వారధి – బుడ్డిగవాని రేవు ఏటి గట్టు పటిష్టం. ♦రూ.7.83 కోట్ల అంచనా వ్యయంతో చివరి గ్రామాలకు సాగు, తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు శేషావతారం పంట కాలువ అభివృద్ధిలో భాగంగా ఛానల్ డీ సిల్టింగ్, టెయిల్ డ్యామ్ నిర్మాణం, సీసీ లైనింగ్ పనులు. ♦రూ.24.01 కోట్లతో మొగల్తూరు వియర్ పంట కాలువ నిర్మాణం. ♦రూ.8.83 కోట్లతో కాజ, ఈస్ట్ కొక్కిలేరు, ముస్కేపాలెం అవుట్‌ఫాల్ నాలుగు స్లూయీస్‌ల పునః నిర్మాణం. సీఎం జగన్ పర్యటన ఇలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు నరసాపురం చేరుకుంటారు. 11.15 – 12.50 మధ్య వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత తిరిగి తాడేపల్లికి యలుదేరుతారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆక్వా వర్సిటీ... ఫిషింగ్ హార్బర్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా విశ్వవిద్యాలయానికి, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్‌కు, రూ.1,400 కోట్లతో జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టులకు శంకుస్థాపన, నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవనానికి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఇప్పటి వరకు తమిళనాడు, కేరళలో మాత్రమే ఈ వర్సిటీలు ఉన్నాయి. ఆక్వా వర్సిటీ కోసం నరసాపురం పరిసర ప్రాంతాల్లోని సరిపల్లి, లిఖితపూడి గ్రామాల మధ్య 40 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించారు. భవన నిర్మాణ పనుల కోసం రూ.332 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ ఆమోదించారు. మొదటి దశలో పరిపాలన భవనంతో పాటు విద్యార్థులకు వసతి గృహాలు, విశ్వవిద్యాలయం నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు చేశారు. 2022–23 బడ్జెట్లో విశ్వవిద్యాలయ నిర్మాణ పనులకు రూ.40 కోట్లు కేటాయించారు. రెండవ దశ పనుల్లో భాగంగా నరసాపురం మండలం బియ్యపుతిప్ప గ్రామంలో 350 ఎకరాలలో రూ.222 కోట్ల అంచనా వ్యయంతో విశ్వవిద్యాలయ సముద్రతీర ప్రాంగణం, పరిశోధన కేంద్రం నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు ద్వారా మత్స్యకారులు, ఆక్వా రైతులు ఎక్కువగా ప్రయోజనం పొందనున్నారు. వృత్తిపరంగా అర్హత కలిగిన మానవ వనరుల లభ్యత కారణంగా ఆక్వా రంగంలో నష్టాలను చాలా వరకు తగ్గించవచ్చు. తద్వారా దాదాపు సంవత్సరానికి రూ.4,000 నుంచి 5,000 కోట్ల ఆర్థిక ప్రయోజనం ఆక్వా రైతులకు చేకూరుతుంది. అవసరమైన సంఖ్యలో ఫిషరీస్ డిప్లొమా, బీఎఫ్ఎస్సీ, ఎంఎఫ్ఎస్సీ, పీహెచ్డీ అర్హత గల అభ్యర్థులను తయారు చేయడానికి ఆక్వా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మరిన్ని కొత్త మత్స్య కళాశాలలు, మత్స్య పాలిటెక్నిక్ కళాశాలలు ప్రారంభించే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ప్రారంభానికి సిద్దంగా ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి 6,000 మంది మత్స్యకారులకు లబ్ధి బియ్యపుతిప్ప వద్ద 150 ఎకరాల విస్తీర్ణంలో రూ.429.43 కోట్ల అంచనాతో ఫిషింగ్ హార్బర్ నిర్మించేందుకు ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. ఈ హార్బర్ నిర్మాణం ద్వారా మత్స్యకారులు అత్యంత సామర్థ్యం గల మోటారు బోట్లలో సముద్రంలో ఎక్కువ దూరం వేటకు వెళ్లేందుకు వీలుంటుంది. మార్కెటింగ్ సౌకర్యాలను పెంపొందించడం ద్వారా మత్స్య పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ హార్బర్ నిర్మించే ప్రదేశం నరసాపురం పట్టణానికి 14 కి.మీ. దూరంలో ఉంది. దీనివల్ల నరసాపురం, మొగల్తూరు మండలాలకు చెందిన 6,000 మంది మత్స్యకారులు లబ్ధి పొందనున్నారు. కొల్లేటికి సముద్రపు నీటి నుంచి రక్ష సముద్రపు నీరు కొల్లేరు సరస్సులోకి చొరబడకుండా నిరోధించడానికి, కొల్లేరులో 5వ కాంటూర్ వరకు మంచి నీరు నిలువ ఉండే విధంగా ఉప్పుటేరు నదిపై కిలోమీటరు 57.950 వద్ద మొల్లపర్రు విలేజ్ లిమిట్స్‌లో రూ. 188.40 కోట్ల అంచనా వ్యయంతో రెగ్యులేటర్ కమ్ బ్రిడ్జ్ కమ్ లాక్ నిర్మాణం కొరకు రూపొందించిన ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించింది. దీంతో ముఖ్యమంత్రి జగన్ నేడు దీనికి శంకుస్థాపన చేయనున్నారు. సురక్షిత తాగునీరివ్వడమే లక్ష్యంగా.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వాకల్చర్ వల్ల, తీర ప్రాంతంలో ఉప్పు నీటి సాంద్రత వల్ల ఏర్పడిన తీవ్ర తాగునీటి ఎద్దడి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం రూ.1,400 కోట్లతో రక్షిత నీటిసరఫరా ప్రాజెక్ట్‌ను మంజూరు చేసింది. విజ్జేశ్వరం జలాశయం నుండి గోదావరి నీటిని రాపిడ్ శాండ్ ఫిల్టర్ల ద్వారా శుద్ధి చేసి, పైప్ లైన్ల ద్వారా సరఫరా చేస్తుంది. ఈ పథకం ద్వారా నూతన జిల్లాలు పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పు గోదావరిలోని నిడుదవోలు, తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, ఉంగుటూరు, ఏలూరు (పార్ట్), తాడేపల్లిగూడెం(పార్ట్) నియోజకవర్గాల ప్రజలకు, కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, గుడ్లవల్లేరు మండలాల ప్రజలకు సురక్షిత తాగునీరు సరఫరా చేయొచ్చు. ఈ పథకానికి నేడు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అగ్రికల్చర్ కంపెనీ భూ అనుభవదారులకు హక్కులు నరసాపురం మండలం నందలి వేములదీవి ఉప గ్రామమైన దర్బరేవు గ్రామంలో నాటి బ్రిటీష్ ప్రభుత్వం 1921లో 1,754 ఎకరాల భూమిని నరసాపురం అగ్రికల్చర్ కంపెనీ లిమిటెడ్‌కు 99 సంవత్సరాలు లీజుకు ఇచ్చింది. ఆ రోజు నుంచి 1,623 మంది రైతులు ఆ భూమి స్వాధీన అనుభవంలో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ రైతులకు ఎటువంటి భూ యాజమాన్య హక్కులు కానీ, రెవెన్యూ రికార్డు పరమైన హక్కులు కానీ లేవు. అందువల్ల ఆ భూమిని అమ్మడానికి లేదా బ్యాంకులలో తనఖా పెట్టి రుణం పొందడానికి అర్హత లేదు. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో జారీ చేసి, ఎకరాకు రూ.100 ధర నిర్ణయించి, ఆ 1,623 మంది రైతులకు భూ యాజమాన్య, రెవెన్యూ రికార్డు పరమైన సర్వహక్కులు కల్పించింది. దీంతో రైతులు వారి వారసులు నిరభ్యంతరంగా స్వాధీనములో ఉండి ఆ భూములను అనుభవించుకోవచ్చు. అవసరాల నిమిత్తం అమ్ముకోవచ్చు. తనఖా పెట్టి ఋణాలు కూడా పొందవచ్చు. ఇందుకు సంబంధించిన హక్కు పత్రాలను సీఎం జగన్ నేడు రైతులకు అందజేయనున్నారు. ఇవీ ప్రారంభోత్సవాలు ► నరసాపురం పట్టణం మధ్యలో ఉన్న ప్రాంతీయ వైద్యశాల ఇటీవలే 100 పడకల స్థాయికి అప్‌గ్రేడ్ అయింది. అందువల్ల చుట్టుపక్కల గ్రామాలలో నివసించే 2 లక్షల మందికి వైద్య సదుపాయాలు, సేవలు అందిస్తోంది. ఇప్పుడు అదే ఆస్పత్రిలో నూతనంగా మాతా శిశు సంరక్షణ విభాగం ఏర్పాటు చేశారు. రూ.13 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించారు. ► నరసాపురం పట్టణంలో మంచి నీటి ఎద్దడి నివారణకు రూ.61.81 కోట్లతో నీటి సరఫరా అభివృద్ధి పథకం చేపట్టి పూర్తి చేశారు. ఈ పథకం వల్ల రాబోయే 30 ఏళ్ల వరకు నరసాపురం పట్టణానికి మంచి నీటి సరఫరాకు ఎటువంటి సమస్యా ఉండదు. ఇంకా శంకుస్థాపనలు ఇలా.. ► రూ.4 కోట్ల వ్యయంతో నరసాపురం బస్‌స్టేషన్ పునరుద్ధరణ పనులు. ► రూ.1.08 కోట్ల అంచనాతో నరసాపురం డివిజినల్ ఉప ఖజానా కార్యాలయం కొత్త భవన నిర్మాణం. ► రుస్తుంబాద గ్రామంలో రూ.132.81 కోట్లతో 220/ 132/ 33 కె.వి సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు. ► నరసాపురం పురపాలక సంఘం పరిధిలో రూ.237 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణం. రూ.87 కోట్లతో మొదటి ఫేజ్ పనులు. ► రూ.26.32 కోట్లతో వశిష్ఠ వారధి – బుడ్డిగవాని రేవు ఏటి గట్టు పటిష్టం. ► రూ.7.83 కోట్ల అంచనా వ్యయంతో చివరి గ్రామాలకు సాగు, తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు శేషావతారం పంట కాలువ అభివృద్ధిలో భాగంగా ఛానల్ డీ సిల్టింగ్, టెయిల్ డ్యామ్ నిర్మాణం, సీసీ లైనింగ్ పనులు. ► రూ.24.01 కోట్లతో మొగల్తూరు వియర్ పంట కాలువ నిర్మాణం. ► రూ.8.83 కోట్లతో కాజ, ఈస్ట్ కొక్కిలేరు, ముస్కేపాలెం అవుట్‌ఫాల్ నాలుగు స్లూయీస్‌ల పునః నిర్మాణం. -
ఇదెక్కడి గోల.. ఈ భారం మోయలేం..
కరీంనగర్: గ్రామపంచాయతీలో సరిపడా నిధులు లేక సర్పంచులు అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నారు. కనీసం కరెంట్ బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి ఉంది. ఇవే తలకుమించిన భారమైతే.. సర్పంచ్‌లపై ట్రాక్టర్ల నిర్వహణ భారం కత్తిమీద సాములా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో పారిశుధ్య నిర్వహణ కోసం ఇచ్చిన ట్రాక్టర్ల కిస్తీలు కట్టలేక తలలు పట్టుకుంటున్నారు. చిన్న పంచాయతీల పరిస్థితి అయితే మరింత దయనీయంగా తయారైంది. రెండు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాల నుంచి ఒక్క రూపాయి కూడా రావడంలేదు. దీంతో పంచాయతీలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. తలలు పట్టుకుంటున్న సర్పంచ్‌లు జిల్లాలో 16 మండలాల పరిధిలో మొత్తం 313 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో కొత్త పంచాయతీలు 57 ఉన్నాయి. అయితే.. చాలా పంచాయతీలకు ఆదాయ వనరులు తక్కువ. దీంతో సిబ్బందికి జీతాల చెల్లింపు భారంగా మారిందని సర్పంచ్‌లు చెబుతున్నారు. ఈ నిర్ణయాలను ఉపసంహరించుకొని పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని కోరుతున్నారు. గ్రామాల్లో పంచాయతీలకు సంబంధించిన వివిధ బాధ్యతలు నిర్వహించేందుకు పలువురు సిబ్బంది అవసరం. పంచాయతీ వ్యవహారాలు చూసేందుకు కారోబార్‌తో పాటు పన్నుల వసూళ్లకు బిల్ కలెక్టర్, వాటర్ ట్యాంక్‌లు, బోర్ల నిర్వహణ, తాగునీటి సరఫరా పనులు చూసేందుకు వాటర్‌మెన్, వీధిలైట్ల మెయిన్టనెన్స్ కోసం ఎలక్ట్రిషియన్, పారిశుధ్య పనులు, చెత్త సేకరణ సఫాయి కార్మికులు అవసరం ఉంటారు. పంచాయతీ ట్రాక్టర్లు నడిపేందుకు డ్రైవర్లు అవసరం ఉంటుంది. ప్రత్యేకంగా డ్రైవర్లను నియమించకపోవడంతో పంచాయతీ సిబ్బందిలో నుంచి ఒకరిని డ్రైవర్‌గా నియమించుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో సర్పంచ్‌లు అనుభవం లేని వారిని డ్రైవర్లను నియమించుకున్నారు. జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరో తెలియని పరిస్థితి నెలకొందని సర్పంచ్‌లు వాపోతున్నారు. ప్రస్తుతం పంచాయతీ స్థాయి జనాభాను బట్టి సిబ్బంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచాయతీల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బందికి రూ.5 వేల నుంచి రూ.3 వేల వరకు వేతనాలు ఉన్నాయి. జీతాలు వ్యయం తక్కువగానే ఉండడంతో పంచాయతీలు భరిస్తున్నాయి. మల్టీపర్పస్ వర్కర్లకు జీతాలు నెలకు రూ.8,500 చెల్లించాల్సి ఉండడంతో సర్పంచ్‌లు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తలలు పట్టుకుంటున్నారు. 500 జనాభాకు ఒకరు.. పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం ఇదివరకు ఉన్న గ్రామపంచాయతీలను పునర్ వ్యవస్థీకరించి కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆమ్లెట్ గ్రామాలు, గిరిజన తండాలు కొత్త జీపీలుగా ఆవిర్భవించాయి. ఈ క్రమంలో వివిధ పనులు నిర్వహించేందుకు గాను గ్రామపంచాయతీలో 500 జనాభాకు ఒకరి చొప్పున మల్టీపర్పస్ వర్కర్లను నియమించుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రతీ పంచాయతీకి కనీసం ఇద్దరు మల్టీపర్పస్ వర్కర్లు ఉండాలని సూచించింది. 500 వరకు జనాభా ఉన్న గ్రామపంచాయతీలు 10 ఉన్నాయి. 3 వేలలోపు జనాభా ఉన్న గ్రామపంచాయతీలు 244 ఉన్నాయి. 3 వేలకు పైగా జనాభా ఉన్న గ్రామపంచాయతీలు 59 ఉన్నాయి. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా 1800 నుంచి 2000 మందికిపైగా మల్టీపర్పస్ వర్కర్లు పనిచేస్తున్నారు. వీరు ముఖ్యంగా గ్రామాల్లో ట్రాక్టర్ డ్రైవింగ్, మురికికాలువలు తీయడం, బల్బులు పెట్టడం, వాటర్ సమస్యలను పరిశీలించడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. చిన్న పంచాయతీల్లో గందరగోళం జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన 57 గ్రామ పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ట్రాక్టర్ కిస్తీ నెలకు రూ 16,000, పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ.17,000, ట్రాక్టర్ మరమ్మ తు ఖర్చులు రూ.2,500, డీజిల్ ఖర్చు రూ.8,000 చొప్పున నెలకు రూ.43,000 ఖర్చు అవుతోంది. ప్రభుత్వం నుంచి చిన్న పంచాయతీలకు వచ్చే నిధులు రూ.85 వేలు మాత్రమే. మిగితా రూ.42 వేల నుండి పారిశుధ్య కార్మికులకు, వీధి లైట్లకు, ఇతరాత్ర వాటికి ఉపయోగించాలి. ప్రభుత్వమే భరించాలి ఇప్పటికే పంచాయతీలకు పైసలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. సమస్యలను పరిష్కరించలేకపోతున్నాం. ఉన్న సిబ్బందికి జీతాలు ఇచ్చుడే కష్టంగా ఉంది. ట్రాక్టర్ నిర్వహణ, మల్టీపర్సస్ వర్కర్ల వేతనాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపు ఇతరాత్ర ఖర్చుల కోసం నానా తంటాలు పడుతున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ ఖాతాల్లో నేరుగా నిధులను జమ చేస్తే వాటిని స్థానికంగా అభివృద్ధి పనులకు వినియోగించుకోనే అవకాశం ఉంటుంది. తలకు మించిన భారంగా తయారైన ట్రాక్టర్ నిర్వహణను ప్రభుత్వమే భరించాలి. – ఉప్పుల రాధమ్మ, గోలిరామయ్యపల్లె సర్పంచ్, రామడుగు (చదవండి: రెండు రోజుల్లో స్వగ్రామాలకు దుబాయ్ బాధితులు ) -
GSDP Growth: వృద్ధిరేటులో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభంలోనూ రాష్ట్ర ఆర్థిక వృద్ధి కొనసాగేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యలు ఫలితాన్నిచ్చాయి. ఓ పక్క ప్రాధాన్యతా రంగాల కార్యకలాపాలు కొనసాగేలా చేయూతనిస్తూనే, మరో పక్క సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేయడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోకుండా చూశారు. దీంతో రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ముగిసిన ఆర్ధిక సంవత్సరం (2021–22)లో రాష్ట్ర వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ 2021–22లో స్థిర ధరల ప్రకారం 11.43 శాతం వృద్ధి రేటు సాధించినట్లు తెలిపింది. తెలంగాణ, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, బిహార్, ఒడిశా, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకన్నా ఏపీ వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. కోవిడ్–19 సంక్షోభం, లాక్డౌన్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా, దేశంలో 2020–21 సంవత్సరంలో వృద్ధి రేటు తిరోగమనంలో ఉన్న విషయం తెలిసిందే. కోవిడ్ సంక్షోభం నుంచి బయటపడి, గత ఏడాదిలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా 2021–22లో ఏపీ ఏకంగా 11.43 శాతం రెండంకెల వృద్ధి సాధించింది. ఇదే సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వృద్ధిరేటు కేవలం 8.7 శాతమే. కేంద్రం, మిగతా రాష్ట్రాలకంటే ఏపీ ఎక్కువ వృద్ధి రేటు సాధించడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక కార్యకలాపాలను ఎక్కడా నిలిపివేయకుండా కొనసాగించడమే. ఒక పక్క ఆదాయం తగ్గిపోయినప్పటికీ, ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను కొనసాగించింది. ప్రధానంగా వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ చేయడం, నాడు–నేడు పేరుతో విద్య, వైద్య రంగాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టడంతో ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి. కోవిడ్–19 లాక్డౌన్ సమయంలోనూ ఎక్కడా వ్యవసాయ, పారిశ్రామిక రంగాల కార్యకలాపాలు నిలిచిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతతో చర్యలు చేపట్టింది. ప్రధానంగా ఎంఎస్ఎంఈ కార్యకలాపాలు కొనసాగించేలా చర్యలు తీసుకోవడంతో 2021–22లో పారిశ్రామిక రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ 12.78 శాతంతో రెండంకెల వృద్ధి సాధించింది. ప్రాధాన్యత రంగ కార్యకలాపాలు కొనసాగించడం, ప్రజల చేతుల్లోకి డబ్బులను పంపించడం ద్వారా ఆర్థిక వ్యవస్థ నిలబడిందని, ఇంత వృద్ది రేటు సాధించడానికి ఇదే కారణమని అర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో 2021–22 ఆర్థిక సంవత్సరం స్ధిర ధరల ఆధారంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వృద్ధి రేటును ఉంచారు. ఏపీ తరువాత అత్యధిక వృద్ధి రాజస్థాన్ 11.04 శాతం సాధించింది. ఆ తరువాత బీహార్ 10.98 శాతం, తెలంగాణ 10.88 శాతం వృద్ది సాధించాయి. -
అమరావతిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు
సాక్షి, అమరావతి: అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, న్యాయస్థానం ఆదేశాల ప్రకారం రాజధాని నగరాభివృద్ధి విషయంలో పలు చర్యలు చేపట్టామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. అమరావతి అభివృద్ధికి అవసరమైన నిధుల కోసం భూములను వేలం వేయాలని నిర్ణయించామని తెలిపింది. భూముల కనీస ధరను నిర్ణయించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేశామని, ఆ కమిటీ నిర్ణయం తరువాత వేలం విషయంలో ముందుకెళతామని పేర్కొంది. అమరావతి ప్రాంతంలో 8 చోట్ల ఉన్న 5,024 ప్లాట్లకు సంబంధించిన బహిర్గత పనులు జరుగుతున్నాయని వివరించింది. అమరావతిలో ఇళ్లు లేని, అల్పాదాయ వర్గాల కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణం ఈ ఏడాది అక్టోబర్ కల్లా పూర్తవుతుందని వివరించింది. అమృత వర్సిటీకి కేటాయించిన 150 ఎకరాల్లో నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయని, ఈ విద్యా సంవత్సరానికి ప్రవేశాలను కూడా ఆ యూనివర్సిటీ ప్రారంభించిందని తెలిపింది. రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్ల విషయంలో హైకోర్టు తీర్పులో నిర్దేశించిన గడువును పెంచాలని ఇప్పటికే అనుబంధ పిటిషన్ల రూపంలో కోర్టును కోరామని గుర్తు చేసింది. తాము ఏ రకంగానూ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదని, అందువల్ల తమపై దాఖలైన కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని కొట్టేయాలని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి కౌంటర్ దాఖలు చేశారు. కోర్టు ధిక్కార పిటిషన్లపై విచారణ ఇదిలా ఉంటే.. రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని, వీరి చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించి, వారిని శిక్షించాలంటూ రాజధాని రైతులు దోనె సాంబశివరావు, తాటి శ్రీనివాసరావు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్ మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్‌మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. గత నెల 5న ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే అమరావతిలో అభివృద్ధి పనులకు సంబంధించి స్థాయీ నివేదిక (స్టేటస్ రిపోర్ట్)ను తమ ముందుంచాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ధర్మాసనం ఆదేశాల మేరకు ప్రభుత్వం తరఫున పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి తన కౌంటర్‌ను దాఖలు చేశారు. స్థాయీ నివేదికను కూడా జత చేశారు. ఇందులో కోర్టు ధిక్కారం ఏముంటుంది? రైతుల తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. రాజధాని నగర, ప్రాంతాన్ని అన్ని మౌలిక వసతులతో నెల రోజుల్లో అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంపై గతంలో ఓ ధిక్కార పిటిషన్ దాఖలు చేశామన్నారు. తాజాగా వేసిన కోర్టు ధిక్కార పిటిషన్ రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను 3 నెలల్లో అభివృద్ధి చేసి ఇవ్వాలన్న ఆదేశాలను అమలు చేయకపోవడంపై దాఖలు చేసినట్టు తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టినట్టు తాము పత్రికల్లో చదివామని తెలిపింది. అభివృద్ధి పనుల స్టేటస్ రిపోర్ట్ సంగతి ఏమిటని ప్రశ్నించింది. గతంలో దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిందని, అలాగే స్టేటస్ రిపోర్ట్ సమర్పించామని అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ తెలిపారు. రైతులకు ప్లాట్లను అభివృద్ధి చేసేందుకు ఐదేళ్ల గడువు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారని, ఆ గడువును తాము వ్యతిరేకిస్తున్నామని మురళీధరరావు చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. గడువు పెంపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేసినప్పుడు కోర్టు ధిక్కారం ఏముంటుందని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఆగస్టు 23వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. -
కొత్తకొత్తగా.. రంజాన్ కానుకగా..
రొట్టెల పండగకు వేదికగా నిలిచే బారాషహీద్ దర్గా తెలుగు రాష్ట్రాల్లోనే ప్రసిద్ధి గాంచింది. ఇక్కడి ఆవరణలో ఉన్న ఈద్గా భవనం ముస్లింలకు ఎంతో ప్రీతికరం. అయితే టీడీపీ హయాంలో ఈద్గా నిర్మాణాన్ని అర్థాంతరంగా కూల్చేశారు. కొత్త నిర్మాణం చేపడుతామని మిన్నకుండి పోయారు. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముస్లింల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఈద్గా నిర్మాణం పూర్తి చేయించారు. రంజాన్ కానుకగా ముస్లింలకు అంకితం చేయనున్నారు. సాక్షి, నెల్లూరు : నెల్లూరులో చారిత్రాత్మకమైన ప్రదేశంగా విరాజిల్లుతున్న బారాషహీద్ దర్గా ప్రాంగణంలో ప్రత్యేకతలతో కూడిన ఈద్గా నిర్మాణం పూర్తయింది. రంజాన్ మాసం కానుకగా స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఈనెల 29న ముస్లింలకు అంకితం చేయనున్నారు. గత టీడీపీ హయాంలో ముస్లింల మనోభావాలకు విరుద్ధంగా ఈద్గాను కూల్చివేసి నిర్మాణం గురించి పట్టించుకోలేదు. దీంతో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు జరుపుకునేందుకు అనేక ఇబ్బందులు పడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి చొరవతో పూర్తి హంగులతో ఈద్గా నిర్మాణం పూర్తి చేయించారు. అన్ని హంగులతో ఈద్గా నిర్మాణం బారాషహీద్ దర్గా ప్రాంగణంలో అన్ని హంగులతో ఈద్గా నిర్మాణం చేపట్టడం ఆనందదాయకం. స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిధులు మంజూరు చేయించి తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడా లేనివిధంగా నిర్మాణం చేయించారు. ముస్లింల పట్ల ఎమ్మెల్యేకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆయనకు మేమంతా కృతజ్ఞతులై ఉంటాం. – అబూబకర్, మాజీ చైర్మన్, బారాషహీద్ రొట్టెల పండగ కమిటీ ఎంతో సంతోషంగా ఉంది ప్రత్యేక హంగులతో నిర్మించిన ఈద్గాను రంజాన్ కానుకగా మాకు అప్పగించడం చాలా సంతోషంగా ఉంది. గత మూడేళ్లుగా ఈద్గా లేక ప్రార్థనల కోసం ఇబ్బందిపడేవారం. స్థానిక ఎమ్మెల్యే మా మనోభావాలను గౌరవిస్తూ ఈద్గా నిర్మాణంపై దృష్టిపెట్టి మాకు రంజాన్ కానుకగా ఇవ్వడం ఆనందంగా ఉంది. పండగ రోజు అందరం కలిసి ప్రత్యేక ప్రార్థనలు జరుపుకుంటాం. – ఎస్డీ ఇలియాజ్ స్థానికుడు, నెల్లూరు వైఎస్సార్సీపీ హయాంలో.. రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది. అదే విధంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ముస్లింల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. తాజాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ కేంద్రంలో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న బారాషహీద్ దర్గా ప్రాంగణంలో అత్యాధునిక హంగులతో రూ.1.03 కోట్ల వ్యయంతో ఈద్గా నిర్మాణం పూర్తి చేయించారు. ► గత రెండేళ్లుగా కరోనా ఆంక్షలతో ముస్లింలు కలిసి ప్రార్థనలు చేసుకునే అవకాశం లేకుండాపోయింది. కానీ ఈ ఏడాది రంజాన్ పండగ కానుకగా ఈద్గాను వారికి అంకితం చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ చూపారు. రంజాన్ మాసం చివరి శుక్రవారం ఈనెల 29న వారికి అంకితం చేసేందుకు కృషి చేస్తున్నారు. ► 100 అడుగుల వెడల్పు, సుమారు 70 అడుగుల ఎత్తులో మినార్ల నిర్మాణం చేపట్టారు. వచ్చే శుక్రవారం అంకితం.. రంజాన్ మాసం చివరి శుక్రవారం ఈద్గాను స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ముస్లింలకు అంకితం చేయనున్నారు. దాదాపు రెండు వేల మందికి పైగా ముస్లింలు హాజరుకానున్న సభలో ఇఫ్తార్ విందు కూడా ఇచ్చేందుకు ఎమ్మెల్యే ఏర్పాట్లు చేస్తున్నారు. బారాషహీద్ దర్గా ప్రాంగణంలో పూర్తి హంగులతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈద్గా నిర్మాణం తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడా లేదని ముస్లింలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ హయాంలో.. బారాషహీద్ దర్గా ప్రాంగణంలో దశాబ్దాల కాలంగా ఉన్న ఈద్గాలో నగరంలో ఉన్న ముస్లింలు బక్రీద్, రంజాన్ పండగలకు ప్రత్యేక ప్రార్థనలు జరుపుకునేవారు. ప్రతి ఏటా రెండు పండగలకు ఈద్గా పరిసరాలను సుందరంగా తీర్చిదిద్ది ప్రత్యక ప్రార్థనలు చేసుకునేవారు. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈద్గాను కూల్చివేశారు. ఆ ప్రదేశంలో నూతన ఈద్గా నిర్మిస్తామని చెప్పి పట్టించుకోలేదు. గత మూడేళ్లుగా ఈద్గా లేక ముస్లింలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
రఘునందన్ Vs టీఆర్ఎస్!
మిరుదొడ్డి (దుబ్బాక)/ బెజ్జంకి (సిద్దిపేట)/సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావును.. పెరుగుతున్న పెట్రో ధరలపై టీఆర్ఎస్ శ్రేణులు నిలదీయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు ఎమ్మెల్యేను మిరుదొడ్డి పోలీస్ స్టేషన్‌కు తరలించడం, అక్కడ టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటా పోటీగా ఆందోళనలకు దిగడంతో ఉద్రి క్తత ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా తొగుట మండ లం గుడికందులో పలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు గురువారం ఆ గ్రామానికి వెళ్లారు. అయితే గ్రామంలోని టీఆర్ఎస్ నాయకులు.. కేంద్ర ప్రభు త్వం పెంచిన పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరల ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే వద్ద నిరసన వ్యక్తం చేశారు. రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు ఎమ్మెల్యేను మిరుదొడ్డి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రఘు నందన్‌రావు పోలీస్ స్టేషన్లో నేలపై భైఠాయించారు. ఏసీపీ దేవారెడ్డి, సీఐ కృష్ణ ఆయన్ను శాంతింపజేసేందుకు విఫలయత్నం చేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు స్టేషన్‌కు తరలివచ్చి ఎమ్మెల్యేకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్ద ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేయడంతో పరి స్థితి ఉద్రిక్తంగా మారింది. అప్రమత్తమైన పోలీసులు ముందుగా బీజేపీ కార్యకర్తలను, ఆ తర్వాత ఎమ్మెల్యే రఘునందన్‌రావును బలవంతంగా అరెస్టు చేసి బెజ్జంకి పోలీస్ స్టేషన్‌కు తరలించడం తో గొడవ సద్దుమణిగింది. బెజ్జంకి పోలీస్ స్టేషన్ వద్ద విలేకరులతో మాట్లాడిన రఘునందన్‌రావు.. అధికారం ఎప్పుడూ ఒక్కరికే ఉండదనే విషయం పోలీసులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్యేను విడుదల చేయండి: బండి సంజయ్ ఎమ్మెల్యే రఘునందన్ రావును వెంటనే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఢిల్లీ నుంచి ఫోన్లో ఆయన సిద్దిపేట పోలీస్ కమిషనర్‌తో మాట్లాడారు. కొం దరు పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. -
‘పర్యాటక’ పరవళ్లు
పిచ్చాటూరు: చిత్తూరు జిల్లాలో ఉన్న అరణియార్ పర్యాటకానికి మహర్దశ కలగనుంది. ప్రాజెక్టు సుందరీకరణ, అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు అవసరమైన నిధులు సమకూర్చడానికి తుడాతో పాటు పర్యాటక శాఖకు గత ఏడాది ప్రతిపాదనలు అందాయి. అంతే వేగంగా స్పందించిన తుడా రూ.1.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జనవరి 3న తుడా వీసీ హరికృష్ణ అరణియార్‌ను సందర్శించి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పర్యాటక శాఖకు రూ.5 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. అరణియార్ అభివృద్ధి, సుందరీకరణ పనులకు 20 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు వద్ద జైకా నిధులు రూ.35 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ నిధుల మంజూరులో తిరుపతి ఎంపీ గురుమూర్తి సహకారంతో స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేసిన కృషి, చొరవ ప్రశంసనీయమైనది. అరణియార్ వద్ద చేపట్టనున్న పనులు తుడా అందించే నిధులతో అరణియార్ అందాలన్నీ తిలకించేలా ప్రాజెక్టు వద్ద వ్యూ టవర్ నిర్మించనున్నారు. నదిపై సరదాగా ప్రయాణించేందుకు బోటింగ్ ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులకు అనువుగా కాటేజీలు అందుబాటులోకి రానున్నాయి. పర్యాటల శాఖ అందించే నిధులతో అదనంగా మరో బోటింగ్, రిసార్టులు, చిల్డ్రన్స్ పార్క్, ఉద్యానవనాల అభివృద్ధి, సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్‌కు అనువుగా పచ్చిక మైదానాలు నిర్మించనున్నారు. పిచ్చాటూరు అరణియార్ ప్రాజెక్టు గతంలో షూటింగ్ స్పాట్‌గా పేరొందింది. ఇక్కడ సుమారు 20 సినిమాలకు పైగా చిత్రీకరణ సాగింది. అందులో ప్రధానంగా జానకిరాముడు, ప్రేమదేశం, అన్నకిళి, టూటౌన్ రౌడీ సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి. దీంతోపాటు వందలాది సినిమాల్లో పాటల చిత్రీకరణ ఇక్కడే సాగింది. తెలుగు, తమిళం సినిమాల్లోని పాటల చిత్రీకరణకు ఇది చాలా అనువైన ప్రదేశంగా నిలిచింది. టీవీ సీరియళ్లు ఎక్కువ కాలం పాటు చిత్రీకరించేవారు. నాగమ్మ టీవీ సీరియల్ 80 శాతం ఇక్కడే రూపుదిద్దుకుంది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రాజేంద్రప్రసాద్, విజయశాంతి, రాధ వంటి మన తెలుగు హీరో, హీరోయిన్లు ఎందరో ఇక్కడ చిత్రీకరణలో సందడి చేసినవారే. అతి సుందరమైన ప్రదేశం పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి, మహా నగరమైన చెన్నై జాతీయ రహదారి పక్కనే కొలువైన అతిపెద్ద జలాశయం బహుసుందరంగా ఉంటుంది. ఇక్కడి నుంచి తిరుపతి, చెన్నై నగరాలకు 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చెన్నై నుంచి తిరుమలకు వెళ్లే యాత్రికులకు అరణియార్ వద్ద సేద తీరేవారు. ఇక్కడ ప్రకతి అందాలు సైతం ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇక్కడ ఆకట్టుకునే ఉద్యానవనం ఉండడంతో వెండితెర, బుల్లితెర దర్శకులు తరలివచ్చేవారు. అయితే 20 ఏళ్ల క్రితం పర్యాటక నిర్వహణకు నిధులు నిలిపివేయడంతో పార్కులన్నీ వెలవెలబోయాయి. ఇన్నేళ్లకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అరణియార్ సుందరీకరణకు శ్రీకారం చుట్టడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అరణియార్ ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకురావడానికి ఎమ్మెల్యే ఆదిమూలం తీవ్రంగా కృషి చేస్తున్నారు. అధికారుల సహకారంతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. ఎంపీని కలిసి నిధుల మంజూరుకు చొరవ చూపాలని విన్నవించారు. -
Andhra Pradesh: పల్లె పటిష్టం
కళ్లెదుటే గ్రామ సచివాలయం.. కళకళలాడుతున్న స్కూలు భవనాలు ఓ వైపు.. రైతుల సేవకు వెలసిన రైతు భరోసా కేంద్రం మరో వైపు.. ఆపద వేళ ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్న హెల్త్ క్లినిక్ ఇంకో వైపు.. అక్కడి నుంచి నాలుగడుగులు ముందుకేస్తే డిజిటల్ లైబ్రరీ భవనం.. ఇంకో నాలుగడుగులు వేస్తే పాల సేకరణ కేంద్రం.. సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం ఇదీ సీఎం వైఎస్ జగన్ కల. ఈ కలను సాకారం చేసేందుకు ఆయన వేసిన విత్తు మొక్కగా మొలిచి.. వృక్షంగా ఎదుగుతోంది. కళ్లెదుటే ఫలాలూ కనిపిస్తున్నాయి. భవిష్యత్‌లో ఈ ఫలాల విలువ లక్షల కోట్లలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. సాక్షి నెట్వర్క్,ఆంధ్రప్రదేశ్: గ్రామాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్నన్ని చర్యలు ఇదివరకెన్నడూ ఏ ప్రభుత్వం తీసుకోలేదని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన రైతు ప్రగడ రాంబాబు చెబుతున్నారు. 5400 మంది జనాభా గల తమ ఊళ్లో రెండు చొప్పున గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణాలు పూర్తి అయ్యాయని చెప్పారు. గతంలో ఏమ్మెల్యేను అడిగినా, ఏ భవనం మంజూరు చేసే వారు కాదని.. ఇప్పుడు అడగకుండానే రూ.2 కోట్లకు పైగా వ్యయంతో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారని చెప్పారు. పురుగు మందులు, ఎరువులు అన్నీ ఉన్న ఊళ్లోనే ఇస్తున్నారని.. ఏ సర్టిఫికెట్ కావాలన్నా, ఏ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా సచివాలయానికి వెళితే చాలని చెబుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు ఇంకా చాలానే ఉన్నాయన్నారు. ఈ ప్రభుత్వం పుణ్యమా అని తమ గ్రామం కొత్త శోభను సంతరించుకుందని, గ్రామాలకు పెద్ద ఎత్తున ఆస్తులు సమకూరాయని తెలిపారు. తనకు ఊహ తెలిశాక ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరగడం ఇదే ప్రథమం అని సంతోషం వ్యక్తం చేశారు. ఇలా రాష్ట్రంలో ఏ పల్లెకు వెళ్లి ఎవరిని కదిపినా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో అభివృద్ధి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కొన్ని ఊళ్లలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణాలు పూర్తి కావడంతో గ్రామాలు కొత్త శోభను సంతరించుకోగా, మరి కొన్ని ఊళ్లలో ఈ భవనాల నిర్మాణాలతో సందడి నెలకొంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే తొలి సారిగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయని, జరుగుతున్నాయని జనం చెబుతున్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా గ్రామాల్లో మౌలిక వసతుల కోసం ఇంత పెద్దఎత్తున నిధులు వెచ్చించలేదని ప్రజలు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రభుత్వం తక్కువలో తక్కువ ఒక్కో ఊరికి రూ.కోటికి పైగా వ్యయం చేస్తోందని చెబుతున్నారు. పెద్ద పెద్ద ఊళ్లలో రూ.రెండు కోట్ల నుంచి రెండున్నర కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా నరేంద్రపురంలో గ్రామ సచివాలయం, ఆర్బీకే రూ.12,510 కోట్లతో మౌలిక వసతుల కల్పన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామాల్లోని ప్రజలకు సంక్షేమంతో పాటు అవసరమైన మౌలిక వసతులను ఆయా గ్రామాల్లోనే కల్పించేందుకు పెద్ద పీట వేశారు. గత 29 నెలల పాలనలోనే గ్రామాల్లో స్పష్టమైన అభివృద్ధి కన్పించేలా పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. సింహ భాగం పనులు పూర్తి అయ్యాయి. మిగతా పనులు కొనసాగుతున్నాయి. ఆయా గ్రామ ప్రజల అవసరాలను తీర్చే గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్, బల్క్‌మిల్క్ యూనిట్లు, వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలతో పాటు నాడు–నేడు కింద పాఠశాలలను బాగు చేయడం తదితర పనులు చేపట్టారు. రూ.12,510 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టారు. ఇందులో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో రూ.3,400 కోట్ల వ్యయంతో 15,000 స్కూల్స్ రూపు రేఖలు మార్చారు. దీంతో పాటు గ్రామాల్లో అంతర్గత రహదారులు, డ్రైనేజీ నిర్మాణ పనులు, మంచి నీటి వసతి పనులు కొనసాగుతున్నాయి. మండల, జిల్లా, నియోజకవర్గ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల స్థాయిలో జరిగే అభివృద్ధి పనులు వీటికి అదనం. గ్రామాల్లో మౌలిక సదుపాయాల పనులు ఇలా.. ► రూ.4,199.70 కోట్లతో 10,929 గ్రామ సచివాలయాల నిర్మాణం. ఇందులో ఇప్పటికే 3,273 పూర్తి. మరో 2,683 పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఇంకా 1,840 సచివాలయాలు రెండవ అంతస్తు దశలో ఉన్నాయి. ► రూ.2,303.47 కోట్లతో 10,408 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) ఏర్పాటు. ఇందులో ఇప్పటికే 1,746 పూర్తి. మరో 2,860 గ్రౌండ్ ఫ్లోర్ స్లాబుతో పాటు పూర్తి అయ్యే దశలో ఉన్నాయి. ఇంకా 5,803 బేస్మెంట్ స్థాయి నుంచి గ్రౌండ్ ఫ్లోర్ దశలో ఉన్నాయి. ► రూ.1,475.50 కోట్లతో 8,585 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు. ఇందులో 702 క్లినిక్స్ నిర్మాణం పూర్తి. మరో 2,008 గ్రౌండ్ ఫ్లోర్ ఫినిషింగ్ స్థాయిలో ఉన్నాయి. ఇంకా 5,875 బేస్మెంట్ స్థాయి దాటి గ్రౌండ్ ఫ్లోర్ దశలో ఉన్నాయి. ► పాడి రైతుల కోసం తొలి దశలో రూ.416.23 కోట్ల వ్యయంతో 2,541 బల్క్ మిల్స్ యూనిట్ల నిర్మాణం మొదలైంది. వివిధ దశల్లో ఉన్నాయి. ► రూ.724.80 కోట్లతో 4,530 వైఎస్సార్ విలేజ్ డిజిటల్ ల్రైబరీల పనులు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. ► నాడు–నాడు తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లోని రూ.3,400 కోట్లతో 15,000 స్కూల్స్‌లో మరమ్మత్తులు, మౌలిక సదుపాయాల కల్పన పూర్తయింది. అభివృద్ధి కళ్లెదుటే కనిపిస్తోంది మా ఊళ్లో రూ.40 లక్షలతో గ్రామ సచివాలయ భవనం నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. రూ.25 లక్షలతో రైతు భరోసా కేంద్రం నిర్మిస్తున్నారు. రూ.14.95 లక్షలతో విలేజ్ క్లినిక్ భవనం నిర్మాణంలో ఉంది. విద్యార్థుల కోసం రూ.15 లక్షలతో డిజిటల్ లైబ్రరీ నిర్మాణం పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. బల్క్ మిల్క్ సెంటర్ కోసం రూ.17.67 లక్షలు మంజూరు చేసింది. నాడు–నేడు పథకం ద్వారా స్కూల్లో రూ.18 లక్షలతో పనులు చేపట్టారు. పెయింటింగ్, ప్రహరీ గోడ నిర్మాణం, టైల్స్, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, విద్యార్థులు కూర్చునేందుకు బెంచీలు, క్లాసు రూములో లైటింగ్, ఫ్యాన్లు ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సచివాలయం వల్ల మండల కేంద్రానికి వెళ్లే బాధ తప్పింది. గ్రామ స్థాయిలోనే అన్ని రకాల సేవలు అందించేందుకు కోట్ల రూపాయలు వెచ్చించి అవసరమైన భవనాలు నిర్మించడం సంతోషంగా ఉంది. సంక్షేమంతో పాటు ప్రభుత్వం అభివృద్ధికి బాటలు వేస్తుంది. – చిటికెల జగదీష్, భీమ బోయిన పాలెం, మాకవరపాలెం మండలం, విశాఖ జిల్లా ఊహించలేదు.. కలలా ఉంది నల్లమల అడవికి సమీపంలోని మా ఊరు మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. 800 జనాభా. పక్కనే ఉన్న కొత్తూరును కలుపుకుని సచివాలయం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అధికారులు మా ఊళ్లోనే మాకు అందుబాటులో ఉంటున్నారు. పనుల కోసం మేము ఏ ఊరికీ పోనవసరం లేదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ పథకం కావాలన్నా అర్హత ఉంటే చాలు వెంటనే అందిస్తున్నారు. వలంటీర్ల తోడుతో చదువురాని వారు సైతం పథకాలను అందిపుచ్చుకొని అభివృద్ధి చెందుతున్నారు. రూ.40 లక్షలతో సచివాలయం, రూ.21.80 లక్షలతో ఆర్బీకే, 17.50 లక్షలతో హెల్త్ క్లినిక్ భవనం, రూ.36 లక్షలతో సిమెంట్ రోడ్లు, స్కూల్లో అదనపు గదుల కోసం రూ.11 లక్షలు, ఇళ్లకు కుళాయిల కోసం రూ.15 లక్షలు ఖర్చు చేశారు. ఇలా చకచకా అన్నీ కళ్లెదుటే ఏర్పాటై పోతున్నాయి. అంతా కలగా ఉంది. ఇంత త్వరగా ఇంత అభివృద్ధి జరుగుతుందని మేమెవ్వరమూ ఊహించలేదు. – షేక్ పెద్ద దాదావలి, ఆరవీటికోట, రాచర్ల మండలం, ప్రకాశం జిల్లా విశాఖ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సచివాలయ భవనం -
నాడు–నేడు మిగులు నిధులు నాబార్డు స్కూళ్ల పనులకు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మనబడి నాడు–నేడు కింద తొలివిడతలో అభివృద్ధి పనులు చేపట్టిన స్కూళ్లకు కేటాయించిన నిధుల్లో మిగిలిన సొమ్మును నాబార్డు ఆర్థిక సాయంతో పనులు చేపట్టిన స్కూళ్లకు వినియోగించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.చినవీరభద్రుడు అన్ని జిల్లాల విద్యాధికారులు, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లను ఆదేశించారు. నాడు–నేడు తొలివిడతలో 15,715 స్కూళ్లను ప్రభుత్వం అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. నీటి సదుపాయంతో మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, విద్యార్థులు, టీచర్లకు కుర్చీలు, బెంచీలు సహా ఫర్నిచర్, గ్రీన్‌చాక్‌బోర్డులు, విద్యుత్తు సదుపాయం, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, మరమ్మతులు, ప్రహరీలు, కిచెన్షెడ్లు, రంగులు వేయడం వంటి వాటికి రూ.3,669 కోట్ల వరకు వెచ్చించింది. ఈ నిధులను పాఠశాలల వారీగా కేటాయించింది. ఆ స్కూళ్లలో పనులన్నీ పూర్తయిన తరువాత పేరెంట్స్ కమిటీల వద్ద మొత్తం రూ.59 కోట్లు మిగిలాయి. ఈ సొమ్మును నాబార్డు నిధులతో పనులు చేపట్టిన 516 స్కూళ్లలో కార్యక్రమాలు పూర్తిచేసేందుకు బదలాయించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు. -
పనుల పురోగతిని అడిగి తెలుసుకుంటున్న సీఎం వైఎస్ జగన్
-
సైకిల్‌పై పువ్వాడ: చక్కర్లు కొడుతూ.. సూచనలిస్తూ
సాక్షి, ఖమ్మం: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్.. కలెక్టర్ ఆర్వీ.కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి బుధవారం ఉదయం మున్సిపల్ కార్యాలయం నుంచి వైరా రోడ్ మీదుగా సైకిల్‌పై నగరంలోని ప్రధాన సెంటర్లలో పర్యటించారు. కొత్త మున్సిపల్ భవనం వరకు సైకిల్‌పై పర్యటించి రోడ్డుకు ఇరువైపులా చేపట్టిన సైడు డ్రెయిన్లు, రోడ్డు విస్తరణ పనులు, విద్యుత్ స్తంభాలు, మిషన్ భగీరథ అంతర్గత పైపులైన్, పారిశుద్ధ్య పనులను మంత్రి పరిశీలించారు. పలు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో జాప్యం పట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలల తరబడి పనుల కొనసాగింపు కుదరదని, పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ప్రజా రవాణాకు, ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ఖమ్మంకు ఎక్కువ మొత్తంలో నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేస్తున్నామన్నారు. నగరాభివృద్ధిలో విద్యుత్ శాఖ అధికారులు అద్భుతంగా పని చేస్తున్నారన్నారు. నగరాభివృద్ధికి రూ.30కోట్ల ఎస్డీఎఫ్ నిధులను సీఎం మంజూరు చేశారని, ఆ నిధులను రోడ్ల మరమ్మతులు, డ్రెయిన్ల నిర్మాణానికి ఖర్చు చేస్తామన్నారు. బడ్జెట్లో ఖమ్మం కార్పొరేషన్‌కు రూ.150కోట్లు కేటాయించారని, ఆ నిధులను వినియోగించుకొని నగరంలోని మట్టి రోడ్లన్నింటినీ సీసీ రోడ్లుగా ఆధునికీకరించడంతోపాటు అన్ని ప్రాంతాల్లో డ్రెయిన్లు నిర్మిస్తామన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల ప్రజలు ఆనందంగా ఉన్నారని, మరిన్ని అభివృద్ధి పనులు చేసేలా ప్రజలు తమను ఆశీర్వదించాలన్నారు. ఇంకా మంత్రి వెంట మున్సిపల్, విద్యుత్, పబ్లిక్ హెల్త్, రెవెన్యూ శాఖల అధికారులు ఉన్నారు. చదవండి: మంత్రి జగదీశ్ కంటతడి -
రాజధానిలో రూ.3 వేల కోట్ల పనులకు ప్రభుత్వ గ్యారెంటీ
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో చేపట్టిన నిర్మాణాలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు అవసరమైన రూ.3 వేల కోట్ల రుణాలకు గ్యారెంటీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మౌలిక వసతుల కల్పన కింద రోడ్లు, మురుగు నీటిపారుదల, నీటి సరఫరా, జాతీయ రహదారికి రాజధాని రోడ్లను అనుసంధానం చేసే పనులు, భూసమీకరణలో రైతులకివ్వాల్సిన ప్లాట్ల లేఅవుట్లను అభివృద్ధి చేసేందుకు రూ.3 వేల కోట్లు అవసరమని ఏఎంఆర్డీఏ ప్రతిపాదించింది. ఈ మొత్తాన్ని రుణంగా ఇచ్చేందుకు మూడు బ్యాంకులు అంగీకరించగా దానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాల్సిఉంది. నిబంధనల ప్రకారం షరతులకు లోబడి గ్యారెంటీ ఇచ్చేందుకు అంగీకారం తెలుపుతూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులిచ్చారు. రాజధాని పనుల కోసం సాంకేతిక కమిటీ రాజధానిలో పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టేందుకు అవసరమైన సిఫారసులు, సూచనలు చేసేందుకు తొమ్మిది మంది సభ్యులతో ప్రభుత్వం సాంకేతిక కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. నీటిపారుదల శాఖ ఈఎన్సీ చైర్మన్‌గా, పబ్లిక్ హెల్త్, ఆర్ అండ్ బీ, ఏపీసీపీడీసీఎల్, ఈఎన్సీలు, సీఈలు ఇతర అధికారులతో ఈ కమిటీ ఏర్పాటైంది. -
యాదాద్రి తరహాలో కొండగట్టు అభివృద్ధి
కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత అన్నారు. కొండగట్టు దేవస్థానం ఆవరణలో రూ.90లక్షల వ్యయంతో నిర్మిస్తున్న శ్రీరామకోటి స్తూపానికి మంగళవారం భూమిపూజ చేశారు. అంతకుముందు వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న మంత్రి, ఎమ్మెల్సీ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా ఆలయాలకు అత్యధికంగా నిధులు కేటాయిస్తోంది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. ఇప్పటికే రూ.వెయ్యికోట్లు వెచ్చించి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయాన్ని బ్రహ్మాండంగా పునర్ నిర్మిస్తున్నామని తెలిపారు. వచ్చే హనుమాన్ జయంతిలోపు స్తూపం పనులు పూర్తి చేస్తామని అన్నారు. ఈ నెల 17నుంచి రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్ చాలీసా పారాయణాన్ని ప్రారంభించి.. కొండగట్టు ఆలయ ప్రాముఖ్యతను నలుమూలలా చాటిచెప్పే బృహత్తర కార్యక్రమానికి నాంది పలకడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ పెద్దహనుమాన్ జయంతిలోపు స్తూపం సిద్ధం అవుతుందని తెలిపారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, భక్తులు ఆధ్వర్యంలో కొండగట్టు సేవాసమితి పేరుతో అఖండ హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం హనుమాన్ చాలీసా పోస్టరును ఆవిష్కరించారు. కార్యక్రమంలో కలెక్టర్ జి.రవి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఈవో చంద్రశేఖర్, ఏఈవో బుద్ది శ్రీనివాస్, ఎంపీపీలు విమల, స్వర్ణలత పాల్గొన్నారు. రాజన్న భక్తులకు సకల సౌకర్యాలు వేములవాడ: వేములవాడ రాజన్న సన్నిధిలో బుధవారం నుంచి శుక్రవారం వరకు జరిగే మహాశివరాత్రి జాతరకు హాజరయ్యే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. అనంతరం జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. కోవిడ్–19 నిబంధనల మేరకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. శానిటైజర్లు, మాసు్కలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. భక్తులు భౌతికదూరం పాటించేలా అధికారులు సమన్వయం చేసుకుంటూ అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. భక్తుల భద్రతకు భారీపోలీసు బందోబస్తు కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్‌హెగ్డే పాల్గొన్నారు. -
కర్నూలు పల్లెల్లో పనుల సందడి
సీ బెళగల్ మండలం పోలకల్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మన బడి నాడు–నేడు కింద కార్పొరేట్ స్కూలు రూపు సంతరించుకుంది. ఇప్పటివరకు ప్రహరీ లేకపోవడంతో ఆవరణలో పశువులు, పందుల సంచారం కనిపించేది. పైకప్పు పాడవడంతో నాలుగు చినుకులు పడినా తరగతి గదుల్లోకి నీరు వచ్చేది. ప్రభుత్వం ఈ పాఠశాల అభివృద్ధికి రూ.98 లక్షలు కేటాయించింది. ప్రహరీ, తరగతి గదులు నిర్మించారు. బల్లలు, టేబుళ్లు, సమకూర్చారు. ఆటస్థలం, పార్కు, అనేక ఆటవస్తువులు ఏర్పాటు చేయడంతో ఈ పాఠశాల అందరినీ ఆకట్టుకుంటోంది. కోసిగి మండలం దుద్ది గ్రామంలోని బీసీ కాలనీలోకి గతంలో అడుగుపెట్టాలంటేనే భయం వేసేది. కాలనీలో డ్రైనేజీ సౌకర్యం లేక మురుగు నీరంతా రోడ్లపై పారి వీధులన్ని దుర్గంధంగా తయారయ్యేవి. ఆ దారిలో వెళ్లేవాళ్లు ముక్కు మూసుకోవాల్సిందే. మురుగునీరు వీధుల్లో చేరడంతో స్థానికులు తరచు అనారోగ్యాలకు గురయ్యేవారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం ప్రతి నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి రూ.15 కోట్లు కేటాయించడంతో బీసీ కాలనీలోని రోడ్లు, డ్రైనేజీకి మోక్షం లభించింది. ప్రస్తుతం ఈ కాలనీల్లో రూ.15 లక్షలు వెచ్చించి సీసీ రోడ్లు వేశారు. కర్నూలు (అర్బన్): రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కర్నూలు జిల్లాలోని పల్లెపల్లెలో అభివృద్ధి కుసుమాలు వికసిస్తున్నాయి. దశాబ్దాలుగా ఎవరికీ పట్టని గ్రామసీమలు ప్రగతిపథంలో సాగుతున్నాయి. గ్రామ సచివాలయ, వలంటీరు వ్యవస్థలతో ప్రజల సమస్యలన్నీ వెంటనే తీరుతున్నాయి. గ్రామాల్లో రూ.779.42 కోట్లతో కార్యాలయాల భవనాల నిర్మాణం జరుగుతోంది. దీన్లో రూ.350 కోట్లతో చేపట్టిన 876 గ్రామ సచివాలయ భవన నిర్మాణాల్లో 343 భవనాలు పూర్తయ్యాయి. రూ.184.42 కోట్లతో చేపట్టిన 845 రైతుభరోసా కేంద్ర భవనాల్లో 53 నిర్మాణాలు పూర్తవగా 81 శ్లాబ్ దశకు చేరుకున్నాయి. రూ.110 కోట్లతో 634 వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణం ప్రారంభించగా 56 పూర్తయ్యాయి. రూ.135 కోట్లతో 823 పాలశీతల కేంద్ర భవనాలు నిర్మించనున్నారు. ఒక్కో నియోజకవర్గంలో రూ.15 కోట్ల వంతున కర్నూలు మినహా మిగిలిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని గ్రామాల్లో మొత్తం రూ.195 కోట్లతో సీసీ రోడ్లు వేస్తున్నారు. అన్ని గ్రామాల్లోను పనులు సాగుతుండటంతో అందరికీ పనులు లభిస్తున్నాయి. కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) పరిధిలోని 611 వైఎస్సార్ జగనన్న లేఅవుట్లలో 75,774 ఇళ్లు నిర్మించనున్నారు. రూ.325.14 కోట్లతో పాఠశాలల్లో అభివృద్ధి పనులు జిల్లాలోని 1,080 ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి విడతగా రూ.325.14 కోట్లతో 9 రకాల అభివృద్ధి పనులు చేపట్టారు. తాగునీరు, మరుగుదొడ్లు, పెయింటింగ్స్, ఇంగ్లిష్ ల్యాబ్ తదితర 7,827 పనులు చేపట్టారు. ఇప్పటివరకు రూ.72.23 కోట్లు వ్యయం కాగా 2,243 పనులు పూర్తయ్యాయి. 261 పాఠశాలల్లో రూ.100 కోట్లతో ప్రహరీల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికి 100 పాఠశాలల ప్రహరీ పనులు పూర్తయ్యాయి. మిగిలిన పాఠశాలల్లో పనులు చురుగ్గా జరుగుతున్నాయి. పాఠశాల రూపురేఖలు మారిపోయాయి రాష్ట్ర ప్రభుత్వం మనబడి నాడు–నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిధులు విడుదల చేయడం వల్ల మా ఊళ్లో పాఠశాల అభివృద్ధి సాధ్యమైంది. దశాబ్దాల కిందట నిర్మించిన పాఠశాలలోని పలు గదులు కూలిపోయేందుకు సిద్ధంగా ఉండేవి. ప్రభుత్వం రూ.98 లక్షలు నిధులు విడుదల చేయడంతో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలతో పాఠశాలను ఆధునికీకరించారు. ప్రస్తుతం ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన సాగుతోంది. – గోవిందు, పాఠశాల కమిటీ చైర్మన్, పోలకల్, సీ బెళగల్ మండలం సీసీ రోడ్డు వేయడం సంతోషంగా ఉంది ఆరునెలల కిందటి వరకు బీసీ కాలనీలోని వీధులు పూర్తి అపరిశుభ్రంగా ఉండేవి. మురికినీరంతా వీధుల్లో ప్రవహించడం వల్ల దుర్గంధభరితంగా మారి.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఇతోధికంగా నిధులు విడుదల చేయడం వల్ల మురికికూపాలుగా ఉన్న వీధులన్నీ నేడు సీసీ రోడ్లతో కళకళలాడుతున్నాయి. బీసీ కాలనీలో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు వేయడంతో కాలనీ ప్రజలు సంతోíÙస్తున్నారు. – నాగరాజు, దుద్ది గ్రామం, కోసిగి మండలం మార్చి నాటికి పూర్తిచేసేలా చర్యలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలను మార్చి చివరి నాటికి దాదాపు పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాం. ఎన్నికల నియమావళి ఉన్న కారణంగా పాలశీతల కేంద్ర భవన నిర్మాణాలను కోడ్ ముగిసిన అనంతరం చేపడతాం. మార్చి నాటికి రూ.300 కోట్లు వ్యయం చేసేందుకు అనుగుణంగా పనులను వేగవంతం చేస్తున్నాం. – కె.సుబ్రమణ్యం, పంచాయతీరాజ్ ఎస్ఈ -
పల్లెకు సొబగులు.. ప్రజలకు వసతులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పల్లెలకు మహర్దశ పట్టింది. దశాబ్దాలుగా సమస్యలతో కునారిల్లుతున్న గ్రామాల్లో అభివృద్ధి మంత్రం వినిపిస్తోంది. సాధారణ రోడ్లు మొదలుకుని అధునాతన నిర్మాణాల వరకు అన్ని హంగులతో గ్రామాలు కొత్త శోభ సంతరించుకుంటున్నాయి. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టిన ఏడాది, పదినెలల్లోనే పల్లెల్లో పెద్దఎత్తున అభివృద్ధి పనులు మొదలయ్యాయి. జిల్లాలో ఉన్న 941 పంచాయతీల్లో మొత్తం రూ.2,500 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు వేగంగా నిర్మిస్తున్నారు. ఇళ్ల పట్టాలు అందజేశారు. పక్కాగృహాల నిర్మాణాలకు చర్యలు తీసుకున్నారు. 24 గంటలు వైద్యసేవలందేలా ఆరోగ్య కేంద్రాలకు వసతులు సమకూరుతున్నాయి. సీసీ రోడ్లు, పక్కా రోడ్లు నిర్మిస్తున్నారు. రోడ్ల పనులకు సుమారు రూ.500 కోట్లు మంజూరయ్యాయి. మనబడి నాడు–నేడు కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలల స్థాయికి మారుతున్నాయి. ఒకప్పుడు పిచ్చి మొక్కలతో కళావిహీనంగా ఉన్న పాఠ«శాలలు నేడు అందంగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరందేలా ఏర్పాట్లు చేశారు. మంచి ఫర్నిచర్, ఆహ్లాదకరమైన పెయింటింగ్‌లతో స్కూళ్లు ఆకట్టుకుంటున్నాయి. 1,054 పాఠశాలల్లో మరుగుదొడ్ల మరమ్మతులు చేపట్టారు. ఇప్పటికే 519 పూర్తయ్యాయి. 40 సచివాలయ భవనాల నిర్మాణం పూర్తి గ్రామ సచివాలయాలు ప్రజలకు విశేషంగా సేవలందిస్తున్నాయి. నూతన భవనాల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే 40 సచివాలయ భవనాల నిర్మాణం పూర్తయింది. బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, కుల, నివాస, ఆదాయ తదితర పత్రాలను సచివాలయాల్లోనే వేగంగా అందజేస్తున్నారు. జిల్లాలో 660 రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటికి సొంత భవనాలు నిర్మిస్తున్నారు. స్థలం, అంతస్తులను బట్టి రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఒక్కో భవనానికి ఖర్చు చేస్తున్నారు. ఇందుకోసం దాదాపు రూ.198 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా ఎరువులు, పురుగుమందులు తక్కువ ధరకే అందేలా చూస్తున్నారు. వాటిద్వారానే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఈ–క్రాప్ వివరాలను అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేస్తున్నారు. జిల్లాలో 75 పీహెచ్సీలుండగా వాటికి అనుబంధంగా పల్లెల్లో 556 హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఒక స్టాఫ్ నర్సు ఉండేలా చూసి 24 గంటలు వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ సెంటర్ల ఏర్పాటుకు రూ.250 కోట్లు వరకు వెచ్చిస్తున్నారు. మర్రిపాడు మండలం డీసీపల్లిలోని రైతుభరోసా కేంద్రం 53 వేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం జిల్లాలో 53 వేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఇంటిస్థలం పట్టాలు పంపిణీ చేశారు. టిడ్కో ఇళ్లను అందజేశారు. చక్కటి లే అవుట్లలో రూపుదిద్దుకుంటున్న కాలనీల్లో అన్ని వసతులు కల్పిస్తున్నారు. పలు పల్లెలకు ప్రధాన రహదారులను కలుపుతూ లింకు రోడ్లు నిర్మిస్తున్నారు. ఇలా జిల్లాలో సుమారు రూ.500 కోట్ల వరకు పంచాయతీరాజ్ రోడ్లు మంజూరు చేశారు. ఇలా అన్ని రంగాల్లో గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. -
వెంట వెంటనే.. ఇంటి చెంతనే..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: గత ప్రభుత్వంలో కాళ్లరిగేలా తిరిగినా సమస్యలు పరిష్కారం అయ్యేవి కావు.. సంక్షేమ పథకాలు అందాలంటే టీడీపీ కార్యకర్తలై ఉండి జన్మభూమి కమిటీ సభ్యులకు ముడుపులు ముట్టజెప్పాల్సి ఉండేది. అవి కూడా ఏ రెండు మూడేళ్లకో వచ్చేవి. రేషన్‌కార్డు కావాలన్నా.. పింఛను రావాలన్నా ఇంతే. ఇప్పుడా పరిస్థితి మారింది. పార్టీలకు అతీతంగా ఫలాలు అందుతున్నాయి. అర్హులైతే చాలు పథకాలన్నీ ప్రజల ఇంటి చెంతకే వచ్చి చేరుతున్నాయి. సంతృప్తికర స్థాయిలో పారదర్శకత, జవాబుదారీతనంతో 539 రకాల సేవలందిస్తున్న గ్రామ సచివాలయాలు అన్ని వర్గాల మన్ననలు పొందుతున్నాయి. సంక్షేమ పథకాలే కాదు.. వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పెద్దఎత్తున జరుగుతున్నాయి. అలాగే.. ► సచివాలయాల ద్వారా తక్కువ వ్యవధిలో రేషన్ కార్డులు, పింఛన్లు, ఆరోగ్యశ్రీ కార్డులు పొందుతున్నారు. ► ఇళ్ల స్థలాలకైతే మూడు నెలల్లోపే ఎంపికైన వారున్నారు. ఠి సచివాలయాల వ్యవస్థ ఏర్పాటైన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో 845 గ్రామ సచివాలయాల్లో ఇప్పటివరకు 10,67,635 దరఖాస్తులు రాగా, వాటిలో 10,37,199 పరిష్కారమయ్యాయి. పంచాయతీల్లో అభివృద్ధి పనులు.. ► 2019–20లో రూ.153.72 కోట్లతో, 2020–21లో రూ.58.56 కోట్లతో మౌలిక సౌకర్యాలు కల్పించారు. ► జిల్లాలో రూ.301.52 కోట్లతో 3 లక్షల 73 వేల 537 ఇళ్లకు ఇంటింటి కుళాయి కనెక్షన్ల ద్వారా తాగు నీరిచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ► నాడు–నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల రూపురేఖలు మారిపోయాయి. 1,249 పాఠశాలల్లో రూ.239.75 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ► జిల్లాలో 1,128 లేఅవుట్లు వేసి లక్షా 23 వేల 62 మందికి ఇళ్ల స్థలాలను ప్రభుత్వం ఇచ్చింది. ► ఐటీడీఎ పరిధిలో రూ.60 కోట్లతో తారురోడ్లు వేస్తున్నారు. 150 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కలిగింది. ► తొలివిడతగా 621 గ్రామాల్లో సమగ్ర భూసర్వే చేపడుతున్నారు. ► రూ.700 కోట్లతో ఉద్దానంలోని 809 నివాసిత ప్రాంతాలకు తాగునీటి సౌకర్యం ప్రాజెక్టు చేపడుతున్నారు. ► మార్పు పథకం కింద 18 వసతి గృహాల్లో రూ.కోటి 75 లక్షలతో కొత్త హంగులు సమకూర్చింది. పిల్లల భవిష్యత్‌కు పునాది నాడు–నేడు పనులతో ప్రభుత్వ పాఠశాలలు ఎంతో అభివృద్ధి చెందాయి. గతంలో అక్కడ చదువులు సాగవనే భయం ఉండేది. నేడు ఆ భయంలేదు. శుభ్రమైన మరుగుదొడ్లు, ఇంగ్లిష్ మీడియంలో బోధన, శుచికరమైన మధ్యాహ్నం భోజనం, కొత్త బెంచీలు, భవనాలన్నీ చాలా బాగున్నాయి. అమ్మఒడితో పిల్లల భవిష్యత్‌కు జగనన్నే భరోసా కల్పించారు. – జె. అనూరాధ, రణస్థలం వారం రోజుల్లో బియ్యం కార్డు మా బియ్యం కార్డులో మా పిల్లల పేర్లు లేవు. గతంలో ఎన్నోసార్లు అధికారులకు చెప్పినా ఫలితంలేదు. ఇప్పుడు మా వలంటీర్‌కి సమస్య చెప్పాం. వారం రోజుల క్రితం వివరాలు తీసుకున్నారు. ఇప్పుడు కొత్త కార్డు ఇచ్చారు. ఇంత వేగంగా కార్డు రావడాన్ని నమ్మలేకపోతున్నా. – గేదెల గౌరమ్మ, ఉణుకూరు, రేగిడి మండలం అడగ్గానే అడంగల్ గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చినా పెద్దగా నమ్మకం కలగలేదు. ఈ రోజు వచ్చి ఇలా 1బి గురించి అడిగానో లేదో వెంటనే తీసి ఇచ్చారు. నిజంగా ఇదొక అద్భుతమైన పాలన. గతంలో అడంగల్ నిమిత్తం ఎక్కడెక్కడో తిరిగాను. ఫలితం కనిపించలేదు. – బొక్కేల తిరుపతిరావు, పోరాం గ్రామం, రేగిడి మండలం ఎంతో మందికి ఉద్యోగాలు సీఎం జగన్ సచివాలయ వ్యవస్థ ద్వారా ఎంతో మందికి ఉద్యోగాలిచ్చారు. ఈ వ్యవస్థ ఇలానే కొనసాగితే ప్రజలు మంచి సేవలను ఇంటి వద్ద నుంచే పొందవచ్చు. – గార శ్రీకాంత్, బీటెక్, మందరాడ, సంతకవిటి మండలం -
అభివృద్ధి కోసం అన్నదమ్ముల్లా..
సాక్షి, హైదరాబాద్/సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ‘గెలుపు కోసం ఎన్నికల ముందు కొట్లాడుదాం.. తర్వాత అభివృద్ధి కోసం అన్నదమ్ముల్లా కలిసి పనిచేద్దాం’అని మున్సిపల్, ఐటీ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ప్రతిపక్షాలను.. ముఖ్యంగా బీజేపీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. సమన్వయంతో పనిచేద్దామని పిలుపునిచ్చారు. కొత్తగా ఎన్నికైన స్థానిక బీజేపీ కార్పొరేటర్‌కు ఆహ్వానం అందలేదని, ప్రొటోకాల్ పాటించడం లేదని ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో బీజేపీ–టీఆర్ఎస్ వర్గాల మధ్య జరిగిన గొడవను దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్.. బాగ్‌లింగంపల్లి లంబాడితండాలో 126 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలోని ఏ రాష్ట్రంలో జరగనంత గొప్పగా రూ.18వేల కోట్లతో 2.72 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శ్రీకారం చుట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో నిర్మిస్తున్న లక్ష ఇళ్లకు రూ.9,714 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. పేదవాడు ఆత్మగౌరవంతో బతికేందుకు సకల సౌకర్యాలతో ఫ్లాట్లు కట్టి అప్పజెప్పుతున్నామన్నారు. అమ్ముకున్నా, కిరాయికిచ్చినా చర్యలు.. మార్కెట్లో దాదాపు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల డిమాండ్ ఉన్న ఈ ఇళ్లను అమ్మినా, అద్దెకిచ్చినా పట్టా రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని హెచ్చరించారు. ఒక్కో ఇంటికి రూ.9 లక్షలు ఖర్చుచేసి ఇస్తున్నది మీ పిల్లలతో బాగా బతికేందుకేనని అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో చాలా మంది పేదలున్నారని, వారందరికీ ఇళ్లు ఇవ్వాలన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విజ్ఞప్తికి స్పందిస్తూ.. ఆ మేరకు చర్యలు చేపడతామన్నారు. కంటోన్మెంట్ డిఫెన్స్ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలిప్పించేందుకు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టేందుకు స్థలం ఇప్పించాలని కేంద్రమంత్రిని కోరారు. కలసి పనిచేస్తేనే హర్షిస్తారు.. కేంద్రం, రాష్ట్రం కలసిమెలసి ఉంటేనే ఓట్లేసిన ప్రజలు హర్షిస్తారని కేటీఆర్ అన్నారు. పరస్పరం గౌరవించుకుందామని.. హుందాగా రాజకీయాల్లో కొనసాగుదామని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి (టీఆర్ఎస్) ఫిబ్రవరి 10 దాకా ఉంటారు. తర్వాత రవిచారి(బీజేపీ) ఐదేళ్లు ఉంటారని చెప్పారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ అనేక రంగాల్లో ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు.. ముషీరాబాద్ నియోజకవర్గంలోని బాగ్‌లింగంపల్లి లంబాడి తండాలో రూ.10.90 కోట్ల వ్యయంతో నిర్మించిన 126 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు.. రూ. 3.50 కోట్లతో అడిక్‌మెట్‌లో నిర్మించిన మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లకు ప్రారంభోత్సవాలు.. దోమల్‌గూడలో రూ.9.90 కోట్లతో నిర్మించనున్న జోనల్, డిప్యూటి కమిషనర్ కార్యాలయాలు.. నారాయణగూడ క్రాస్‌రోడ్స్‌లో రూ.4 కోట్లతో నిర్మించనున్న మోడల్ మార్కెట్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నన్ను ఆహ్వానించరా?... జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్పై కిషన్‌రెడ్డి ఫైర్ హిమాయత్‌నగర్: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్పై మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ సర్ధిచెబుతున్నా.. అభివృద్ధి కార్యక్రమాలకు నన్ను పిలవరా అంటూ అసహనం వ్యక్తం చేశారు. శనివారం నారాయణగూడ వెజిటేబుల్ మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కిషన్‌రెడ్డి: ‘ఏం కేటీఆర్‌గారూ.. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రొటోకాల్ పాటించరా? కేటీఆర్: ఏమైందన్నా? కిషన్‌రెడ్డి: ఏ కార్యక్రమానికి నన్ను పిలవట్లేదు. ప్రోటోకాల్ పాటించాలి కదా. కేటీఆర్: కచ్చితంగా పిలవాలన్నా. ఇంటిమేషన్ ఇవ్వలేదా? కిషన్‌రెడ్డి: ఎవరిచ్చారు? అడగండి.. కేటీఆర్: (దూరంగా నిలబడ్డ కమిషనర్ లోకేశ్కుమార్ని పిలిచి) కిషన్‌రెడ్డి గారికి ఇంటిమేషన్ ఇవ్వలేదా? లోకేశ్‌కుమార్: ఇచ్చాం సార్, ముందురోజే చెప్పాం. కిషన్‌రెడ్డి: తమాషాలు చేస్తున్నారా? చెప్పకుండా చెప్పామంటున్నారు? కేటీఆర్: అన్నా.. పోనీ.. ఇప్పుడొద్దు. నేను మాట్లాడతా. కిషన్‌రెడ్డి: అదికాదు.. చెప్పాలి కదా? నాకు అధికారం లేదా? కాగా, దీనిపై లోకేశ్‌కుమార్ డీఎంసీలను అడగ్గా.. ‘సార్, మేం కిషన్‌రెడ్డి గారికి ముందే చెప్పాం. నాకు కమిషనర్ చెబితేనే వస్తా, మీరు చెబితే నేనెందుకు వస్తానని ఆయన అన్నారు. ఏం చేయమంటారు’అని బదులిచ్చారు. -
మా వైఫల్యాలున్నాయి: కిమ్
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ప్రజలందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తే ప్రకటన చేశారు. అనుకున్న లక్ష్యాలను సాధించడంలో తమ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అంగీకరించారు. సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ప్రజలందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తే ప్రకటన చేశారు. అనుకున్న లక్ష్యాలను సాధించడంలో తమ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అంగీకరించారు. అయిదేళ్లకి ఒకసారి జరిగే అధికార వర్కర్స్ పార్టీ కాంగ్రెస్ సదస్సుని బుధవారం ఆయన ప్రారంభించారు. గత అయిదేళ్లలో తాము నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమయ్యామని, దీనికి ప్రభుత్వ విధానాలే కారణమని కిమ్ పేర్కొన్నట్టుగా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. గత తొమ్మిదేళ్ల పాలనలో కిమ్ గతంలో ఎన్నడూ లేనంతగా కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కరోనాతో సరిహద్దుల మూసివేత, దేశ ఆర్థిక రంగం కుదేలైపోవడం, అమెరికా విధించిన ఆంక్షలు, వరసగా కమ్మేసిన ప్రకృతి వైపరీత్యాలు వంటివన్నీ దేశాన్ని అతలాకుతలం చేశాయి. -
సాగర్‌పై సీఎం కేసీఆర్ వరాల జల్లు
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అక్కడి ప్రజలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇటీవల హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఇక్కడ 6 నెలల్లోపు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశించిన మేర సీట్లు రాకపోవడంతో టీఆర్ఎస్ పార్టీకి సాగర్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. చదవండి: జమిలి ఎన్నికలకు సిద్ధం కండి.. ఈ ఎన్నికలో గెలిచి మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో తన సత్తాను నిలుపుకోవాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తక్షణ చర్యలు ప్రారంభించారు. నియోజకవర్గం పరిధిలోని హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాక ముందే రైతులందరి ఖాతాల్లో ఈ ఏడాది రెండో విడత రైతుబంధు డబ్బులను జమ చేసేందుకు సీఎం కసరత్తు చేస్తున్నారు. సోమవారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి యాసంగి సాగు కోసం రైతు బంధు పంపిణీపై నిర్ణయం తీసుకోనున్నారు. చదవండి: ఢిల్లీతో ఢీకి టీఆర్ఎస్ రెడీ ఎత్తిపోతల పథకాలకు అనుమతులు సాగర్ నియోజకవర్గంలో చేపట్టదలిచిన నాలుగు ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. దీంతో పాటు మరో పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు కోసం.. మొత్తంగా దాదాపు రూ.600 కోట్ల పనులకు అనుమతులు మంజూరు చేశారు. బోతలపాలెం–వడపల్లి ఎత్తిపోతల పథకాన్ని దామరచెర్ల మండలం వడపల్లి వద్ద నిర్మించేందుకు రూ.229.25 కోట్లతో పరిపాలన అనుమతులు ఇవ్వగా, సాగర్ కాల్వలపై దున్నపోతులగండి– బాల్నేపల్లి–చంపాల తండా ఎత్తిపోతల పథకాన్ని అడవిదేవునిపల్లి మండల పరిధిలోని చిట్యాల గ్రామం వద్ద నిర్మించేలా రూ.219.90 కోట్లతో అనుమతులు ఇచ్చారు. ఈ ఎత్తిపోతల పథకంలో భాగంగా అప్రోచ్ చానల్, ఫోర్‌బే, పంప్‌హౌస్, ప్రెషర్‌మెయిన్, డెలివరీ సిస్టమ్, గ్రావిటీ కెనాల్ల నిర్మాణ పనులు చేయనున్నారు. ఇక రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద మూసీ నదిపై కేశవాపురం–కొండ్రపోల్ ఎత్తిపోతల పథకాన్ని దామరచర్ల మండల పరిధిలోని కేశవాపురం గ్రామం వద్ద నిర్మించేలా రూ.75.93 కోట్లతో అనుమతులు ఇచ్చారు. ఈ ఎత్తిపోతల ద్వారా 5,875 ఎకరాలు సాగులోకి తేనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక టీఎస్ఐడీసీ కిందే నాగార్జునసాగర్ రిజర్వాయర్ ఫోర్ షోర్లో నెల్లికల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు అనుమతులిచ్చారు. రూ.72.16 కోట్లతో దీనికి అనుమతులు ఇవ్వగా, 4,175 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందివ్వాలని నిర్ణయించారు. వీటితో పాటే ఏఎంఆర్పీ హైలెవల్ కెనాల్ పరిధిలోని డి్రస్టిబ్యూటరీ 8, 9లకు లో లెవల్ కెనాల్ పంప్‌హౌస్ నుంచి పైప్‌లైన్ ద్వారా నీటి సరఫరాతో పాటు, ఈ డి్రస్టిబ్యూటరీల పరిధిలోని పొదలు, పూడిక తీసివేత కోసం 2.76 కోట్లతో అనుమతులు ఇచ్చారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలోనే ఈ ఎత్తిపోతల పథకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇవ్వగా, ప్రస్తుతం ఏ సమయమైనా ఎన్నికల కోడ్ రానున్న దృష్ట్యా ముందే వీటికి అనుమతులిచ్చారు. -
‘పశ్చిమ’లో రూ. 381 కోట్లతో అభివృద్ధి పనులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. సుమారు రూ. 381 కోట్లతో ఏలూరు, దెందులూరు నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి పనులకు, జిల్లాలోని రోడ్ల విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. వీటికి సంబంధించి ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియం సమీపంలో వీవీనగర్ బెయిలీ బ్రిడ్జి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అభివృద్ధి పనుల శిలాఫలకాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అంతకుముందు ఏలూరు నగరాన్ని తమ్మిలేరు వరద ముంపు నుంచి కాపాడేందుకు చేపట్టనున్న కాంక్రీటు గోడ నిర్మాణం నమూనా చిత్రాలను సీఎం వైఎస్ జగన్ తిలకించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. అక్కడే ఉన్న దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పుష్పాలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. తర్వాత జిల్లా మార్కెట్ యార్డు చైర్మన్ మంచెం మైబాబు.. ప్రత్యేకంగా రూపొందించిన చిత్రపటాన్ని ముఖ్యమంత్రికి బహూకరించారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఎస్ఎంఆర్ పెదబాబు, ఏలూరు మాజీ మేయర్ షేక్ నూర్జహాన్ దంపతుల కుమార్తె వివాహానికి సీఎం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పర్యటనలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి పేర్ని నాని, ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీఎం శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులివే.. – ఏలూరు నగరానికి దుఃఖదాయినిలా మారిన తమ్మిలేరు నుంచి రక్షణకు తూర్పు, పశ్చిమ ఏటిగట్లను పటిష్టం చేస్తూ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో రూ. 80 కోట్లతో కాంక్రీట్ గోడ నిర్మించనున్నారు. – జిల్లాలో గ్రామాలను మండల కేంద్రాలకు అనుసంధానం చేస్తూ రోడ్లు విస్తరణ, అభివృద్ధి, వంతెనల నిర్మాణ పనులను ఫేజ్ 1 కింద రూ. 201 కోట్లతో రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా 11 రోడ్లను 74.13 కిలో మీటర్ల మేర విస్తరణ, అభివృద్ధి చేయటంతో పాటు వంతెనలు నిర్మిస్తారు. వీటిలో తణుకు– భీమవరం, పాలకొల్లు– ఆచంట, మేడపాడు– నర్సాపురం (వయా చించినాడ), కానూరు– లంకలకోడేరు, పెనుమంట్ర– వీరవాసరం, ఏలూరు– జంగారెడ్డిగూడెం, దెందులూరు– పంగిడిగూడెం, ఏలూరు– కైకలూరు, ఏలూరు– పెరికీడు తదితర రోడ్లున్నాయి. – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ రూఅర్బన్ మిషన్ పథకం కింద ఏలూరు క్లస్టర్ దెందులూరు నియోజకవర్గంలో మొత్తం రూ. 100 కోట్ల విలువ గల పనులను చేపట్టగా, ఇప్పటికీ రూ. 24.14 కోట్ల విలువ కలిగిన పనులు పురోగతిలో ఉన్నాయి. ఇంకా రూ. 75.86 కోట్లు విలువ కలిగిన పనులు చేపట్టనున్నారు. -
నేడు ఏలూరుకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి/ఏలూరు(మెట్రో): సీఎం వైఎస్ జగన్ బుధవారం ఏలూరులో పర్యటించనున్నారు. ఉదయం 10.35 గంటలకు ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంకు హెలికాప్టర్లో చేరుకోనున్న సీఎం ఆ తరువాత వీవీ నగర్ బెయిలీ బ్రిడ్జ్ సెంటర్ వద్ద రూ.330 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం శ్రీ సూర్య కన్వెన్షన్ హాలులో ఎస్ఎంఆర్ పెదబాబు, నూర్జహాన్ల కుమార్తె వివాహానికి హాజరవుతారు. తదనంతరం 11.57 గంటలకు సీఎం వైఎస్ జగన్ ఏలూరు నుంచి బయల్దేరి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. చదవండి: ఆంధ్రాలో ఓలా ఈ–స్కూటర్ల ప్లాంటు? -
తాడిపత్రిపై రాజన్న ముద్ర..
సాక్షి ,అనంతపురం: ప్రజల అవసరాలు, ఆకాంక్షలు తెలుసుకున్న డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. తాను సీఎంగా ఉన్న సమయంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. సకాలంలో సంక్షేమ ఫలాలు అందజేస్తూ ఆపన్నుల కన్నీళ్లు తుడిచేందుకు అహరి్నశం శ్రమించారు. తాను పెట్టిన తొలి సంతకంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్నదాతల కడగండ్లను ఒక్కసారిగా తుడిచేశారు. వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందజేయడమే కాక.. హరితాంధ్ర సాధనలో భాగంగా వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. విద్య, వైద్య రంగాల పురోభివృద్ధికి బాటలు వేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో నిరుపేద విద్యార్థులను డాక్టర్లను, ఇంజినీర్లను చేశారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు నాణ్యతతో కూడిన ఖరీదైన వైద్య చికిత్సలను ఉచితంగా అందజేశారు. తాగునీటి పథకాలకు జీవం పోస్తూ.. ప్రజల దాహార్తిని తీర్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే వైఎస్సార్ అంటే ఒక వ్యక్తి కాదని.. శక్తి అని నిరూపించారు. ఆ పాలనను స్వర్ణయుగమంటూ నేటికీ వేనోళ్ల కొనియాడుతున్నారు. మహానేత తమ మదిలో జీవించే ఉన్నాడంటూ ఘంటాపథంగా చెబుతున్నారు. వైఎస్సార్ సంక్షేమ ఫలాలతో లబ్ధి పొంది, ఆయన ఆశయాల సాధనలో మేము సైతం అంటూ శ్రమిస్తున్న జిల్లా వాసులు ఏమంటున్నారో.. వారి మాటల్లోనే. ‘పురం’ ప్రజల పాలిట అపర భగీరథుడు.. హిందూపురం: ఒకప్పుడు తాగునీటి కోసం విలవిల్లాడిన హిందూపురం ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చి అపర భగీరథుడిగా చరిత్రలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నిలిచిపోయారు. 2004 ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురానికి వచ్చిన ఆయన.. ఇక్కడి ప్రజలు తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను కళ్లారా చూశారు. ఆ సమయంలోనే ఇక్కడ పార్టీ ఓడినా.. గెలిచినా.. తాము అధికారంలోకి వస్తే పీఏబీఆర్ నుంచి ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా పురం ప్రజల దాహార్తిని తీరుస్తానంటూ హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.650 కోట్లతో శ్రీరామరెడ్డి తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 1,400 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేయించి 2008 డిసెంబరు 30న తన స్వహస్తాలతో హిందూపురం పట్టణ నడిరోడ్డున రహమత్‌పురం సర్కిల్ వద్ద శ్రీరామరెడ్డి తాగునీటి పథకం పైలాన్‌ను ఆయన ప్రారంభించారు. ఇచ్చిన మాట అక్షరాల నిలుపుకుని హిందూపురం ప్రజల మదిలో చెరగని ముద్రను ఆయన వేసుకున్నారు. మడకశిర, పెనుకొండ, పరిగి మండలంతోపాటు హిందూపురం నియోజకవర్గం పరిధిలోని మొత్తం 220 గ్రామాలకూ నేడు సమృద్ధిగా తాగునీరు అందుంతోందంటే అదంతా వైఎస్సార్ పుణ్యమేనని స్థానికులు కొనియాడుతున్నారు. అలాగే జలయజ్ఞంలోనూ హిందూపురం ప్రాంత ప్రజలకు న్యాయం చేకూర్చారు. అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కింద మడకశిర ఉప కాలువ ద్వారా ఈ ప్రాంతంలోని చెరువులకు నీరందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూడా వైఎస్ రాజశేఖరరెడ్డినే. ప్రతి నీటి బొట్టులోనూ ‘వైఎస్సార్’ డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్మించిన ఈ సమ్మర్ స్టోరేజ్ వాటర్ ట్యాంక్ రాయదుర్గం వాసులను తాగునీటి కష్టాల నుంచి శాశ్వతంగా గట్టెక్కించింది. 2005లో రాయదుర్గం పురపాలక సంఘానికి ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో ఇక్కడకు వచ్చిన అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎదుట స్థానికులు తమ తాగునీటి కష్టాలను ఏకరవు పెట్టారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రస్తుతం తానేమీ చేయలేనని, ఎన్నికలు పూర్తి కాగానే మీ కష్టాలను తీరుస్తానంటూ ఆ సమయంలో ఆయన హామీనిచ్చారు. అనుకున్నట్లుగానే ఎన్నికలు ముగియగానే రాయదుర్గం వాసుల తాగునీటి కష్టాలపై ఆయన దృష్టి సారించారు. 2007లో రూ.48 కోట్లు నిధులు మంజూరు చేసి, కణేకల్లు వద్ద సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి 168 ఎకరాల భూసేకరణ చేయించారు. 2008లో పనులు ప్రారంభించి, శరవేగంగా పూర్తి చేయించారు. హెచ్చెల్సీ నీటిని ఎత్తిపోతల ద్వారా ట్యాంక్‌లోకి నింపి అక్కడి నుంచి పైప్‌లైన్ ద్వారా రాయదుర్గానికి చేర్చడం ద్వారా ప్రజలు దాహార్తిని తీర్చారు. ప్రస్తుతం రాయదుర్గం తాము తాగుతున్న ప్రతి నీటి బొట్టులోనూ వైఎస్సార్‌నే చూడగలుగుతున్నారు. అనంత అభివృద్ధిపై మహానేత చెరగని ముద్ర అనంతపురం సెంట్రల్/విద్య/హాస్పిటల్: అనంత జిల్లా అభివృద్ధిపై మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేశారు.రైతు బాంధవుడిగా వేనోళ్ల కొనియాడబడుతున్న ఆ మహానేత జయంతిని బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా జిల్లా అభివృద్ధిలో వైఎస్సార్ పాత్రను గుర్తు చేసుకుంటూ... ఒక సంవత్సరం పంట పండితే మరో ఐదారేళ్లు కరువు విలయతాండవం చేస్తుంది. పొట్ట చేతపట్టుకుని మహానగరాలకు వలసబాట పడుతున్న కాలమది. యేటా వేసవి వచ్చిందంటే ఊళ్లకు తాళాలు పడేవి. ఇలాంటి సమయంలో ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వలసల నివారణ కోసం మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. ఇలాంటి బృహత్తర పథకాన్ని 2006 ఫిబ్రవరి 2న నార్పల మండలం బండ్లపల్లిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సారథ్యంలో ప్రధాని మన్మోహన్సింగ్, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ పురుడు పోశారు. కరువు సీమ కల్పతరువుగా భాసిల్లుతున్న జేఎన్టీయూఏ వర్సిటీని 2008లో ఏర్పాటు చేశారు. 2008 కంటే ముందు జేఎన్టీయూఏ ఇంజినీరింగ్ కళాశాలతో పాటు రాయలసీమలోని ఇంజినీరింగ్ కళాశాలలు జేఎన్టీయూ హైదరాబాద్ ఆధీనంలో ఉండేవి. దీంతో పాలనపరమైన సమస్యలు ఉత్పన్నం కావడంతో జేఎన్టీయూఏ వర్సిటీని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేశారు. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలలు జేఎన్టీయూఏ పరిధిలో అనుబంధ కళాశాలలుగా ఉన్నాయి. మొత్తం 107 ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏటా 1.20 లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ చదువుతున్నారు. పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య కలగా మిగిలిపోయేది. రూ.లక్షల్లో ఫీజులు కట్టాల్సిన పరిస్థితితో ఉన్నత విద్యవైపు వెళ్లే వారు కాదు. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేశారు. విద్యార్థి ఫీజు ఎంత అయినా నేరుగా ప్రభుత్వమే చెల్లించే బృహత్ కార్యక్రమం ఇది. దీంతో ఇంజినీరింగ్, మెడిసిన్ వైపు నిరుపేద విద్యార్థులు దృష్టి సారించారు. ఫలితంగా లక్షలాది మంది ఇంజినీరింగ్ , ఎంబీఏ గ్రాడ్యుయేట్లు కాగలిగారు. మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఎంతో మంది జీవితాలను మలుపుతిప్పిన మహానేతగా చెరగని ముద్ర వేసుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యసేవలను ఉచితంగా అందజేశారు. ఇందు కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆయన ప్రవేశపెట్టారు. క్షతగాత్రులు, గర్భిణిలు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలు కాపాడేందుకు 108 (37 వాహనాలు), పీహెచ్‌సీలకు దూరంగా ఉన్న గ్రామాల్లోని ప్రజలకు వైద్యం అందించేందుకు 104 (23 వాహనాలను) సేవలను ప్రవేశపెట్టారు. ఆరోగ్యశ్రీ కింద 937 జబ్బులకు కార్పొరేట్ వైద్యం అందించారు. కరువు జిల్లా అనంత అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఎంతో మమకారం. అనంతపురం జిల్లాను దృష్టిలో పెట్టుకుని వేరుశనగ చెట్లకు డబ్బులు కాపిస్తా అంటూ సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రంలో ఏ జిల్లాకు ఇవ్వని విధంగా రైతులకు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ రూపంలో రూ.వందల కోట్లు మంజూరు చేశారు. పీఏబీఆర్ జలాశయం జలకళను సంతరించుకుందంటే అది వైఎస్ పుణ్యమే. 2006లో కేసీ కెనాల్ వాటా 10 టీఎంసీలను పీఏబీఆర్‌కు మళ్లించారు. తీసుకున్న ఈ నిర్ణయం వలన ఏటా సగటున 6 టీఎంసీలు చొప్పున పీఏబీఆర్‌కు నీళ్లు వస్తున్నాయి. ఈ నీటితో పీఏబీఆర్ కుడికాలువ కింద ఉన్న ఉరవకొండ, రాప్తాడు, ధర్మవరం, శింగనమల నియోజకవర్గాల్లోని 49 చెరువులను నీటితో నింపుతున్నారు. వైఎస్సార్ చొరవతోనే ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అభివృద్ధి చెందాయి. తాగునీటి ఇబ్బందులు తీరాయి. వైఎస్సార్ హయాంలో జలయజ్ఞం పథకానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. దాదాపు రూ.12వేల కోట్లు వ్యయంతో అనంత వెంకటరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ హయాంలోనే ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారు. తాగునీటి ప్రాజెక్టుగా ఉన్న హంద్రీ–నీవాను సాగునీటి ప్రాజెక్టుగా మార్చారు. మొదటి దశ పనులను దాదాపు 90 శాతం పూర్తి చేయించారు. 2012 నుంచి ప్రాజెక్టు ద్వారా జిల్లాకు సాగునీరు వస్తున్నాయి. నాడు మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం వలన నేడు కరువు సీమ అనంతలో సాగు, తాగునీటి సమస్యలకు పరిష్కారం దొరుకుతోంది. తాడిపత్రిపై రాజన్న ముద్ర.. తాడిపత్రి: వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తాడిపత్రి అభివృద్ధి పథంలో పరుగులు తీసింది. అనంత జిల్లా అల్లుడిగా తాడిపత్రి అంటే ఆయనకూ అభిమానం ఎక్కువ. నియోజకవర్గంలోని పెద్దపప్పూరు మండలం చీమలవాగుపల్లిలో ఆయన పెళ్లి చేసుకున్నారు. పీఎబీఆర్ స్టేజ్–2 కింద రూ.536 కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించారు. దీని ద్వారా తాడిపత్రి నియోజకవర్గంలోని 50వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించాలన్న లక్ష్యంతో జలయజ్ఙంలో భాగంగా రూ.244 కోట్లతో చాగల్లు ప్రాజెక్ట్ ñనిర్మించారు. పెద్దపప్పూరు మండలం పెండేకల్లు గ్రామం వద్ద ఉన్న ఈ ప్రాజెక్టు ద్వారా పెద్దపప్పూరు, తాడిపత్రి, యాడికి మండలాల్లోని 18,500 ఎకరాల ఆయకట్టును సాగులోకి తీసుకువచ్చారు. రూ.190 కోట్ల వ్యయంతో యాడికి కాలువ నిర్మాణానికి 2005 మార్చి 20న డాక్టర్ వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. పెద్దవడుగూరు, యాడికి, పెద్దపప్పూరు.తాడిపత్రి మండలాల పరిధిలోని 38 గ్రామాలకు లబ్ది చేకూరేలా 50 వేల ఎకరాలకు నీటి పారుదల సౌకర్యం కలి్పంచే లక్ష్యంగా ఈ పథకాన్ని చేపట్టారు. 2009 జనవరి నాటికి యాడికి కాలువ పథకం పనులపై రూ.300 కోట్లు వ్యయం చేశారు. తాడిపత్రి–అనంతపురం వెళ్లే మార్గంలో సుమారు రూ.38కోట్ల వ్యయంతో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ)ని నిర్మించారు. పట్టణంలోని అన్ని వీదుల్లో సీసీ రోడ్లు నిర్మించారు. సీబీ రోడ్డు ప్రధాన రహదారిని జాతీయ రహదారి తలపించేలా నిర్మించారు. మా ఇంట కొలువైన దేవుడు 13 సంవత్సరాల క్రితం నేను, నా భార్య చెన్నమ్మ, కుమార్తె ప్రభావతమ్మ కలిసి పొలం దగ్గరకు పోతుండగా ఎలుగుబంటి దాడి చేసి, ముగ్గురినీ తీవ్రంగా గాయపరిచింది. ఆ రోజుల్లో చేతిలో చిల్లిగవ్వలేని మాకు వైఎస్సార్ ప్రభుత్వం ఆర్థిక సాయం అందివ్వడమే కాక, మెరుగైన వైద్యం చేయించింది. అంతేకాక ఉచితంగా ఇల్లు కట్టించి ఇవ్వడమే కాక, పింఛన్‌ను కూడా మంజూరు చేయించి ఆదుకున్నారు. ఆ రోజు నుంచి మా ఇంటిలో వైఎస్సార్ ఫొటో పెట్టుకుని రోజూ పూజలు చేస్తున్నాం. – ఆంజనేయులు, బీసీ కాలనీ, కనగానపల్లి వైఎస్సార్ తాతకు దండాలు నేను ఏడాది వయసులో ఉన్నప్పుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడేవాడినంటా. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తాత ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కింద హైదరాబాద్‌లోని పెద్దాస్పత్రిలో నాకు ఆపరేషన్ చేయించి, అమ్మానాన్న రవీంద్రారెడ్డి, అలివేలమ్మ తీసుకొచ్చారంటా. ఈ రోజు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే అదంతా వైఎస్సార్ తాత పెట్టిన భిక్షే కదా... అందుకే వైఎస్సార్ తాతకు దండాలు పెడుతున్నా. – సుమంత్‌రెడ్డి, యలకుంట్ల, కనగానపల్లి మండలం -
మార్పు వైపు మరో అడుగు
సాక్షి, అమరావతి : మద్య రహిత సమాజం కోసం, ఇసుక కొరతలేని నిర్మాణ రంగం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన మరో అడుగు మంచి ఫలితాన్నిస్తోందని స్పష్టమవుతోంది. ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ఏర్పాటుతో చేసిన కొత్త ప్రయోగం దేశానికే ఆదర్శం కాబోతోంది. అవిర్భవించిన నెల రోజుల్లోనే అద్భుత పనితీరును ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలో అనుమతి లేని మద్యం ప్రవాహానికి చెక్ పెడుతోంది. ఇసుక అక్రమాలకు బ్రేక్ వేస్తోంది. మరోవైపు గొంతులో గరళం నింపుతున్న నాటుసారా, గంజాయిలకు చెల్లుచీటీ రాసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. దశాబ్దాల తరబడి నాటుసారా కాస్తున్న గ్రామాల్లో మంచి మార్పు తీసుకురావడంలో తనదైన ముద్ర వేస్తోంది. ఎస్ఈబీ ఏర్పాటుతో రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయని ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్‌లో స్పష్టమైంది. నెల రోజుల్లోనే ఎస్ఈబీ ముద్ర.. ► గత నెల 12న ఏర్పాటైన ఈ విభాగం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక, మద్యం అక్రమాలపై గత నెల 15వ తేదీ వరకు క్షేత్ర స్థాయి సమాచారం సేకరించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 18 పోలీస్ యూనిట్లలో పోలీస్ టీమ్‌లను ఏర్పాటు చేసుకుని గత నెల 16 నుంచి పూర్తి స్థాయి కార్యాచరణ చేపట్టింది. ► రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ పర్యవేక్షణలో ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలోని అన్ని యూనిట్లు వాటి పరిధిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ► ఇసుక, మద్యం అక్రమ రవాణాలో పట్టుబడే వారిపై కఠిన చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేస్తూ.. ప్రత్యేక నిఘా వ్యవస్థతో మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. అక్రమాలకు పాల్పడే పాత నేరస్థులపై పీడీ యాక్టు ప్రయోగించేందుకు, నిబంధనలు ఉల్లంఘించే అక్రమార్కులపై రౌడీషీట్స్ తెరవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎస్ఈబీ దాడుల ఫలితాలివి.. ► 75,731 లీటర్ల నాటుసారా, దీని తయారీలో ఉపయోగించే 45,969 కిలోల బెల్లం స్వాధీనం. ► సారా తయారీకి ఉపయోగించే 13,04,022 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం. ► అక్రమంగా తరలిస్తున్న 59,161.6 లీటర్ల మద్యం, 1,957.99 లీటర్ల బీరు, 10,530.302 కిలోల గంజాయి స్వాధీనం. ► 18,961 మందిపై 14,200 కేసుల నమోదు. 4,872 వాహనాల స్వాధీనం. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమాలకు పాల్పడుతున్న 2,837 మందిపై 1,545 కేసుల నమోదు. ► ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 1,924 వాహనాలు, 3,82,636.855 టన్నుల ఇసుక స్వాధీనం. ప్రభుత్వ ఆశయాన్ని సాధిస్తాం.. ► రాష్ట్రంలో అక్రమ మద్యం, ఇసుక అక్రమాలను నిలువరించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా ఎస్ఈబీ ఏర్పాటు చేశారు. మద్యం, ఇసుక అక్రమాలకు చెక్ పెట్టాలనే ప్రభుత్వ ఆశయాన్ని సాధిస్తాం. డీజీపీ సవాంగ్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనిట్లతో బలమైన పోలీస్ టీమ్‌లు ఏర్పాటు చేసుకుని రంగంలోకి దిగుతున్నాం. ► ప్రత్యేక కొరియర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని, సాంకేతిక పరిజ్ఞానం వాడుకుని ఇసుక అక్రమ రవాణా, మద్యం అక్రమ రవాణా, సారా తయారీని అరికట్టేందుకు దాడులు ముమ్మరం చేశాం. మద్యం, ఇసుక అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్రంలోని అన్ని సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాం. ► పలు జిల్లాల్లో ఇసుక, సిలికా, గ్రావెల్ నిల్వలు ఎక్కువగా ఉన్న క్రమంలో వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఇసుక అక్రమంగా తరలింపు, మద్యం అక్రమ రవాణా, మద్యం అక్రమ తయారీపై నిఘాను తీవ్రతరం చేశాం. రాత్రివేళల్లోనూ గస్తీ ముమ్మరం చేశాం. మొబైల్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. – వినీత్ బ్రిజ్‌లాల్, ఎస్ఈబీ కమిషనర్ ‘పరివర్తన’ వచ్చింది.. ► అవి కృష్ణా జిల్లా సముద్ర తీరంలోని గ్రామాలు. తీరంలోని ఇసుక తిన్నెలపై అడుగడుగునా నాటు సారా పాతరలుండేవి. ఆ పక్కనే సర్వే తోటల్లోకి వెళితే చెట్టుకొకటి అన్నట్టుగా నాటుసారా బట్టీలు పొగలు కక్కుతుండేవి. పోలీసులు దాడులు, నాటుసారా తయారీ దారుల ప్రతిదాడులు అక్కడ నిత్యకృత్యం. ► చినగొల్లపాలెం, పెదగొల్లపాలెం, పోడు, పడతడిక, నిడమర్రు తదితర గ్రామాలలో ఈ పరిస్థితి ఉండేది. ఇప్పుడు సీన్ మారింది. ప్రస్తుతం సముద్రతీరం ప్రశాంతంగా ఉంది. నాటుసారా తయారీకి దూరంగా ఉంటామంటూ ఆ గ్రామాలు ప్రతిజ్ఞ చేసి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ► లాఠీకి పని చెప్పినా వినని వారిని లౌక్యంతో మంచి మాటలు చెప్పి దారికి తెచ్చారు. ఇందుకు ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని సామాజిక చైతన్యాన్ని తెచ్చారు. ► కృత్తివెన్ను, పెడన మండలాల్లోని పలు గ్రామాలతోపాటు మైలవరం, తిరువూరు, నూజివీడు నియోజకవర్గాల్లోని తండాల్లోను నాటుసారా తయారీ సాగుతున్నట్టు గుర్తించిన పోలీసులు పక్కా కార్యాచరణతో అక్కడి ప్రజల్లో మార్పు తేగలిగారు. ► కృష్ణా జిల్లాలో తరతరాలుగా (దాదాపు 60 ఏళ్లకుపైగా) నాటుసారా తయారీని కుటీర పరిశ్రమలా నిర్వహిస్తున్న 16 గ్రామాల్లోని 140 కుటుంబాలు ఆ ఊబి నుంచి బయట పడటంలో ఎస్ఈబీ పాత్ర ఘనమైనది. ► కృష్ణా జిల్లాలో చేసిన ప్రయోగం ఫలించడంతో చిత్తూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరితోపాటు అనేక జిల్లాల్లో వందలాది కుటుంబాలు నాటుసారా రొంపి నుంచి బయటపడేలా ఎస్ఈబీ ప్రయత్నం చేసింది. ► దశాబ్దాల తరబడి నాటు సారా కాయడంలో నిమగ్నమైన కుటుంబాలకు రోజుల తరబడి ఓపికగా కౌన్సెలింగ్ ఇచ్చి మార్పు తెస్తున్నారు. రాష్ట్రంలో 436 కుటుంబాల్లో మార్పు తెచ్చి ఇక నాటుసారా జోలికి వెళ్లం అంటూ ప్రతిజ్ఞ చేయించడం విశేషం. ఆ ఉపాధి ఇక మాకొద్దు ఎన్నో ఏళ్లుగా మా గ్రామంలో నాటుసారా కాచి అమ్మి కుటుంబాన్ని పోషించుకునే వాళ్లం. ఒక విధంగా చెప్పాలంటే నాటుసారా తయారీయే మాకు ఉపాధి అయ్యింది. పోలీసులంటేనే కేసులు పెట్టి వేధిస్తారని మాకు తెలుసు. కానీ అందుకు భిన్నంగా వారు రోజుల తరబడి తిరిగి మా చుట్టూ తిరిగి సారా తయారీ జోలికి వెళ్లకుండా మార్పు తెచ్చారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసిన మాకు ఇకపై ఆయన ఏదో ఒక ఉపాధి చూపకపోతారా అనే నమ్మకంతో నాటుసారా తయారీ నిలిపివేశాం. ఇకపై సారా తయారీ జోలికి వెళ్లం. – ఆరేపల్లి వెంకటేశ్వరరావు, సావిత్రి, చినగొల్లపాలెం, కృష్ణా జిల్లా నాకు గౌరవం పెరిగింది సమాజంలో మద్యం లేకుండా చేసి ప్రజల ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయం నాకు బాగా నచ్చింది. కేసులు పెట్టి వేధించకుండా మా కోసం, మా బిడ్డల భవిష్యత్ కోసం పోలీసులు పడిన తాపత్రయం ఆలోచింపజేసింది. అందుకే ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసే సారా కాయకూడదని నిర్ణయం తీసుకున్నాను. దీంతో సంఘంలో నాకు గౌరవం పెరిగింది. మంచి నిర్ణయం తీసుకున్నావంటూ చుట్టు పక్కల వారు కూడా ఇప్పుడు నన్ను మెచ్చుకుంటుంటే గర్వంగా ఉంది. – పడమట శ్రీనివాసరావు, నిడమర్రు, కృష్ణా జిల్లా ఇసుక కష్టాలు తీరుతున్నాయి ఇసుక సమస్యతో భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది అనేక ఇబ్బందులు పడ్డారు. ఇసుక అక్రమ రవాణాను నియంత్రించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి. ఇసుక అక్రమాల నివారణకు ప్రత్యేకంగా ఎస్ఈబీ ఏర్పాటు చేయడం బాగుంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఇప్పుడిప్పుడే ఇసుక కష్టాలు తీరుతున్నాయి. – కె.నాగేశ్వరరావు, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా -
‘అమృత్’ పనులు వేగవంతం చేయండి
సాక్షి, అమరావతి: ‘అమృత్’ పథకం కింద రూ.3,762 కోట్లతో రాష్ట్రంలోని ఆయా మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పురపాలక శాఖను ఆదేశించారు. ఆర్థికంగా బలంగా లేని మున్సిపాలిటీలకు నిధులు సమకూర్చడంలో ఉన్న ఇబ్బందులను తొలగించాలని.. అందుకు రూ.800 కోట్ల లోటును భర్తీ చేసేందుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలని, ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని చెప్పారు. పురపాలక శాఖలో అభివృద్ధి పనులపై గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► విజయవాడ, గుంటూరులలో చేపట్టిన డ్రైనేజీ పనులను సత్వరం పూర్తిచేయాలి. ► విశాఖపట్నానికి నిరంతరం తాగునీటి సరఫరా కోసం సమగ్ర కార్యాచరణ రూపొందించాలి. ► స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు కింద విశాఖ, కాకినాడ, తిరుపతిలో రూ.4,578 కోట్లతో చేపడుతున్న పనులను సత్వరం పూర్తి చేయాలి. ► ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) ఆర్థిక సహాయంతో లక్ష కన్నా తక్కువ జనాభా ఉన్న 50 పట్టణాల్లో తాగునీటి సరఫరాకు రూ.5,212 కోట్లతో చేపట్టిన పనులపై దృష్టి సారించాలి. ఈ పట్టణాలకు వెళ్లే దారిలోని 111 గ్రామాలకూ తాగునీరు అందించాలి. ► ఏపీ టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి జూలై 8న లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిణీ చేసేందుకు సిద్ధంకావాలి. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్‌ను త్వరగా సిద్ధంచేయాలి. ► లక్ష జనాభా దాటిన పట్టణాల్లో రూ.10,666 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులకు సన్నద్ధం కావాలి. మోడల్ మున్సిపాలిటీలుగా తాడేపల్లి, మంగళగిరి గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలను మోడల్ మున్సిపాలిటీలుగా అభివృద్ధి చేసే అంశంపై కూడా సీఎం వైఎస్ జగన్ అధికారులతో సమీక్షించారు. ఆయన ఏమన్నారంటే.. ► రాబోయే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదనలు రూపొందించాలి. ► 100 శాతం తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు, ఇతర మౌలిక వసతులను కల్పించేందుకు ప్రతిపాదనలు రూపొందించండి. ► పాఠశాలల అభివృద్ధి కోసం ‘నాడు–నేడు’ కార్యక్రమంలో చేపట్టిన పనుల కన్నా మరింత ఆధునిక వసతులు సమకూర్చేలా ప్రతిపాదనలు తయారుచేయండి. ► జనాభా ప్రాతిపదికన నాలుగు పట్టణ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలి. ► పేదల ఇళ్ల నిర్మాణంలో నాణ్యత ఉండాలి. ► మంగళగిరిలో చేనేతలకు కాంప్లెక్స్, ప్రభుత్వ కార్యాలయాలకు సమగ్ర కాంప్లెక్స్ నిర్మాణాలకు సంబంధించి జూన్ నాటికి పరిపాలనా అనుమతులివ్వాలి. ► మంగళగిరి ఆలయ అభివృద్ధి పనులు, మాడ వీధుల పునర్నిర్మాణం.. బకింగ్‌హామ్ కాలువ అభివృద్ధి, కాల్వల సుందరీకరణ, జంక్షన్ల అభివృద్ధిపై కూడా సీఎం చర్చించారు. ఈ సమావేశంలో పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ సంకల్పం అదే..: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నగరంలో రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ఆయన శనివారం బుద్ధభవన్ లో హైదరాబాద్ రోడ్డు డవలప్మెంట్ కార్పొరేషన్ కింద చేపట్టిన పనుల ప్రగతిపై సమీక్ష జరిపారు. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇది వర్కింగ్ సీజన్ అని.. ఒక నెల పాటు పనులు చేయవచ్చన్నారు. జూన్ నుండి వర్షాలు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు గుర్తింపు.. దేశంలో వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. దేశంలో లాక్ డౌన్ ను చక్కగా వినియోగించుకున్న రాష్ట్రంగా తెలంగాణకు మంచి గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. మే నెలలో కొన్ని పనులను చేపడతామని.. అందుకనుగుణంగా పనులకు తుది మెరుగులు దిద్దాలని అధికారులకు సూచించారు. (లాక్డౌన్: సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ) వారి పట్ల మానవీయ కోణంలో వ్యవహరించాలి... వివిధ ప్యాకేజీల కింద చేపట్టిన లింక్ రోడ్ల లో అక్కడక్కడ అటంకంగా వున్న భూముల సేకరణ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదే సమయంలో నిర్వాసితులయ్యే పేదలు, కూలీల పట్ల మానవీయకోణంలో వ్యవహరించాలన్నారు. అటువంటి నిర్వాసితులకు ప్రభుత్వపరంగా పునరావాసం కల్పించాలని చెప్పారు. జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న లింక్ రోడ్ల వెడల్పు 120 అడుగులు వుండాలన్నారు. భవిష్యత్తులో ఈ లింక్ రోడ్లు వలన ఆయా ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఎస్ఆర్ డిపి, లింక్, సర్వీస్ రోడ్ల ను మరింత ప్రయోజనకరంగా పొడిగించేందుకు హెచ్ ఎండిఎ, ఇతర విభాగాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. (జోరందుకున్నఉపాధి పనులు) నిధులకు కొరత లేదు.. భవిష్యత్ అవసరాలు, పెరిగే ట్రాఫిక్ రద్దీని అంచనా వేసి పనులు చేపట్టాలని వివరించారు. హైదరాబాద్ నగర మాస్టర్ ప్లాన్ ను అప్డేట్ చేయనున్నట్లు ప్రకటించారు. అందుకనుగుణంగా రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేయాలని తెలిపారు. అలాగే నిర్మాణం లో వున్న రైల్వే అండర్ పాసులు, రైల్వే ఓవర్ బ్రిడ్జి లతో పాటు, కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలకు కూడా అవసరమైన భూ సేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులు, భూసేకరణకు నిధులు కొరత లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
గజ్వేల్..‘పట్టణ ప్రగతి’కి మోడల్
గజ్వేల్ : ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మెరుగైన పట్టణ జీవన వ్యవస్థను తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నం ప్రశంసనీయం.. ఇక్కడ నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వైకుంఠధామం, అర్బన్ పార్కులాంటి నిర్మాణాలు తలమాణికంగా నిలుస్తున్నాయి’అని పలువురు మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మ న్లు, కమిషనర్ల బృందం కొనియాడింది. ‘పట్టణ ప్రగతి’పై హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో మంగళవారం సీఎం కేసీఆర్‌తో సమీక్షలో పాల్గొన్న వీరంతా అక్కడి నుంచి బస్సుల్లో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సి పాలిటీని సందర్శించారు. హరీశ్‌రావు నేతృత్వంలో మంత్రులు ఈటల రాజేందర్, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ తదితరులతో పాటు కలెక్టర్లు, పలువురు ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు, మేయర్లు, మున్సిపల్ కమిషనర్లు ఇక్కడ పర్యటించారు. ముందుగా మున్సిపాలిటీకి సరిహద్దులో ఉన్న వర్గల్ మండలం సింగాయపల్లి అటవీ ప్రాంతాన్ని ఈ బృందం సందర్శించింది. అటవీశాఖ పీసీసీఎఫ్ డోబ్రియాల్ వీరికి అటవీ అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను అంశాలవారీగా వివరించారు. ఆ తర్వాత బృందం గజ్వేల్‌లోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా మార్కెట్లో కూరగాయలు, పండ్లు, పూలు, మాంసం విక్రయాలను, మార్కెట్లోని ఇతర దుకాణ సముదాయాలను పరిశీలించి ముగ్ధులయ్యారు. మంత్రులు సబిత, సత్యవతితో పాటు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, పలువురు మహిళా మున్సిపల్ చైర్మన్లు కూరగాయల వ్యాపారులతో ముచ్చటించారు. ఇది పూర్తయ్యాక వారంతా తిరిగి బస్సుల్లో పట్టణంలోని వైకుంఠధామంను సంద ర్శించి పరిసరాలను ఆసక్తిగా పరిశీలన జరిపారు. తర్వాత అర్బన్ పార్కును సందర్శించారు. మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఓపెన్‌జిమ్‌లో కొద్దిసేపు గడిపారు. జిమ్ చేస్తూ తోటి మంత్రులు, ఎమ్మెల్యేలను ఉత్సాహపరిచారు. అర్బన్ పార్కు నిర్మాణం జరిగిన విధానం తమను ఆకట్టుకుందని.. ఇలాంటి నిర్మాణాలు తమ జిల్లాల్లో కూడా జరిగేలా చొరవ చూపుతామని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు పార్కును ప్రత్యేకంగా కలియతిరిగి తమ జిల్లాలో ఎక్కడెక్కడ ఇలాంటివి నిర్మించుకోవాలనే అంశంపై చర్చించుకున్నారు. మంత్రులకు స్వాగతం పలుకుతున్న హరీశ్‌రావు మెరుగైన వసతులే సీఎం లక్ష్యం: హరీశ్‌రావు రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో మెరుగైన వసతులే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధిని మోడల్‌గా చూపుతూ ఇదే తరహాలో ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాలని సీఎం సూచించారని తెలిపారు. మెరుగైన నగర, పట్టణ జీవన వ్యవస్థను తీసుకురావడానికి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, వైకుంఠధామాల నిర్మాణంతో పాటు పట్టణాలకు ఆనుకొని ఉండే విధంగా అర్బన్ పార్కులను నిర్మించి స్వచ్ఛమైన గాలి అందించడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
మురిసిన విశాఖ
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విశాఖపట్నం ప్రజలు శనివారం అపూర్వ స్వాగతం పలికారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ పేరు తెరపైకి వచ్చిన అనంతరం తొలిసారి నగరానికి వచ్చిన ఆయనకు.. 24 కిలోమీటర్ల మేర మానవహారంగా ఏర్పడి ‘థాంక్యూ సీఎం’ అంటూ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సీఎం పర్యటన ఆద్యంతం విశాఖ నగరం జన సంద్రమై ఉప్పొంగింది. దాదాపు 4 గంటల పాటు సాగిన ఈ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది. విశాఖ పర్యటనలో భాగంగా రూ.1,285.32 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం బీచ్‌రోడ్డులో విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించారు. దారిపొడవునా అభిమాన సంద్రమై.. శనివారం మధ్యాహ్నం 3.47 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికేందుకు చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా ఏకమై వేలాదిగా తరలివచ్చారు. విమానాశ్రయం నుంచి బయటికి రాగానే పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులందరినీ ఆత్మీయంగా పలకరించి జగన్ కాన్వాయ్‌లో బయలుదేరారు. వివిధ కళాశాలల విద్యార్థులు, మహిళలు, కార్మికులు, ఆటో డ్రైవర్లు, చోడవరం, అనకాపల్లి నుంచి రైతులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి హర్షధ్వానాలతో పూలు చల్లుతూ సీఎం జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. ఎన్ఏడీ జంక్షన్, ఆర్అండ్బీ కూడలి, తాటిచెట్లపాలెం.. కైలాసగిరి అక్కడి నుంచి సెంట్రల్ పార్కు.. ఆపై ఆర్కే బీచ్ వరకూ సాగిన కృతజ్ఞతా యాత్రలో ఆసాంతం కొండంత అభిమానం కనిపించింది. విమానాశ్రయం నుంచి తాటిచెట్లపాలెం వరకూ కాన్వాయ్ చేరేందుకు 50 నిమిషాల సమయం పట్టడాన్ని చూస్తే.. అభిమాన తరంగం ఎంతగా ఉప్పొంగిందో అర్థం చేసుకోవచ్చు. రూ.1,290 కోట్లతో శంకుస్థాపనలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూ.1285.32 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ముందుగా కైలాసగిరిపై వీఎంఆర్డీఏ చేపట్టే రూ.379.82 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పాతజైలు రోడ్డులోని వైఎస్సార్ సెంట్రల్‌పార్క్‌లో జీవీఎంసీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్కులో ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటైన్ కార్యక్రమాన్ని వీక్షించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జీవీఎంసీ చేపట్టనున్న రూ.905.50 కోట్ల పనులకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి నేరుగా ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన విశాఖ ఉత్సవ్ ప్రాంగణానికి బయల్దేరారు. మీ ప్రేమానురాగాల మధ్య ఉత్సవాలు ప్రారంభిస్తున్నా.. సాయంత్రం 6.39 గంటలకు ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన విశాఖ ఉత్సవ్ వేదిక వద్దకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేరుకున్నారు. నవరత్నాలపై ఏర్పాటు చేసిన లేజర్ షో ప్రదర్శనతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం.. సీఎం జగన్ మాట్లాడుతూ ఆప్యాయతలూ.. ప్రేమానురాగాల మధ్య.. ఈ రోజు విశాఖ ఉత్సవాలను ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. 22 సెకన్లు మాత్రమే మాట్లాడినా.. జనం సీఎం.. సీఎం.. అంటూ జేజేలు పలుకుతూ అభిమానాన్ని చాటుకున్నారు. జిగేల్మనే లేజర్ షో.. బాణసంచా వెలుగుల నడుమ.. విశాఖ సంబరాలు అంబరానంటేలా ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవాలు ముగిసిన అనంతరం తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్‌జైన్ దంపతులకు సీఎం ఆత్మీయ సత్కారం చేశారు. ఆ తర్వాత సీఎం జగన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి జ్ఞాపిక అందించారు. పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి ముఖ్యమంత్రికి ఆత్మీయ సత్కారం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి అశేష జనవాహినికి అభివాదం చేస్తూ విమానాశ్రయానికి పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రోగ్రామ్స్ కోర్డినేటర్ తలశిల రఘురాం, మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, ధర్మాన కృష్ణదాస్, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డా.భీశెట్టి సత్యవతి, బెల్లాన చంద్రశేఖర్, ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పాండుగాయిల రత్నాకర్‌తో పాటు ఉత్తరాంధ్రతో పాటు తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పుష్ఫ సోయగం అదరహో స్వదేశీ, విదేశీ పుష్ఫాలతో డాక్టర్ వైఎస్సార్ సిటీ సెంట్రల్ పార్కులో ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేసింది. విశాఖ ఉత్సవ్‌లో భాగంగా రూ.60 లక్షలతో 22 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 15 టన్నుల పుష్ఫాలను వాడి పలు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. వీటిలో నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, థాయ్‌లాండ్ నుంచి తెప్పించిన 20 రకాల పుష్ఫాలు కూడా ఉన్నాయి. అభివృద్ధి విధాతకు జయహో నగరంలో దాదాపు 24 కిలోమీటర్ల మేర అభిమానం పూలవర్షమై కురిసింది. ‘థ్యాంక్యూ సీఎం సర్.. థ్యాంక్యూ జగనన్న.. ‘అభివృద్ధి విధాతకు జయహో’ అనే నినాదాలతో నగరం మార్మోగిపోయింది. పలుచోట్ల తమ అభిమాన నేతతో సెల్ఫీలు దిగాలన్న ఆత్రుతతో కాన్వాయ్‌కు అడ్డు వచ్చేందుకు పలువురు ప్రయత్నించగా.. అతి కష్టంమ్మీద పోలీసులు వారిని నిలువరించారు. విశాఖ నగరం నుంచే కాకుండా.. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన జనం సీఎంకు స్వాగతం పలికేందుకు ఉత్సుకతతో తరలివచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రారంభమైన అభిమాన యాత్రలో అడుగడుగునా ధన్యవాదాలు చెబుతున్న ప్రజలు, అభిమానులను జగన్ చిరు మందహాసంతో ఆత్మీయంగా పలకరిస్తూ అభివాదం చేశారు. ప్రతీ కూడలిలోనూ వాయిద్యాలు, జానపద నృత్యాలతో సందడి నెలకొంది. చిన్నారి వైద్యానికి సీఎం భరోసా పెందుర్తి మండలం జుత్తాడ గ్రామానికి చెందిన రెండేళ్ల పాప ఎస్.తన్విత ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్ వివరించారు. పెద్ద పేగుకు ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారని, తమకు అంత స్తోమత లేదని తల్లిదండ్రులు ముఖ్యమంత్రికి మొరపెట్టుకున్నారు. చిన్నారి కష్టాన్ని చూసి చలించిపోయిన సీఎం జగన్ తక్షణమే తన్వితకి శస్త్ర చికిత్స చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రత్యేక కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డిని ఆదేశించారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆ పాపకి ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందనీ.. త్వరలోనే ఆరోగ్యంగా తిరుగుతుందని తన్వితని ముఖ్యమంత్రి జగన్ ఆశీర్వదించారు. ఆ కుటుంబం సీఎంకు ధన్యవాదాలు చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. -
రాయచోటిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
-
రాయచోటిలో అభివృద్ధి పనులకు శ్రీకారం
సాక్షి, రాయచోటి: వైఎస్సార్ జిల్లా రాయచోటిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.1272 కోట్లతో జీఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ నుంచి కాలేటివాగు రిజర్వాయర్, అక్కడి నుంచి చక్రాయపేట, రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాల చెరువులకు నీరందించి తద్వారా ఆయకట్టును స్థిరీకరించేందుకు ఏర్పాటు చేయనున్న ఎత్తిపోతల పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. రూ. 340.60 కోట్లతో రాయచోటిలో చేపట్టే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, పట్టణాభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ. 23 కోట్లతో రాయచోటి ఆస్పత్రిని 50 నుంచి 100 పడకలకు విస్తరించే పనులకు, రూ.11.55 కోట్లతో రాయచోటి నియోజకవర్గంలో నిర్మించనున్న గ్రామ సచివాలయ భవనాలకు, రూ. 15.52 కోట్లతో నియోజకవర్గంలో చేపట్టనున్న సీసీ రోడ్లు నిర్మాణానికి, రూ.31.7 కోట్లతో సీసీ డ్రెయిన్స్ , రూ.కోట్లతో రాయచోటి మండలంలో చేపట్టనున్న తాగునీటి పథకాలకు, రూ.18 కోట్లతో చేపట్టనునన మైనార్టీ రెసిడెన్సియల్ స్కూలు కాంప్లెక్స్, రూ. 20.95 కోట్లతో నిర్మించనున్న కడప డిస్ట్రిక్ట్ పోలీసు కార్యాలయ భవనాలకు శంకుస్థాపన శిలాఫలకాలను ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్‌బాషా, మంత్రులు ఆదిమూలపు సురేశ్, అనిల్ కుమార్ యాదవ్, చీఫ్ విప్ రాయచోటి శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఇళ్లస్థలాల’ భూముల అభివృద్ధికి ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల స్థలాల కోసం గుర్తించిన భూముల్లో అన్ని మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నడుం బిగించింది. వచ్చే ఉగాది నాటికి దాదాపు 25 లక్షల మంది పేదలకు ఇళ్లస్థలాల పంపిణీకి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా భూములు గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇళ్ల స్థలాల కోసం గుర్తించిన భూముల్లో ముళ్ల పొదల తొలగింపు, భూమి చదును చేయడం, అంతర్గత రోడ్ల నిర్మాణం, లింకు రోడ్లు నిర్మాణాన్ని ఉపాధి హామీ పథకంలో చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇళ్ల స్థలాల కోసం కేటాయింపు చేసినట్లు నిర్ణయం తీసుకున్నాకే ఆయా స్థలాల్లో పనులు చేపట్టాలని పేర్కొన్నారు. 800 మీటర్ల అంతర్గత రోడ్లు ఇళ్ల స్థలాలకు కేటాయించిన స్థలంలో ‘ఉపాధి’ నిధులతో ఏయే పనులు చేపట్టవచ్చో స్పష్టంగా పేర్కొంటూ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఉత్తర్వులిచ్చారు. ఎకరా విస్తీర్ణంలో గరిష్టంగా నాలుగు వేల క్యూబిక్ మీటర్ల పరిమాణం మేర భూమి చదునుకు అనుమతించారు. ఎకరా స్థలంలో గరిష్టంగా 800 మీటర్ల పొడవున అంతర్గత రోడ్ల నిర్మాణానికీ.. ఇళ్ల స్థలానికి కేటాయించిన స్థలం నుంచి దగ్గరగా ఉండే రోడ్డుకు కలుపుతూ గరిష్టంగా 5 కి.మీ పొడవున గ్రావెల్ రోడ్డు నిరి్మంచవచ్చని పేర్కొన్నారు. రూ. 5 లక్షల లోపు పనులకు పంచాయతీరాజ్ లేదా సాంఘిక సంక్షేమ శాఖ ఇంజనీరు విభాగాల్లో పనిచేసే డీఈఈ.. రూ. 40 లక్షల వరకు పనులను ఈఈలు.. రూ. 2 కోట్ల వరకు పనులను జిల్లా ఎస్ఈలు, అంతకు మించి విలువ చేసే పనులను ఈఎన్సీ కార్యాలయంలోని సీఈలకు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చారు. 12,291 ఎకరాల్లో పనులకు ప్రతిపాదనలు ఇళ్ల స్థలాల కోసం మొత్తం 12,291 ఎకరాల్లో రూ. 803 కోట్లతో నాలుగు రకాల అభివృద్ధి పనులకు ప్రతిపాదనల్ని జిల్లా అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. ఇందులో 2,702 ఎకరాల్లో పనులు చేపట్టేందుకు అనుమతుల జారీ చేసే ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన పనులకు సంబంధించి అనుమతుల జారీ ప్రక్రియ జిల్లాల్లో వేగంగా కొనసాగుతున్నట్లు అధికారులు వివరించారు. -
యాదాద్రి వైకుంఠ ద్వారం కూల్చివేత
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా దశాబ్దాల చరిత్ర కలిగిన మరో కట్టడాన్ని తొలగించారు. యాదగిరికొండపైకి మెట్ల మార్గం మొదలయ్యే ప్రాంతంలో ఉన్న వైకుంఠ ద్వారాన్ని శుక్రవారం రాత్రి కూల్చివేశారు. 1947లో రామ్‌దయాళ్ సీతారామయ్య శాస్త్రి, నరసింహారెడ్డి, కొండల్‌రెడ్డి, గాదె కిష్టయ్య తదితరులు ఆస్థాన కమిటీగా ఏర్పడి ఈ వైకుంఠ ద్వారాన్ని నిర్మించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా యాదగిరిగుట్ట పట్టణంలో యాదవనగర్ వరకు రోడ్డు విస్తరణ చేస్తుండడంతో ప్రస్తుతం వైకుంఠ ద్వారాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో చరిత్ర కలిగిన ఈ వైకుంఠ ద్వారానికి సంబంధించి ఇక జ్ఞాపకాలే మిగిలిపోనున్నాయి. తుది దశకు చేరుకున్న నూతన వైకుంఠ ద్వారం నిర్మాణంలో నూతన వైకుంఠ ద్వారం ప్రస్తుతం ఉన్న వైకుంఠ ద్వారాన్ని కూల్చివేసే ప్రణాళికను ముందస్తుగా నిర్ణయించడంతో దాని వెనుక భాగంలో ఇప్పటికే కొత్తగా మరో వైకుంఠ ద్వారాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నూతన వైకుంఠ ద్వారం పనులు సైతం తుది దశకు చేరుకున్నాయి. -
కరీబియన్ దీవులకు వంద కోట్లు
న్యూయార్క్: కరీబియన్ దేశాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు భారత్ తనవంతు సాయంగా సుమారు రూ.100కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. సౌరశక్తి, ఇతర సంప్రదాయేతర ఇంధన వనరుల పనులకుగాను మరో రూ.1000 కోట్ల రుణాలు కల్పించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. బుధవారం న్యూయార్క్‌లో కరీబియన్ దేశాల సమాఖ్య ‘కరికామ్’తో మోదీ భేటీ అయ్యారు. భారత్‌లో తొలి ‘కరికామ్’ సమావేశంలో మోదీతోపాటు సెయింట్ లూసియా ప్రధాని, కరికామ్ ఛైర్మన్ అలెన్ ఛాస్టెనెట్లు పాల్గొన్నారు. భారత్ సాయం ఇరు పక్షాల మధ్య ఉన్న సంబంధాలను ఉన్నతస్థానానికి తీసుకెళ్తుందని అలెన్ వ్యాఖ్యానించారు. గయానాలో ఐటీ రంగంలో ప్రాంతీయ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు, బెలీజ్‌లో ప్రాంతీయ వృత్తి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రధాని అంగీకరించినట్లు కరికామ్ ఓ ప్రకటనలో పేర్కొంది. సదస్సు సందర్భంగా మోదీ మాట్లాడారు. కరీబియన్ దేశాలతో ఆర్థిక, రాజకీయ సాంస్కృతిక సంబంధాలను దృఢం చేసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. ఇరాన్ అధ్యక్షుడితో మోదీ భేటీ: ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనితో న్యూయార్క్‌లో గురువారం ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ప్రాంతీయ పరిస్థితులు, ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నేతలు చర్చించారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాల నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఇరాన్, అమెరికాల మధ్య విబేధాలు తీవ్రస్థాయిలో ఉన్న పరిస్థితుల్లో ఈ భేటీ జరగడం విశేషం. సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలపై దాడులకు ఇరానే కారణమని అమెరికా ఆరోపిస్తోంది. ‘ఇరువురు నేతలు ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయ స్థితిగతులపై చర్చించారు’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు సందర్భంగా కిర్గిజిస్తాన్‌లో ఈ జూన్‌లోనే మోదీ, రౌహనీల మధ్య భేటీ జరగాల్సి ఉన్నా, ఇతర కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఇటీవలి కాలం వరకు ఇరాక్, సౌదీ అరేబియాల తరువాత ఇరాన్ నుంచే భారత్ ఎక్కువగా చమురును దిగుమతి చేసుకుంటూ ఉండేది. -
సీఎం హామీతో సిద్దిపేట మున్సిపల్‌కు నిధుల వరద
సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని ఏకైక స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ సిద్దిపేట పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ప్రేమను నిధుల రూపంలో వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు అభివృద్ధి, ప్రయోగాత్మక ప్రక్రియలతో రాష్ట్ర, దేశ స్థాయిలో గుర్తింపు పొందిన సిద్దిపేట బల్దియాకు సీఎం కేసీఆర్ నిధుల వరదను పారించారు. చింతమడక సందర్శనలో ప్రకటన.. చింతమడక ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా సిద్దిపేట పట్టణానికి నిధులను కేటాయించాలన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించి రూ.25కోట్లను ప్రత్యేకంగా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం పాఠకులకు విధితమే. సీఎం ప్రకటన పరోక్షంగా మున్సిపల్‌కు ఊరటగానే చెప్పాలి. ఇప్పటికే అనేక ప్రజాపయోగ కార్యక్రమాలను నిర్వహించడానికి బల్దియాకు నిధుల సమీకరణ కొంత ఇబ్బందిగా మారుతుంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా రూ. 25కోట్లను మంజూరి చేయడంతో నిధుల కోరతను తాత్కాలికంగా గట్టెక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రతీ నెల విద్యుత్ బిల్లుల చెల్లింపు రూపంలో రూ. 25లక్షలు, జీత భత్యాల రూపంలో మరో రూ.55లక్షలు మొత్తంగా రూ. 70లక్షల వ్యయం మున్సిపల్‌కు భారంగా మారుతున్న క్రమంలో ప్రత్యేక నిధుల కేటాయింపు కొంత ఊరటగానే చెప్పాలి. విలీన వార్డుల్లో అభివృద్ధికి దోహదం.. జిల్లాలో స్పేషల్ గ్రేడ్ మున్సిపల్ సిద్దిపేట పరిధిలో 34 వార్డులు ఉన్నాయి. గత కొన్నేళ్ల క్రితం సిద్దిపేట మున్సిపల్లో సమీపంలోని రంగదాంపల్లి, గాడిచెర్లపల్లి, ఇమామ్‌బాద్, ప్రశాంత్‌నగర్, నర్సాపూర్, హనుమాన్నగర్లను వీలినం చేశారు. ఇదేసమయంలో ఇటీవల లింగారెడ్డిపల్లి గ్రామ పంచాయతీని కూడా కలిపారు. గతంలో ఉన్న 28వార్డుల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఉన్న కొద్దిపాటి మున్సిపల్ నిధులతో సమకూర్చారు. మరోవైపు విలీన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన బల్దియాకు భారంగా మారింది. ముఖ్యంగా ఆరు విలీన గ్రామాల వార్డుల్లో మురికికాలువలు, రోడ్లు, భవనాల నిర్మాణం, నిధుల సమీకరణ అడ్డంగా మారింది. ఇదే సమయంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు మంత్రివర్గంలో కీలక స్థానంలో ఉండడంతో వివిధ పథకాల కింద సిద్దిపేటకు ప్రత్యేకంగా నిధులను కేటాయింపజేసి దశల వారిగా విలీన వార్డుల్లో అభివృద్ధి పరుగులు జరిగేలా చొరవ చూపారు. ప్రతీ నెల రూ.కోటికి పైగా వ్యయం స్పెషల్ గ్రేడ్ మున్సిపల్లో ప్రతీ నెల సుమారు కోటిరూపాయల వివిధ పద్దుల కింద బల్దియా వెచ్చించాల్సి ఉంటుంది. ప్రధానంగా సిద్దిపేట పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరా కోసం ఎల్ఎండీ నుంచి మానేరు నీటిని తరలించడంతో పాటు వివిధ పంప్‌హౌజుల్లో విద్యుత్ వినియోగం కోసం ప్రతీ నెల రూ. 25లక్షలను వెచ్చించడం మున్సిపల్‌కు గుదిబండగా మారుతుంది. అదే విధంగా జీతభత్యాల రూపంలో రూ. 55లక్షల వ్యయం మున్సిపల్‌కు భారంగా ఉంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రత్యేక చోరవ చూపి బల్దియా విద్యుత్ బిల్లులను స్వతహాగా నియోజకవర్గ నిధుల నుంచి వెచ్చించి తాత్కాలికంగా మున్సిపల్‌ను విద్యుత్‌బిల్లుల భారం నుంచి గట్టెక్కించారు. మరికొతకాలం ప్రత్యేకంగా ప్రభుత్వంలో మాట్లాడి కొన్ని నెలల పాటు ప్రభుత్వమే విద్యుత్ బిల్లుల భారం భరించేలా చొరవ∙చూపారు. మరోవైపు గతంలో జీతభత్యాల చెల్లింపు సిద్దిపేట మున్సిపల్‌కు ప్రధాన సమస్యగా మారేది. కోన్ని నెలల పాటు కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో గతంలో సిద్దిపేట మున్సిపల్ ఉండేది ఇదే సమయంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, అధికారంలోకి టీఆర్ఎస్ప్రభుత్వం రావడంతో పాటు మంత్రివర్గంలో కీలక శాఖలో ఉన్న ఎమ్మెల్యే హరీశ్‌రావు వివిధ పథకాల ద్వారా సిద్దిపేట మున్సిపల్ కోట్లాధి నిధులను సమీకరించి సిద్దిపేటను అభివృద్ధిలో ఆదర్శంగా నిలపడంలో కృషి చేశారు. మరోసారి సీఎం కేసీఆర్ చేయూత జిల్లా ఆవిర్భావం అనంతరం స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు విజ్ఞప్తి మేరకు రూ. 100కోట్ల ప్రత్యేక నిధులను ప్రకటించారు. అప్పట్లోనే సీఎం మంజూరు చేసిన వందకోట్లలో సుమారు 20కోట్ల రూపాయలు ప్రత్యేకంగా సిద్దిపేట మున్సిపల్ అభివృద్ధి కోసం విడుదల చేశారు. ప్రధానంగా మున్సిపల్ పరిధిలో మురికికాలువల నిర్మాణం, రోడ్లు, వివిధ కమ్యూనిటీ భవనాల నిర్మాణం లాంటి ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు వాటిని వెచ్చించారు. దీనికి తోడు సిద్దిపేటలో ప్రత్యేకంగా వైకుంఠధామాల నిర్మాణం, కోమటిచెరువు సుందరీకరణ, వివిధ రకాల భవనాల నిర్మాణంతో పాటు రహదారుల మరమ్మతు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థ, లాంటి అనేక అభివృద్ధి్ద పనుల కోసం పెద్ద ఎత్తున బల్దియాలో నిధుల వినియోగం చేయాల్సి వచ్చింది. జిల్లా కేంద్రం కావడంతో పట్టణీకరణ జోరుగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు మౌళిక వసతుల కల్పనతో పా టు వివిధ ప్రజా ఉపయోగ పనుల నిమిత్తం మరి న్ని నిధులు అవశ్యకతగా మారాయి.దీనిని పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్యే హరీశ్‌రావు చింతమడకలో సీఎం దృష్టికి నిధులను మంజూరి చేయాల ని విజ్ఞప్తి చేయడం స్పందించిన సీఎం తక్షణం రూ. 25కోట్లను మంజూరుతో అభిృద్ధికి నిధుల సమీకరణకు కొంత ఊరటగానే భావించాలి. సిద్దిపేటపై సీఎంకు అమితమైన ప్రేమ తాను పెరిగిన సిద్దిపేట గడ్డపై సీఎం కేసీఆర్‌కు అమితమైన ప్రేమ ఉంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరిక మేరకు వెంటనే రూ. 25కోట్లు మంజూరి చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. సిద్దిపేట పట్టణ అభివృద్ధి కోసం తాపత్రయ పడుతున్న హరీశ్‌రావు ఆశయానికి అనుగుణంగా సీఎం నిధులను కేటాయించారు. గతంలో కూడా 20కోట్లు మంజూరి చేశారు. ఇప్పుడు మరొక 25కోట్లు ప్రత్యేకంగా మంజూరు చేశారు. సిద్దిపేట ప్రజల, పాలకవర్గం పక్షాన నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు, కృషి చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావుకు కృతజ్ఞతలు. – రాజనర్సు, మున్సిపల్ చైర్మన్ -
‘ప్రత్యేకం’లో పరిష్కారమయ్యేనా..!
సాక్షి, కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల పాలన గడువు 2వ తేదీన ముగిసింది. ఐదేళ్ల కాలంలో తమ వంతుగా పాలకులు పట్టణాభివృద్ధికి పాటుపడ్డారు. కానీ పట్టణంలో చేయాల్సిన అభివృద్ధి పనులు ఇంకా భారీగానే ఉన్నాయి. కోట్ల రూపాయలతో చేపట్టనున్న పాత, నూతన పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధాన అభివృద్ధి పనులను పూర్తి చేయకుండా కౌన్సిల్ సభ్యులు పదవీకాలం ముగించుకుని గద్దెదిగారు. ప్రస్తుతం ప్రత్యేకపాలన అధికారిగా కలెక్టర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ సత్యనారాయణ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించక ముందు గతంలో మున్సిపల్ శాఖలోనే విధులు నిర్వహించారు. ఆయనకు మున్సిపల్ శాఖపై పూర్తిస్థాయిలో పట్టు ఉంది. ప్రత్యేక పాలనలో కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపిస్తే పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. నిలిచిన రూ. 2 కోట్ల మురికాలువ, ఫుట్‌పాత్ పనులు జిల్లా ఏర్పడిన తర్వాత పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా మురికి కాలువ, ఫుట్‌పాత్ నిర్మాణం కోసం టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ. కోటీ 99 లక్షలతో పనులను ఎమ్మెల్యే గతేడా జూలై 28న ప్రారంభించారు. అయితే కొత్త బస్టాండ్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ఇరువైపులా తవ్వకాలు జరిపి పనులు పూర్తి చేయకుండానే నిలిపివేశారు. పనులు అర్ధం తరంగా నిలిచిపోవడంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. అదనపు టెండర్లతో ఖర్చు వ్యయం పెంచాలని, చేసిన పనుల బిల్లులు చెల్లించాలని ఈ పనులు నిలివేశారు. అయితే ఈ పనులను కౌన్సిల్‌లోని పాలకురాలి భర్తనే చేపడుతుండడం గమనార్హం. స్లాటర్ హౌజ్, మటన్ మార్కెట్ ఊసేలేదు 2003లో ఐడీసీఎంస్ కేంద్ర నిధులు రూ. 63లక్షలతో సుభాష్‌రోడ్డులో 60కి పైగా దుకాణాలతో మటన్ మార్కెట్ సముదాయాలను నిర్మించారు. వాటికి టెండర్లు నిర్వహించకపోవడంతో ఇప్పటి వరకు అద్దెలు, అడ్వాన్స్‌ల రూపంలో రూ.2 కోట్లకుపైగానే బల్దియా ఆదాయం కోల్పోయింది. అలాగే రూ. 10 లక్షలతో సిరిసిల్ల రోడ్డులో జంతువధశాల నిర్మించి వదిలేశారు. ప్రస్తుతం పెద్ద, చిన్నకసాబ్ గల్లి, బతుకమ్మకుంట తదితర ప్రాంతాలలో జనవాసాల మధ్య జంతువులను వధిస్తూ మాంసం విక్రయిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాలలో జంతువుల కళేబరాలు, రక్తం మురికాలువల్లో, రోడ్లపై పడేయడంతో దుర్గధంతో స్థానికులు అవస్థలు పడుతూ, రోగాల బారిన పడుతున్నారు. గాడితప్పిన పారిశుధ్యం బల్దియాలో 5 ఏళ్లుగా సానిటరీ ఇన్స్పెక్టర్లు లేకపోవడంతో ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం పట్టణంలోని ఈ విభాగం అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడ చూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే మురికికాల్వలు నిండి రోడ్లపైకి మురుగునీరు వస్తోంది. సుభాష్‌రోడ్డు, జేపీఎన్ రోడ్డు, అయ్యప్పనగర్, దళిత వాడ, ఇస్లాంపూర, విద్యానగర్‌కాలనీ తదితర ప్రాంతాల్లో రోడ్లపైకి మురుగునీరు ప్రవహిస్తోంది. జవాన్లను, కార్మికులకు ప్రణాళికాబద్ధంగా పనులు అప్పగించే వారు లేక సైతం పనులు సక్రమంగా జరగడం లేవు. టౌన్‌ప్లానింగ్‌లో ఆరోపణలెన్నో.. పట్టణంలో పార్కింగ్ స్థలాలు లేకుండానే, సెల్లార్ అనుమతులు లేకుండానే జిల్లాకేంద్రంలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు చేపట్టారు. నిజాంసాగర్ చౌరస్తాలో, నిజాంసాగర్ రోడ్, పాత బస్టాండ్, సిరిసిల్ల రోడ్ తదితర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల్లో పార్కింగ్ స్థలాలు లేకున్నా, సెల్లార్లు లేకున్నా అనుమతులు ఇచ్చారు. ఈ అనుమతులపై అధికారులు, కౌన్సిల్ సభ్యులపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. పాత బస్టాండ్‌లో సెల్లార్ అనుమతి లేదని స్వయంగా అధికారులు కూల్చివేయించినా మళ్లీ యధావిధిగా నిర్మాణాలు ఉన్నాయి. నిజాంసాగర్ చౌరస్తాలో భవన నిర్మాణాలపై పార్కింగ్ స్థలాలు, సెల్లార్ అనుమతులు లేవని, ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కాంగ్రెస్ నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మాస్టర్ ప్లాన్ అమలు కావడం లేదు. మార్కింగ్‌లు వేసి నోటీసులు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా చర్యలులేవు. ఇళ్లలో ఇంకుడు గుంతలకు డబ్బులు వసూళ్లు చేసి ఇప్పటివరకు ఒక్క ఇంకుడు గుంత నిర్మాణానికి చర్యలు లేవు. ఆదాయ మార్గాలున్నా.. జిల్లా కేంద్రంలో ట్రేడ్ లైసెన్స్‌లు, రెన్యూవల్ పేరి ట కేవలం యేటా రూ.3 నుంచి 4 లక్షలకు వర కు మాత్రమే ఆదాయం తీసుకొస్తున్నారు. కానీ జిల్లాకేంద్రంలో రైస్‌మిల్లులు, పెద్ద పెద్ద షాపింగ్‌మాల్స్, వ్యాపార సముదాయాలు, చిన్నపాటి వ్యాపార దుకాణాలు, షోరూంలు ఇలా 3 వేలకు పైగానే ఉంటాయి. అంటే ఏటా ట్రెడ్ లైసెన్స్ పేరిట సుమారు రూ. 20 లక్షల వరకు ఆదాయం సమకూర్చవచ్చు. కానీ సానిటేషన్ విభాగంలో పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రధాన రోడ్లపై వ్యాపార ప్రకటనల కోసం హోర్డింగ్, బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిపైనా ఏటా ఎలాంటి ఆదాయం సమకూరడం లేదు. మటన్ మార్కెట్ సముదాయం టెండర్లు చేయకపోవడంతో రూ. కోట్లతో ఆదాయం కోల్పోయింది. నిషేధిత ప్లాస్టిక్ బ్యాగులు విక్రయిస్తున్న జరిమానాలు వేయడం లేదు. కలెక్టర్ చొరవ చూపితే.. కలెక్టర్ సత్యనారాయణ గతంలో మున్సిపల్ శాఖలో ఉన్నతాధికారిగా విధులు నిర్వహించారు. మున్సిపాలిటీపై ఆయనకు చాలానే అనుభవం ఉంది. ఈ బల్దియాపై ప్రత్యేక దృష్టి సారిస్తే పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, సానిటేషన్, నీటి విభాగం, వీధిలైట్లు, రెవెన్యూ విభాగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. -
నేత... మేత
పార్థకు కియా పంట కియాకు ఇచ్చిన రూ.600 ఎకరాలు చదును చేసేందుకు రూ. 178 కోట్లతో టెండర్ పిలిచారు. ఈ పనుల్లోనే స్థానిక ఎమ్మెల్యే బీకేకు రూ.30 కోట్లు అందినట్లు తెలుస్తోంది. ‘పేరూరు’లో సునీతకు వాటా పేరూరు ప్రాజెక్టుకు రూ.803 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనుల్లో మంత్రి సునీతకు రూ.84 కోట్లు ఏజెన్సీ ఇచ్చేలా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. కాలవకు భారీ లబ్ధి బీటీపీకి నీరిచ్చే పనులను తొలివిడతలో రూ.344కోట్ల సివిల్ వర్క్స్ ప్రారంభించారు. ఈ పనుల్లో మంత్రికి రూ. 84 కోట్లు గుడ్‌విల్ ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. పయ్యావులకు ప్యాకేజీ హంద్రీ–నీవాలో భాగంగా 36వ ప్యాకేజీ డిస్ట్రిబ్యూటరీకి రూ.336కోట్లు మంజూరైంది. ఇందులో 15 శాతం చొప్పున రూ.36 కోట్లు పయ్యావుల కేశవ్‌కు అందనుంది. బాలకృష్ణకూ మామూళ్లు చిలమత్తూరు–మడకశిర రోడ్డు పనులను రూ.282 కోట్లకు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ దక్కించుకుంది. ఇందులో రూ.45 కోట్లు ఎమ్మెల్యే బాలకృష్ణకు ‘గుడ్‌విల్’ అందనుంది. ఎన్నికల వేళ ‘అనంత’ నేతలు అభివృద్ధి మంత్రం జరిపిస్తున్నారు. అడ్డగోలుగా అభివృద్ధి పనుల అంచనా వ్యయం పెంచేసి ఏజెన్సీల నుంచి ‘గుడ్‌విల్’ దండుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి ఎలాగైనా గెలవాలని సిద్ధమైపోయారు. ప్రభుత్వం కూడా నీళ్లు, రోడ్లు, రైతుల పేరుతో టీడీపీ ఎమ్మెల్యేలకు ఎన్నికల ఖర్చును ముందుగానే దోచిపెడుతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడిచింది. ఇన్నేళ్లలో ఎకరాకు కూడా ప్రభుత్వం సాగునీరు ఇవ్వలేదు. కానీ సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఆర్నెళ్ల ముందు రైతులు, నీళ్ల పేరుతో వేల కోట్లాది రూపాయలు ‘అనంత’లో గుమ్మరిస్తున్నారు. ‘అనంత’పై తనకు ఎనలేని ప్రేమ ఉందని జిల్లాకు వచ్చిన ప్రతీసారి సీఎం చంద్రబాబు వల్లెవేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టులకు నిధులు మంజూరు వెనుక ప్రత్యేక ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఖర్చు కోసం ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో ప్రాజెక్టును మంజూరు చేసి, ప్రాజెక్టు ఖర్చును భారీగా పెంచి, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు దోచిపెడుతున్నారు. జిల్లాలో సాగుతున్న అభివృద్ధి పనులను నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఆ రెండు రోడ్ల పనులు సూరీకే బత్తపల్లి–రాప్తాడు నేషనల్ హైవే పనులను రూ.147 కోట్లకు కేసీపీఎల్–లికాన్(జాయింట్ వెంచర్) దక్కించుకుంది. కళ్యాణదుర్గం–రాయదుర్గం పనులను రూ.194 కోట్లతో ఇవే సంస్థలు దక్కించుకున్నాయి. అంటే రూ.341 కోట్ల విలువైన ఈ రెండు పనులను ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరికి చెందిన నితిన్‌సాయి కన్స్ట్రక్షన్స్ సబ్లీజుకు చేస్తోంది. ఇందులో ఏస్థాయిలో మిగులుతుందో ఇట్టే తెలుస్తోంది. చిలమత్తూరు–మడకశిర రోడ్డు పనులను రూ.282 కోట్లకు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ దక్కించుకుంది. ఇందులో రూ. 45 కోట్లు ఎమ్మెల్యే బాలకృష్ణకు ‘గుడ్‌విల్’ అందనున్నట్లు తెలుస్తోంది. ఇది కాకుండా మడకశిర బ్రాంచ్ కెనాల్ పనుల్లో కూడా బాలయ్యతో పాటు మడకశిర ఎమ్మెల్యే ఈరన్నకు మామూళ్లు అందినట్లు తెలుస్తోంది. ఎంపీ జేసీకి భారీగా గుడ్‌విల్ గుంతకల్లు–గుత్తి హైవే పనులు రూ.275 కోట్లకు సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్కు దక్కాయి. ఈ పనులు మొదట 13 శాతం లెస్‌కు రిత్విక్ దక్కించుకుంది. ఆ తర్వాత టెండర్ రద్దు చేసి, తిరిగి 4.95 శాతానికి పెంచి మళ్లీ టెండర్ దక్కిచుంది. లెస్ చేసిన 13 శాతం, పెంచిన 4.95 శాతం ప్రభుత్వానికి నష్టమే. ఈ డబ్బులు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి రిత్విక్ ఇవ్వాలని ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అంటే రూ.50 కోట్ల మేర అందనుంది. హెచ్చెల్సీ ఆధునికీకరణలో భాగంగా యాడికి కెనాల్ పనులు 548.96 కోట్లుతో సాగుతున్నాయి. ఈ పనులు జీఎస్‌రెడ్డి, కేకేరెడ్డి, హిందుస్తాన్ రత్నకి చెందిన ఏజెన్సీలు చేస్తున్నాయి. ఇందులో కూడా జేసీ బ్రదర్స్‌కు భారీగానే ‘గుడ్‌విల్’ అందినట్లు తెలుస్తోంది. జీబీసీ(గుంతకల్లు బ్రాంచ్ కెనాల్) పనులు రిత్విక్, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాయి. ఈ పనుల్లో పయ్యావుల కేశవ్, గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌కు లబ్ధి చేకూరింది. పుట్టపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న మారాల రిజర్వాయర్, కదిరి పరిధిలోని చెర్లో పల్లి రిజర్వాయర్ పనులతో పల్లె రఘునాథరెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, కందికుంట ప్రసాద్‌కు డబ్బులు చేరినట్లు తెలుస్తోంది. పార్థకు కియా పంట కియా రాకతో పెనుకొండ ఎమ్మెలే పార్థసారథికి భారీగా లబ్ధి చేకూరింది. మంత్రి పదవి ఆశించి భంగపడిన ఈయనకు కియాకు ఇచ్చిన రూ.600 ఎకరాలు చదును చేసేందుకు రూ. 178 కోట్లతో టెండర్ పిలిచారు. ఈ పనుల్లోనే బీకేకు రూ.30 కోట్లు అందినట్లు తెలుస్తోంది. అనంతలో రూ.191 కోట్లతో పైపులైన్ పనులు మంజూరయ్యాయి. ఇందులో ఫేజ్–1లో రూ.147 కోట్ల పనులను 6.89 శాతం ఎక్కువతో ఐహెచ్పీ దక్కించుకుంది. ఇందులో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి భారీగా అందినట్లు తెలుస్తోంది. ఇది కాకుండా కార్పొరేషన్ పరిధిలో జరిగే ప్రతీ పనిలో ఎమ్మెల్యేకి మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. శింగనమలలో విప్ యామినీ బాల ఇసుక ద్వారా భారీగా అర్జించింది. ఇసుకకు శింగనమల అడ్డా కావడంతో దోపిడీకి అడ్డు లేకుండా పోతోంది. ఇలా 14 నియోజకవర్గాల్లో టీడీపీ ప్రజాప్రతినిధులు ఎక్కడిక్కడ ప్రజాధనాన్ని కొల్లగొట్టి నగదు రూపంలో పోగు చేసుకుని ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఈ స్థాయిలో అర్జించిన వీరంతా ఎన్నికల్లో నియోజకవర్గానికి రూ. 25 కోట్ల నుంచి రూ.40 కోట్లు వరకూ ఖర్చు చేసేందుకు సిద్ధ మయ్యారు. పేరూరు ప్రాజెక్టు కథ ఇదీ పేరూరు ప్రాజెక్టుకు రూ.95కోట్లతో బోరంపల్లి నుంచి నీళ్లిచ్చేందుకు 2009లో డీపీఆర్ సిద్ధమైంది. రూ.56 కిలోమీటర్ల మేర ఈ కాలవ తవ్వాలి. దాదాపు పదేళ్లు కావస్తోంది కాబట్టి ఏడాదికి పదిశాతం చొప్పున పెంచినా రూ.190 కోట్లతో ప్రాజెక్టు పూర్తి చేయవ చ్చు. కానీ ప్రభుత్వం రూ.803 కోట్లు మంజూరు చేసింది. తొలివిడతగా రూ.565 కోట్ల పనులను ‘మెగా’ నిర్మాణసంస్థకు కట్టబెట్టింది. ఈ పనుల్లో మంత్రి సునీతకు 15 శాతం చొప్పున రూ.84 కోట్లు ఏజెన్సీ ఇచ్చేలా ఒప్పందం చేసినట్లు తెలుస్తోంది. ఇది కాకుండా అమరావతిలో చినబాబుగా పిలవబడే ఓ మంత్రికి భారీగానే కప్పం కట్టాలని తెలుస్తోంది. ఇది కాకుండా నాలుగేళ్లలో ఇప్పటికే భారీగా అర్జించిన పరిటాల కుటుంబం ఈ నిధులతో ఎన్నికల్లో ఏ స్థాయిలో ఖర్చు పెట్టనుందో ఊహించవచ్చు. పయ్యావులకు 36వ ప్యాకేజీ హంద్రీ–నీవాలో భాగంగా 36వ ప్యాకేజీ డిస్ట్రిబ్యూటరీకి రూ.336 కోట్లు మంజూరైంది. ఇందులో తొలివిడతగా 244.72 కోట్ల పనులను టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ చేస్తోంది. ఈ పనుల అంచనా వ్యయాన్ని కూడా భారీగా పెంచారు. ఇందులో 15 శాతం చొప్పున రూ.36 కోట్లు శాసనమండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్‌కు అందినుంది. ఈ పనుల్లో తక్కిన 91.64 కోట్లు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరగనున్నాయి. ఇందులో కూడా 15 శాతం కళ్యాణదుర్గం ఎమ్మెల్యేకు ‘గుడ్‌విల్’ అందనుంది. -
ఆ పార్కులో అన్నీ సమస్యలే
వికారాబాద్ అర్బన్ : మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న గాంధీ పార్కులో పిల్లలు ఆడుకోవడానికి సిబ్బంది అనుమతించడం లేదు. ఇదేమిటని అడిగితే పనులు జరుగుతున్నాయని, అక్కడ ఏర్పాటు చేసిన ఆట వస్తువులు చెడగొడుతున్నారని సిబ్బంది చెబుతున్నారు. సుమారు రూ.30 లక్షలతో చేపట్టిన గాంధీ పార్కు అభివృద్ధి పనులు మధ్యలో ఆగిపోయి రెండు మాసాలు కావస్తోంది. సంబంధిత కాంట్రాక్టు అసంపూర్తిగా పనులు చేసి వెళ్లిపోయారు. అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో పార్కుకు తాళం వేసేస్తున్నారు. సెలవు రోజు పిల్లలు పార్కులో ఆడుకుందామని వస్తున్నా గేట్లకు వేసిన తాళాలు చూసి వెళ్లిపోతున్నారు. లక్షల రూపాయలు ఖర్చచేసి కొనుగోలు చేసిన పిల్లల ఆటు వస్తువులు ఆడుకునే వారు లేక బోసిపోతున్నాయి. పార్కులో కొంత మేరా గ్రీన్‌మ్యాట్ వేసినా సక్రమంగా లేక పిచ్చిమొక్కలు మొలిశాయి. అనేక చోట్ల పూల మొక్కలు ఎండిపోతున్నా సిబ్బంది పట్టించుకోవడంలేదు. ఆది, సోమవారాలు రెండు రోజులు వరుసగా సెలవులు వచ్చినా పిల్లలను పార్కులోకి అనుమతించలేదు. పిల్లలు ఆడుకోవడానికి అనుమతించకుంటే లక్షలు ఖర్చుచేసినా లాభముండదని పట్టణవాసులు పేర్కొంటున్నారు. -
ఖమ్మం అభివృద్ధికి రూ.కోట్లు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగరంలో అన్ని డివిజన్లలో రోడ్లనుసీసీ రోడ్లుగా మార్చి సుందర నగరంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. శనివారం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 41, 41వ డివిజన్లలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మేయర్ పాపాలాల్‌తో కలిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నగరంలో రోడ్లు, సీసీ డ్రెయిన్ల అవసరాన్ని గుర్తించిన మేరకు నేడు శంకుస్థాపనలు చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసి వాటిని వాడుకలోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రుద్రగాని శ్రీదేవి, కొప్పెర సరిత, పాలడుగు పాపారావు, కొప్పెర నరసింహారావు, నాయకులు ఆర్జేసీ కృష్ణ, రుద్రగాని ఉపేందర్, మెంతుల శ్రీశైలం, నిరంజన్‌రెడ్డి, వసంతబాబు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యవర్గం భేటీ ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ను అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ నూతన కార్యవర్గం శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పద్మ, భవాని, శ్రీదేవి, ప్రేమబాయి, రమాదేవి, విమల, ప్రేమిలా, జ్యోతి, కల్పన పాల్గొన్నారు. -
హింసకు ప్రగతే పరిష్కారం
భిలాయ్: అన్ని రకాల హింస, కుట్రలకు అభివృద్ధి మాత్రమే ఏకైక పరిష్కారమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గురువారం రూ. 22 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల్ని ప్రారంభించిన అనంతరం ఆయన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో హింసకు పాల్పడుతున్న నక్సల్స్‌కు స్పష్టమైన సందేశమిచ్చే ప్రయత్నం చేశారు. ప్రజల్లో నమ్మకం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని, అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు అనేక పథకాల్ని ప్రారంభించాయని అన్నారు. యూపీఏ హయాంలో ఛత్తీస్‌గఢ్ అభివృద్ధిని పట్టించుకోలేదని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భిలాయ్‌లో ఐఐటీ ఏర్పాటు చేశామని, మౌలిక వసతులు కల్పిస్తున్నామని ప్రధాని వెల్లడించారు. అంతకుముందు భిలాయ్ ఉక్కు కర్మాగారం ఆధునిక విస్తరణ ప్లాంటును ఆయన ప్రారంభించారు. ఈ కర్మాగారం ఆధునిక భారతదేశ పునాదులను బలోపేతం చేస్తుందని చెప్పారు. అలాగే జగదల్పూర్–రాయ్‌పూర్ మధ్య విమాన సేవల్ని, నయా రాయ్‌పూర్‌లో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్‌లో నెలరోజుల వ్యవధిలో ప్రధాని మోదీ పర్యటించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ‘సహజ వనరుల నుంచి వచ్చే ఆదాయంలో కొంత స్థానిక గిరిజనుల కోసం ఖర్చుపెట్టాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ఛత్తీస్‌గఢ్‌కు అదనంగా రూ. 3 వేల కోట్లు అందాయి. వాటిని ఆస్పత్రులు, పాఠశాలలు, రహదారులు, మరుగుదొడ్ల నిర్మాణానికి ఖర్చు చేస్తారు. గిరిజనులు, వెనకబడ్డ ప్రాంతాల్లో నివసించేవారి ఆదాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది’ అని ప్రధాని పేర్కొన్నారు. జగదల్పూర్–రాయ్‌పూర్ మధ్య విమాన సేవల ప్రారంభాన్ని ప్రస్తావిస్తూ.. ‘హవాయ్ జహజ్(విమానం)లో హవాయి చెప్పులు వేసుకుని ఎవరైనా ప్రయాణిస్తే చూడాలనేది నా కల. చిన్న నగరాలు, పట్టణాలకు కూడా విమాన సేవలు అందించడమే మేం ప్రారంభించిన ఉడాన్ పథకం లక్ష్యం. గత ప్రభుత్వం రోడ్లు కూడా నిర్మించని ప్రాంతాల్లో.. ఎన్డీఏ ప్రభుత్వం రోడ్లు, విమానాశ్రయాల్ని నిర్మిస్తోంది. ఇంతకముందు రాయ్‌పూర్ విమానాశ్రయంలో రోజుకు కేవలం ఆరు విమానాలు ఎగిరేందుకు అవకాశముందేది. ఇప్పుడు 50 విమానాల రాకపోకలకు సామర్థ్యం కల్పించాం’ అని మోదీ చెప్పారు. భిలాయ్ ఐఐటీని సాకారం చేశాం ఎప్పటి నుంచో చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి ఐఐటీ కేటాయించమని సీఎం రమణ్ సింగ్ డిమాండ్ చేసినా యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదని.. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దానిని సాకారం చేశామని చెప్పారు. గతంలో చత్తీస్‌గఢ్ అంటే అడవులు, గిరిజనులే గుర్తుకు వచ్చే వారని, ఇప్పుడు స్మార్ట్ సిటీ(నయా రాయ్‌పూర్)కి పేరుగాంచిందన్నారు. బస్తర్ అనగానే బాంబులు, తుపాకీల పేర్లు మాత్రమే వినిపించేదని, ఇప్పుడు జగదల్పూర్లో నిర్మించిన విమానాశ్రయం అందరికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. నవ భారతానికి పునాదులు ఛత్తీస్‌గఢ్ పర్యటనలో భాగంగా ఆధునికీకరించిన భిలాయ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. నవ భారతానికి ఈ స్టీట్ ప్లాంట్ పునాదులు వేస్తుందని అన్నారు. దాదాపు రూ. 18,800 కోట్లతో విస్తరించిన ఈ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం ఏడాదికి 4.7 మిలియన్ టన్నుల నుంచి 7.5 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం వరకూ ఉక్కు పరిశ్రమ ఇబ్బందుల్ని ఎదుర్కొందని, ఇప్పుడు ప్రపంచంలో భారత్ రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి దేశంగా నిలిచిందన్నారు. రూ. 72 వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ల ఆధునీకరణ, విస్తరణ కార్యక్రమంలో భిలాయ్ ప్లాంట్ అభివృద్ధిని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్) చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా దేశంలో ఉక్కు ఉత్పత్తి ఏడాదికి 13 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం 21 మిలియన్ టన్నులకు చేరుతుంది. బస్తర్ జిల్లాకు తొలిసారి విమాన సేవలు భిలాయ్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగదల్పూర్ నుంచి రాయ్‌పూర్‌కు మొదటి విమానాన్ని మోదీ ప్రారంభించారు. దీంతో మావోయిస్టులకు పేరుపడ్డ బస్తర్ జిల్లాకు తొలిసారి విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. -
అభివృద్ధిని జీర్ణించుకోలేకే..
పెబ్బేరు : టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకే విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో సాయిరాం ఫంక్షన్హాల్లో కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో తెలంగాణ దేశానికి మార్గదర్శకం అవుతుందన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ పథకాలను పథకాలను అమలుచేస్తున్నారని కొనియాడారు. నాలుగేళ్లలో 24 గంటల ఉచిత కరెంట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రుణమాఫీ.. ఇలా ఎన్నో పథకాలను అమలుచేసినట్లు తెలిపారు. తనకు పదవులు లేకున్నా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. అభివృద్ధి పనులను చూసి ప్రజలకు ఎక్కడికి వెళ్లినా సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అంతకుముందు బీజేపీ, టీడీపీ నాయకులు భానుప్రకాష్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, శేఖర్‌గౌడ్, వార్డు సభ్యులు కుమ్మరి అచ్చన్న, మురళిరెడ్డి, సంజీవరెడ్డి, వెంకటేష్, సాయిరెడ్డి, ప్రపుల్నాయుడు, ఆంజనేయులుతో పాటు సుమారు 100 మందిని పార్టీలోకి ఆహ్వానించి కండువా వేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రకాష్, ఎంపీపీ పద్మావతి, గౌని బుచ్చారెడ్డి, విశ్వరూపం, హరిశంకర్‌నాయుడు, గోవింద్‌నాయుడు, ఎంపీటీసీ సభ్యుడు ఐజాక్, శివశంకర్‌గౌడ్, ఎండీ ముస్తాక్, రామన్‌గౌడ్, గోపాల్ యాదవ్, అక్కమ్మ వేణుగోపాల్, బీచుపల్లి పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి చెక్కు పంపిణీ వనపర్తి: మండలంలోని అంకూరు గ్రామానికి చెందిన బీసమ్మకు రూ.51 వేలు, భాగ్యమ్మకు రూ.51 వేలు, అనసూయమ్మకు రూ.75,116 కల్యాణలక్ష్మీ చెక్కులను గురువారం సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వనపర్తిలోని తన నివాసంలో పంపిణీ చేశారు. పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామానికి చెందిన నారాయణకు రూ.25వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పలుస రమేష్‌గౌడ్, కౌన్సిలర్ గట్టుయాదవ్, టీఆర్ఎస్ నాయకులు యోగానందారెడ్డి పాల్గొన్నారు. -
నిజం ఒప్పుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి. దీంతో ఎక్కడ చూసినా రోడ్లు గుంతలు పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై బుధవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మల్యే గణేష్ గుప్తా స్పందించారు. పనుల కారణంగా రోడ్లు పాడయ్యాయని.. దీంతో జనం ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనని ఆయన తెలిపారు. అయితే ఎంత ఇబ్బంది ఉన్నా తమకు సహకరిస్తున్నందుకు నగర ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. జూన్ లోపు అన్ని పనులు పూర్తవవుతాయన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా రూ. 800 కోట్లతో నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. యూజీడీ పనుల కారణంగా గత నాయకులు అబాసుపాలయ్యారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పనులన్నీ పూర్తై తాము చేసిన అభివృద్ధి ప్రజలకు నచ్చితే ఓట్లు వేస్తారని గణేష్ వ్యాఖ్యానించారు. -
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం చామన్‌పల్లి నుంచి చొప్పదండి మండలం వెదురుగట్ట వరకు ఆర్డీఎఫ్ నిధులతో చేపట్టనున్న సీసీ, బీటీ రోడ్డు పనులకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భూమిపూజ చేశారు. రూ.1.73కోట్లతో వంతెన, రూ.3.45కోట్లతో సీసీ, బీటీ రోడ్డుపనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రం ఏర్పాటైన అనంతరం గ్రామాలన్నీ పూర్తిస్ధాయిలో అభివృద్ధి చెందుతున్నట్లు తెలిపారు. చామన్‌పల్లిలో తీన్మూర్తిరోడ్డు, ఫకీర్‌పేట గ్రామాల రోడ్డు నిర్మాణం పూర్తయిందని, వెదురుగట్టవరకు చేపట్టనున్న రోడ్డు నిర్మాణానికి రైతులందరూ సహకరించాలని కోరారు. ఆర్నేళ్లలో వంతెన, రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు. మరో రెండునెలల్లో రూ.10కోట్లతో చామన్‌పల్లి నుంచి ఫకీర్‌పేట, ఎలబోతారం, ఇరుకుల్ల, చెర్లభూత్కూర్ గ్రామాలకు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ను అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రజలకు సేవకుడిగా పనిచేస్తూ.. అన్ని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ వి.రమేశ్, సర్పంచులు, ఎంపీటీసీలు, ఆర్టీఏ సభ్యుడు రమేశ్, ఆర్అండ్బీ డీఈ నర్సింహచారీ, ఏఈ లక్ష్మణ్‌రావు, ఏఏంసీ వైస్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, డైరెక్టర్ లక్ష్మయ్య, అయిలయ్య, నరేశ్‌రెడ్డి, సంజీవరెడ్డి, శ్రీనివాస్, చలమయ్య, అజయ్, పర్షరాములు తదితరులు పాల్గొన్నారు. -
డీడీ ఎక్కడండి.. ఎక్కడో పోయిందండి!
సాక్షి, హైదరాబాద్: పురావస్తు శాఖలో పెద్ద సంఖ్యలో డిమాండ్ డ్రాఫ్టులు గల్లంతయ్యాయి. అవి ఏ పని కోసం సంబంధించినవో వివరించే కొన్ని ఫైళ్లు కూడా మాయమయ్యాయి. అందులో కాంట్రాక్టర్లకు తిరిగి చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన కాంట్రాక్టర్లు వారి డీడీల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కేంద్రం 12వ ఆర్థిక సంఘం, 13వ ఆర్థిక సంఘం నుంచి పురావస్తు శాఖకు భారీ మొత్తాన్ని కేటాయించింది. ఆ శాఖ పరిధిలోని చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీటిని ఖర్చు చేయాలి. దాదాపు రూ.70 కోట్ల వరకు ఈ రూపంలో, కొన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పనులు చేపట్టారు. పనుల టెండర్లు పిలిచినప్పుడు కాంట్రాక్టర్లు ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) దాఖలు చేయాల్సి ఉంటుంది. దీన్ని డీడీ, చెక్కులు, బ్యాంకు గ్యారంటీ రూపంలో చెల్లిస్తారు. ఆ పని విలువలో రెండున్నరశాతం వరకు ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు మాత్రం నిర్ధారిత కాలం తర్వాత తిరిగి చెల్లిస్తారు. ఇలా 12, 13వ ఆర్థిక సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులకు సంబంధించిన టెండర్లతో పాటు కాంట్రాక్టర్లు ఈఎండీని డీడీల రూపంలో చెల్లించారు. ఇదంతా రాష్ట్ర విభజనకు ముందు జరిగింది. బ్యాంకులో వేయక ఏం చేసినట్లు.. సాధారణంగా ఈఎండీ తాలూకు మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఆ మొత్తం, దానిపై వచ్చే వడ్డీని కూడా ఆయా శాఖలు ఖర్చు చేసుకుంటాయి. అవసరం వచ్చినప్పుడు కాంట్రాక్టర్లకు నిర్ధారిత మొత్తాన్ని తిరిగి చెల్లిస్తాయి. కానీ పురావస్తు శాఖలో మాత్రం ఆ ఈఎండీ మొత్తాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయలేదని తెలుస్తోంది. ఆ డీడీలను అలాగే ఫైళ్లలో ఉంచేశారని, ఇప్పుడు ఆ ఫైళ్లతో పాటు అవి కనిపించటం లేదని తెలుస్తోంది. పనులు పూర్తి కావటంతో కాంట్రాక్టర్లు ఈఎండీ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోరడంతో అసలు విషయం బయటపడింది. అప్పుడు కాని గల్లంతైన సంగతిని గుర్తించలేదు. ఈ డీడీల విలువ ఎంతో కూడా తెలియకుండా అధికారులు గుట్టుగా ఉంచుతున్నారు. ఈ మొత్తం తిరిగి చెల్లించాలని తెలంగాణ, ఆంధ్ర పురావస్తు కార్యాలయాల చుట్టూ కాంట్రాక్టర్లు తిరుగుతున్నారు. కాంట్రాక్టర్ల ఒత్తిడి పెరుగుతుండటంతో ఏపీ అధికారులు.. తెలంగాణ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ‘ఈ ఫైళ్లను మాకు ఇవ్వలేదు, అవి తెలంగాణ కార్యాలయంలోనే ఉన్నాయి. ఇవ్వాలని కోరినా ఇప్పటి వరకు ఇవ్వలేదు’అని ఏపీకి చెందిన ఓ అధికారి ‘సాక్షి’తో చెప్పారు. -
సాంకేతికతను అందిపుచ్చుకోండి
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులను పకడ్బందీగా పర్యవేక్షించాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం మేరీ సడక్ యాప్‌తో పాటు స్పేస్ టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. మౌలిక రంగాలైన రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాల అభివృద్ధి పనులపై ఆయన శుక్రవారం సమీక్ష జరిపారు. కార్యక్రమానికి నీతి ఆయోగ్, రోడ్లు, హైవేలు, రైల్వే శాఖల అధికారులు హాజరయ్యారు. రోడ్లు, రైల్వే రంగాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు సకాలంలో పూర్తిచేయడానికి సమగ్ర విధానం ఉండాలని ప్రధాని పేర్కొన్నట్లు పీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధాన్ మంత్రి సడక్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 130 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకున్నామని అధికారులు వివరించారు. హరిత సాంకేతికతతో 4000 కిలో మీటర్లకు పైగా రోడ్లు నిర్మించామని, ప్లాస్టిక్ వ్యర్థాలు, కోల్డ్ మిక్స్, జియో టెక్స్టైల్స్, ఫ్లైయాష్, ఐరన్, కాపర్ల వినియోగాన్ని రోడ్ల నిర్మాణంలో ప్రోత్సహిస్తున్నట్లు పీఎంఓ వెల్లడించింది. చార్ధామ్ ప్రాజెక్టు, క్వాజిగుండ్–బానీహల్ సొరంగం, చీనాబ్ రైల్వే బ్రిడ్జి, జిరిబామ్–ఇంఫాల్ ప్రాజెక్టు, ఈస్టర్న్ ఫెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే తదితర ప్రాజెక్టుల పురోగతిని మోదీ సమీక్షించారు. -
సొంత రాష్ట్రంలో కోట్లతో అభివృద్ధి
కొత్తపల్లి (కరీంనగర్): సమైక్య పాలనలో రూ.10 లక్షల నిధులకు పది వేలు ఖర్చు చేసి చెప్పులరిగేలా తిరిగామని..ఆనాడు నిధుల కోసం కాంగ్రెస్ మంత్రుల వద్ద ప్రాధేయపడ్డా ఫలితం లేదని.. అదే తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం పద్మనగర్ నుంచి ఒడ్యారం వరకు 14 కిలోమీటర్లు 4 లైన్ల రహదారి విస్తరణకు ఆర్రోజుల్లోనే రూ.88 కోట్లు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ ఆదివారం ఎలగందుల వై జంక్షన్లో అభినందన సభ ఏర్పాటు చేశారు. పద్మనగర్– ఒడ్యారం వరకు ఉన్న రహదారిని మరో రూ.70 కోట్లు మంజూరు చేసి సిరిసిల్ల వరకు 4 లైన్లు విస్తరిస్తామని వెల్లడించారు. రూ.500 కోట్లతో నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్, రూ.60 కోట్లతో మానేరు వాగుపై నిర్మిస్తున్న వంతెన పూర్తయితే ఎలగందులకు కొత్త కళ వస్తుందన్నారు. -
పెద్ద చెరువులో ‘పచ్చ’గద్దలు..!
అధికార బలంతో రూ.కోట్ల విలువైన పనులను ముక్కలుగా చేయించారు.. నామినేషన్ పద్ధతిలో తమవారికి కట్టబెట్టించారు. నాణ్యతలేని పనులతో ప్రజాధనాన్ని లూటీ చేయిస్తున్నారు. విజయనగరం పెద్దచెరువు సాక్షిగా జరుగుతున్న అక్రమాలను అధికారులూ గుర్తించారు. పదికాలాల పాటు శాశ్వతంగా ఉండాల్సిన పనుల్లో నాణ్యత లోపించినా ఎదురు చెప్పలేక.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అప్పనంగా బిల్లులు చెల్లించేస్తున్నారు. అధికారులు, రాజకీయ నేతలు ఏకమై నిధులు కొల్లగొడుతున్న తీరుపై ‘సాక్షి’ ఫోకస్. సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం పట్టణ నడిబొడ్డున ఉన్న పెద్ద చెరువు అభివృద్ధి పేరుతో అధికార పార్టీ పెద్దలు దోపిడీకి తెరలేపారు. రూ.కోట్ల విలువైన పనులను నామినేటెడ్ పద్ధతిలో దక్కించుకున్నారు. ఇదేమిటని అడిగేవారు లేక పనుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చేశారు. అధికార బలంతో అధికారులపై ఒత్తిడి పెంచి ప్రజల సొమ్మును అప్పనంగా మేసేస్తున్నారు. పనుల్లో నాణ్యత లేదని ఆ విభాగం అధికారులు ప్రశ్నిస్తే రాజకీయపలుకుబడితో వారి నోరు నొక్కేస్తున్నారు. అధికారం ఉన్నప్పుడే పనుల పేరుతో ఇల్లు చక్కబెట్టుకుంటున్నారని జనం గగ్గోలు పెడుతున్నారు. ఇదీ పనుల తీరు... నీరు–చెట్టు పథకం కింద విజయనగరం పట్టణం నడిబొడ్డున ఉన్న పెద్దచెరువు అభివృద్ధి కోసం రూ.1.60 కోట్లు మంజూరు చేశారు. ఇందులో రూ.80 లక్షలు మట్టి పనులకు మంజూరు చేయగా, మరో రూ.80 లక్షలు కల్వర్టుల నిర్మాణానికి కేటాయించారు. మట్టి పనుల్లో భాగంగా గతేడాది కొంత, ఈ ఏడాది కొంత మట్టి తీయడం, బండ వెడల్పు చేయడం వంటి పనులు చేశారు. సిమెంట్ పనుల్లో భాగంగా ఎనిమిది కల్వర్టులు నిర్మించారు. ఇందులో ఇప్పటివరకు మట్టి పనులకు, కాంక్రీట్ పనులకు రూ.70 లక్షలకు పైగా ఖర్చు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా... చెరువు అభివృద్ధి పనుల కేటాయింపులో నిబంధనలను అధికారులు గాలికొదిలేశారు. నీరు–చెట్టు పథకం కింద రూ.10లక్షల పనుల వరకే నామినేటెడ్ విధానంలో సాగునీటి సంఘాలకు ఇవ్వాలి. లేకుంటే జన్మభూమి కమిటీలకు నిర్వహణ బాధ్యత అప్పగిస్తున్నారు. రూ.10 లక్షలు విలువ దాటిన పనులను మాత్రం తప్పనిసరిగా టెండరు పద్ధతిపై కేటాయించాలి. ఈ నిబంధన ప్రకారం చూస్తే పెద్ద చెరువు అభివృద్ధికి రూ.1.60 కోట్లు కేటాయించడంతో టెండరు విధానంలో పనులు కేటాయింపు జరగాలి. అలా చేయకుండా అధికారులు పనులను ముక్కలుగా చేసి 16 పనులుగా మంజూరు చేశారు. ఒక్కోపని విలువ రూ.10 లక్షలుగా చేసి నామినేషన్ పద్ధతిపై సాగునీటి సంఘానికి కేటాయించారు. అన్ని పనులూ ఎమ్మెల్యే సోదరికే.. నామినేటెడ్ పద్ధతిలో పనులెందుకు కేటా యించారనే ప్రశ్నకు.. పనులు వేగంగా చే యడానికే ఇలా చేశామని సాగునీటి శాఖ అధికారులు సమాధానం చెప్పుకొస్తున్నారు. అధికారులు అనుకున్నట్లు చేస్తే పనులు వేర్వేరు వ్యక్తులకు కేటాయించాలి. అలాకా కుండా ఒకే వ్యక్తి పనులు చేస్తున్నారు. పెద్ద చెరువుకు సంబంధించి సాగునీటి కమిటీ అధ్యక్షులుగా విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత సోదరి విజయలక్ష్మి వ్యహరిస్తున్నారు. ఆమె పెద్ద చెరువు పనులు చేస్తుండడంతో అధికారులు టెండర్లు పిలవకుండా పనులు విడదీసి నామినేషను పద్ధతిపై కేటాయించేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివెనుక ఎమ్మెల్యే మీసాల గీత చక్రం తిప్పారని, అధికారులపై ఒత్తిడి పెంచారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనుల్లో నాణ్యతా లోపం.. పనుల మంజూరులో రాజకీయ పెత్తనం పెరగడంతో నాణ్యతలోనూ అదే కనిపించింది. చేసేది అధికారపార్టీ నాయకులు కావడంతో తమనడిగేవారెవరన్న విధంగా పనులు చేశారు. మట్టి పనుల్లో నిబంధలు గాలిలో కలిశాయి. మట్టి వేయడం తప్ప రోలింగ్, వాటరింగ్ అసలు లేదు. సిమెంట్ పనుల్లో నాణ్యత మరింత ఘోరం. చెరువుకు ఉత్తరవైపు ఎనిమిది కల్వర్టు పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో నాణ్యత లోపం స్పష్టంగా కనిపిస్తోంది. కల్వర్టు గోడలు నిర్మాణం అంచెలంచెలుగా వేశా రు. ఒకేసారి వేయడం సాధ్యం కాదు కావున అలా వేశారనుకున్నా కాంక్రీట్‌లో సిమెంట్, మెటల్ వాడకం సక్రమంగా లేదు. దీంతో గోడలపై ఎక్కడక్కడ పెచ్చులూడి కనిస్తున్నాయి. కాం క్రీట్ శ్లాబ్‌కు శ్లాబ్‌కు మధ్య గోనె సంచులు, ఎక్కడక్కడ అతుకులు స్పష్టంగా కనిపించడం నాణ్యత లోపాన్ని తెలియజేస్తున్నా యి. ఇసుక, సిమెంట్, మెటల్ మిక్సింగ్‌లో లోపం తెలుస్తోంది. జలవనరుల శాఖ అభ్యంతరాలకు వివరణ.. జలవనరులశాఖ క్వాలటీ కంట్రోల్ అధికారులు ఇటీవల పనులను పరిశీలించి నాణ్యతపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నాణ్యత లోపం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తూ విజయనగరం డివిజన్ ఇరిగేషన్ అధికారులకు లేఖ రాశారు. ఎలాంటి లోపాలు లేవని, పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయని వారి లేఖకు జిల్లా అధికారులు సమాధానం ఇచ్చేశారు. ఇప్పటికిప్పుడు ఉన్న ఫళంగా పెద్ద చెరువు వద్దకు వెళ్లి చూస్తే ఎవరికైనా పనుల నాణ్యత ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది. మరి ఈ విషయాన్ని జిల్లా అధికారులు ఎందుకు మరుగున పెట్టాలనుకుంటున్నారా తెలియడంలేదు. కలెక్టర్ కనీసం కన్నెత్తి ఎందుకు చూడటం లేదనే విషయాలపై ఆరాతీస్తే కలెక్టరే పరిపాలనానుమతి ఇచ్చారని తెలిసింది. -
నిధులు ఫుల్ కానీ..ప్లానింగ్ నిల్
-
ఎన్నికలు ఉన్నందునే నంద్యాల అభివృద్ధి
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాలలో ఉప ఎన్నికలు ఉన్నందునే ఇక్కడ మరింతగా దృష్టి కేంద్రీకరించి అభివృద్ధి పనులు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఎన్నికల సభ కాదంటూనే పార్టీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డిని పక్కన ఉంచుకుని ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. శనివారం ఆయన కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో రోడ్డు విస్తరణ పనులను పరిశీలించడంతో పాటు ఎస్ఆర్బీసీ కాలనీ వద్ద అందరికీ ఇళ్ల పథకం కింద గృహ సముదాయానికి భూమిపూజ చేశారు. అంతకుముందు ఎస్పీజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. అభివృద్ధి పనులు గమనించి తమ పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు. నంద్యాలను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు. అర్హులందరికీ పథకాలు నంద్యాల నియోజకవర్గంలో అర్హులైన అందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేస్తున్నామని సీఎం చెప్పారు. ఉప ఎన్నిక నేపథ్యంలోనే అభివృద్ధి పనులు చేస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. ఇల్లు లేని పేదలకు 13 వేల ఇళ్లు నిర్మించేందుకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. అభివృద్ధిని చూసి తమ పార్టీని ఆదరించాలన్నారు. ఇది ఎన్నికల సభ కాదంటూనే.. పదేపదే తమ పార్టీని ఆదరించాలం టూ సీఎం విన్నవించ డం, పార్టీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డిని పక్కన ఉంచుకుని ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించడంపై స్థానికులు మండిపడుతున్నారు. సీఎంకు నిరసన సెగ శంకుస్థాపన సందర్భంగా స్థానికులు ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ నిరసన వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా ఉంటున్న తమను ఖాళీ చేయించి ఇతరులకు గృహాలు కట్టించడమేంటని నిలదీశారు. అయితే.. సీఎం వారి సమస్యలు వినకుండానే వెళ్లిపోయారు. -
నాణ్యత అడగొద్దు..!
– మూడు నెలల్లో పనులు పూర్తి కావాలి – బిల్లుల చెల్లింపులోనూ జాప్యం పనికిరాదు – నంద్యాల పనులపై ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలు కర్నూలు(అర్బన్): ‘‘ పనులు చేసేవారు మనవాళ్లే.. నాణ్యత విషయాన్ని పట్టించుకోవద్దు...అనుమతులు, నిబంధనలు అంటు కాలయాపన చేయవద్దు.. బిల్లుల చెల్లింపులో కూడా ఎవరినీ కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దు, చేసిన పనులకు చేపినట్టు బిల్లులు చెల్లించండి.’’ నంద్యాల అధికారులకు ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలు. నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటికే వేల కోట్ల రూపాయల అంచనాలతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. రోడ్లు, డ్రెయినేజీలు, మంచినీటి పైప్లైన్లు, ఇళ్లు తదితర ఇంజనీరింగ్ పనులతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకుపోయేందుకు టీడీపీ నేతలు అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత నెల 29వ తేదిన సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు అందిన మరుక్షణమే జిల్లా అధికార యంత్రాంగం రూ.298.21 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. అంతకుముందే నంద్యాల పట్టణ ఓటర్లను నమ్మించేందుకు రూ.60 కోట్లతో రోడ్ల విస్తరణ, డ్రెయినేజీ పనులను ప్రారంభించారు. అలాగే రూ.960 కోట్లతో 13 వేల ఇళ్లను నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. అయితే ఈ పనులు నేటిరీ ప్రారంభం కాలేదు. తాజాగా నంద్యాల రూరల్, గోస్పాడు మండలాల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లకు ప్రభుత్వం రూ.44 కోట్లను విడుదల చేసింది. అమృత్ పథకం కింద వెలుగోడు నుంచి నంద్యాల వరకు మంచినీటి పైప్‌లైన్ పనులు రూ.80 కోట్లతో జరుగుతున్నాయి. పట్టణంలో కూడా ఇంటింటికి కుళాయి కనెక్షన్ల పనులు కూడా ఊపందుకున్నాయి. రాత్రి, పగలు పనులు.. నాణ్యత గురించి ఉన్నతాధికారుల నుంచి భరోసా లభించడంతో ఆయా పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల ఆశకు అంతు లేకుండా పోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు ఇంజనీరింగ్ అధికారులు కూడా వీరితో చేతులు కలపడంతో రాత్రి, పగలు తేడా లేకుండా పనులు జరగడమే గాక, నాణ్యత కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది. ‘ దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి ’ అనే సామెతగా ఆయా పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు కూడా రోడ్లు, డ్రెయినేజి తదితర పనుల్లో నాణ్యత గురించి పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు ... నంద్యాల నియోజకవర్గంలో చేపడుతున్న పనులకు సంబంధించి స్థానిక ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచిపోతున్నా..ఏనాడు నంద్యాల అభివృద్ధి గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఉప ఎన్నికల నేపథ్యంలో వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తోందని బాహాటంగానే వారు విమర్శిస్తున్నారు. పట్టణంలోని మురికివాడల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని అనేక సందర్భాల్లో కోరుతున్నా..పట్టించుకోని నేతలు ఉప ఎన్నిక నేపథ్యంలో హడావుడి చేయడం విమర్శలకు తావిస్తోంది. -
తాడిపత్రిలో అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపం
అనంతపురం న్యూసిటీ : తాడిపత్రిలోని 23వ వార్డులో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించిందని ఫిర్యాదు చేస్తూ ఆ వార్డు కౌన్సిలర్ జయచంద్రారెడ్డి బుధవారం పబ్లిక్ హెల్త్ ఈఈ సీహెచ్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఎస్ఈ కార్యాలయంలో ఈఈకి వినతిపత్రం ఇచ్చారు. నాణ్యత లోపించిన పనుల ఫొటోలను వినతిపత్రంతో జతపరిచారు. ఈ పనులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
పనులు సరే.. బిల్లులేవి?
గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా..అందుకు సంబంధించిన బిల్లులు అందని దుస్థితి నెలకొంది. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెల ముగుస్తుంది...నెలాఖరులోపు సీసీ రోడ్డు వేస్తేనే బిల్లులు వస్తాయని లేకుంటే..ఎన్ఆర్ఈజీఎస్ నిధులు వెనక్కిపోతాయని అధికారులు చెప్పడంతో అప్పులు తెచ్చి మరీ సదరు కాంట్రాక్టర్లు, నాయకులు గ్రామాల్లో పనులు పూర్తి చేశారు. కానీ ఇప్పుడు బిల్లులు మంజూరు కాకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే బిల్లులు విడుదల చేయాలని వేడుకుంటున్నారు. సూర్యాపేటరూరల్ : సూర్యాపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 3 కోట్ల 60 లక్షల రూపాయలతో 28 సీసీ రోడ్లు వేశారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం శాఖ అధికారులు 90 శాతం పనులను మార్చి నెలాఖరులోపు సదరు కాంట్రాక్టర్లతో పూర్తి చేయించారు. మార్చి 31లోపు చేసిన పనులకు ఎంబీ రికార్డులు చేశారు. వారం రోజుల్లో బిల్లులు వస్తాయని అధికారులు చెప్పారని, నెలలు దాటినా బిల్లులు అందలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు చేయించేందుకు వడ్డీ వ్యాపారుల వద్ద డబ్బులు, సిమెంట్ వ్యాపారుల వద్ద సిమెంట్ తెచ్చి సీసీ రోడ్లు పోయించామని.. ఇప్పుడు బిల్లులు రాకపోవడంతో వారు డబ్బులివ్వాలని ఒత్తిడి చేస్తున్నారని సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టిన నాయకులు, కాంట్రాక్టర్లు వాపోతున్నారు. కృషియల్ బ్యాలెన్స్ నిధులదీ అదే పరిస్థితి.. కృషియల్ బ్యాలెన్స్ (సీబీఎఫ్) నిధులు రూ.50 లక్షలతో సూర్యాపేట మండలంలోని రత్నపురం, బాలెంల గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో గాను 10 సీసీ రోడ్లు నూతనంగా వేశారు. ఒక్కో రోడ్డుకు రూ.5లక్షలు కేటాయించారు. రూ.5లక్షల పని చేస్తే అంతో ఇంతో డబ్బులు మిగులుతాయనే ఆశతో చోటామోటా నాయకులు సీసీ రోడ్లకు సంబంధించిన పనులు చేసి 8 నెలలకు పైగా అవుతాన్నా... బిల్లులు మాత్రం అందడం లేదు. దీంతో రోడ్ల నిర్మాణానికి తీసుకొచ్చిన డబ్బులకు వడ్డీలు పెరుగుతున్నాయని వాపోతున్నారు. ఇప్పటిౖMðనా సంబంధిత అధికారులు చొరవ చూపి ప్రభుత్వం, సంబంధితశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్ల బిల్లులు విడుదల చేయించాలని పలువురు కోరుతున్నారు. త్వరలోనే అందుతాయి సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు త్వరలోనే అందుతాయి. పెండింగ్‌లో ఉన్న బిల్లులు మంజూరు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొద్ది రోజుల్లోనే బిల్లులు విడుదల కానున్నాయి. – మనోహార్, పంచాయతీరాజ్ ఏఈ, సూర్యాపేట -
అక్రమాలు నిజమే
– 172 అభివృద్ధి పనుల్లో రూ.50 లక్షల గోల్మాల్ – కాంట్రాక్టర్ల బిల్లుల్లో కోత ! – అధికారులపై వేటుకు రంగం సిద్ధం - ముందే అక్రమాలను వెల్లడించిన ‘సాక్షి’ అనంతపురం న్యూసిటీ : నగరపాలక సంస్థ పరిధిలో గతేడాది జరిగిన అభివృద్ధి పనుల్లో అక్రమాలు వెలుగుచూశాయి. పాలకవర్గానికి చెందిన కొందరు నేతల సూచనలతో చేసిన తప్పిదాలు అధికారులు మెడకు చుట్టుకున్నాయి. అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించడంతో పాటు టెండర్‌కు విరుద్ధంగా పనులు చేసినట్లు అధికారుల తనిఖీలో తేలింది. రూ 2.5 నుంచి రూ 3 కోట్ల బిల్లుల్లో(172 పనులు) రూ 45 నుంచి 50 లక్షల వరకు కాంట్రాక్టర్లకు కోత వేయాలని డీఎంఏ కమిషనర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అభివృద్ధి పనుల్లో ఉదాసీనతతోపాటు పరోక్షంగా పాలకులకు సహకరించిన అధికారులపై వేటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి 10న ‘డబ్బుల్ పనులు’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై అప్పటి కలెక్టర్ కోన శశిధర్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో పబ్లిక్‌హెల్త్ ఎస్ఈ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరుగురు డీఈలు బృందంగా ఏర్పడి 172 పనులను తనిఖీ చేశారు. ఆ నివేదిక ఆధారంగా డీఎంఏ చర్యలకు సిఫార్సు చేసింది. ఇంకా 90 పనులను తనిఖీ చేయలేదు. నిగ్గుతేలిన అంశాలివే..! నగరంలో ఒక రోడ్డు నిర్మాణాన్ని 5 విభాగాలు చేసి నామినేషన్ పద్ధతిన పనులు పిలవడాన్ని తప్పుబట్టారు. ఒక రోడ్డును విభజించడం సరికాదన్నారు. నగరంలో రూ లక్షతో ఏడు సీసీ రోడ్లు వేయగా అందులో 5 నాసిరకమని గుర్తించారు. సైడ్ బర్మ్స్ (మట్టిదిబ్బలు) జేసీబీ ద్వారా చేపట్టి కూలీలతో పని చేసినట్లు రికార్డులో పొందుపర్చారు. దీని ద్వారా సదరు కాంట్రాక్టర్ రూ లక్షల్లో లబ్దిపొందినట్లు తేలింది. వీటితో పాటు పదుల సంఖ్యలో పనుల్లో నాణ్యత లోపించినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. పబ్లిక్ హెల్త్ ఎస్ఈకు మరో 90 పనుల(రూ1.2 కోట్లు) జాబితాను నగరపాలక సంస్థ అధికారులు జాప్యం చేశారు. దీనిపై డీఎంఏ స్పందించారు. ఎస్ఈ సత్యనారాయణ నేతృత్వంలో తనిఖీ చేసి రిపోర్టు ఆధారంగా బిల్లులు చేయాలన్నారు. అధికారుల్లో వణుకు.. అక్రమాలు వెలుగులోకి రావడంతో అధికారుల్లో వణుకు మొదలైంది. ఇద్దరు డీఈలు, ఇద్దరు ఏఈలపై వేటుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అభివృద్ధి పనుల్లో రూ లక్షల్లో నగరపాలక సంస్థకు నష్టం వాటిల్లడంలో సదరు అధికారులు కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై కమిషనర్ పీ వీరవెంకట సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ బాధ్యులపై చర్యలు తప్పవన్నారు. -
అభివృద్ధి కోసం ఆమరణదీక్షకైనా సిద్ధమే
నెల్లూరు సిటీ: కార్పొరేషన్ పరిధిలోని విలీన గ్రామాలు, శివారు కాలనీల్లో వారం రోజుల్లో అభివృద్ధి పనులు చేపట్టకపోతే ఆమరణ దీక్ష చేపడుతానని వైఎస్సార్సీపీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి పనుల కోసం 42గంటల పాటు ఇచ్చిన గడువు ముగియడంతో నగర పాలక సం స్థ కార్యాలయంలో సోమవారం కోటంరెడ్డి నిరవధిక నిరసన చేపట్టారు. ఉద యం 11 గంటలకు కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే కమిషనర్ చాంబర్ వద్దకు వెళ్లారు. కమిషనర్ ఢిల్లీరావు లేకపోవడంతో చాంబర్ బయట బైటాయిం చారు. సాయంత్రం 5 గంటలకు కార్యాలయానికి చేరుకున్న కమిషనర్ బయట నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేను లోనికి పిలిపించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విలీన గ్రామాలు, శివారు కాలనీల్లో కనీస వసతులు కల్పించాలని రెండేళ్లుగా కార్పొరేషన్ చుట్టూ తిరిగి పనులకు టెండర్లు పిలిపిస్తే, చిన్నపాటి సమస్యలను అడ్డుగా చూపి కొర్రీ పెట్ట డం సమంజసం కాదన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టే పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. స్పందించిన కమి షనర్ కొత్తగా వచ్చానని, తనకు వారం రోజులు సమయం ఇస్తే టెండర్లు పిలిచి అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సోమవారం నాటికి దళిత వాడల్లో సబ్‌ప్లాన్ పనులు ప్రారంభించకపోతే ఆమరణ దీక్ష చేపడుతామన్నారు. శావారు ప్రాంతాలపై భారం విలీనగ్రామాలు, శివారుకాలనీలకు భూ గర్భడ్రైనేజీ, తాగునీటి పథకాలు మం జూరు కాలేదని, ఎటువంటి లబ్ధిపొం దని కాలనీవాసులపై వెయ్యికోట్లు భా రం మోపడం ఎంత వరకు సబబని ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి ఎద్దడి నివారణకు రూ.4.50కోట్లు కేటాయించి 10రోజులకు పైగా గడుస్తున్నా ఎందుకు ఖర్చు పెట్టలేదని మండిపడ్డారు. జీఓ 94 ప్రకా రం టెండర్లు పూర్తిచేసిన 90 రోజుల్లో పనులు ప్రారంభించాల్సి ఉన్నా, 2016 అక్టోబర్ 13న టెండర్లు పూర్తిచేసిన పను లను ఇంత వరకు ప్రారంభించకపోడం దారుణమన్నారు. పనులు చేయించడం చేతకాకపోతే తాను చేయిస్తానన్నారు. నిధులు కేటాయిస్తే 60రోజుల్లో నా ణ్యమైన పనులు చేసి చూపిస్తానన్నారు. అలా చేయలేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు.సీపీఎం కార్పొరేటర్ పద్మజ దంపతులు ఎమ్మెల్యేకు మద్దతు తెలిపారు. వైఎస్సార్సీపీ కార్పొరేషన్ విప్ బొబ్బల శ్రీనివాసులుయాదవ్, కార్పొరేటర్లు లేబూరు పరమేశ్వరరెడ్డి, లక్ష్మీసునంద, నాయకులు కమల్‌రాజ్, డాక్టర్ సత్తార్, తాటి వెంకటేశ్వరరావు, బిడుదువోలు శ్రీకాంత్‌రెడ్డి, పుల్లారెడ్డి పాల్గొన్నారు. -
‘ పుట్టపర్తి సుందరీకరణపై ప్రత్యేక దృష్టి ’
పుట్టపర్తి టౌన్ : పుట్టపర్తిని సుందరంగా తీర్చిదిద్ది ఆదర్శంగా నిలుపుతామని స్వచ్చాంధ్ర మిషన్ ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ డాక్టర్ పి.ఎల్.వెంకటరావు తెలిపారు. ఆదివారం ఆయన నగర పంచాయతీ చైర్మన్ గంగన్న, కమిషనర్ విజయభాస్కర్‌రెడ్డితో కలసి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో శిల్పారామం, థీంపార్క్, చిత్రావతి సుందరీకరణ ఘాట్, ప్రశాంతి గ్రాం, ఎనుములపల్లి, కర్ణాటక నాగేపల్లి సర్కిల్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటకలోని నాగేపల్లి వద్ద డంప్‌యార్డు ఏర్పాటు చేసి పట్టణంలో సేకరించిన చెత్తతో ఎరువుతయారీ చేసే పద్ధతిని అభివృద్ధి చేస్తామన్నారు. çపట్టణంలో పచ్చదనం పెంపునకు, రైల్వేస్టేషన్ నుంచి పుట్టపర్తి వరకు తొమ్మిది కిలోమీటర్ల మేర బటర్ ఫ్లై లైట్లు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శిల్పారామం, థీంపార్క్ అభివృద్ధికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. అనంతరం ప్రశాంతి నిలయంలో సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ఆర్.జె.రత్నాకర్రాజు, ప్రసాద్‌రావును కలసి రాష్ట్రవ్యాప్తంగా సత్యసాయి సేవాదళ్ సహకారంతో పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
'నోట్ల రద్దుతో ఆదాయం తగ్గింది'
► నోట్ల రద్దుతో ఇబ్బందులు తాత్కాలికమే ► మంత్రి తన్నీరు హరీష్‌రావు కరీంనగర్ : కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ.500, 1000 నోట్ల రద్దుతో రాష్ట్ర ఆదాయం తగ్గిందని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్లో ఆదివారం తెలంగాణ వికాస సమితి జిల్లా మహాసభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో అభివృద్ది పనులు స్పీడ్ పెంచుతున్న తరుణంలో పెద్ద నోట్ల రద్దుతో కొంత బ్రేక్ పడిందన్నారు. నోట్ల రద్దుతో రాష్ట్రానికి వచ్చే కమర్షియల్, రిజిస్ట్రేషన్, ఆర్టీఏ తదితర రంగాల నుంచే వచ్చే ఆదాయం తగ్గిందని హరీష్ చెప్పారు. నోట్ల రద్దుతో వచ్చే ఇబ్బందులు శాశ్వతం కాదని, తాత్కాలికమే అని అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ఆర్థికంగా వచ్చే ఇబ్బందులను అధిగమించేందుకు సహకారం అందించాలని ప్రధాని మోదీ దృష్టికి సీఎం కేసీఆర్ తీసుకెళ్లినట్లు తెలిపారు. నోట్ల రద్దుతో పేద, సామాన్యులు, రైతులకు, వ్యాపారులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. నోట్ల రద్దు విషయంలో స్పష్టత రాలేదని, మరో నాలుగు రోజుల్లో కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడ్డాక పైరవీలకు తావులేదని, గతంలో కలెక్టర్లు ఎప్పుడు వస్తరో తెలియక పోయేదని, ప్రస్తుతం నెలకు మూడు రోజులు గ్రామాల్లో తిరుగుతున్నారని హరీష్‌రావు అన్నారు.