Siddhipet
-
తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్న కేంద్రం: హరీశ్
సాక్షి, సిద్దిపేట: ఎంతమంది ముఖ్య మంత్రులు, ప్రధాన మంత్రులు మారినా ప్రజల కనీస అవసరాలు తీర్చలేకపోయారని, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయ కత్వంలోనే తెలంగాణా శరవేగంగా అభివృద్ధి చెందిందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేవలం మూడున్నరేళ్లలో మిషన్‌భగీరథ పథకం కింద తెలంగాణలో ఇంటింటికీ తాగునీరు అందించారని ఇదే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ‘హర్ ఘర్ కో జల్‘, మిషన్‌కాకతీయ తరహాలో అమృత్ సరోవర్ పేరిట కాపీ కొట్టిందన్నారు. ఇదొక్కటే కాదనీ, ఇలా చాలా సంక్షేమ పథకాలను కేంద్రం కాపీ కొడుతోందన్నారు. సోమవారం సిద్దిపేటలో పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 26 శాతం నిరుద్యోగత ఉందన్నారు. బీజేపీ ఏటా లక్ష ఉద్యోగాలు ఇస్తా మని చెప్పి భర్తీ చేయకపోవడంతో ఇప్పటికే 16 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని, పైగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఇష్టారాజ్యంగా కేంద్రం ప్రైవేట్ పరం చేస్తోందన్నారు. రానున్న రోజుల్లో ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా రజకులకు పెద్ద ఎత్తున రుణాలు, స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని వేములవాడ కమాన్‌వద్ద ఉన్న మైదానంలో నవంబర్ 19 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి వారి పర్యవేక్షణలో ఆయుత చండీ అతిరుద్ర యాగం జరగనుంది. ఈ నేపథ్యంలో స్వరూపానంద స్వామి సిద్దిపేటకు వచ్చి మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామి వారిని మంత్రి హరీశ్‌రావు కలిసి ఆశీస్సులు తీసుకు న్నారు. ఎగ్జిబిషన్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీరంగనాయక స్వామి కాలేజ్ ఆప్ బీఫార్మసీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చదవండి: నగరంపై ‘కారు’ మబ్బులు! -
సిద్దిపేటలో అందమైన కళాకృతులు
-
బీజేపీ మాయ మాటల పార్టీ: హరీశ్ రావు
సాక్షి, సిద్ధిపేట: ‘‘టీఆర్ఎస్ చేతల పార్టీ అని, బీజేపీ మాయ మాటల పార్టీ’’ అంటూ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రానికి వాటాగా.. హక్కుగా రావాల్సిన కోటా ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం మాయమాటలు చెబుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్రంపై ధ్వజమెత్తారు. సిద్ధిపేట జిల్లా మండల కేంద్రమైన రాయపోల్‌లో గురువారం ఉదయం మండలంలోని 266 మంది రైతులకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో కలిసి పట్టాదారు పాసు పుస్తకాలను, అధిక వర్షాలకు కూలిన ఇళ్లకు నష్టపరిహారం చెక్కులను మంత్రి పంపిణీ చేశారు (చదవండి: మొదలైన రాజకీయ వేడి.. నేతలతో కేసీఆర్ భేటీ) అనంతరం మంత్రి మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. తెలంగాణకు హక్కుగా రూ.10 వేల కోట్లు కేంద్రం నుంచి రావాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తోందని, బీజేపీ ప్రభుత్వం రైతులపై బాంబులు వేస్తోందంటూ ఆయన ధ్వజమెత్తారు. ఎకరానికి ఏటా పెట్టుబడి సాయం కింద రూ.10 వేలు ఇస్తున్నామన్నారు. బీజేపీ రైతు వ్యతిరేక చట్టం అమలు చేస్తోందని.. ఆ విధానాలు నచ్చక కేంద్రమంత్రి రాజీనామా చేశారని విమర్శించారు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, రైతుల కోసమే సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తెచ్చారని ఆయన అన్నారు.(చదవండి: జీతాలు ఇచ్చేదెట్లా?) టీఆర్ఎస్ పార్టీ చేతల్లో చూపే ప్రభుత్వమని, 7 లక్షల ఆడ పిల్లల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించామని, ఆర్థిక సాయం కింద ఇప్పటి దాకా రూ.5555 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగలేదని పేర్కొన్నారు. సంక్రాంతికి గంగిరెద్దుల మాదిరిగా ఓట్ల కోసం వచ్చేవారెవరో.. గుర్తించాలని కోరారు. కొత్త పట్టాదారు పాసు పుస్తకాల కోసం గతంలో ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడేవారని, అయినా పాసు పుస్తకాలు పొందేవారు కారని, కొత్త రెవెన్యూ చట్టం.. రైతులకు మేలు కోసం సీఎం కేసీఆర్ తెచ్చారని వివరించారు. 1బీ కోసం తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, రైతుల సమయం వృథా కాకూడదని కొత్త రెవెన్యూ చట్టం తెచ్చామని, టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, ఆరేళ్లుగా రైతు శ్రేయస్సు కోసం పని చేస్తోందన్నారు. కొత్త రెవెన్యూ చట్టంలో డిజిటల్ సర్వే చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పారని, ట్రాక్టర్ ర్యాలీతో కొత్త రెవెన్యూ చట్టానికి ప్రతి గ్రామంలో స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. మండలంలోని 11,317 ఖాతాలకు 10,022 ఖాతాలు క్లియరెన్స్ చేసినట్లు వాటిలో ఇప్పటికే 9,756 పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసుకున్నామని, ఇవాళ 266 మంది రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. నాలా- ఎక్సెస్ ఎక్సేంట్ 550, కోర్టు తగదాలతో 350, ఈకేవైసీ-344, ప్రభుత్వ ల్యాండ్ ఖాతాలో 51 ఇలా మొత్తం క్లియరెన్స్ చేయని 1295 పట్టాదారు పాసు పుస్తకాలను త్వరితగతిన క్లియరెన్స్ చేసి రైతులకు అందివ్వాలని ఆర్డీవోను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ పద్మాకర్, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
దండం పెట్టే రోజులు పోయాయి
సాక్షి, సిద్దిపేట: లంచాలు అడిగే అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అందుకు అనుగుణంగా మున్సిపల్ కొత్త చట్టం లో నిబంధనలు పొందు పరిచారని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన సిద్దిపేటలోని పలు వార్డుల్లో తిరిగారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. దరఖాస్తులు పెట్టి దండం పెట్టే రోజులు పోయాయన్నారు. సిరిసిల్లకు యాభై ఏళ్ల దరిద్రం వది లిందన్నారు. కేటీఆర్ చొరవతో అభివృద్ధిలో దూసుకెళుతోందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో బుధవారం జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి హరీశ్ హాజరయ్యారు. -
హుస్నాబాద్‌లో యువకుడి దారుణ హత్య
-
సంపూర్ణేష్ బాబు కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్
సాక్షి, సిద్ధిపేట: సినీ నటుడు సంపూర్ణేష్ బాబుతో పాటు ఆయన కుటుంబసభ్యులకు బుధవారం తృటిలో ప్రమాదం తప్పింది. సిద్ధిపేటలో సంపూర్ణేష్ బాబు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంపూర్ణేష్‌తో సహా ఆయన భార్య, కుమార్తెకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. అలాగే కారు కూడవా కొద్దిగా ధ్వంసం అయింది. ఈ ప్రమాదంపై సంపూర్ణేష్ బాబు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో మంగళవారం ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆమె ఘటనా స్థలంలోనే మరణించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న సంపూర్ణేష్ బాబు -
చరిత్రలో లేనంతగా ఖరీఫ్ దిగుబడులు
సిద్దిపేట జోన్: చరిత్రలో ఎప్పుడూ చూడనంత వరి పంట ఈ ఏడాది ఖరీఫ్‌లో రానుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. 80 లక్షల టన్నుల వరి ధాన్యం రాష్ట్రంలో పండబోతుందని, ఉమ్మడి ఏపీలో వచ్చిన పంట దిగుబడులు ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే పండుతోందన్నారు.ఆదివారం సిద్దిపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మందపల్లి, మిట్టపల్లి మార్గంలో రూ.17.5 కోట్లతో ఇండస్ట్రియల్ పార్క్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం జిల్లా కలెక్టరేట్లో 2017–18 రబీ సీజన్ మార్కెటింగ్ కమీషన్ రూ.1.85 కోట్లను మహిళా సంఘాలకు పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ పండనంత పంట ఈ ఏడాది పండుతోందని, దీనంతటికీ ప్రభుత్వ కార్యక్రమాలు వ్యవసాయానికి భరోసాగా నిలిచాయన్నారు. -
సిద్ధిపేటను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి
సాక్షి, సిద్ధిపేట : జెడ్పీటీసీలు స్థానిక సంస్థల ప్రతినిధులతో కలిసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా పని చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా పరిషత్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సిద్ధిపేట జిల్లా పరిషత్ పాలకవర్గం చరిత్ర పుటల్లో నిలిచిపోతుందన్నారు. గొప్ప అనుభవం ఉన్నవారు, విద్యావంతులు ఈ సారి జిల్లా పరిషత్‌కు ఎన్నికయ్యారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా అయిన సిద్ధిపేటను రాష్ట్రంలో ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. జిల్లాలో బాగా పని చేసే అధికారులన్నారని వారి సేవలను సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. సభలో, సమావేశాల్లో చర్చ అర్థవంతంగా, ప్రశ్న ఆలోచించే విధంగా ఉండాలన్నారు హరీశ్ రావు. హెడ్లైన్ వార్తల కోసం అరిచి గగ్గోలు పెట్టుకోవద్దని తెలిపారు. ప్రజా ప్రతినిధులు వివిధ శాఖలపై అవగాహన పెంచుకోవాలన్నారు. నేను అనే విధానంతో కాకుండా మేము అనే పద్దతిలో పని చేసుకోవాలన్నారు. పొరపాటు జరిగినప్పుడు భేషజాలకు పోకుండా ఆ తప్పును సవరించుకునే వారే గొప్పవారవుతారని పేర్కొన్నారు. -
‘ఆమె’కే జెడ్పీ చాన్స్
సాక్షి,సిద్ధిపేట్: ఇంతకాలం ద్వితీయ శ్రేణి నాయకులుగా ఉన్న పలువురు కొత్త జిల్లా పరిషత్ పీఠంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. మొత్తం 22 మండలాల్లో అక్కన్నపేట జెడ్పీటీసీ, ఎంపీపీ రెండు ఎస్టీకి రిజర్వ్ చేశారు. బెజ్జంకి, కొమురవెల్లి, మిరుదొడ్డి, గజ్వేల్ ఎస్సీలకు కేటాయించారు. మిగిలిన వాటిలో రాయప్రోలు, కొండపాక, వర్గల్, మర్కుక్, ములుగు, చేర్యాల బీసీలకు కేటాయించగా మిగిలిన 11 స్థానాలు జనరల్‌కు కేటాయించారు. జనరల్ స్థానాలతోపాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళ, జనరల్ స్థానాల్లో కూడా మహిళలను పోటీలో దింపి జెడ్పీ చైర్పర్సన్ పదవికి పోటీ పడే అవకాశం ఉంది. 22 మండలాలతో ఏర్పడిన ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొంత భాగంతోపాటు కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి పలు మండలాలతో సిద్దిపేట జిల్లా ఆవిర్భవించింది. అయితే జిల్లా పరిషత్ పీఠం కోసం ప్రాంతాల వారిగా కూడా పోటీ పడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. సతులను పోటీలో దింపనున్న పతులు జిల్లా పరిషత్ పీఠం జనరల్ మహిళకు కేటాయించడంతో ఇప్పటికే ఆ స్థానం కోసం పోటీ పడుతున్న నాయకులు తమ సతులను పోటీలో దింపేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్‌తోపాటు వివిధ పార్టీల నుండి టికెట్ ఆశించి భంగపడిన నాయకులు, ఓటమి పాలైన నాయకులు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ముందుగా జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉండగా.. జెడ్పీటీసీ సభ్యుల రిజర్వేషన్ల ఆధారంగా ఏ మండలం నుండి తమ సతులను లేదా కుటుంబ సభ్యులను పోటీలో దింపితే బాగుంటుందనే దానిపై దృష్టి పెడుతున్నారు. ఏదిఏమైనా ఎమ్మెల్సీ ఎన్నికల వేడి తగ్గక ముందే పార్లమెంట్, ఆ వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలతో మరోసారి జిల్లాలోని పల్లెలు హోరెత్తనున్నాయి. జిల్లాలో జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీల రిజర్వేషన్లు ఇలా.. మండలం జెడ్పీటీసీ సభ్యులు ఎంపీపీ 1 అక్కన్నపేట ఎస్టీ(మహిళ) ఎస్టీ( మహిళ) 2 బెజ్జంకి ఎస్సీ(మహిళ) ఎస్సీ( జనరల్) 3 గజ్వేల్ ఎస్సీ(జనరల్) ఎస్సీ(మహిళ) 4 కొమురవెల్లి ఎస్సీ(జనరల్) ఎస్సీ( మహిళ) 5 మిరుదొడ్డి ఎస్సీ(మహిళ) ఎస్సీ(జనరల్) 6 రాయప్రోలు బీసీ(జనరల్) బీసీ( జనరల్) 7 కొండపాక బీసీ(మహిళ) బీసీ(మహిళ) 8 వర్గల్ బీసీ( జనరల్) బీసీ(మహిళ) 9 మర్కూక్ బీసీ(మహిళ) బీసీ(జనరల్) 10 ములుగు బీసీ(మహిళ) బీసీ(మహిళ) 11 చేర్యాల బీసీ(జనరల్) బీసీ( జనరల్) 12 జగదేవ్‌పూర్ అన్‌రిజర్వుడ్ అన్‌రిజర్వుడ్ 13 చిన్నకోడూర్ అన్‌రిజర్వుడ్(మహిళ) అన్‌రిజర్వుడ్ 14 నంగునూరు అన్‌రిజర్వుడ్(మహిళ) అన్‌రిజర్వుడ్(మహిళ) 15 తొగుట అన్‌రిజర్వుడ్ అన్‌రిజర్వుడ్(మహిళ) 16 సిద్దిపేటఅర్బన్ అన్‌రిజర్వుడ్(మహిళ) అన్‌రిజర్వుడ్(మహిళ) 17 సిద్దిపేట రూరల్ అన్‌రిజర్వుడ్ అన్‌రిజర్వుడ్ 18 కోహెడ అన్‌రిజర్వుడ్(మహిళ) అన్‌రిజర్వుడ్(మహిళ) 19 దుబ్బాక అన్‌రిజర్వుడ్ అన్‌రిజర్వుడ్ 20 దౌల్తాబాద్ అన్‌రిజర్వుడ్(మహిళ) అన్‌రిజర్వుడ్(మహిళ) 21 మద్దూరు అన్‌రిజర్వుడ్ అన్‌రిజర్వుడ్ 22 హుస్నాబాద్ అన్‌రిజర్వుడ్ అన్‌రిజర్వుడ్(మహిళ) -
‘ఓపెన్’ బెని‘ఫిట్’
దైనందిన కార్యక్రమాల్లో వ్యాయామం కూడా ఒకటి. దనికోసమే యువత పోలీస్, ఇతర పరీక్షలకు సిద్ధం కావలంటే శారీరక సౌష్టవం, పటిష్టత కోసం జిమ్స్ అవసరం. మహిళలు, పట్టణ వాసులు కూడా వ్యాయామం వైపు మొగ్గు చూపుతున్నారు. దీని కోసం సిద్దిపేట పట్టణంలో ఇప్పటికే కోమటి చెరువు, బ్లాక్ ఆఫీస్ చౌరస్తా, సిరిసిల్లా కమాన్ ప్రాంతాల్లో ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొత్తగా కోమటి చెరువు అడ్వంచర్ పార్కు, హౌసింగ్‌బోర్డు పార్కు, ఎర్రచెరువు ప్రాంతాల్లో జిమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. యువత కోరిక మేరకు సిద్దిపేట నియోజకవర్గంలోని గుర్రాల గొందిలో కూడా ఏర్పాటు చేశారు. దీన్ని చూసిన చిన్నకోడూరు, ఇబ్రహింపూర్, విఠలాపూర్, చంద్లాపూర్, ఇర్కొడు, నంగునూరు మొదలైన గ్రామాల యువకులు తమ గ్రామాల్లో కూడా జిమ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనిపై స్పందించిన హరీశ్‌రావు ఆయా గ్రామాల్లో కూడా జిమ్స్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. సాక్షి, సిద్దిపేట: నాటి తెలంగాణ ఉద్యమం నుంచి నేడు జిల్లా సమగ్ర అభివృద్ధి వరకు సిద్దిపేట అంటే ఓ ప్రత్యేకత. రాష్ట్రంలో ఏ జిల్లా అభివృద్ధి చెందనంతగా సిద్దిపేట అభివృద్ధిలో దూసుకుపోతోంది. రోడ్లు, కార్యాలయాలు, భవనాలు, ప్రభుత్వ పథకాల అమలులో మందంజలోనే కాకుండా ఇప్పుడు వినూత్న రీతిలో యువతకు ఉపయోగపడే కార్యక్రమాలకు మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నేతృత్వంలో శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా యువత అతి త్వరగా ఆకర్షితులయ్యే ఓపెన్ జిమ్స్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా సిద్దిపేటలో ప్రతీ కూడలిలో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశారు. వీటిని గ్రామాలకు కూడా విస్తరించేందుకు కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. యువతను ప్రోత్సహించేలా.. నేటి బాల బాలికలే రేపటి పౌరులు. వీరే విలువైన మానవ వనరులు.. వీరు సంపూర్ణ ఆరోగ్యంతో పెరిగితే రేపటి ఆరోగ్యవంతమైన సమాజంలో భాగస్వామ్యులు అవుతారనే విధానాన్ని నమ్మిన మాజీ మంత్రి హరీశ్‌రావు యువతకు పదికాలల పాటు ఉపయోగపడే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఉపాధ్యాయుల నియామకం కోసం పోటీ పడుతున్న విద్యార్థులకు టెట్, టీఆర్టీతోపాటు, వీఆర్వో, వీఆర్ఏ, గ్రూప్స్‌కు కూడా శిక్షణ ఇప్పించారు. దాతల సహకారంతో విద్యార్థులు ఉచిత భోజనం, వసతులు కల్పించారు. దీంతో వేలాది మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు మార్గం సుగమనం అయ్యింది. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్సై ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఆర్మీ, ఎయిర్‌పోర్స్ నియామకాలు కూడా జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రతీ మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఎదగాలంటే మంచి గాలి, శారీరక వ్యాయామం అవసరం. దీనికోసమే సిద్దిపేట పరిసర ప్రాంతాలతోపాటు మారుమూల ప్రాంతాల్లో కూడా విరివిరిగా చెట్లు నాటే కార్యక్రమాన్ని యజ్ఞంలా ప్రారంభించారు. పచ్చటి సిద్దిపేటే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా మంచి వ్యాయామం చేయాలంటే వారికి అందుబాటులో జిమ్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రధాన కూడళ్ల వద్ద జిమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. వ్యాయామంతో క్రమశిక్షణ ‘‘యువత రేపటి విలువైన మానవ వనరులు. చిన్న చిన్న పొరపాట్లు చేసి జీవితాలను ఆంధకారంలోకి పోతున్నారు. వీరిని ప్రోత్సహించాలనే ఆలోచనతోనే అన్ని పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇప్పించాం. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలకు సన్నద్ధం చేశాం. ఎయిర్‌పోర్స్ సెలక్షన్లు పెట్టడంతో వందలాది మంది ఉద్యోగాలు పొందారు. ఇక సిద్దిపేటలో కోమటి చెరువు అభివృద్ధి చేశాం. ఉదయం వేలసంఖ్యలో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు వ్యాయామం చేస్తున్నారు. వీరందరికీ జిమ్స్ అందుబాటులో ఉండాలన్నదే ఆలోచన. యువత జిమ్స్‌ను ఉపయోగించుకొని పోలీస్, ఇతర ఉద్యోగాల్లో ఎంపిక కావడం సంతోషకరం. ’’ – తన్నీరు హరీశ్‌రావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే ‘‘ఒకప్పుడు సిద్దిపేట అంటే మారుమూల గ్రామం. కానీ ఇప్పుడు ఇక్కడి ప్రజలకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. సిద్దిపేట కోమటి చెరువు, బ్లాక్ ఆపీస్ చౌరస్తా, సిరిసిల్లా కమాన్ వద్ద ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్స్తో యువతకు ఉపయోగకరంగా ఉంది. నెలకు వేలాది రూపాయలు ఖర్చుచేసి జిమ్‌కు వెళ్లలేని నిరుపేదలు వీటిని వినియోగించుకొని మంచి క్రీడాకారులుగా ఎదుగుతున్నారు.’’ – మల్లికార్జున్, క్రికెట్ క్రీడాకారుడు ‘‘మా ఊళ్లో మూడు వందలకు పైగా యువత ఉంటారు. జిమ్ చేయాలంటే సిద్దిపేటకు రావాల్సి ఉండేది. యుత అందరం కలిసి మాకు జిమ్ కావాలని మాజీ మంత్రి హరీశ్‌రావును కోరాం. వెంటనే మా ఊళ్లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. యువత ఉదయం, సాయంత్రం జిమ్ చేసుకుంటున్నారు. క్రమశిక్షణకు అలవాటు పడుతున్నారు. కొందరు కానిస్టేబుల్, ఎస్సై వంటి ఉద్యోగాలు కూడా పొందుతున్నారు. యువతలో మార్పు వచ్చింది’’. – ఆంజనేయులు, సర్పంచ్, గుర్రాల గొంది -
మీ మధ్య ఉండటం నా అదృష్టం: హరీశ్
సాక్షి, సిద్దిపేట: ‘పధ్నాలుగు ఏళ్లుగా నూతన సంవత్సర వేడుకలను మీ మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉంది. అది నా అదృష్టం’అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గమంతా తన కుటుంబమని, ఏ వేడుకైనా ప్రజల మధ్య జరుపుకోవడమే తనకు ఆనందమని ఆయన పేర్కొన్నారు. తనకు ఇటువంటి అవకాశాన్ని కల్పిస్తున్న నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతగా వారి రుణం తీర్చుకుంటానని అన్నారు. సోమవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఆయన సిద్దిపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ కళాశాల విద్యార్థులతో కలసి న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులకు తినిపించారు. అనంతరం ఉద్వేగంగా మాట్లాడుతూ ఇటువంటి సందర్భాలను గర్వంగా భావిస్తానని అన్నారు. నియోజకవర్గ ప్రజల అవసరాలు తీర్చేందుకు తాను ఏ సమయంలోనైనా, ఎప్పుడైనా సిద్ధంగా ఉంటానన్నారు. తనకు శాసనసభ్యునిగా వచ్చే వేతనం రూ.2 లక్షలు మీకే ఇచ్చేస్తానని, ఆ సొమ్ముతో మంచి లైబ్రరీ ఏర్పాటు చేసుకుని, దానిని సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. మీరంతా ఉన్నత స్థాయికి ఎదిగితేనే మీ తల్లిదండ్రులతో పాటు తానూ సంతోష పడతానని, అదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణగా భావిస్తానని విద్యార్థులనుద్దేశించి హరీశ్ అన్నారు. విద్యార్థులు చిన్ననాడే ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలని, తెలంగాణ బిడ్డలంటే గర్వపడే స్థాయికి చేరుకోవాలని ఉద్బోధించారు. కొత్త సంవత్సరంలో అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆయన ఆకాంక్షించారు. -
దసరా రోజునే జిల్లాల సంబురం
♦ సిద్దిపేట, మెదక్ జిల్లాలు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి ♦ మిగతా జిల్లాలకు మంత్రులు, స్పీకర్, మండలి చైర్మన్ ♦ డివిజన్లు, మండలాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ♦ ఆసిఫాబాద్‌కు కొమురంభీం పేరు ♦ సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ♦ రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో యాదాద్రి ఆ నాలుగు జిల్లాల్లో ఏయే మండలాలు? ఆసిఫాబాద్ జిల్లా (కొమురంభీం జిల్లా) (18): కాగజ్‌నగర్, సిర్పూర్, దహేగాం, కౌటాల, బెజ్జూరు, చింతలమానేపల్లి(కొత్త), పెంచికల్‌పేట (కొత్త), ఆసిఫాబాద్, రెబ్బెన, వాంకిడి, కెరమెరి, జైనూర్, సిర్పూర్ (యూ), లింగాపూర్, తాండూరు, కన్నేపల్లి, భీమిని, తిర్యాని. సిరిసిల్ల (రాజన్న జిల్లా) (14): సిరిసిల్ల, సిరిసిల్ల రూరల్(కొత్త), వేములవాడ, వేములవాడ రూరల్(కొత్త), చందుర్తి, రుద్రంగి(కొత్త), కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, ఇల్లంతకుంట, బోయినపల్లి, వీర్నపల్లి(కొత్త), పొత్తూరు(కొత్త). జనగాం జిల్లా(13): జనగాం, లింగాల ఘన్పూర్, బచ్చన్నపేట, దేవరుప్పుల, నర్మెట్ట, తరిగొప్పుల(కొత్త), రఘునాథ్‌పల్లి, గుండాల, స్టేషన్ ఘన్పూర్, చిల్పూరు(కొత్త), జఫర్‌గఢ్, పాలకుర్తి, కొడకండ్ల. గద్వాల జిల్లా(12): గద్వాల, ధరూర్, గట్టు, మల్దకల్, అలంపూర్, ఇటిక్యాల, మానవపాడు, వడ్డేపల్లి, అయిజ, నందిన్నె(కొత్త), రాజోలి(కొత్త), ఉండవల్లి(కొత్త). సాక్షి, హైదరాబాద్: దసరా రోజునే కొత్త జిల్లాలను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా ఏర్పాటయ్యే ప్రతీ జిల్లా కేంద్రంలో మొదటి రోజు నుంచే కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు, కొత్త మండలాల్లో పోలీస్ స్టేషన్లు, మండల రెవెన్యూ కార్యాలయాలు పని చేయాలని ఆదేశించారు. ప్రతీ రెవెన్యూ డివిజన్లో ఆర్డీవోతోపాటు డీఎస్పీ స్థాయి అధికారి ఉండాలని సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి చేపట్టాల్సిన అధికారిక కసరత్తుపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష జరిపారు. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, శాంతికుమారి, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందులో పాల్గొన్నారు. సిద్దిపేట, మెదక్ జిల్లాల ప్రారంభ కార్యక్రమంలో తాను పాల్గొంటానని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. మంత్రులు, శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తలా ఒక జిల్లాను ప్రారంభించాలని పేర్కొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పరిధిలో ఏర్పాటయ్యే రెవెన్యూ డివిజన్లు, మండలాలను ప్రారంభించాలని చెప్పారు. ఎవరు ఎక్కడ ఏ కార్యాలయాన్ని ప్రారంభించాలో జాబితా తయారు చేయాలని చెప్పారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల్లో పని చేయడానికి ఉద్యోగుల విభజన వెంటనే పూర్తి చేయాలని, అవసరమైన పక్షంలో డీపీసీలు నిర్వహించి పదోన్నతులు కల్పించాలని సీఎం చెప్పారు. ఆసిఫాబాద్‌కే ‘కొమురం భీం’ కొత్తగా తెరపైకి వచ్చిన ఆసిఫాబాద్ జిల్లాకు ‘కొమురం భీం’ పేరు పెట్టాలని సీఎం నిర్ణయించారు. కొమురం భీం పుట్టిన జోడేగాట్ కొత్తగా ఏర్పడే ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోకి వస్తుంది. అందుకే ముసాయిదాలో ప్రతిపాదించిన మంచిర్యాల జిల్లాకు బదులు ఆసిఫాబాద్ జిల్లాకే కొమురం భీం పేరు పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 17 కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ముసాయిదాలో ప్రకటించామని, ఇవి కాకుండా జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటు కూడా పరిశీలనలో ఉందని చెప్పారు. వీటికి తోడు కొత్త డివిజన్లు, మండలాలు ఏర్పాటవుతున్నందున అన్నిచోట్ల అధికారుల నియామకం, కార్యాలయాల ఏర్పాటు తదితర విషయాలపై దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలకు సంబంధించి ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను పరిశీలించిన సీఎం పలు నిర్ణయాలు తీసుకున్నారు. ♦ సిద్దిపేటలో పోలీస్ కమిషరేట్‌ను ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖను సీఎం ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేయాలనుకున్న కరీంనగర్, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లతోపాటు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌కు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. ♦ యాదాద్రి జిల్లాను రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో, జనగామ జిల్లాను వరంగల్ పోలీస్ కమిషనరేట్లలో భాగం చేయాలని సీఎం చెప్పారు. ♦ ఆదిలాబాద్ జిల్లాలో కాగజ్‌నగర్‌ను, మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరును, రంగారెడ్డి జిల్లాలోని తాండూరును రెవెన్యూ డివిజన్లుగా మార్చాలని సూచించారు. ♦ ముథోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త రెవెన్యూ డివిజన్ ప్రారంభించాలని నిర్ణయించినందున.. ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా భైంసాలో రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయాలన్నారు ♦ కొత్తగా గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్, మనోహరాబాద్, ములుగు నియోజకవర్గంలో కన్నాయిగూడెం, నిర్మల్ అర్బన్, రూరల్ మండలాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ♦ మొయినాబాద్, శంకరపల్లి, షాబాద్‌తోపాటు చేవెళ్ల మండలాన్ని కూడా రంగారెడ్డి (శంషాబాద్) జిల్లాలోనే చేర్చాలని ఆదేశించారు. ఆ నాలుగు మండలాలను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి మార్చాలని చెప్పారు ♦ నాగిరెడ్డిపేట మండలాన్ని కామారెడ్డి జిల్లాలో కొనసాగించాలని నిఘా వర్గాలు జరిపిన సర్వేలో తేలిందని సీఎం చెప్పారు. ఆ మండలాన్ని కామారెడ్డిలో కొనసాగించాలని, అవసరమైతే మెదక్‌కు సమీపంలో ఉన్న ఆ మండల పరిధిలోని గ్రామాలను మెదక్ జిల్లాలో కలపాలని సూచించారు. కల్వకుర్తి డివిజన్‌పై చర్చలు మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా మార్చాలని వస్తున్న డిమాండ్‌పై సీఎం చర్చలు జరిపారు. ఆ జిల్లాకు చెందిన మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి, కలెక్టర్ శ్రీదేవితో మాట్లాడారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని అమనగల్, మాడ్గుల, తలకొండపల్లి, కొత్తగా ఏర్పడే కడ్తాల మండలం ప్రతిపాదిత రంగారెడ్డి(శంషాబాద్) జిల్లాలో కలుస్తున్నాయి. దీంతో కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేసే అవకాశాలు లేవు. కల్వకుర్తి నియోజకవర్గంలో కల్వకుర్తి, వెల్దండ మండలాలు మాత్రమే మిగులుతాయి. ఈ నేపథ్యంలో కల్వకుర్తి డివిజన్ ఏర్పాటు ఎలా? అనే ప్రశ్న తలెత్తింది. కానీ ప్రజల నుంచి డిమాండ్ ఉన్నందున కల్వకుర్తి డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారు. -
ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం: మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట (మెదక్) : ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మెదక్ జిల్లా సిద్దిపేటలోని ఎంపీడీఓ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బాబూ జగ్జీవన్ రాం జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై ఇప్పటికే రెండు సార్లు శాసన సభలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించినట్టు తెలిపారు. త్వరలో అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. -
'రైతులూ.. ధైర్యంగా ఉండండి'
సిద్ధిపేట రూరల్ (మెదక్) : రైతుల ఆత్మహత్యలను చూస్తుంటే బాధేస్తోందని, ఆత్మహత్యలు చేసుకోవద్దని, ధైర్యంగా ఉండాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కోరారు. శనివారం మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం నారాయణరావుపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నీళ్ల కోసం అపరభగీరథునిలా ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని, తెలంగాణ సాధన కోసం ఎలాగైతే కష్టపడ్డామో... నీళ్ల కోసం కూడా రాత్రింబవళ్లు కష్టపడైనా నీళ్లు తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు కాలువల ద్వారా నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేయడంతోపాటు మార్చి నుంచి పగటి వేళే 9గంటలు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. -
కోనసీమను తలపిస్తాం: హరీశ్
మెదక్ (నంగునూరు) : గోదావరి జలాలను తరలించి సిద్దిపేట ప్రాంతాన్ని కోనసీమను తలపించేలా అభివృద్ధి చేస్తామని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. శుక్రవారం ఆయన మెదక్ జిల్లాలోని నంగునూరు మండలంలో పర్యటించి పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నంగునూరు మండలం పాలమాకులలో భూపంపిణీ కార్యక్రమంలో భాగంగా రాంపూర్, పాలమాకుల గ్రామాల లబ్ధిదారులకు పట్టా పాస్‌పుస్తకాలను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు దళితులకు రాళ్లు, రప్పలు, గుట్టలు, నీళ్లు పడని భూములను పంపిణీ చేశాయని, తమ ప్రభుత్వం సాగుకు యోగ్యమైన భూములను అందజేస్తోందని తెలిపారు. దళితులకు పంపిణీ చేస్తున్న భూమిలో సంవత్సరం వరకు పంటలు పండించుకునేలా విత్తనాలు, ఎరువులు అందజేయడంతోపాటు డ్రిప్ పరికరాలను ఉచితంగా అందజేస్తామన్నారు. తడ్కపల్లి వద్ద రూ. 6వేల కోట్లతో ప్రాజెక్ట్ పూర్తి చేయడం ద్వారా సిద్దిపేటతో పాటు హుస్నాబాద్, కొహెడా మండలాల్లోని ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు రూ.30 కోట్లతో 695 ఎకరాల భూమిని పంపిణీ చేయగా నంగునూరు మండలంలోనే అత్యధికంగా లబ్ధిదారులున్నారని తెలిపారు. దేవాదుల ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని, ఎంత కష్టమైనా ప్రాజెక్ట్ పూర్తి చేసి రైతన్నకు సాగు నీరందిస్తామని చెప్పారు.