సాక్షి, హైదరాబాద్: కొందరు సభ్యుల శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసే అవకాశం లేకపోలేదని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో కోమటిరెడ్డి, సంపత్ ల సభ్యత్వాలు రద్దు చేయలేదా అని ప్రశ్నించారు. గతంలో కొన్ని సాంప్రదాయాలు నెలకొల్పారని, తనను ఏ రోజు అసెంబ్లీలో కూర్చోనివ్వలేదని ప్రస్తావించారు.
తన వద్దకు 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి కలిసి వెళ్లినట్లు సీఎం పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభ గురువారానికి వాయిదా పడిన తర్వాత రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌తో మాట్లాడారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా బడ్జెట్‌పై ఇంత చర్చ జరగలేదన్నారు సీఎం రేవంత్. ప్రజాస్వామ్య బద్దంగా సభ నడుస్తుందని అన్నారు. ఒక్క రోజు 17 గంటల పాటు సభ నడిచిందని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌కు అనుబంధంగా రాష్ట్ర బడ్జెట్ పెట్టామని. నేడు మొత్తం బడ్జెట్‌కు ఆమోదం తెలిపామని చెప్పారు.
మోసం అనే పదానికి సబితా ప్రత్యామ్నాయం
‘మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబితక్క అని భట్టి చెప్పారు.అంతకుమించి సమాధానం ఏముంటుంది. సునితా లక్ష్మారెడ్డి కోసం ప్రచారం చేస్తే నాపై రెండు కేసులు పెట్టారు.తరువాత ఆమె బీఆర్‌ఎస్‌లోకి వెళ్లి మహిళా కమిషన్ చైర్‌పర్సన్ అయ్యారు. నేను కేసుల చుట్టూ తిరుగుతున్నాను. నేను ఎవరి పేర్లు ప్రస్తావించలేదు. సబితా ఇంద్రారెడ్డి పేరు ఎక్కడా తీయలేదు. ఆమెను సొంత అక్కలా భావించా. వాళ్లు ఎందుకు బాధపడ్డారు. రియాక్ట్ అయ్యారు.
అక్క అనే అన్నాను.. వేరే భాషలో మాట్లాడలేదు
నన్ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన అక్క.. నాకు తోడుండాలి కదా. కానీ ఆమె బీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. మల్కాజిగిరి ఎంపీ టికెట్ తీసుకో నేను పనిచేస్తా అని చెప్పి.. టికెట్ రాగానే సబిత పార్టీ మారారు. సభలో హరీష్ రావు 2 గంటల 11 నిమిషాలు మాట్లాడారు. జగదీశ్‌రెడ్డి గంటా 10 నిమిషాలు మాట్లాడారు. కేటీఆర్ 2 గంటల 36 నిమిషాలు మాట్లాడారు. ఇంతకంటే ఎక్కువ సేపు మాకు ఎప్పుడైనా మైక్ ఇచ్చారా? మాకంటే వాళ్లే ఎక్కువ సేపు మాట్లాడారు.
రాజకీయంగా వ్యక్తిగత విషయాలు మాట్లాడొద్దు. సబితకు మాట్లాడే అవకాశం ఇచ్చాం. ఆమె వ్యక్తిగత ప్రస్తావన తెస్తే.. ఆ తరువాత నేను మాట్లాడాను. సబితక్క ఆవేదనకు కేటీఆర్, హరీశ్ ఎందుకు అండగా లేరు? కేటీఆర్,హరీష్‌లు తాము సభలో సరిపోతామని చెబతున్నారు. అలాంటిప్పుడు కేసీఆర్‌ను ఫ్లోర్ లీడర్‌గా తీసేయండి. సభలో గందరగోళం చేసేందుకే కేటీఆర్ సభకు వస్తున్నారు.’ అని సీఎం రేవంత్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment