మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలో నిర్వహించిన సభలో మొత్తంగా రూ.27.5 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయి.
గజ్వేల్: మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలో నిర్వహించిన సభలో మొత్తంగా రూ.27.5 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయి. గజ్వేల్ ‘మిషన్ భగీరథ’ పథకం వ్యయం రూ.1,055 కోట్లు కాగా రామగుండం ఎన్‌టీపీసీలో నిర్మించనున్న 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రానికి, రామగుండం ఎరువులు కర్మాగారం పునఃరుద్ధరణ, వరంగల్ కాళోజీ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ శంకుస్థాపన, 1200 మెగావాట్ల జైపూర్ థర్మల్ పవర్‌స్టేషన్ ప్రారంభం, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ శంకుస్థాపన తదితర పనులకు మరో రూ.17వేల కోట్లకుపైగా వెచ్చిస్తున్నారు.