సాక్షి, సిద్దిపేట: ఎంతమంది ముఖ్య మంత్రులు, ప్రధాన మంత్రులు మారినా ప్రజల కనీస అవసరాలు తీర్చలేకపోయారని, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయ కత్వంలోనే తెలంగాణా శరవేగంగా అభివృద్ధి చెందిందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేవలం మూడున్నరేళ్లలో మిషన్‌భగీరథ పథకం కింద తెలంగాణలో ఇంటింటికీ తాగునీరు అందించారని ఇదే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ‘హర్ ఘర్ కో జల్‘, మిషన్‌కాకతీయ తరహాలో అమృత్ సరోవర్ పేరిట కాపీ కొట్టిందన్నారు.
ఇదొక్కటే కాదనీ, ఇలా చాలా సంక్షేమ పథకాలను కేంద్రం కాపీ కొడుతోందన్నారు. సోమవారం సిద్దిపేటలో పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 26 శాతం నిరుద్యోగత ఉందన్నారు. బీజేపీ ఏటా లక్ష ఉద్యోగాలు ఇస్తా మని చెప్పి భర్తీ చేయకపోవడంతో ఇప్పటికే 16 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని, పైగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఇష్టారాజ్యంగా కేంద్రం ప్రైవేట్ పరం చేస్తోందన్నారు. రానున్న రోజుల్లో ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా రజకులకు పెద్ద ఎత్తున రుణాలు, స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు.
సిద్దిపేట పట్టణంలోని వేములవాడ కమాన్‌వద్ద ఉన్న మైదానంలో నవంబర్ 19 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి వారి పర్యవేక్షణలో ఆయుత చండీ అతిరుద్ర యాగం జరగనుంది. ఈ నేపథ్యంలో స్వరూపానంద స్వామి సిద్దిపేటకు వచ్చి మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామి వారిని మంత్రి హరీశ్‌రావు కలిసి ఆశీస్సులు తీసుకు న్నారు. ఎగ్జిబిషన్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీరంగనాయక స్వామి కాలేజ్ ఆప్ బీఫార్మసీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
చదవండి: నగరంపై ‘కారు’ మబ్బులు!
Comments
Please login to add a commentAdd a comment