సిద్ధిపేట రూరల్ (మెదక్) : రైతుల ఆత్మహత్యలను చూస్తుంటే బాధేస్తోందని, ఆత్మహత్యలు చేసుకోవద్దని, ధైర్యంగా ఉండాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కోరారు. శనివారం మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం నారాయణరావుపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నీళ్ల కోసం అపరభగీరథునిలా ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఆత్మహత్యలు చేసుకోవద్దని, తెలంగాణ సాధన కోసం ఎలాగైతే కష్టపడ్డామో... నీళ్ల కోసం కూడా రాత్రింబవళ్లు కష్టపడైనా నీళ్లు తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు కాలువల ద్వారా నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేయడంతోపాటు మార్చి నుంచి పగటి వేళే 9గంటలు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు.
'రైతులూ.. ధైర్యంగా ఉండండి'
Published Sat, Sep 5 2015 6:57 PM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM
Advertisement
Advertisement