
29న జిల్లాకు కేసీఆర్
జిల్లాలో చేపట్టనున్న అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 29న జిల్లాలో పర్యటించనున్నారు.
⇒ అభివృద్ధి పనులపై సమీక్ష
⇒ చర్చకు రానున్న కీలక అంశాలు
⇒ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం
సాక్షి, హన్మకొండ : జిల్లాలో చేపట్టనున్న అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 29న జిల్లాలో పర్యటించనున్నారు. వరంగల్ నగరంలో నిర్మించతలపెట్టిన టెక్స్‌టైల్స్ పార్క్, హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, వ్యాగన్‌వర్క్‌షాప్, కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం ఫేజ్ 2, మామునూరు విమానశ్రయ పునరుద్ధరన వంటి కీలక అంశాలతో పాటు 2014 జనవరిలో జరగనున్న కాకతీయ ఉత్సవాల నిర్వాహానపె జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి సమీక్ష జరపనున్నారు.
ఎన్నికల మెనిఫెస్టోలో పేర్కొన్న వరంగల్-హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, టెక్స్‌టైల్స్ పార్కు నిర్మాణాలను కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంతేకాకుండా తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానని అనేక సందర్భాల్లో పేర్కొన్నారు.అంతేకాకుండా నూతన విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాలపై సర్కారుప్రత్యేక దృష్టి సారించింది.
అందువల్లే జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై గతంలో రెండు పర్యాయాలు సమీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి భావించిన చివరి నిమిషంలో ఆ కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కాళోజీ శతజయంతి, కొమురవెల్లి మల్లన్నకళ్యాణం వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చారు. ఈ రెండు సంధర్భాల్లో జిల్లాలో అభివృద్ధి పనులపై సమీక్షించేందుకు వ్యవధి లభించలేదు. ఫలితంగా జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పూర్తిస్థాయిలోస్పష్టత కోసం జిల్లాలో సమీక్ష చేయాలని సీఎం నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగా ఏడాదిచివర్లో నగరంలోపర్యటన ఏర్పాటు చేశారు. డిసెంబర్ 29న ముఖ్యమంత్రి జిల్లాకు రానుందన్న ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.