సిద్దిపేట (మెదక్) : ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మెదక్ జిల్లా సిద్దిపేటలోని ఎంపీడీఓ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బాబూ జగ్జీవన్ రాం జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై ఇప్పటికే రెండు సార్లు శాసన సభలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించినట్టు తెలిపారు. త్వరలో అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.