సాక్షి,సంగారెడ్డి: కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ఏమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. సంగారెడ్డిలో హరీశ్‌రావు సోమవారం(జనవరి13) మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేతల ప్రభుత్వం.రూ.15వేలు రైతు భరోసా ఇస్తామని మోసం చేశారు. రుణమాఫీకి నవంబర్ 30న సీఎం రేవంత్ ఇచ్చిన చెక్కు ఏమైంది.
వ్యవసాయ కూలీలకు రూ.15వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడేమో సెంటు భూమి ఉన్నా ఇవ్వబోమంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎలా మోసం చేస్తోందో పండుగకు ఊళ్లకు వెళ్లేవారు రైతులకు చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలన్నీ మోసాలే. కాంగ్రెస్ మోసాలపై పోరాడాల్సిన సమయం వచ్చింది’అని హరీశ్‌రావు అన్నారు.
భట్టి గోబెల్స్‌ను మించి పోతున్నారు: ఆయనకిదే నా ఛాలెంజ్..
రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ రైతులను దగా చేస్తోంది
సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి
కానీ చేతలు గడప దాటడం లేదు
2750 కోట్ల రూపాయలు చెక్కుని రుణమాఫీ కోసం నవంబర్ 30న సీఎం రేవంత్ ఇచ్చారు
సీఎం రేవంత్ ఇచ్చిన చెక్కు డమ్మీది కావచ్చు..లేదా దారి తప్పిపోయిందా..?
రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దగాని ప్రజలు గమనించాలి
కేసీఆర్ రైతుల కడుపులో సల్ల కదలకుండా చూసుకుంటే 13 నెలల్లో సీఎం రేవంత్ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు
కాంగ్రెస్ పథకాల తీరు అయితే ఎగవేతలు లేకపోతే కోతలు
రైతులందరూ కలిసి ఉద్యమానికి సిద్ధం కావాలి
కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి... మనకి రావాల్సిన పథకాలు తీసుకుందాం
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అంటే దళిత గిరిజన రైతుల పొట్ట కొట్టుడేనా..?
కోటి మంది కూలీలు ఉంటే 10 లక్షల మందికే పథకాన్ని ఇస్తామని చెబుతున్నారు
మాట తప్పినందుకు సీఎం రేవంత్ రైతులకు, కూలీలకు క్షమాపణ చెప్పాలి
గ్రామసభలు పెడితే మీపై కూలీలు తిరగబడతారు జాగ్రత్త
ఎకరం లోపు భూమి ఉన్నవారిని కూడా కూలీలుగా గుర్తించి వారికి రూ. 12 వేలు ఇవ్వాల్సిందే
ఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క గోబెల్స్ ని మించిపోతున్నారు
పూటకో తీరుగా ఆయన మాట్లాడుతున్నారు
నిన్న నాగర్ కర్నూల్ లో బీఆర్‌ఎస్ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తికాలేదు అని అంటున్నారు
మేము మహబూబ్నగర్ జిల్లాలోనే 600 లక్షల ఎకరాలకు నిరిచ్చాం
భట్టి వ్యాఖ్యలపై నేను బహిరంగ చర్చకు సిద్ధం...ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తా
ఇదీ చదవండి: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై నాలుగు కేసులు
Comments
Please login to add a commentAdd a comment