హైడ్రా బాధితుల తరఫున కొట్లాడుతాం: బీఆర్‌ఎస్‌ | Telangana: For Hydra Victims BRS Ready To Fight With Revanth Govt | Sakshi
Sakshi News home page

హైడ్రా బాధితుల తరఫున రేవంత్‌ సర్కార్‌తో కొట్లాడుతాం: బీఆర్‌ఎస్‌

Published Sat, Sep 28 2024 1:39 PM | Last Updated on Sat, Sep 28 2024 3:15 PM

Telangana: For Hydra Victims BRS Ready To Fight With Revanth Govt

సాక్షి, హైదరాబాద్‌: కూల్చివేతల పేరుతో బుల్డోజర్లు వస్తే.. వాటికంటే ముందు తాము వస్తామని భరోసా ఇస్తోంది బీఆర్‌ఎస్‌. శనివారం మధ్యాహ్నాం తెలంగాణ భవన్‌లో మూసీ సుందరీకరణ బాధితులతో ఆ పార్టీ నేతలు సమావేశం అయ్యారు.

ఈ భేటీలో పలువురు కూల్చివేతలతో తమకు జరుగుతున్న నష్టం గురించి కంటతడి పెట్టుకున్నారు. ‘‘కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ఇల్లు చెరువులో ఉంది. బాధితుల వద్దకు బుల్డోజర్లు వెళ్తే వాటికంటే ముందు మేము వస్తాం. ఈ ప్రభుత్వంతో మీ తరఫున మేం కొట్లాడుతాం. అధైర్యపడొద్దు’’ అని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్‌కు జ్వరం 
తెలంగాణ భవన్‌కు వస్తున్న హైడ్రా బాధితులకు అండగా నిలవాని పార్టీ నాయకులకు, శ్రేణులకు వర్కింగ్‌ ప్రెసిడెంట‌ కేటీఆర్‌ సూచించారు. గత రెండ్రోజులగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ్టి తెలంగాణ భవన్‌కు వెళ్లలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆయన ఎక్స్‌ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. హైడ్రా బాధితులకు అండగా పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ న్యాయవిభాగం అండగా ఉంటుందని తెలిపారాయన.

ఇక.. హైడ్రా బాధితుల కోసం బీఆర్‌ఎస్‌ క్షేత్రస్థాయి పర్యటనకు సిద్దమైంది. ఆదివారం ఉదయం బాధితుల వద్దకే బీఆర్‌ఎస్‌ బృందం వెళ్లనుందని సమాచారం. ఈ బృందంలో కేటీఆర్‌, హరీష్‌రావుతో పాటు నగర ఎమ్మెల్యేలు, మాజీమంత్రులు ఉండనున్నారు. బండ్లగూడ జాగీర్, హైదర్ షా కోట్, గంధంగూడలో పర్యటించి.. పలువురు అపార్ట్మెంట్లు, విల్లాల వాసులతో సమావేశంకానున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement